పెద్దగా శ్రమ పదకుండా చెక్క (లేదా ప్లాస్టిక్) పలకలపై నిలబడి వందల మీటర్ల దూరం జారుతూ పోవడాన్ని ఎవరు ఇష్టపడరు గనక? మంచు కప్పేసిన ఏటవాలు కొండ తలాలపై ప్రమాదకరంగా స్కీయింగ్ చేయడం పశ్చిమ దేశాల్లో మామూలు విషయం అనుకుంటా.
చలికాలం తెచ్చి పడేసిన మంచు ప్రజా జీవనానికి ఒక కోణంలో ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రతి యేడూ మంచు కురవడం సాధారణ వాస్తవం అయినప్పుడు ఆ ఇబ్బందిని అధిగమించే ఆటలు పుట్టుకోస్తాయి కాబోలు! స్కీయింగ్, ఐస్ హాకీ లాంటి ఆటలు పశ్చిమ దేశాలకే పరిమితం కదా.
ఈ యేడు చలికాలం కురిపించిన మంచుపాతాలను క్రీడా స్దలాలుగా మార్చుకోవడంలో పశ్చిమ ప్రజలు ప్రస్తుతం తలమునకలై ఉన్నారు. క్రీడా ప్రియులు అనేకమంది తమ క్రీడా పరికరాలు తొడుక్కుని రోజూ కొండలు ఎక్కి దిగుతూ మంచు ఆనందాన్ని తనివితీరా అనుభవిస్తున్నారు.
ఈ కింది ఫోటోలు అమెరికా, ఐరోపా దేశాలలో చలి కాలపు క్రీడా ఉత్సాహాన్ని అనుభవిస్తున్న వారికి సంబంధించినవి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అత్యంత ఏటవాలు తలాల్లో ఒళ్ళు జలదరించే విన్యాసాలు చేస్తున్న దృశ్యాలను ఫోటో గ్రాఫర్లు ఫొటోల్లో బంధించగా వాటిని బోస్టన్ గ్లోబ్ పత్రిక ప్రచురించింది. స్కీయింగ్ వరల్డ్ కప్ పోటీలను స్విట్జర్లాండ్ లో నిర్వహించిన ఫోటోలు కూడా కొన్ని ఇందులో ఉన్నాయి.