ఎగరలేని మోడి విమానం -కార్టూన్


Modi plane

ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారి పార్లమెంటు విమానం. ఈ విమానానికి ఒక రెక్క లోక్ సభ అయితే మరొక రెక్క రాజ్య సభ. ఇరు సభల్లో కూర్చొని ఉన్న సభ్యుల సంఖ్య ఆ రెక్కల కింద ఉండే ఇంజన్లు.

మోడి/బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వానికి లోక్ సభలో నిఖార్సయిన మెజారిటీయే ఉంది. కానీ రాజ్య సభలో ఆ పార్టీకి మెజారిటీ లేదు. అనగా మోడి విమానానికి ఒక రెక్కకు ఒకటే ఇంజన్ ఉంటే మరో రెక్కకు ఏకంగా 5 ఇంజన్లు. కానీ ఏం లాభం? రెండు రెక్కలకు సమాన సంఖ్యలో ఇంజన్లు ఉంటేనే అది సక్రమంగా ఎగురుతుంది. అసమాన సంఖ్యలో ఉంటే విమానం కాస్త ఎగిరినా ఆ తర్వాత పల్టీలు కొడుతూ కూలిపోతుంది.

లోక్ సభలో మెజారిటీతో బిల్లులను ఆమోదింప జేసుకుంటున్న బి.జె.పి ప్రభుత్వం రాజ్య సభలో మెజారిటీ మద్దతు లేక బోల్తా పడుతోంది. దీనికి విరుగుడుగా ఆర్డినెన్స్ ల జాతరను మోడి ప్రభుత్వం ప్రారంభించింది. చట్ట సభలు ఉండగా ఆర్డినెన్స్ లు తేవడం ఏమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. దానితో ఆత్మరక్షణలో పడవలసిన దుర్గతి దాపురిస్తోంది.

అందుకే అట్టహాసంగా, అంతర్జాతీయ మందీ మార్బలంతో తయారయిన మోడి విమానం ఎగరలేక ఆపసోపాలు పడుతోందని కార్టూనిస్టు ఈ విధంగా ప్రతిభావంతంగా వివరించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s