రంగుల హేళి, హోలీ -ఫోటోలు


చైనాలో వసంత కాలం ఆరంభాన్ని కొత్త సంవత్సర వేడుకలతో జరుపుకుంటే భారత దేశంలో హోలీ వేడుకలతో జరుపుకుంటారు. ప్రకృతి రీత్యా సరికొత్త పచ్చదనాన్ని ఆహ్వానించడానికి ఈ పండుగలు జన్మించి ఆ తర్వాత మతం రంగు పులుముకున్నాయేమో తెలియదు గానీ చైనా కొత్త సంవత్సరం, భారతీయ హోలీ రెండూ ప్రకృతితో ముడిపడి ఉన్న పండగలన్న భావన కలుగుతోంది.

వసంత ఋతువు ప్రకృతికి కొత్త అందాల్ని తెస్తుంది. ఆది నుండి ప్రకృతితోనే తన జీవనాన్ని ముడివేసుకున్న మనిషి ఆ ప్రకృతిలో మారే మూడ్స్ నే తన మూడ్స్ గా చేపట్టి తన ఆనందాలను, సంతోషాలను, సంబరాలను కొన్ని పండగల రూపంలోకి తర్జుమా చేసుకుని ఉండవచ్చు. ఈ అవగాహన అంత నిర్దిష్టమైనదేమీ కాదు. ఒక ఊహా మాత్రంగా తోచేది మాత్రమే. సంక్రాంతి, హోలీ లాంటి కొన్ని పండగలు మాత్రమే ఈ పరిధిలోకి వస్తాయి. చాలా పండగలు మతం పునాదిగా దైవ భావనతో ఏర్పడినవే. అది వేరే చర్చ.

ఫాల్గుణ మాసంలో చివరి సంపూర్ణ పౌర్ణమి రోజును హోలీ దినంగా హిందువులు జరుపుకుంటారు. ఒక పాతిక సంవత్సరాల క్రితం వరకు ఈ పండగ ఉత్తర భారతంలోనే ప్రధానంగా జరిపేవారు. దక్షిణ భారతంలో కూడా జరిపినప్పటికీ అంత తీవ్రత ఉండేది కాదు. హైద్రాబాద్ లో ఉత్తరాదివాళ్ళు ఎక్కువగా ఉండడం వల్లనో మరే కారణం చేతనో హోలీ పండగను బాగా జరిపేవారు. ఇప్పుడు ఈ తేడా లేకుండా పోయింది. రంగుల పండగలో సహజంగా ఉండే ఉత్సాహం, ఆహ్లాదకర టీజింగ్ వల్ల అది అందరికీ ఆకర్షణీయం అయింది. దక్షిణాది రాష్ట్రాల్లో హోలీ జరిపినా చాలా మందికి దాని మూలాలు తెలియవు.

హోలీ ముందు రోజు సాయంత్రం పెద్ద మంట రగిలించి హోలిక అనే రాక్షసిని తగలబెట్టడంతో పండగ ప్రారంభం అవుతుందని పత్రికల ద్వారా తెలుస్తున్న విషయం. హోలీ పండగను చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుతారని కొందరు చెబుతారు. కానీ ఇదే వివరణ దీపావళికి కూడా ఇవ్వడం కద్దు. దాదాపు హిందు పండగలన్నింటికి ఈ వివరణ వర్తిస్తుందనుకుంటాను.

ఇప్పుడు హోలీ ఖండాంతరాలకు సైతం వ్యాపించింది. ఐరోపా, అమెరికాలలో కూడా భారతీయులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లినందున భారతీయ పండుగలు, సంప్రదాయాలు అక్కడా దర్శనం ఇస్తున్నాయి. ఇది వలసల వల్ల చాలా సహజంగా పరిణామం. ఇందులో ఒకరి గొప్పతనాన్ని, మరొకరి చిన్నతనాన్ని ఎంచి చూడవలసిన అవసరం లేదు.

కింది ఫోటోలు భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో హోలీ సంబరాలను చూపిస్తున్నాయి. రాయిటర్స్ వార్తా సంస్ధ ఫోటోగ్రాఫర్లు వీటిని తీయగా బోస్టన్ గ్లోబ్ పత్రిక ప్రచురించింది. కాసేపు కనులకి విందు!

One thought on “రంగుల హేళి, హోలీ -ఫోటోలు

  1. if chinese people celebrates it will culture or their own religious festival……………when India celebrates it will just an event in which you can find a mistakes………..
    how come one communist country will celebrates its culture……….and it should not be celebrated…………………communism is there for destroy the culture and civilization……….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s