భారత దేశ జనాభా 120 కోట్ల పై మాటే. వారిలో నిరుద్యోగులు ఎంతమంది అని అడిగితే ప్రభుత్వాలు చెప్పే సమాధానం 4 కోట్లు అని. 120 కోట్ల మంది జనాభాలో నిరుద్యోగులు 4 కోట్ల మందేనా అన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఈ సంఖ్య కేవలం చదువుకున్న వారికి మాత్రమే సంబంధించింది అని మనకు వెంటనే కనపడదు.
చదువుకున్న వారిలో కూడా ఎవరైతే ఉద్యోగం కావాలని ఎంప్లాయ్ మెంట్ ఎక్ఛెంజీలో రిజిస్టర్ చేసుకున్నారో వారిని మాత్రమే నిరుద్యోగులుగా ప్రభుత్వాలు పరిగణిస్తాయి. అనగా ఉద్యోగం లేకపోవడంతో పాటు తమకు ఉద్యోగం కావాలని ప్రభుత్వాన్ని అడిగితేనే వారు నిరుద్యోగుల జాబితాలోకి వస్తారు. లేకపోతే రారు. ఈ లెక్కన లెక్కింపులోకి రాని నిరుద్యోగులు చదువుకున్నవారిలో సైతం అనేకమంది ఉంటారు.
ఇక నిరక్షరాస్యులై ఉండి చేసేందుకు పని దొరకని వారికి ఇండియాలో కొదవ లేదు. కానీ వారు ఎంతమందో లెక్కించే ప్రక్రియ ప్రభుత్వాలు చేపట్టవు. ఎప్పుడో అవసరం అయినప్పుడు అనిర్దిష్టంగా ఇంతమంది అని చెప్పుకోవడమే గాని వారిని అధికారికంగా నిరుద్యోగులుగా పరిగణించి వారికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వాలు భావించవు.
ఈ కారణం వల్ల మహాత్మాగాంధి గ్రామీణ ఉపాధి హామీ పధకం లాంటి అరకొర చర్యలను అరుణ్ జైట్లీ లాంటి మంత్రులు ‘మతిలేని పాపులిస్టు విధానాలు’ గా విమర్శకు గురవుతూ అభివృద్ధి నిరోధకంగా పరిగణించబడుతున్నాయి. జనాలకు పని కల్పించే విధానాలు అభివృద్ధిలో భాగం కాకుండా ఎలా పోతాయో వివరించేందుకు జైట్లీ లాంటి వారు పూనుకోరు.
అసమాన దోపిడి సమాజాల్లో ఆర్ధిక వనరులను గుప్పిట్లో పెట్టుకున్న ధనికవర్గాలు నిరుద్యోగులు ఎంత ఎక్కువమంది ఉంటే తమకు అంత ప్రయోజనంగా చూస్తాయి. ప్రతి కేటగిరీలోనూ నిరుద్యోగుల సరఫరా గరిష్టంగా ఉండేట్లు చూస్తాయి. తద్వారా పనికోసం వెతికేవారు అతి తక్కువ వేతనాలకు అందుబాటులోకి వచ్చేలా జాగ్రత్తపడతారు. వేతనాలు తక్కువ స్ధాయిలో ఉంటే కంపెనీలకు లాభాలు ఇంకా ఎక్కువగా మిగులుతాయి. అందుకే నిరుద్యోగాన్ని తక్కువ చేసి చెప్పడం ప్రభుత్వాలకు అలవాటు. ప్రభుత్వాలను సంపన్నవర్గాలే నియంత్రిస్తున్నాయి కనుక!
కంపెనీల అవసరాల రీత్యాను, సంపన్నుల ప్రయోజనాల రీత్యాను నిరుద్యోగులను వివిధ కేటగిరీలుగా నిర్వచిస్తారు. ఇది ప్రధానంగా కంపెనీల ప్రయోజనాలను నెరవేర్చే వర్గీకరణ. జనం కోసం ఆలోచించే ప్రభుత్వాలకు కూడా ఈ వర్గీకరణ ఉపయోగపడుతుంది.
నిరుద్యోగంలోని వివిధ రకాలను నిన్న సోమవారం ఈనాడు పత్రికలో చర్చించబడింది. ఈనాడు పత్రిక వెబ్ సైట్ లో ఆర్టికల్ చూడడం కోసం కింది లంకెను క్లిక్ చేయగలరు.
కింద బొమ్మను క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆర్టికల్ చూడవచ్చు.
జనాభా ఎక్కువైతే అందరికీ ఇళ్ళు లాంటి సౌకర్యాలు కల్పించడం కష్టమవుతుంది. 1870లో ఇందియా జనాభా కేవలం 20 కోట్లు. అప్పట్లో దేశంలో 40% వరకు అటవీ భూములు ఉండేవి. ఇప్పుడు అడవులు 11% కనిపించడం కూడా కష్టమే. దేశ జనాభా పెరిగితే సహజ వనరులు క్షీణిస్తాయి. The law of diminishing returns సూత్రం జనాభా పెరుగుదలకి పూర్తిగా వర్తిస్తుంది కనుక మీరు జనాభా పెరుగుదల సమస్యని చిన్నదిగా చూడకూడదు.
అతి కానంతవరకూ ఏది పెరిగినా(వృద్ధి చెందినా) పెద్దనష్టమేమీ కాదు.జనాభా పెరుగుదలకు చెందిన విషయాలలో ఆ అతిని కొలవడానికి(అంచనావేయడానికి) ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొలమానాల మీద నాకు విశ్వాసంలేదు. కానీ,ఇంత భారీస్థాయి(అతికాదు) మానవవనరులను సమర్ధవంతంగా ఉపయోగించలేని,చేతకానీ విధానాలే మనకు పెద్ద శాపం!!!
బాగా చెప్పారు హిమగిరి గారు. The law of diminishing returns సూత్రం జనభా పెరుగుదలకు వర్తిస్తుందా లేదా అనది ముఖ్యం కాదు. ఒక చిన్న పుల్స్టాప్ లాంటి చుక్కను సూర్యుడంత పెద్దదిగా చూపిస్తారి పాలకులు. ఎందుకంటే ఆడ లేనమ్మ మద్దెల తప్పు అన్నట్లు తాము ఆరగిస్తున్నదంతా జనభా తిని పోతున్నట్లు చూపిస్తారు. వెయ్యి సమస్యల్లో జనాభాది ఒకటి మాత్రమే. ఆ ఒక్కదాంతో వెయ్యి కి ముసుగేస్తారు.
Margaret Sanger, who started family planning movement in the USA, was a leftist. Despite her effort, the population of the US has multiplied from 7.5 crore to 30 crore. Population explosion is always potential to create problems such as housing, sanitation etc. Hyderabad old city still uses the old drainage system introduced by the Nizam in 1920 .
Read this: http://blog.marxistleninist.in/2015/03/blog-post.html