బడ్జెట్ 2015-16 పై ఢిల్లీ దెబ్బ -కార్టూన్


Delhi attack on Budget 2015-16

ఢిల్లీ ఎన్నికల ముందు వరకూ ప్రధాని నరేంద్ర మోడి నోట సంస్కరణల మాటలు తప్ప మరొకటి వినపడలేదు. సంస్కరణలు తీవ్రం చేసి ఆర్ధిక వ్యవస్ధకు ఊపు తేవడం పైనే ఆయన ప్రసంగాలు, పర్యటనలు, ప్రకటనలు కేంద్రీకృతం అయ్యాయి. ఆయన పైన కార్పొరేట్ వర్గాలు కూడా గంపెడు ఆశలు పెట్టుకుని బడ్జెట్ 2015-16 కోసం ఆత్రంగా ఎదురు చూశారు. మోడి ప్రభుత్వం ‘బిగ్ బ్యాంగ్’ తరహాలో స్వదేశీ, విదేశీ పెట్టుబడి వర్గాలకు, ఇతర సంపన్నులకు మోత మోగించే వరాలు కురిపిస్తారని ఆశ పెట్టుకున్నారు.

ఎప్పుడైతే ఢిల్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయో అప్పటి నుండే మోడి నోట ‘పేదవాడి’ మాట వినబడడం మొదలైంది. ఓ పక్క కార్పొరేట్ వర్గాలకు మేలు చేసే విధానాలను వల్లిస్తూనే అదే నోటితో అవి పేదవాడి సంక్షేమాన్ని పట్టించుకునేవిగా వర్ణించడం ప్రారంభించారు. అనగా ఆయన ప్రసంగాల సారం కార్పొరేట్ మేలు కాగా, వాటికి ‘పేదవాడి’ పూత పూయడం మొదలు పెట్టారు. రైల్వే బడ్జెట్ గానీ, సాధారణ బడ్జెట్ గానీ సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తూ మాటల్ని పేదలకు అప్పజెప్పి బడ్జెట్ సారాన్ని మాత్రం సంపన్నులకు అప్పగించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని మోడి ప్రభుత్వం మొదటి నుండి తీవ్రంగా విమర్శిస్తూ వచ్చింది. ఆ పధకాన్ని నీరు గార్చుతామని కూడా గ్రామీణ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. ఆర్ధిక మంత్రి జైట్లీ అయితే ‘మతి లేని పాపులిస్టు విధానం’గా ఉపాధి పధకం లాంటి విధానాలను తిట్టి పోశారు. అలాంటి పధకాన్ని నీరు గార్చడానికి బదులు గత యేడు కంటే 5,000 కోట్లు ఎక్కువ నిధుల్ని తాజా బడ్జెట్ లో కేటాయించారంటే దానికి కారణం నిస్సందేహంగా ఢిల్లీ ప్రజలు చాచి కొట్టిన దెబ్బ!

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ప్రసంగిస్తూ కూడా ప్రధాని మోడి ఉపాధి హామీ పధకాన్ని కాంగ్రెస్ పార్టీ 60 యేళ్ళ పాలన వైఫల్యానికి స్మారక చిహ్నం అనదగ్గ పధకం ఉపాధి హామీ పధకం అని ప్రధాని తీవ్రంగా విమర్శించారు. అలాంటి పధకాన్ని మేమేందుకు విడిచి పెడతాం, కొనసాగిస్తాం అని ముందుగానే ఆపాలజీ చెప్పుకుని మరీ నిధులు పెంచారు మోడి ప్రభుత్వ పాలకులు.

ఈ కార్టూన్ నిజానికి బడ్జెట్ ప్రసంగానికి రెండు రోజుల ముందే ఫిబ్రవరి 26 తేదీ నాడు ప్రచురించబడింది. అప్పటికీ ఢిల్లీ ప్రజల విద్యుత్ బిల్లులు సగానికి తగ్గిస్తూ కేజ్రీవాల్ విధాన ప్రకటన చేశారు. 90 శాతం మంది ఢిల్లీ ప్రజలకు మేలు చేస్తూ 400 యూనిట్ల లోబడి విద్యుత్ వినియోగించేవారికి ఛార్జీలు సగానికి తగ్గించారు. నీటి బిల్లులు సైతం తగ్గించారు. అరవింద్ ప్రభుత్వ విధాన ప్రకటన ప్రభావం కేంద్ర బడ్జెట్ పై ఎలా ఉండబోతున్నదో కార్టూనిస్టు ముందే ఇలా ఊహించారు. అయితే ఇది ఉపాధి హామీ పధకం వరకే వర్తిస్తుంది. ‘Devil in the details’ తరహాలో జైట్లీ బడ్జెట్ సారం ఎవరికి అనుకూలమో కొద్ది రోజుల్లోనే తేటతెల్లం అవుతుంది. కనీసం ఆర్ధిక మంత్రి నోట ‘మతిలేని పాపులిస్టు విధానాలు’ అంటూ దేశ ప్రజల అవసరాలను అవహేళన చేసే దుష్టవాక్కులనైనా ఢిల్లీ ఎన్నికలు ఆపగలిగాయని భావించవచ్చు.

5 thoughts on “బడ్జెట్ 2015-16 పై ఢిల్లీ దెబ్బ -కార్టూన్

 1. మీరు railway budgetని కూడా పరిశీలించండి. ఇంతకు ముందు ప్రతి railway budgetలో 100 నుంచి 150 వరకు కొత్త రైళ్ళు వేసేవాళ్ళు. వాటి కోసం platforms సరిపోతాయా, coaching depots సరిపోతాయా లాంటివి పట్టించుకునేవాళ్ళు కాదు. ఈ railway budgetలో ఒక్క కొత్త రైలు కూడా వెయ్యలేదు. తాము pending railway projects కోసం డబ్బులు మిగుల్చుకోవడానికి కొత్త రైళ్ళు నడపడం లేదని రైల్వే మంత్రి చెపుతున్నప్పటికీ, వెనుక ఉన్న అసలు కారణం వేరు. ఇప్పటి వరకు వేసిన కొత్త రైళ్ళలో పెక్కు భాగం పాత పెట్టెలతో వేసినవే. అలా ఎంత కాలం కొత్త రైళ్ళు నడుపుతామని ఈ సారి కొత్త రైళ్ళు వెయ్యలేదు. వీళ్ళు పాత పెట్టెలతో కొత్త రైళ్ళు నడుపుతారనే నిజం ఒప్పుకోలేక pending projects పూర్తి కోసం అంటూ దాట వేత సమాధానం చెప్పారు.

 2. రాజకీయనాయకులు(పాలకులు) పనిచేసేది ఎలాగో కార్పోరేట్ వర్గాలకోసమేనని పెక్కు మందికి తెలుసును.కానీ, వాళ్ళు అధికారంలోకి రావడానికి వోట్లువేసింది వాళ్ళుకాదుకదా!
  9 నెలల మోడీ పాలనలో సామాన్యులకు మేలు చేసే పని ఒక్కటంటే ఒక్కటీలేదు. ఈ జమాఖర్చులలోనైనా మాకు ఉపయోగపడే పథకాలుంటాయని ఆశించిన సామాన్యుడికి మోడీ బళ్ళెంతో గుచ్చాడు!
  కేంద్రం నుండి ఎంతో ఆశించిన ఏ.పి ప్రభుత్వానికి ఉత్తచేతులే మిగిలాయి! ఇప్పటికైనా సి.యం & పి.యం రాష్ట్రప్రజలను ఊహాలోకాల్లో విహరింపజేయడమ్మాని ప్రజలకు క్షమాపణలు అడగడం మంచిది.

 3. మనదేశం లో జరినటువంటి భారీ ఎత్తున స్కాములు వేరే దేశంలో జరిగితే ఆదేశం దివాలతీసి ముక్క చెక్కలు అయినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. ఎన్ని ఒడి దుడుకులు వచ్చినా భారతదేశం తట్టుకొని నిలబడుతున్నాది. ప్రపంచ చరిత్ర తెలిసిన వారికి అదే చాలా గొప్ప, ఆశ్చర్య కరమైన విషయం గా అనిపిస్తుంది. గత ప్రభుత్వపాలనలో
  2జి స్కాం, బొగ్గు గనుల స్కాం లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసు. సిబాల్ గారు ఎలా తొండివాదన వినిపించారో, ప్రజలు అప్పుడే మరచిపోయారు. ఈసారి బొగ్గు గనుల వేలం లో వచ్చిన లక్షయల కోట్లా ఆదాయం మొడి ప్రభుత్వ విజయం కదా! దాని ఆదాయన్ని రాష్ట్రాలు కోరక మునుపే వాటికి కేటాయించ లేదా? ఈ డబ్బులు ప్రజల అభివృద్ది కి ఉపయోగ పడవా?

  The next big idea is accident insurance for Rs.2 lakh at Rs.12 per annum; for life insurance at a premium of Rs.330 per annum and lifelong pension on an annual premium of up to Rs.1,000, each to be contributed by the beneficiary and the government equally. This ambitious plan aims to reach crores of poor Indians.

  http://www.thehindu.com/opinion/op-ed/game-changers-in-the-budget/article6948760.ece

 4. Jayram, Free schemes are not bad for the economy if they are implemented with the money procured by taxing the rich. Even the famous capitalist economist John Keynes favoured such schemes. But in India, the government uses world bank borrowings for free schemes and therefore I opposed free schemes. Foreign borrowings always cause inflation, but taxing the rich doesn’t cause inflation and it may even help in controlling inflation.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s