సెలవులో రాహుల్ -ది హిందు ఎడిటోరియల్


Rahul

[Rahul on Leave శీర్షికన నిన్న ది హిందులో ప్రచురితం అయిన ఎదిరోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్]

రాహుల్ గాంధీ ఆత్మ శోధనకు ఎంచుకున్న ప్రస్తుత కాలం కంటే మించిన గడ్డు కాలం మరొకటి ఉండబోదు. పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలకు సరిగ్గా ముందు ఆయన ఆ పనికి పూనుకున్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎదుర్కొన్న అవమానకర ఓటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వం తెచ్చిన భూ స్వాధీన చట్టానికి ఆ పార్టీ ఇచ్చిన మద్దతు… -ఆ చట్టాన్నే ఇప్పటి మోడి ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా నీరు గార్చి ఆ మేరకు పార్లమెంటు చట్టంగా మార్చాలని భావిస్తోంది- ఇవి, పార్లమెంటులో ప్రతిపక్షానికి ప్రభావశీలమైన నాయకుని పాత్రలో తనను తాను రుజువు చేసుకునేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ (కాంగ్రెస్ ను పత్రికలు అప్పుడప్పుడు ఇలా సంబోధిస్తాయి. అమెరికాలో రిపబ్లికన్ పార్టీని కూడా ఇలాగే చెబుతారు. -అను) కి మెరుగైన, గొప్ప నేపధ్యాన్ని సమకూర్చాయి. భూ స్వాధీన చట్టాన్ని తేవడంలో గత యు.పి.ఏ ప్రభుత్వం వెనుక కదిలించే స్ఫూర్తిగా రాహుల్ గాంధీ పని చేసినందున, సదరు చట్టం చుట్టూ ప్రస్తుతం నెలకొని ఉన్న వివాదాస్పద పరిస్ధితులను తన నాయకత్వ వారసుడిని పునః స్ధాపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు.

ఈ అంశం పైనే ఫిబ్రవరి 25 తేదీన ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని కూడా పార్టీ ప్రకటించింది. కనుక గాంధీకి ఇది మరో తప్పి పోయిన అవకాశంగా మిగలవలసిన ఉదాహరణ ఎంత మాత్రం కాకూడదు: ఇది ఎంతగా నిజం అంటే “ఇటీవలి ఘటనలపైనా, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పైనా ఆత్మ పరిశీలన చేసుకునేందుకు” అని చెబుతూ రాహుల్ గాంధీ ప్రకటించిన “గైర్హాజరు రీత్యా సెలవు” కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇబ్బందికర పరిస్ధితిలోకి నెట్టి వేసింది. పార్టీ విశ్వాసపాత్రులైతే దిగ్భ్రాంతికి లోనై కలవరంలో పడిపోయారు. ఎంతలా అంటే రాహుల్ “త్వరలోనే తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు” అన్న అధికారిక వివరణను సీనియర్ నేతలు కూడా నమ్మడం లేదు. పార్టీలో పారదర్శకత చెప్పుకోదగినంతగా లోపించిందని భావించేందుకు ఇదొక తార్కాణం కూడా.

(రాహుల్ సెలవుకు) పార్టీలోని వివిధ నాయకులు ఊహించి చెప్పిన వివరణలలో కాస్త సంబంద్ధంగా కనిపించేవి మొదలుకొని నమ్మశక్యం కాని అసంబద్ధ కారణాల వరకు ఉన్నాయి. ఒకటి, శ్రీమతి గాంధీ కోటరీ సభ్యులు ఆయనను పైకి తేవడాన్ని ప్రతిఘటిస్తూ పార్టీలో ఆయన తేదలుచుకున్న మార్పులను వ్యతిరేకిస్తున్నారని. రెండవది, ఢిల్లీ ఎన్నికలతో సహా ఇతరుల తప్పులకు బాధ్యత వహించడంలో విసిగిపోయిన గాంధీ రాజకీయాల నుండి నిష్క్రమించనున్నారని, అందుకు పూర్వరంగమే సెలవు ప్రకటన అని. మూడోది, ఎట్టకేలకు ఆయన వివాహం చేసుకోబోతున్నారని. మూడో వివరణకు అసలు సాక్ష్యమే లేకపోగా ఆయన జనవరి చివరి వారంలో ఢిల్లీ ఎన్నికలకు ముందే రెండు నెలలపాటు విరామం లోకి వెళ్లాలని ప్రయత్నించగా శ్రీమతి గాంధీ వద్దు వద్దని నచ్చజెప్పడంతో వెనక్కి టాగ్గారు. కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ సాధించడం కంటే అంతర్గత రాజకీయాలలోనే మునిగి ఉన్న సంగతి స్పష్టంగా కనిపిస్తున్నందున మొదటి కారణంలో ఎంతోకొంత వాస్తవ ఉండకపోదు. రాహుల్ ‘విశ్రాంతి కోసం సెలవు’ ప్రకటించడమే కాంగ్రెస్ ప్రతిష్టకు భంగకరమే కాక ఆ పార్టీకి తరచుగా ఊరటల అవసరం ఎంతగానో ఉందన్న అవగాహనకు తగ్గట్లుగానే ఆ ప్రకటన వచ్చి పైన బడింది. ప్రత్యామ్నాయ నాయకత్వం కావాలన్న డిమాండ్ల సంకేతాలు కూడా కాంగ్రెస్ లో కనిపించడం లేదు; ఏప్రిల్ ఆరంభంలో జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో చర్యలతో కూడిన పధకం ప్రకటించడానికి గాంధీ తనను తాను తాజా పరుచుకుని వస్తారని మాత్రమే ప్రస్తుతం ఊహించగల కార్యం.

One thought on “సెలవులో రాహుల్ -ది హిందు ఎడిటోరియల్

  1. ప్రజాస్వామ్యంలొ ప్రతి పక్షాల పాత్ర చాలా కీలకం. ఎన్.డి.ఎ ప్రభుత్యం కీలకమైన బిల్లులను ఒకపక్క పార్లమెంట్ నందు ప్రవేశపెట్టగా మరొ పక్క బడ్ఝేట్ సమావేశాలు జరుగుతున్న ఇటువంటి కీలక సందర్భంలొ రాహుల్ గాంది ప్రకటించిన సెలవు తనకి పొరాడకుండానే అదికారం కావలనె భావన స్పష్తంగా తేలుస్తుంది. కాని ప్రజలు బాద్యత లెని వ్యక్తికి అదికారం ఇవ్వలని కొరుకొరు .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s