నితీష్ పునరాగమనం -ది హిందు ఎడిటోరియల్


Nitish oath

బీహార్ ముఖ్యమంత్రిగా జనతా దళ్ (యునైటెడ్) నేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిలోని ఒక దశ ముగిసింది. అయితే, ఆయన పునరాగమనంతో అక్టోబర్ లోపు జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మరో రాజకీయ పునరేకీకరణ దశ ఆరంభం అవుతుంది. ఇప్పటివరకు మనం చూసిన, జితన్ రామ్ మంఝి రాజీనామాకు దారి తీసిన… పరిణామాల కంటే మరింత తీవ్రమైన స్ధాయిలో రాజకీయ కవ్వం చిలకబడే అవకాశం కనిపిస్తోంది. 2010 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో పదవి చేపట్టిన నితీష్ కుమార్ కోసం (ఆయన రాజీనామా అనంతరం) మళ్ళీ ఆ పదవిని అప్పగించడానికి మంఝి నిరాకరించారు. జె.డి(యు) పార్టీని చీల్చడంలో భారతీయ జనతాపార్టీ మరింత చురుకయిన మద్దతు ఇస్తుందని మంఝి ఆశించారు. ఎందుకంటే బి.జె.పి మద్దతు లేనిదే అధికారంలో కొనసాగాలన్న ఆయన ఆశ నెరవేరదు. కానీ బి.జె.పి తన మద్దతును తమ ఎమ్మెల్యేల ఓట్లను హామీ ఇవ్వడం వరకే పరిమితం చేసుకుంది.

ఇప్పటి వరకు ముగిసిన నాటకంలోని మూడు దారాలే: తన ఒకప్పటి రాజకీయ పోషకులయిన నితీష్ కుమార్ ను ధిక్కరిస్తూ మంఝి ముందుకు రావడం; మంఝిని ప్రేరేపించడంలో బి.జె.పి కనబరిచిన ఆతృత: సూత్ర రీత్యా 2014లో తాను పరిత్యజించిన కుర్చీని తిరిగి ఆక్రమించాలని నితీష్ కుమార్ పట్టు పట్టడం… వచ్చే వారాల్లోనూ ఆవిష్కృతం కానున్న నాటకంలో ప్రధాన అంశాలుగా ప్రస్ఫుటం అవుతాయి. తానుగా అవకాశవాది అయినప్పటికీ పక్కనే ఉన్న ఉత్తర ప్రదేశ్ లో వలె బీహార్ లో ఇంకా ఒక (ప్రభావశీల) వర్గంగా వ్యక్తం చేసుకోలేని దళితుల ఆశలకు, ఆకాంక్షలకు మంఝి ప్రతినిధి. ముఖ్యమంత్రిగా మహాదళిత్ అయిన మంఝి నియామకం ఆనాటి నితీష్ కుమార్ రాజకీయాల కొనసాగింపు కోసమే కాగా, ఆయన తిరుగుబాటు సైతం సరిగ్గా అవే రాజకీయాల ఫలితం. సాధికారత పొందిన దళితులు వెనుకబడిన కులాల నేతలకు రెండో వాయిద్యగాడిగా ఉండడానికి అంగీకరించరు. ఇక్కడే తనకు అవకాశం ఉందని బి.జె.పి భావించింది. మహారాష్ట్ర, హర్యానాలలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళితులను ఆకర్షించడంలో విజయవంతం అయిన బి.జె.పి అదే తరహాలో బీహార్ లోనూ దళితులను ఆకర్శించేందుకు బి.జె.పి ప్రయత్నిస్తుంది.

దళితులను ఆకర్షించే బి.జె.పి పధకంలో మంఝి పాత్ర ఏమిటన్నది ఇంకా రూపు కట్టవలసి వుంది. అయితే నితీష్ కి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న శబ్దాలు బి.జె.పి హిందూత్వ రాజకీయాలకే లాభం చేకూర్చుతాయి. 2010 అసెంబ్లీ ఎన్నికల వరకూ బీహార్ లో జె.di(యు) కు జూనియర్ పార్టీగా ఉన్న బి.ఏ.పి ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో చిన్న పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తుంది. తన అభ్యర్ధులకు 100 కు పైగా సీట్లను అందుబాటులో ఉంచగలుగుతుంది. ఫలితంగా తన ఏలుబడిలోని వెనుకబడిన కులాలను,  దళితులను, ముస్లింలను ఒకే గొడుగు కింద కలిపి ఉంచడంలో కుమార్ భారీ సవాలును ఎదుర్కోనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తో కూటమి కట్టడం ద్వారా వెనుకబడిన కులాల సామాజిక కూటమిని నిర్మించడానికి తగిన పునాదిని కుమార్ ఏర్పరుచుకున్నారు. ముస్లింల మద్దతుతో మండల్ రాజకీయాలను పునరుద్ధరించే ప్రయత్నమే ఇది. బి.జె.పి పార్టీ హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఇది కొత్త రక్షణ దళం కానున్నది. రానున్న వారాల్లో హిందూత్వ, మండల్ రాజకీయాల మధ్య జరిగే తీవ్ర యుద్ధానికి బీహార్ వేదిక కావడం స్పష్టం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s