ఛిద్రమైన బి.జె.పి జంట టవర్లు -రాజ్ ధాకరే కార్టూన్


BJP twin towers

ఒబామా: “మరొకసారి జంట స్తంభాలు కూలిపోయాయి, కానీ విమానం మాత్రం భద్రంగా ఉందే”

*********

అద్భుతమైన కార్టూన్ కదా!

అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవలే ఇండియా సందర్శించిన సంగతి తెలిసిందే. ఒబామా పర్యటన విజయవంతం అయిందని మోడి, బి.జె.పిలు ఆ తర్వాత ఢంకా బజాయించారు. చాలా పత్రికలు అదే నమ్ముతూ తాము కూడా శక్తి కొద్దీ ఢంకాలు బజాయించాయి. దానితో పాటు ‘ఆ విజయం ఢిల్లీ ఎన్నికల్లో మోడీకి ఉపయోగపడుతుంది’ అని కూడా చెప్పాయి.

తీరా చూస్తే వారి జోస్యం నిజం కాకపోగా కళ్ళు తేలేసే ఫలితాల్ని ఢిల్లీ జనం రుచి చూపించారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలను టి.విలో తిలకిస్తూ ఒబామా ఏ విధంగా భావించి ఉంటారో ఈ విధంగా, అత్యంత ఇంటలిజెంట్ బుర్రతో, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధిపతి, బాల్ ధాకరే బంధువు రాజ్ ధాకరే కార్టూనీకరించారు. బాల్ ధాకరే లాగానే రాజ్ ధాకరే కూడా కార్టూనిస్టని బహుశా మహారాష్ట్రకు బయట ఇంతవరకూ తెలియదు. ఈ కార్టూన్ తో ఇప్పుడు తెలిసినట్లే.

అరవింద్ కేజ్రీవాల్ కి ‘ఎయిర్ జాదూ’ అని పేరు పెట్టడం చూడండి! ఎన్నికల పార్టీల దృష్టిలో ఓట్లు నొల్లుకోవడమే ప్రధాన లక్ష్యం. ఓట్లు సంపాదించి అధికారంలోకి వచ్చాక ఆ ఓట్లు వేసిన జనం ఏమైపోయినా వారికి అనవసరం. ఈ దృష్టితో చూడడం వల్లే అరవింద్ కేజ్రీవాల్ రాజ్ ధాకరేకి జాదూగా కనిపించాడు.

జనం కళ్ళతో చూస్తే అరవింద్ కేజ్రీవాల్ జాదూగా కాదు ఉన్నవారిలో ‘ది బెస్ట్’ నిజాయితీపరునిగా కనిపిస్తారు. అది వేరే కధ.

కార్టూన్ విషయానికి వస్తే అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 తేదీన టెర్రరిస్టులు కొందరు విమానాల్ని హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను ఢీ కొట్టి కూల్చారని అమెరికా ప్రపంచానికి చెప్పింది. (వాస్తవాలేమిటన్నది ప్రస్తుతానికి పక్కన పెడదాం.)

ఆ జంట టవర్లతో మోడి, షా లను రాజ్ పోల్చారు. అంత ఎత్తున ఠీవిగా, అమెరికా ఆర్ధికాధిపత్యానికి గుర్తుగా నిలబడి ఉండే టవర్లను టెర్రరిస్టులు కూల్చిపారేసినట్లే, బి.జె.పికి చెందిన జంట టవర్ల (ఇప్పుడు ఆ పార్టీలో వారిద్దరే నాయకులు. మిగతావారంతా డమ్మీలే అని రాజ్ ధాకరే సైతం అంగీకరించారు, గమనించండి) గుండెలను చీల్చుకుంటూ వెళ్ళి కూడా అరవింద్ జాదూ నిక్షేపంగా బైటికి వచ్చారని రాజ్ అభివర్ణించారు.

ఓడిపవడం అన్నదే ఎరుగని రెండు ఎత్తైన టవర్లను చిన్న పీపీలికం ఢీ కొడితే ఏమవుతుంది? టవర్లకు ఏమీ కాకపోగా పీపీలికం సర్వనాశనం అయిపోతుంది. కానీ కేజ్రీవాల్ మాత్రం భారత దేశ, రాష్ట్ర ఎన్నికల సమరాంగణంలో అప్రతిహతంగా పురోగమిస్తున్న జంట శిఖరాలను ఢీ కొట్టి కూడా చెక్కు చెదరకుండా మరే రాజకీయ పార్టీ అయినా అసూయ పడేలా బైటికి వచ్చేశారు. ఆ శిఖరాలు మాత్రం గుండెలు బద్దలై నిస్సహాయంగా, నిస్పృహతో చూస్తూ నిలబడవలసిన దుర్గతి!

ఈ కార్టూన్ గీయడానికి తనకు రెండున్నర గంటలు పట్టిందని రాజ్ చెప్పారు. ఆయన కార్టూన్ ని MNS వెబ్ సైట్ లో ప్రచురించిన వెంటనే ముంబైలో పత్రికలన్నీ దాన్ని తమ సొంతం చేసుకున్నాయి. కొన్ని టి.వి ఛానెళ్లు కార్టూన్ పైన ప్రత్యేక కధనాన్ని ప్రసారం చేశాయి.

5 thoughts on “ఛిద్రమైన బి.జె.పి జంట టవర్లు -రాజ్ ధాకరే కార్టూన్

 1. అరవింద్ కేజ్రీవాల్ కి ‘ఎయిర్ జాదూ’ అని పేరు పెట్టడం చూడండి! ఎన్నికల పార్టీల దృష్టిలో ఓట్లు నొల్లుకోవడమే ప్రధాన లక్ష్యం. ఓట్లు సంపాదించి అధికారంలోకి వచ్చాక ఆ ఓట్లు వేసిన జనం ఏమైపోయినా వారికి అనవసరం. ఈ దృష్టితో చూడడం వల్లే అరవింద్ కేజ్రీవాల్ రాజ్ ధాకరేకి జాదూగా కనిపించాడు.
  ఇదే థాకరే గారు కూడా ఎన్నికలలో నిల్చున్నప్పుడు తానూ కూడా జాదూగాడునే నన్న సంగతి తెలియదా!!!
  ఎదుటివారికి చెప్పేటందుకేనా నీతులు?
  ఏమైనప్పటికీ స్నేహపక్షులను-వారి భాధను కార్టూన్లో చూపించిన విధానం బాగుంది!!

 2. VSHEKHAR GAARU, I don’t think, it’s ‘ఎయిర్ జాదూ(magic)’.It’s “air zadoo(ఝాడూ =broom)” ,bcs even the broom symbol is there too.so the statement(అరవింద్ కేజ్రీవాల్ కి ‘ఎయిర్ జాదూ’ అని పేరు పెట్టడం చూడండి! ఎన్నికల పార్టీల దృష్టిలో ఓట్లు నొల్లుకోవడమే ప్రధాన లక్ష్యం. ఓట్లు సంపాదించి అధికారంలోకి వచ్చాక ఆ ఓట్లు వేసిన జనం ఏమైపోయినా వారికి అనవసరం. ఈ దృష్టితో చూడడం వల్లే అరవింద్ కేజ్రీవాల్ రాజ్ ధాకరేకి జాదూగా కనిపించాడు. ) has no meaning here. thanks

 3. పవన్ గారు, మీ లింక్ చదివాను. విదేశీ పెట్టుబడులు తప్ప ఏదీ అవసరం లేదని చెప్పడానికి హిందూ మతాన్ని నమ్ముకోవలసిన అవసరం లేదు. హిందూ మతంలో స్త్రీ-పురుష సంబంధాలు ఎంత అభివృద్ధి నిరోధకంగా ఉంటాయో హిందూ కుటుంబం నుంచి వచ్చిన ఒక నాస్తికునిగా నాకు బాగానే తెలుసు. హిందువులు కర్మవాదం (fatalism)ని నమ్ముతారు. వాళ్ళు బాగుపడరు, ఇతరులని బాగుపడనివ్వరు. పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యక్తి స్వేచ్ఛావాదం పేరు చెప్పుకుంటుంది. హిందూ మతంలో ఉండే కులం, కట్నం లాంటి కట్టుబాట్లు వ్యక్తి స్వేచ్ఛావాదానికి సరిపడవు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండాలన్నా భాజపా నాశనం కావాలి.

 4. praveen garu, ……i am not against to BJP as a whole and at the same time i does not support the pro capitalistic and communal tendencies of BJP ….every party has its own flaws….congress is a dynastic party always revolving around the nehru gandhi familyhttps:(//fairindian.wordpress.com/2015/01/07/why-i-hate-congress-but-loved-indian-national-congress/)…coming to communism although as a ideology it is highly on the edge when compared to capitalism asking for the greater parity among the civilians and for a egalitarian society but as a political alternative (CPI and CPM) to sustain in democratic countries, according to me ,completely failed.

  హిందువులు కర్మవాదం (fatalism)ని నమ్ముతారు. వాళ్ళు బాగుపడరు, ఇతరులని బాగుపడనివ్వరు. పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యక్తి స్వేచ్ఛావాదం పేరు చెప్పుకుంటుంది. హిందూ మతంలో ఉండే కులం, కట్నం లాంటి కట్టుబాట్లు వ్యక్తి స్వేచ్ఛావాదానికి సరిపడవ
  relation between fatalism, individualism and Hinduism, a typical comparison praveen garu..trying to fall in line with you…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s