సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున బ్లాగ్ ప్రారంభించిన సంగతి వర్డ్ ప్రెస్ వాళ్ళ శుభాకాంక్షలు అందుకునే వరకూ గుర్తు రాలేదు.
బ్లాగ్ ప్రారంభించింది ఒకందుకే అయినే ఇంకా మరిన్ని విధాలుగా బ్లాగ్ ఉపయోగపడుతోందని పాఠకుల స్పందనల ద్వారా తెలిసింది.
గత సంవత్సరం ఇదే రోజు చెప్పినట్లు ఎందరో పాఠకులు, హితాభిలాషుల ఉత్సాహ ప్రోత్సాహాలు లేకుండా నాలుగేళ్ల పాటు ఈ బ్లాగ్ కొనసాగడం సాధ్యపడి ఉండేది కాదు. వారందరికీ మరోసారి కృతజ్ఞతలు.
ఈ బ్లాగు నాకు సంబంధించినంతవరకు సైబర్ ప్రపంచం వైపు తెరుచుకున్న కిటికీ. నా ప్రపంచం లోకి తొంగిచూసే అవకాశం ఇతరులకు కల్పించిన కిటికీ కూడా.
ఫలితంగా నాకు మంచి మిత్రులు దొరికారు. మంచి విమర్శకులు లభించారు. సామాజిక అనుభవాలు దక్కాయి. అనుభూతులు మిగులుతున్నాయి. నా గురించి నేను ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను. బాహ్య ప్రపంచం గురించి మరింత తెలుసుకున్నాను.
ఇప్పటికి ఇది 3669వ టపా. అనగా 48 నెలలకు 3669 చొప్పున రమారమి నెలకు 76 టపాలు లేదా రోజుకు రమారమి రెండున్నర టపాలు. చూపులు 1461 రోజులకు 1,260,670. లేదా రోజుకు 862. ఇది సమాచారం కోసం. (నా రికార్డు కోసం కూడా.) స్వోత్కర్ష కోసం కాదని మనవి.
అందరికీ దండాలతో…
శుభాకాంక్షలు
బాగుంది, చాలా సంతోషం, congratulations sir
శాండి సోదరా, ధన్యవాదాలు.
?! గారు, బహుకాల దర్శనం! మేం అలిగాం. మీకు ధన్యవాదాలు లేవు పొండి.
శుభాకాంక్షలు Sekhar gaaru.
నేను ఆన్‌లైన్‌లో వుంటే “తెలుగువార్తలు” చూడకపోవటం కల్ల, మీ పోస్టులు మొత్తం ఫీడ్ రూపంలో మెయిల్ కి రావడం చేత వెబ్ సైట్ వచ్చి వార్తలు చూడాల్సిన అవసరం లేకుండా వున్నది. అంచేత మీకు నా ఉనికి తెలియటం లేదు అంతే.
సర్ మరో మాట, దేశం అంతట కూడా AIB Backhod (అశ్లీల పదాలు వుపయోగిస్తున్న షో) గురించిన చర్చ జరుగుతున్నది, కనీసం చూచాయిగా కూడా తెలుగు పత్రికలు అద్దానిపై స్పందిచడం లేదు, మీరైనా కాస్త ఆ వార్తకు తెలుగులో వెలుగునియ్యరాదా?
గతంలో కూడా hollywood movie “The Interview” Release సమయంలో సోనీ పిక్చర్స్ సంస్థ పై కొరియా దేశ హ్యాకర్ల దాడి చాలా పెద్ద వార్త దానిని మీ సైట్ ప్రచురించగలరని మెయిల్ ద్వారా మిమ్మల్ని కోరటం జరిగినది బహుశ పని ఒత్తిడిలో మీరు గమనించలేదేమో అనుకున్నాను.
ఏది ఏమైనప్పటికి *తెలుగు వార్తలు* అనేది ప్రస్తుతానికే కాదు, ఫ్యూచర్ లో రిఫరెన్స్ కోసం ఉపయోగపడే అతి పెద్ద చక్కని వార్తా భాండాగారం !!
మీ మా ఈ తెలుగువార్తలు పదికాలాలపాటు చల్లగా వుండాలని కోరుకుంటూ
రెగ్యులర్ రీడర్
?!
?! గారు, జస్ట్ హాస్యమాడా అంతే.
మీరు చెప్పిన మెయిల్ ఇప్పుడే వెతికి చూశాను. ఆ మెయిల్ అప్పుడే చూశాను. మీరు ఇచ్చిన లంకెలోకి వెళ్ళి చూసి తీరిగ్గా స్పందిద్దాం అని వాయిదా వేశాను. ఈ లోపే రోజులు గడిచిపోయాయి.
మీరు ఊహించినట్లు వేరే పని ఒత్తిడిలో ఉన్న మాట నిజం. పాఠకులు వేసిన అనేక ప్రశ్నలకు కూడా నేను సమాధానం బాకీ ఉన్నాను. వీటన్నింటికీ వరుసగా స్పందించే అవకాశం కోసం చూస్తున్నాను. మీరు గమనిస్తే ఈ మధ్య నేను టపాలు రాయని రోజులు కూడా ఉన్నాయి. పని ఒత్తిడే ఈ వైఫల్యాలకు కారణం.
మీరు చూపిన ధీమ్ కోసం అప్పుడు వర్డ్ ప్రెస్ లో వెతికితే దొరకలేదు. బహుశా ప్రీమియం ధీమ్ అయి ఉంటుంది. వర్జ్ వాళ్ళు కూడా తమ ధీమ్ ఏమిటో చెప్పలేదు. వర్డ్ ప్రెస్ లో ఒక ధీమ్ తీసుకుని దానికి మార్పులు చేసారేమో.
ప్రీమియం ధీమ్స్ పేరుతో వర్డ్ ప్రెస్ వాళ్ళు అందమైన ధీమ్ లు ఇస్తున్నారు. కానీ వాటికి డబ్బు కట్టాలి. వర్జ్ వాళ్ళది ప్రీమియం ధీమే అయితే మనకు దొరకడం కష్టమే. అయినా మళ్ళీ చూస్తాను.
సోనీ హ్యాకింగ్ అమెరికా కుట్ర. దాని గురించి వివరంగా త్వరలోనే రాస్తాను. ఆలస్యం అయినా ఏమీ అనుకోవద్దు మరి.
congrats sir…..especially ur awesome with analysis on international news…thanking u sir for enlightening us on various issues these four long years
తెలుగు బ్లాగుల్లో మీ బ్లాగు స్థానం కచ్చితంగా ఎంతో విలువైనది. ముఖ్యంగా పోటీ పరీక్షల విద్యార్థులకు కూడా మీ బ్లాగ్ ద్వారా ఎన్నో విలుపైన
విషయాలు వివరిస్తున్నారు. ప్రధానంగా మీరు రాస్తున్న ఆర్థిక అంశాలు దాచిపెట్టుకోవాల్సినవి. మీరు మీ బ్లాగ్ పదికాలాల పాటూ చల్లగా
వర్థిల్లాలని కోరుకుంటున్నాను.