స్వేచ్చా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధల్లో, వాణిజ్య పత్రికల్లో తరచుగా వినియోగించే పదం ‘బిజినెస్ కాన్ఫిడెన్స్.’ ఇదే అర్ధాన్ని వ్యక్తం చేస్తూ పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త జాన్ కీన్స్ ‘యానిమల్ స్పిరిట్స్’ అన్న పదబంధాన్ని ప్రయోగించారు.
భారత దేశంలో ‘యానిమల్ స్పిరిట్స్’ అన్న పదాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చిన ఘనత మాజీ ప్రధాని, మాజీ ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ దే. భారత జి.డి.పి పడిపోవడం మొదలైన దశలో, అప్పటి ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా నామినేషన్ వేసిన దరిమిలా, మన్మోహన్ రెండో దఫా ఆర్ధిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేబూనారు.
ఆ సందర్భంగా కార్పొరేట్ సంఘాల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన “మీ యానిమల్ స్పిరిట్స్ ను పునరుద్ధరించండి” అని పెట్టుబడిదారీ కార్పొరేట్ కంపెనీల అధిపతులను కోరారు. అప్పటి నుండి ఆ పదం ఇండియాలో వాణిజ్య పత్రికలు తరచుగా ఉపయోగించడం ప్రారంభించాయి.
ఈ వారం ఈనాడు పత్రికలో ‘యానిమల్ స్పిరిట్స్’ గురించి చర్చించాను. నిన్నటి ఈనాడు పేపర్ చదువు పేజీలో “ఆర్ధిక వ్యవస్ధకు వూపునిచ్చే వైఖరి” శీర్షికన ఈ ఆర్టికల్ ప్రచురితం అయింది.
ఈ ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే కింది లంకెను క్లిక్ చేయండి.
ఆర్ధిక వ్యవస్ధకు వూపునిచ్చే వైఖరి
ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ లో చదవాలనుకుంటే కింద చిన్న బొమ్మపై క్లిక్ చేయగలరు. చిన్న బొమ్మపై రైట్ క్లిక్ చేసి ఆర్టికల్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. బొమ్మ రూపంలోనే చూడాలనుకుంటే ఆ కింద ఉన్న పెద్ద బొమ్మను క్లిక్ చేయగలరు.
అప్పు తచ్చు: పత్రికలో కొన్ని చోట్ల ‘యానిమేషన్ స్పిరిట్స్” గా ప్రచురితం అయింది. ఇది అచ్చులో దొర్లిన పొరబాటు మాత్రమే.
–