గాల్లోంచి ఢిల్లీ పీఠంపైకి బేడీ -కార్టూన్


Kiran Bedi

“ఇదేదో మన పీకల మీదికే వచ్చేట్లుంది….”

************

అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం పస ఏమిటో, అది ఎందుకు ఎవరి ప్రోద్బలంతో మొదలై చివరికి చప్పగా ముగిసిందో జనానికి బహుశా ఇప్పుడు తెలిసి ఉండాలి.

అలాగే, అవినీతి వ్యతిరేక ఉద్యమం లోక్ పాల్ చట్టాన్ని సాధించలేని పరిస్ధితుల్లో ఇక రాజకీయాల్లోకి దిగుదామని కొత్త పార్టీ పెడదామని అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించినప్పుడు ఆయన కొలీగ్ కిరణ్ బేడీ ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించారో కూడా ఇప్పుడు జనానికి అర్ధమై ఉండాలి.

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సాగించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం చివరికి నామమాత్ర సెక్యులరిజంను, నామ మాత్ర ప్రజానుకూల విధానాలను సైతం బొంద పెట్టే ఆర్ధిక విధానాలతోనూ, మతోన్మాద గ్రూపుల మద్దతు గల శక్తులతోనూ కూడిన ప్రభుత్వం ఏర్పాటుకు దారి తీసినట్లే అన్నా బృందం ఉద్యమం కూడా హిందూత్వ శక్తులు అధికారం ఏర్పడేందుకు దారి తీసింది. కాకపోతే తీవ్రతల్లోనే తేడా.

అయితే, అరవింద్ కేజ్రీవాల్ తనను తాను హిందూత్వ శక్తుల నుండి వేరుపరచుకోవడం ఒక సానుకూల పరిణామం.

కేజ్రీవాల్, ఏఏపి ని స్ధాపిస్తున్నప్పుడు మొదట అన్నా మద్దతు ఇస్తున్నట్లే కనిపించారు. కానీ కిరణ్ బేడీ ఒత్తిడితో ఆయన కేజ్రీవాల్ ను వ్యతిరేకించి దూరంగా ఉండిపోయారు. మోడి పాలనను మెచ్చుకున్న హజారే కిరణ్ బేడీ ఒత్తిడికి లొంగిపోయారా లేక తానే ఇష్టంతో/అయిష్టంతో (ఏఏపి స్ధాపన నుండి) దూరంగా ఉండిపోయారా అన్నది ఇప్పుడు తలెత్తుతున్న మరో అనుమానం.

కిరణ్ బేడీ హఠాత్తుగా ఢిల్లీ ఎన్నికల్లో బి.జె.పి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రత్యక్షం అయ్యారు. తద్వారా ఆమె తాను మొదటి నుండీ బి.జె.పి కి ప్రాక్సీగానే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని స్పష్టం చేశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆమె అవినీతికి వ్యతిరేకంగా కాకుండా రాజకీయ ఉద్దేశాలతో పని చేశారని స్పష్టం చేశారు.

ఢిల్లీ బి.జె.పికి నాయకుల కొరత ఉన్నదని ఆ కొరత కిరణ్ బేడి తీర్చారని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. కానీ మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు నాయకులు కాకుండా ఎలా పోతారు? ఎప్పటి నుండో ఏదో ఒక స్ధాయిలో నాయకత్వంలో ఉన్న బి.జె.పి నేతలకు లేని నాయకత్వ ప్రతిభ హఠాత్తుగా రాజకీయాల్లోకి దుమికిన బేడికి ఎక్కడి నుండి వస్తుంది?

ఇది ఢిల్లీ బి.జె.పి నేతల మనసులోని మాట అని కార్టూనిస్టు సూచిస్తున్నారు. జనానికి కూడా ఇదే అనుమానం వస్తే అది న్యాయమైనదే. అవినీతి వ్యతిరేకత పేరుతో జనాన్ని మోసగించిన కిరణ్ బేడీ మోసాలతో నిండిన రాజకీయాల్లోకి దుమికి నిజాయితీగా పని చేస్తారా అన్న అనుమానం జనానికి వస్తే అది న్యాయమైనదే.

‘Thin end of the edge’ అనేది ఆంగ్లంలో ఒక Idiom. త్వరలో ప్రమాదకరంగా పరిణమించే సంఘటనను ఉద్దేశిస్తూ దీనిని వాడతారు. ఢిల్లీ బి.జె.పి నేతలకు కిరణ్ బేడీ చేరిక ఉత్సాహానికి బదులు భయాన్ని రేకెత్తించ్చిందని, గెలుపు గ్యారంటీ అయిన ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవిని  గద్దలా తన్నుకుపోతున్నారని వారు ఆందోళనలో ఉన్నారని కార్టూనిస్టు సూచిస్తున్నారు.

 

4 thoughts on “గాల్లోంచి ఢిల్లీ పీఠంపైకి బేడీ -కార్టూన్

  1. అవినీతి వ్యతిరేక ఉద్యమం అనే బుడగ పేలడానికి(అసలు స్వరూపం బయటపడడానికి) ఇంతకాలం పట్టిందన్నమాట!!!
    మనదేశంలో జరిగే సో కాల్డ్ ఉద్యమాలు యొక్క అసలు స్వరూపాలు వేరేఉన్నాయన్నమాట?!
    బి.జే.పి అధికారంలోకి రావడానికి టీం అన్నా ఇతోధికంగా సహకరించారన్నమాట!(అన్నన్నా!)
    దేశం సరైన మార్గంలోనే ముందుకు పోతోందన్నమాట?! కీప్ ఇట్ అప్!!!

  2. నీతి, అవినీతికి మధ్య సంబందం చెప్పే వారిని బట్టి అర్ధం మారి పోతూ ఉంటుంది. అవినీ తికి సరైనా నిర్వచనం ఏంటీ? ఏది నీతి? ఏది అవినీతి ఓ మహాత్మా! ఓ మహార్షి! ‘ వీర వనితా, ఆదర్శ స్త్రీ ‘ అని మీడియా పేరు పెట్టిన బేడి అవినీతికి బేడీలు వేస్తుందా?

  3. స్త్రీ-పురుష సంబంధాలపై సాధారణ ఇల్లాలి అభిప్రాయానికీ, కిరణ్ బేదీ అభిప్రాయానికీ మధ్య తేడా ఏమీ లేదు. కిరణ్ బేదీ ఒక పత్రికకి ఇచ్చిన ఇంతర్వ్యూ చిన్నప్పుడు చదివాను. “ఆడదానికి బతుకు అఱటాకు లాంటిది” అని ఆమె అన్నట్టు నాకు గుర్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s