కమ్యూనిజానికి కాలం చెల్లిందని నమ్ముతున్నవారికిది దుర్వార్త! హిందూ మతోన్మాదాన్ని పీకలదాకా ఎక్కించుకుని, బుద్ధుడిని హిందూ మతంలో కలిపేసుకుని, చైనామీద వ్యతిరేకతతో దలైలామా పైన ప్రేమ పెంచుకున్న జీవులకు, బహుశా డిప్రెషన్ లోకి నెట్టివేసే విషాద వార్త! దలైలామా సైతం ‘నేను మార్క్సిస్టుని’ అని చాటుకోవడం కంటే మించిన విషాదకర దుర్వార్త ఉండగలదా?
“సామాజికార్ధిక సిద్ధాంతానికి సంబంధించినంతవరకు నేను ఇంకా మార్క్సిస్టునే” అని దలైలామా ప్రకటించారు. “నేను ఇంకా” అనడం ద్వారా తాను పూర్వాశ్రమంలో ‘మార్క్సిస్టుని’ అని దలైలామా చెబుతున్నట్లే ఉంది. ఆయన చెప్పేది నిజమేనేమో!
చైనా కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్ మావో జెడాంగ్ నేతృత్వంలో జరిగిన పార్టీ సభలకు డెలిగేట్ గా కూడా హాజరయిన చరిత్ర దలైలామాకు ఉంది. కనుక తాను గతంలో మార్క్సిస్టుని అని చెప్పుకోగల అర్హత ఉండవచ్చు. కానీ “నేను ఇంకా మార్క్సిస్టుని” అని ఆయన చెప్పుకోవడం మార్క్సిస్టుల కంటే ఎక్కువగా హిందూ మతోన్మాద పెట్టుబడిదారీ గుంపుకి బాధ కలుగుతుంది అనడంలో సందేహం లేదు.
ఇంతకీ ఇంకా మార్క్సిస్టునే అని దలైలామా చెప్పుకోవడానికి కారణం? ఆయన మాటల్లోనే చూస్తే: “పెట్టుబడిదారీ దేశాల్లో ధనికులకు పేదలకు మధ్య అంతరాలు ఇంకా ఇంకా పెరుగుతూ పోతున్నాయి. మార్క్సిజంలో సమాన పంపిణీ గురించి నొక్కి చెబుతారు. అది నా దృష్టిలో చాలా కీలకమైన అంశం” అని 14వ దలైలామా (జెట్సన్ జంఫెల్ ఙవంగ్ లోబ్సాంగ్ యెషే టెంజిన్ గ్యాట్సో) ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ లోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో పాల్గొన్న దలైలామా ‘ప్రపంచ శాంతి’ అంశంపై ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మార్క్సిస్టుని అని చెప్పుకోవడంతోనే లామా సరిపెట్టుకోలేదు. పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించారు కూడా. వారితో పాటు మార్క్సిస్టులను కూడా ఆయన వదల్లేదు. మార్క్సిస్టులు పెట్టుబడిదారీ ఆలోచనతో ఉండడం ఆయనకు బొత్తిగా నచ్చడం లేదట.
“అనేక మంది మార్క్సిస్టు నాయకులు ఇప్పుడు తమ ఆలోచనా విధానంలో పెట్టుబడిదారులే. అది వారికి అందిన ప్రేరణ, ఆలోచన, దృక్పధం… మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది” అని లామా తన ప్రసంగంలో పేర్కొన్నారు.
భారత దేశం గురించి కొన్ని మంచి మాటలను లామా చెప్పారు. “పాకిస్తాన్ లో షియాల కంటే ఇండియాలో ముస్లింలు ఎక్కువ భద్రతతో జీవిస్తున్నారు” అని లామా చెప్పారు. కానీ కుల వ్యవస్ధను ఆయన విమర్శించారు. “భారత దేశంలో నిమ్న కులాలపైనా, స్త్రీల పైనా కొనసాగుతున్న వివక్షల వల్ల ఇక్కడ శాంతికి భంగం కలుగుతోంది” అని లామా విమర్శించారు.
30 యేళ్ళ వయసు లోపలి వారంతా పూనుకుని 21వ శతాబ్దాన్ని ‘శాంతి శతాబ్దం’ గా మార్చాలని లామా విజ్ఞప్తి చేశారు. “గత శతాబ్దం నిండా హింస నిండి ఉంది. ఈ శతాబ్దాన్ని చర్చల శతాబ్దంగా మార్చితే అది ఇక శాంతి శతాబ్దం అవుతుంది. నా జీవితంలో అది చూడలేకపోవచ్చు. కానీ మనం అందుకోసం కృషి చేయాల్సి ఉంది. 30 యేళ్ళ లోపువారు 21వ శతాబ్దపు తరం. మీ లక్ష్య శక్తి, దృష్టి, విజ్ఞానంతో హింసను నిరోధించాలి” అని లామా ఆకాంక్షించారు.
కానీ యువత లక్ష్యం పెట్టుకున్నంత మాత్రాన శాంతి సాధ్యపడుతుందా? అసలు శాంతి భంగం కావడానికి కారకులు ఎవరో గుర్తించి వారిని నిరోధిస్తే శాంతి సాధ్యపడుతుందా లేక కేవలం యువత పూనుకుంటే సాధ్యపడుతుందా? 21వ శతాబ్దాన్ని కూడా హింసా వలయంలో ముంచివేసే ప్రయత్నాల్లో భౌగోళిక రాజకీయ శక్తులు నిండా మునిగి ఉండగా ఎవరో కొందరు పూనుకుంటే సాధ్యపడదు.
ప్రజలు, దేశాలు, ప్రపంచం అశాంతిలో కొట్టుకుంటూ ఉంటేనే తాము శాంతిగా బతకగలమని భావించే శక్తులే ఇప్పుడు ప్రపంచ పెత్తనాన్ని చెలాయిస్తున్నాయి. వారి పీచమణచకుండా శాంతి నెలకొనడం సాధ్యం కాజాలదు. ఈ సంగతి లామాకు తెలియకుండా ఉంటుందా?
తాను మార్క్సిస్త్‌నని చెప్పుకోవడం ఆయన వ్యక్తిగత విషయం. వర్గ చైతన్యం ఉన్నవాడు వ్యక్తిగతంగా మత విశ్వాసి అయినా అతన్ని కమ్యూనిస్త్ పార్తీలో చేర్చుకోవడానికి అభ్యంతరం చెప్పరు. అయినప్పటికీ పెట్టుబడిదారీ వ్యవస్థని ఎదుర్కోవడానికి భావవాదం సరిపోదనే విషయం గుర్తుంచుకోవాలి. “నీ హక్కులు ఇవి, దీన్ని నీవు సాధించుకోవాలి” అని చెప్పి ప్రజల్ని యుద్ధ రంగంలోకి దింపగలం కానీ కేవలం మతపరమైన ప్రవచనాలు చేసి పోరాటానికి రమ్మంటే ఎంత మంది వస్తారో చెప్పలేము.
if he is marxist why is he living in india………..why not china………..if marxism is solution of the capitalism why it been failing all over the world…………why soviet union broke down………..why hardcore Communist getting close to America……
I had read in you bolgs that because of the capitalism communism fell down…………….is communism is that much weak that can collapse in one stroke of capitalism………………..