LPG! ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన ఊతపదం. దీనిపైన ఒక జోక్ వ్యాప్తిలో ఉంది.
LPG అంటే ఏమిటో తెలుసా? అని ఓ వ్యక్తి అడిగాడట. ‘ఆ, ఏముంది గ్యాసే కదా!’ అని మరో వ్యక్తి సమాధానం ఇచ్చాడట.
LPG అంటే ఏమిటని అడిగిన వ్యక్తి ఉద్దేశ్యం Liberalisation, Privatisation, Globalisation అని. ఈ విధానాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని, ఉద్యోగాలు కుమ్మరిస్తాయని, దేశం ఒకటే అభివృద్ధి చెందుతుందని దేశాల పాలకులు చెబుతారు. ఈ చెప్పేదంతా కూడా ఒట్టి గ్యాసే అని ఆ సమాధానం చెప్పిన వ్యక్తి తనకు తెలియకుండానే చెప్పినట్లు లేదూ? అదే జోక్. కాస్త సెన్సిటివ్ జోక్!
ఈ కరణాల గురించి రాసిన ఆర్టికల్ ఈ రోజు ఈనాడులో ప్రచురితం అయింది. ఆర్టికల్ ను ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే కింది లింక్ ను క్లిక్ చేయండి.
2 thoughts on “సరళీ-ప్రైవేటీ-ప్రపంచీ కరణాలు -ఈనాడు”
నవ్య ఉదారవాద విధానాలు సామ్రాజ్యవాద దేశాలకీ, పేద దేశాలకీ సమానంగా వర్తించవు. అమెరికాలో ఉన్నవి పూర్తి ఉదారవాద ఆర్థిక విధానాలు కావు. అమెరికాలో కూడా కొన్ని స్కూల్‌లూ, ఆసుపత్రులని ప్రభుత్వమే నడుపుతుంది. అవి లేకపోతే అక్కడి పేదవాళ్ళకి విద్య, వైద్యం అందవు. కానీ ఇందియాలో మాత్రం పరిమిత ప్రభుత్వం ఉండాలని అమెరికా అంటుంది. నవ్య ఉదారవాదుల నాటకాలు ఇలాగే ఉంటాయి.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పెట్టుబడుల మీదే ఆధారపడి మనం బతకాలని రూల్ ఏమీ లేదు. అమెరికాలో లైసె ఫెయిర్ ఆర్థిక విధానాలని అమలు చేస్తే అమెరికన్ కంపెనీలకి తమ సొంత దేశంలోనే cheap labour దొరుకుతుంది. అప్పుడు అమెరికన్ సంస్థాగత పెట్టుబడిదారులు (institutional investors) ఇందియాలో తమ షేర్‌లు ఉపసంహరించుకుని తమ సొంత దేశంలో పెట్టుబడులు పెట్టుకుంటారు. అప్పుడు అమెరికాలో stock markets ఆకాశానికి అంటి ఇందియాలో stock markets కుప్పకూలుతాయి. స్పెక్యులేషన్ వల్ల కోటీశ్వరులైన కొంత మంది భారతీయులు అప్పుడు సంతల్లో ఉప్పూ, చింతపండూ అమ్ముకోవాల్సి వస్తుంది.