ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ ఫండమెంటల్స్ లో చెల్లింపుల సమతూకం (Balance of Payments) ఒక ముఖ్యమైన అంశం. ఒక దేశం తన అవసరాల రీత్యా (ఉదా: దిగుమతులు) విదేశాలకు చెల్లింపులు చేయగల స్ధితిలో ఉన్నదా లేదా అన్నది ఆ దేశ BoP తెలియజేస్తుంది.
పేరులో ఉన్నట్లు BoP అంటే చెల్లింపులు చేయడం కాదు. అది ఒక ఆర్థిక ప్రకటన. ఒక కంపెనీ ఆర్ధిక పరిస్ధితిని ఆ కంపెనీ యేటా ప్రకటించే బ్యాలన్స్ షీట్ తెలియజేసినట్లే ఒక దేశం విదేశాలతో ఆర్ధిక లావాదేవీలు నడపగల పరిస్ధితిని ఆ దేశ BoP తెలియజేస్తుంది.
ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు BoP ఎప్పుడూ మైనస్ లో ఉంటుంది. ఎందుకంటే అవి ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంటాయి.
డాలర్, యూరో, యెన్, పౌండ్ మొదలైన కరెన్సీలు అంతర్జాతీయ స్ధాయిలో బలమైనవి. కనుక ఆ కరెన్సీలు కలిగిన దేశాలు సాపేక్షికంగా మెరుగైన BoP ని కలిగి ఉంటాయి.
వాణిజ్య మిగులు కలిగిన దేశాల BoP సాధారణంగా ప్లస్ లో ఉంటాయి. వాణిజ్య లోటు మరీ ఎక్కువై పెట్టుబడుల ఆదాయం ఆ లోటును పూడ్చలేకపోతే అప్పుడు ధనిక దేశాలు సైతం మైనస్ BoP ని చూపించవచ్చు.
BoP లో ఆర్ధిక వ్యవస్ధ సామర్ధ్యానికి మించిన నెగిటివ్ బ్యాలన్స్ ఉన్నట్లయితే అది చెల్లింపుల సమతూకపు సంక్షోభంగా పరిణమిస్తుంది. ఈ సంక్షోభంలో దేశీయ కరెన్సీ విలువ పడిపోతుంది. పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోతుంది. అప్పు చేసే సామర్ధ్యమూ తగ్గుతుంది.
ఇలాంటి పరిస్ధితిని కృత్రిమంగా అభివృద్ధి చెందిన దేశాలపై రుద్దడం ద్వారా అమెరికా, ఐరోపాలు తమ కంపెనీలకు అనుకూలమైన ఆర్ధిక విధానాలను పేద, వర్ధమాన దేశాలపై రుద్దుతున్నాయి. భారత పాలకులు కూడా అటువంటి పరిస్ధితిలోనే నూతన ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్నారు.
ఈ రోజు ఈనాడు చదువు పేజీలో BoP అంశం పైన నేను రాసిన ఆర్టికల్ ప్రచురితం అయింది. ఈనాడు వెబ్ సైట్ లో ఆర్టికల్ చూసేందుకు కింద లింక్ లోకి వెళ్లగలరు.
ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ లో చూసేందుకు కింద చిన్న బొమ్మపై క్లిక్ చేయండి. చిన్న బొమ్మను రైట్ క్లిక్ చేస్తే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ కింద పెద్ద బొమ్మను క్లిక్ చేస్తే బొమ్మ ఇంకాస్త పెద్దది అవుతుంది. మరోసారి క్లిక్ చేస్తే అసలు కొలతలతో కనిపించి చదవడానికి వీలుగా ఉంటుంది.
*******