“దానికి బదులు మనం మూడు కోతులకు విగ్రహం కట్టాలి”
*********
బి.జె.పి పాలన ప్రారంభం అయింది లగాయితు గాంధీ హంతకుడు నాధూరామ్ గాడ్సే ను ప్రశంసించేవారు ఎక్కువయ్యారు. సాక్ష్యాత్తు బి.జె.పి ఎం.పి లే బహిరంగంగా గాడ్సేను పొగిడి తమ భావజాలం నిజ స్వరూపం ఏమిటో చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా గాడ్సేకు దేశ రాజధానిలోనే విగ్రహం కట్టాలని అఖిల భారత హిందూ మహా సభ డిమాండ్ చేస్తోంది.
మహాత్మా గాంధీ నిజంగా మహాత్ముడా కాదా అన్నది తర్వాత సంగతి. ఆయన భావాలు, నిజమైన స్వతంత్రం పట్ల ఆయనకున్న నిబద్ధత ఎలా ఉన్నప్పటికీ జాతీయోద్యమానికి నేతృత్వం వహించిన ప్రధాన నాయకుల్లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తిని బహిరంగంగా హత్య చేసిన వ్యక్తి 67 యేళ్ళ సో-కాల్డ్ స్వతంత్రం తర్వాత దేశ నాయకుడిగా ప్రజల ముందుకు తేవడం ఏమిటి?
హింసా రాజకీయాల పట్ల నమ్మకం లేదంటూనే హింసకు పాల్పడుతున్నట్లే, హింసకు పాల్పడి నేరస్ధుడిగా రుజువైన వ్యక్తిని గొప్పగా కీర్తించడం కూడా హిందూత్వ సంస్ధలకు మహా నేరం కాకపోవచ్చునేమో గానీ జనానికి మాత్రం వారు సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. గాంధీ మహాత్యుడు, స్మరణీయుడు అయితే ఆయనను చంపిన గాడ్సే కూడా స్మరణీయుడు ఎలా అవుతాడో వారు చెప్పాలి. ఒకవేళ గాంధీ మహాత్ముడు కాకపోతే, అలా ఎందుకు కాదో, ఇన్నాళ్లూ ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదో వివరించాలి.
ఇదిలా ఉంటే హిందూ మహా సభలోనే గాడ్సేకు విగ్రహాన్ని నిర్మించడం పట్ల విభేదాలు నెలకొన్నట్లు వార్తల ద్వారా తెలుస్తున్నది. సభకు జాతీయ అధ్యక్షుడిని అని ప్రకటించుకుంటూ చంద్ర ప్రకాష్ కౌశిక్ అనే పెద్దాయన ఢిల్లీలో గాడ్సేకు విగ్రహం కడుతున్నట్లు చాటాడు. ఢిల్లీలో ప్రతి సెంటర్ లోనూ గాడ్సే విగ్రహాలు నెలకొల్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు కూడా.
ఇంతలోకే అదే హిందూ మహా సభకు అధ్యక్షుడిని అని చెబుతూ స్వామి చక్రపాణి మహారాజ్ అనే పెద్దాయన గాడ్సేకి విగ్రహం కట్టడం ఏమిటని ప్రశ్నించారు. “గాంధీని చంపిన నేరస్ధుడు గాడ్సే. అలాంటి వ్యక్తికి విగ్రహం నిర్మించడం ఏమిటి? ఇది రాజకీయ దురుద్దేశ్యంతో కూడిన డిమాండ్” అని చక్రపాణి ప్రకటించారు.
అసలీ గోలంతా ఎందుకు? గాడ్సేకు బదులు మూడు కోతులకు విగ్రహం గడితే బాగుంటుందని స్కూల్ పిల్లలు సలహా పడేస్తున్నారని కార్టూనిస్టు సూచిస్తున్నారు. గాంధీ గారు ‘చెడు వినకు, చెడు అనకు, చెడు కనకు’ అని గాంధీ చెప్పారని పిల్లలకు చెబుతారు. గాంధీని గాడ్సే అనే విలన్ చంపేశాడని కూడా వారికి బోధిస్తారు. అలాంటి పిల్లలకు గాడ్సే కంటే చెడుకు వ్యతిరేకంగా బోధించే కోతుల విగ్రహాలే కావాలని అనిపించడంలో ఆశ్చర్యం లేదని, దేహమూ బుద్ధీ అన్నీ ఎదిగిన పెద్దలే కొద్ది బుద్ధులు ప్రదర్శిస్తున్నారని కార్టూనిస్టు భావన కావచ్చు.
స్వాతంత్ర్య సంగ్రామం బలపడినప్పుడు హింస పెరిగిపోతుందని చెప్పి ఆ సంగ్రామాన్ని ఆపడానికి గాంధీ ప్రయత్నించాడే తప్ప తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నించలేదు. ఈ నిజాలు స్కూల్ పుస్తకాలలో వ్రాయరు. గాంధీని విమర్శిస్తే జనం మావోయిస్త్‌లలో చేరిపోతారంటూ మన బ్లాగుల్లోనే ఒకాయన వ్రాసాడు. గాద్సే ఎంత హిందూత్వవాదైనా హింసావాదానికి తావు ఇస్తే దాని వల్ల మావోయిస్త్‌లు, ఉల్ఫా లాంటివాళ్ళు లాభపడతారని హిందూత్వవాద పాలకులకి కూడా భయం ఉంటుంది. గాద్సే హిందూ మహా సభ కార్యకర్త అని తెలిసి కూడా అతను ఎవడో తెలియనట్టు భాజపా ఇంత కాలం నటించింది ఇందుకే.
గాంధీ-గాడ్సే లపై హిందుత్వ సంస్థల గోల ఏమిటో ఎవరికైన తెలిస్తే కాస్తా చెబుతారా?
పాలక వర్గానికి చెందినవాడు ఎవడైనా అతనికి మార్క్సిస్త్‌లు దూరంగా ఉండాలి. అతను గాంధీ అయినా, గాద్సే అయినా ఒకడి కంటే ఇంకొకడు మంచోడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాలకవర్గానికి మావోయిస్త్‌ల భయం ఒకవైపు, ఉల్ఫా లాంటి జాతీయ విముక్తి పోరాట సంస్థల భయం ఇంకో వైపు ఉంది. కనుక పాలకవర్గంవాళ్ళు ఏ మతస్థులైనా, జనం ఆ పోరాటాల వైపు వెళ్ళకుండా చెయ్యడానికి గాంధేయవాదం పేరే జపిస్తారు.
గాంధీ ఏమీ తక్కువ గడ్డి తినలేదు. అంటరానితన నిర్మూలన ఉద్యమం చేపట్టమని అడిగితే సంఘ సంస్కరణ తమ అజెందాలో లేని హిందూ మహా సభకి ఆ బాధ్యత అప్పగించాడు ఈ మహాత్ముడు. సత్యం, అహింస ముసుగులో గాంధీ చేసిన పనులు ఇవి. అప్పట్లో కొంత మంది దోపిడీ వర్గంవాళ్ళు కూడా గాంధీని వ్యతిరేకించారు. దోపిడీ అనేది కేవలం సత్యం, అహింస ముసుగులో చెయ్యడం సాధ్యం కాదు. తాము ఎంత దోపిడీదారులమైనా ఆంగ్లేయుల కింద పని చెయ్యడానికి కూడా కొందరు ఇష్టపడలేదు. హిందూ మహా సభవాళ్ళు అటువంటివాళ్ళే. వాళ్ళకు నాథూరాం గాద్సే దొరికాడు. వాళ్ళు అతనికి తమ సంస్థ అధికారిక పత్రికకి సంపాదకునిగా పదవి ఇచ్చారు. గాద్సే గాంధీపై అనేక సార్లు హత్యాయత్నం చేసాడు. ఓ సారి పూణే దగ్గర గాంధీ ప్రయాణిస్తున్న రైలు వెళ్ళే దారిలో పట్టాలు పీకేసాడు. ఇలా అనేక ప్రయత్నాలు విఫలమైన తరువాత అతను గ్వాలియర్‌లో ఒక పిస్తల్ కొని, దానితో గాంధీని కాల్చి చంపాడు. చంపిన తరువాత తప్పించుకోకుండా ఘటన స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. కోర్త్‌లో కూడా తన కోసం లాయర్‌ని పెట్టుకోకుండా, తాను గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చిందో వివరంగా చెప్పాడు. ఒకప్పుడు దోపిడీ వర్గంవాళ్ళు కూడా వ్యతిరేకించిన గాంధీ ఇప్పుడు దోపిడీ వర్గంవాళ్ళకి అవసరమయ్యాడు. అహింసావాదం ఒక బూటకం అని తెలిస్తే జనం మావోయిస్త్‌ల వైపో, ఉల్ఫా లాంటి జాతుల విముక్తి సంస్థల వైపో వెళ్తారని పాలకుల భయం. నా దృష్టిలో గాద్సే ఒక హీరోయే. అతను నమ్మిన హిందూ మతం అభివృద్ధి నిరోధకమైనదే కావచ్చు. కానీ అతను చేసిన సాహసం అభివృద్ధి నిరోధకం కాదు కదా.
ప్రవీణ్ గారు….
మనది ప్రజాస్వామ్యం. ఈ వ్యవస్థలో ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు తావులేదు.
-ఇక మీరన్నట్లే గాంధీ అంత గొప్ప వ్యక్తి కాకపోవచ్చు. ఆయన సిద్ధాంతాల వల్ల ఏ ఉపయోగం లేదనే అనుకుందాం.
ఆయన స్వతంత్ర పోరటానికి చేసిందేమీ లేదనే అనుకుందాం.
అంత మాత్రాన ఆయనను చంపడం మంచి పని అవుతుందా….?
గాడ్సే సిద్దాంతాలు మంచివి అయితే మాత్రం..ఆయన హత్యలు చేయడాన్ని కూడా సమర్థిస్తారా…?
అన్నీ వదులుకుని ఒంటరిగా జీవిస్తున్న ఒక ముసలి వ్యక్తిని చంపడాన్ని సాహసం అంటారా…?
నిజంగా గాడ్సేకి గాంధీ సిద్ధాంతాల పట్ల వ్యతిరేకత ఉంటే…. బలంగా తన అభిప్రాయాలు ప్రచారం చేసుకోవాలి.
హత్య ద్వారా…గాంధీ సిద్ధాంతాలు కనుమరుగయ్యాయా..?
కెనదాలో ఉండే నా స్నేహితురాలు అంటుండేది “పెట్టుబడిదారీవర్గంవాళ్ళు రక్తపాతాన్ని మాత్రమే హింస అనుకుంటారు కానీ పేదవాళ్ళు ఆకలి చావులు చస్తే లేదా వైద్యం అందక చస్తే దాన్ని ఎవరూ హింస అనుకోరు” అని.
స్వాతంత్ర్య సంగ్రామం బలపడినప్పుడు హింస పెరిగిపోతోందని చెప్పి గాంధీ ఆ ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నించాడే తప్ప తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నించలేదు. హిందూ మహా సభవాళ్ళు భారతీయులని తామే దోచుకోవాలి తప్ప ఆంగ్లేయులకి ఆ అవకాశం ఉండకూడదని నమ్మినవాళ్ళు. గాంధీ దేశ విభజనని సమర్థించడంతో పాటి ఇందియా పాకిస్తాన్‌కి నష్ట పరిహారం కూడా ఇవ్వాలని కోరుతూ నిరాహార దీక్ష చేసాడు. మదన్ లాల్ పాహ్వా అనే వ్యక్తి కూడా గాంధీపై హత్యాయత్నం చేసాడు. దేశ విభజన జరిగినప్పుడు ఈ రెండు దేశాలలో మత ఘర్షణలు జరిగాయి. అనేక మంది ముస్లింలు ఇందియా నుంచి పాకిస్తాన్‌కి వలస పోగా, అనేక మంది హిందువులు పాకిస్తాన్ నుంచి ఇందియాకి వలస వచ్చారు. వాళ్ళందరూ శరణార్ధి శిబిరాలలో తలదాచుకున్నారు. అలా శిబిరాలలో దుర్భర జీవితం గడిపినవాళ్ళలో మదన్ లాల్ పాహ్వా ఒకడు. గాంధీ వల్లే తాను శిబిరాల పాలయ్యానని మదన్ లాల్ పాహ్వా అనుకున్నాడు. అతను శిబిరాలలో ఉండగా అతనికి నాథూరాం గాద్సే, గోపాల్ గాద్సే పరిచయమయ్యారు. మదన్ లాల్ పాహ్వా బాంబులు తయారు చెయ్యడం నేర్చుకుని, ఒక బాంబ్ పెట్టి గాంధీని చంపడానికి ప్రయత్నించాడు. ఆ పేలుడు నుంచి గాంధీ తప్పించుకున్నాకే నాథూరాం గాద్సే గ్వాలియర్‌లో ఒక తుపాకీ కొని దానితో గాంధీని కాల్చి చంపాడు. గాంధీ చనిపోయిన తరువాత సంతోషించినవాళ్ళలో తెలుగువాళ్ళు కూడా ఉన్నారు. విజయవాడలో కొంత మంది “పీడ వదిలిపోయింది” అని చెప్పుకున్నారు. ఒక డబ్బున్నవాడు ఇంకో డబ్బున్నవాణ్ణి తుపాకీతో కాల్చి చంపితే దానితో ఒక పేదవానికి ఏమి సంబంధం ఉంటుందో, ఒక పాలకవర్గంవాడు ఇంకో పాలకవర్గంవాణ్ణి హత్య చేస్తే దానితో విప్లవకారులకి అదే సంబంధం ఉంటుంది.
http://www.outlookindia.com/article/I-Regret-I-Wasnt-The-Man-To-Kill-Gandhi/204997
/నా దృష్టిలో గాద్సే ఒక హీరోయే./
మీ దృక్పదంతో చూస్తే హత్య చేసే ప్రతి వాడు ఒక హీరోనేనా?
ఇది మరీ అరాచక వాధం.
Already I said ‘violence doesn’t mean only bloodshed’. Do you think that the man who supported bifurcation of India and demanded 55 crores compensation to Pakistan could be considered hero?
గాడ్సే విగ్రహాన్ని ఖచ్చితంగా నిర్మించవలసిందే. ఆవిగ్రహం పోరుబందర్‌లోనే నిర్మించబడితే మరింత మేలు. కానీ అంతటితో ఆగిపోకూడదు. అలంటి జాతీయవాదులు ఇంకెందరో ఉన్నారు కాబట్టి వారందరివీ కూడా విగ్రహాలు నిర్మిస్తేనే జాతీయవాదపు ప్రభ ఇనుమడిస్తుంది. ఇక్కడ జాతీయవాదం ముఖ్యం కాబట్టి దానికి భారత, బ్రిటీషు అంటూ సంకుచితపు పరిధులుండరాదు. నేను చెప్పేదేమిటంటే ‘లాల్’ మరణానికి కారణమైన పోలీసు అధికారి scott విగ్రహాన్ని, ప్రముఖ (బ్రిటీష్)జాతీయవాది Reginald Dyer విగ్రహాన్ని పంజాబులో నిర్మించాలి. మళ్ళీ చెబుతున్నాను. మనం ఇంతటితో ఆగిపోరాదు. మనదేశంలో పనిచేసిన ఎంతమంది (బ్రిటీషు) జాతియవాదులు హత్యలుచేయడానికైనా వెనుకాడక జాతీయవాద సౌరభాలను విరబూయించారో వారందరి విగ్రహాలను వారివారి ప్రతిష్టలకు సరితూగేలా విగ్రహాలు నిర్మించాల్సిందే.
జాతీయవాదం జిందాబాద్!
శతకోటి లింగాలలో ఒక బోడిలింగమైన గాద్సే మీద పడి ఏడవాల్సిన అవసరం లేదు. తణి గుడ్డతో గొంతులు కోసే గాంధీ లాంటి కపట మహాత్ములతోనే ప్రమాదం ఎక్కువ.
హిందూ మతం అభివృద్ధి నిరోధకమే. కానీ గాంధేయవాదం కూడా ఏమీ అభివృద్ధికరమైనది కాదు కదా. జనం పాలకవర్గంపై తిరగబడకుండా చెయ్యడంలో ఇప్పుడు గాంధేయవాదమే బాగ పని చేస్తోంది. నేను నాస్తికుణ్ణైనా, హిందూ మతాన్ని ఎంత ద్వేషించినా, హిందూ మతం మీద గాంధేయవాదానికి ప్రిఫరెన్స్ ఇవ్వలేను. అందుకే నేను నా దృష్టిలో గాద్సేయే హీరో అన్నాను.
http://www.telugubooks.in/products/mana-mahatmudu
గాంధీ గురించి నేను ఎం.వి.ఆర్.శాస్త్రి గారు వ్రాసిన “మన మహాత్ముడు” పుస్తకంలోనూ, రంగనాయకమ్మ గారు వ్రాసిన “దళిత సమస్య పరిష్కారానికి” పుస్తకంలోనూ చదివాను. విశేఖర్ గారు రంగనాయకమ్మ గారి రచనలు చదివారు కనుక దాని లింక్ నేను ఇక్కడ ఇవ్వడం లేదు కానీ “మన మహాత్ముడు” పుస్తకం యొక్క లింక్ ఇక్కడ ఇస్తున్నాను. మన దేశానికి స్వాతంత్ర్యం రావడం కాకి వాలిన తాటి పండు కింద పడినట్టుగా జరిగింది. రేపో, ఎల్లుండో కిందపడబోయే తాటి పండు మీద కాకి వాలిందనుకుందాం. ఆ పండు వెంటనే కింద పడితే కాకి వల్లే అలా జరిగిందనుకుంటాం. రేపో, ఎల్లుండో ఆంగ్లేయులు దేశం వదిలి వెళ్ళిపోతారు అని అందరూ అనుకుంటున్న దశలో దేశానికి స్వాతంత్ర్యం వస్తే, అది గాంధీ వల్లే వచ్చిందని కాంగ్రెస్‌వాళ్ళు ప్రచారం చేసారు. ఇప్పుడు కూడా జనం గాంధీ వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని నమ్ముతున్నారు. ఎం.వి.ఆర్. శాస్త్రి గారు వ్రాసిన పుస్తకం చదివితే గాంధీ ఒక్కడి వల్లే దేశానికి స్వాతంత్ర్యం రాలేదని అర్థమవుతుంది. ప్రజలు సోషలిస్త్ విప్లవం లాంటి వాటి వైపు వెళ్ళకుండా చెయ్యడానికి పాలకులు గాంధీ పేరు స్మరిస్తున్నారని కూడా శాస్త్రి గారే వ్రాసారు. శాస్త్రి గారేమీ విప్లవకారుడు కాదు. కేవలం చరిత్ర గురించి నిజాలు చెప్పడానికి ఆయన ఈ విషయాలు వ్రాసారు.
నేను మార్క్సిస్త్‌నే కానీ ఒకవేళ నేను పెట్టుబడిదారీ వ్యవస్థని సమర్థించాననుకుందాం. అప్పుడు “సోషలిజం అనేది ఊహాజనితం, అటువంటివాటి వైపు వెళ్ళకూడదు” అని నేను ప్రచారం చెయ్యగలను. “కేవలం గాంధీ మార్గాన్ని నమ్ముకుంటే విప్లవం వస్తుంది” అని జనాన్ని నమ్మించాల్సిన అవసరం నాకు ఉండదు. ఒక సాధారణ పెట్టుబడిదారుడు కేవలం తన సొంత ఆస్తిని కాపాడుకోవాలనుకుంటాడు. పాలకవర్గంవాళ్ళకి అధికారం కూడా ముఖ్యమే కనుక వాళ్ళు విప్లవం రాకుండా చెయ్యడానికి ఎన్ని అబద్దాలైనా చెపుతారు. అందుకోసం వాళ్ళు గాంధీ పేరుని కూడా ఉపయోగించుకుంటారు.
ప్రవీణ్ గారూ, పైన 13 కామెంట్లు ఉంటే అందులో 9 కామెంట్లు మీవే. ఇక ఈ అంశాన్ని వదిలి పెట్టండి. ఏ ఆర్టికల్ కిందైనా మీ వ్యాఖ్యపైన మరొకరు స్పందించేవరకూ మరో వ్యాఖ్య రాయకూడదని ప్రతిజ్ఞ చేయండి. మీకే ఉపయోగం.
మళ్ళీ దీనిపై మరో వరద పారించకండి.
మీరు గాంధీ గురించి కొంచెం positiveగా వ్రాసినట్టు కనపడితే ఇది వ్రాసింది మీరేనా అని సందేహం వచ్చే నేను ఇన్ని వ్యాఖ్యలు వ్రాసాను.
అవునా. అలా ఎందుకు అనిపించింది?
ఒకటి: కులధర్మాన్ని, హిందూ ధర్మాన్ని నెత్తిన పెట్టుకుని ప్రబోధించిన గాంధీని చంపిన వ్యక్తిని సమర్ధించేవారు ఇంకెంత తీవ్రవాదులో అన్న అర్ధంలో ‘తమ నిజ స్వరూపం’ చాటుకున్నారు. అని రాశాను. బహుశా ఇది మీరు గ్రహించలేదనుకుంటాను.
రెండు: గాంధీ జాతీయోద్యమ నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి. ఆయన దళారీ పెట్టుబడిదారీ వర్గానికి ప్రతినిధి కావచ్చు గానీ, విశాల జాతీయోద్యమానికి ఆయన నాయకుడు కూడా. కనుక పాలకవర్గాలు వారు ఏ భావజాలాన్ని అంటి పెట్టుకుని ఉన్నప్పటికీ తప్పనిసరిగా, తమ ప్రయోజనాల కోసమే, ఆయన్ను గౌరవిస్తారు. అలాంటి బూర్జువా విలువని కూడా పాటించలేని విద్వేషాన్ని హిందూ మహా సభ ప్రదర్శిస్తే దానికి నేటి హిందూత్వ మద్దతు ఇస్తోందని నేను పరోక్షంగా చెప్పాను. .
మూడు: హిందూ మహాసభ జాతీయ ప్రయోజనాలకు ప్రతినిధి అన్న మీ అవగాహన నిజం కాదు. అది హిందూత్వ భూస్వామ్య భావజాలానికి మాత్రమే ప్రతినిధి. వారితో పోల్చితే భూస్వామ్య వ్యవస్ధకు ఒక మెట్టు పైన ఉన్న (దళారీ) పెట్టుబడిదారీ వ్యవస్ధకు + అర్ధ భూస్వామ్య వ్యవస్ధకు ఉమ్మడి ప్రతినిధి అయిన కాంగ్రెస్ భావజాలమే కాస్త బెటర్. ఆదిలోనే (1947) హిందూత్వ శక్తులు పై చేయి సాధించి ఉంటే మన సమాజంలోని కార్మికవర్గం, ముఖ్యంగా అందులోని నిమ్న కులాలు, మైనారిటీలు మరింత అణచివేతను ఎదుర్కొని ఉండేవారు. రిజర్వేషన్లు, వివిధ ప్రజానుకూల స్కీములు నామ మాత్రంగా కూడా ప్రజలకు అంది ఉండేవి కావు.
గతంలో అనేక సార్లు ఈ బ్లాగ్ లో చెప్పినట్లు దేశంలోని దళారీ బూర్జువాలు, అర్ధ భూస్వాములు రెండు ప్రధాన రాజకీయ స్రవంతుల్లో చేరారు. ఒకటి సో కాల్డ్ సెక్యులరిస్టు మతాతీత భావజాలం కాగా రెండోది హిందూత్వ భావజాలం. భారత దేశం అనేక సంస్కృతుల, జాతుల, ప్రాంతాల సంగమం. అందువల్ల రెండో దానికి పరిమితి ఏర్పడి హిందూత్వ పైకి రాలేకపోయింది. కాంగ్రెస్ వైఫల్యం పెట్టుబడిగా ఇప్పుడు పైకి వస్తోంది. ఈ రెండు భావజాలల మధ్య ఐక్యతను, వైరుధ్యాలను సమయానుకూలంగా పరిగణించాలి. అంతా ఒక గాటన కట్టేస్తే మీరు భావిస్తున్నట్లు హిందూ మహా సభే జాతీయ తత్వం కలదిగా పొరబడే ప్రమాదం ఉంటుంది.
పోతే మీరు ఒక పొరపాటు అభిప్రాయానికి వచ్చినంత మాత్రాన అది 9 కామెంట్లకు దారి తీయనక్కర్లేదు కదా.
హిందువులలో రెండు కులాలు కలిసి ఉన్న సందర్భాలు ఎన్నడూ లేవు. అటువంటప్పుడు దొంగ లౌకికవాదం మీద హిందూత్వవాదం పాప్యలర్ అవ్వదు అనే నిజం నాకు తెలుసు, మీకూ తెలుసు. రేషన్ కార్ద్‌లు ఆశ చూపి ముస్లింలని యజ్ఞ కుండం ముందు కూర్చోబెట్టే హిందూత్వ మూకలకి ఆ విషయం తెలియదు కదా.
1967లో నక్సల్బాడీ ఉద్యమం ప్రారంభమైనప్పుడు దేశంలో అధికారంలో ఉన్నది గాంధేయవాదుల పార్తీయే. విప్లవకారులని చెరసాలల్లో పెట్టి, సహచర కార్యకర్తల జాడ చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టి చంపింది ఆ గాంధేయవాద ప్రభుత్వం కింద పని చేసిన పోలీసులే. హిందూ మతంలో రెండు కులాలు కలిసి ఉన్న సందర్భాలు ఎన్నడూ లేవు అనే నిజాన్ని హిందూత్వ మూకలు ఇప్పటికీ అంగీకరించరు. హిందూత్వ మూకల అజ్ఞానం ఇలా ఉన్నప్పుడు 1967లో హిందూత్వ పార్తీ అయిన జన సంఘ్ అధికారంలోకి వచ్చే అవకాశం లేనేలేదు. అందుకే అప్పట్లో గాంధేయవాద పార్తీ అయిన కాంగ్రెసే అధికారంలో ఉండేది.
అయినా గాద్సేని నెత్తికెక్కించుకుని, అహింసావాద ఒక బూటకం అనే నిజాన్ని బయటపెట్టి, మావోయిస్త్‌లూ & ఉల్ఫా లాంటివాళ్ళకి సైకలాజికల్ సపోర్త్ ఇచ్చేంత పని భాజపా చెయ్యదనే అనుకుంటాను. తెలిసితెలిసి కొరివితో ఎవడు తలగోక్కుంటాడు?
\హిందువులలో రెండు కులాలు కలిసి ఉన్న సందర్భాలు ఎన్నడూ లేవు.\
కులాలంటేనే రెండు అయినా మూడు ఐనా వేరు, వేరు అని అర్ధం. సమాజంలో అన్నీ కులాలు కలిస్తేనేగదా అవి కలిసినట్టు. అలా రెండు కలిసినా ఉమ్మడి ప్రయోజనాలు ఆ ప్రయోజనాలు సాదించడానికి, లేక ఇతర కులాల డామినేషన్ నుండి తప్పించుకోవడానికి కలుస్తాయి.
గాందీ దేశానికి చేసిన సేవ ఏమిటి? అయన సిద్ధాంతం తప్పా రైటా అన్నవి ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే ఆయనగురించిన పూర్తి అవగాహాన చాలా మందికి (ముఖ్యంగా వామ పక్ష వాదులకు) ఉన్నాయి. ఆ మాటకొస్తె వామక్షాలలోనే విభిన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం తెరపైకి వచ్చిన సామాజిక రాజకీయ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. గాంది వర్ణాశ్రమ దర్మాన్ని, మను ధర్మాన్ని విడ నాడలేదని జాతి యోద్యమంలో ప్రదాన పాత్ర పోషిస్తూనే, ప్రజాగ్రహం వచ్చినపుడు దాన్ని జాతీయోధ్యమానికి ఉపయోగించలేదని, అలా పక్క దారి పట్టి దేశంలో విప్లవానికి అవకాశం లేకుండడమే గాక తమ వర్గ ప్రయోజనాలు దెబ్బతినకుండా రక్షించుకున్నారని అంటారు. అది నిజమే, ప్రస్తుత ప్రజాస్వామ్యంలో తమ ప్రతినిధిగా ఆయన బావజాలాన్ని ముందుకు తెచ్చారు. శేఖర్ గారు చెప్పినట్లు నిమ్న వర్గాలకు కాస్తైనా వెసులుబాటు కల్పించారు. ఇప్పుడున్న మితవాద పార్టీ విశాల ప్రజానికానికి ఏ హక్కులు లేకుండా సో కాల్డ్ ప్రజాస్వామ్యాన్ని కూడా ఎంత బ్రష్టు పట్టించబోతుందో ఇప్పటికే కొంత అనుభవం లోకి వస్తోంది.
ఆర్థిక ప్రయోజనాలకైతే రెండు కులాలు కలిసే ఉంటాయి. కోస్తా ఆంధ్రలో నిత్యం ఒకరినొకరు తిట్టుకునే కమ్మవాళ్ళు & రెడ్లు హైదరాబాద్ అనే మేడి పండు కోసం కలిసే సమైక్యాంధ్ర ఉద్యమం నడిపారు. ముస్లింలకి వ్యతిరేకంగా హిందువులలోని రెండు కులాలు కలిసిన సందర్భాలు ఎక్కడా లేవు కదా.
గాంధేయవాదం ఏమీ దళితులకి అనుకూలం కాదు. ఎవరి కులవృత్తులు వాళ్ళు చేసుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని గాంధీ అనేవాడు. ఇదే మాట ఏ ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తో అంటే ఎంత గొడవ అవుతుందో మనకి తెలుసు. మహాత్మ అనే ముసుగు వేసుకున్నవాడు ఏమి చెప్పినా అభ్యంతరం చెప్పలేకపోతే మనం హిందూత్వవాదుల కంటే ఏ రకంగా మానసిక వికాసం సాధిస్తాం?