ప్రధాని నరేంద్ర మోడి తన లక్ష్మణ రేఖ ప్రకటించారు. సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ‘రామ్ జాదే – హరామ్ జాదే’ అంటూ చేసిన ప్రసంగం ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వడంతో ఆయన ‘కొత్త మంత్రులు, పార్టీ నేతలు’ ‘నియంత్రణ’లో ఉండాలని లక్ష్మణ రేఖ గీశారు.
ఇంత గొడవ జరుగుతుంటే ప్రధాని ఎక్కడ? అంటూ ప్రతిపక్షాలు గర్జించడంతో పార్లమెంటుకు వచ్చిన ప్రధాని ‘కొత్త మంత్రి, గ్రామీణ నేపధ్యం, అంతా కొత్త. అయినా ఆపాలజీ చెప్పారుగా, వదిలేయండిక’ అని హితోపదేశం చేశారు. పులిలా గర్జించిన ప్రతిపక్షాలు తోక ముడిచి తీర్మానం ఐనా చేద్దాం అన్నాయి. ఏమీ కాకుండానే నోరు మూసేశాయి.
అయినా కార్యకర్తలు, నేతల ఉద్యమోత్సాహం కట్టుబడలేదు. ఈసారి బి.జె.పి, మంత్రులు కాదు. ఎజెండాను ముందుకు తీసుకుపోయే కర్తవ్యాన్ని మోసేందుకు భజరంగ్ దళ్, వి.హెచ్.పి, ధర్మ జాగరణ్ మంచ్…. ఇత్యాది కాషాయ దళాలు ముందుకు ఉరికాయి.
ఆగ్రాలో ముస్లింలు ‘హిందూ సంస్కృతి’ ఇంటికి తిరిగి వచ్చారు. క్రిస్టమస్ రోజున క్రైస్తవుల భారీ ‘ఘర్ వాపసీ’ కి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంతకీ ఇంటికి తిరిగి వచ్చినవారు వేలాది నిచ్చెన మెట్ల కూళ్ళలో ఏ కూటిలో చేరాలి? సమాధానం సిద్ధంగా ఉంది. ‘అది వారి వారి ఇష్టం. ఏ బంతిలో అయినా కూర్చోవచ్చు. ఇది ఒక రోజు వ్యవహారం కాదు. నెలలు, సంవత్సరాలు… దశాబ్దాలు కూడా పట్టవచ్చు’ వి.హెచ్.పి అధిపతి స్పష్టత ఇచ్చారు.
అదీ సంగతి! ఇది ఆగేది కాదు. నిరంతర ప్రక్రియ. ఆ కాడికి లక్ష్మణ రేఖ ఎందుకు?
ఓహో, లక్ష్మణ రేఖ బి.జె.పి కార్యకర్తలకు, నేతలకు, మంత్రులకే. ఇతర సంస్ధలతో వారికేమి పని! వారు స్వతంత్రులు వారికి లక్ష్మణ రేఖ గీయలేరు. ఆ మాటకు వస్తే ఈ భూమండలంపైన వారికి లక్ష్మణ రేఖ గీయగల వారు లేరు గాక లేరు. వారు సర్వ స్వతంత్రులు. విశ్వమంతటా హిందూత్వను వ్యాపింపజేయడానికి శపధం చేసిన నిర్నిరోధక సైనికులు!
పందెం ఆగరాదు. పందెం ముగిసేవరకూ చేలరేగిపోవాలి. పందెం ఫలాన్ని తనివి తీరా అనుభవించాలి. పందెం ముగిశాక మాత్రమే లక్ష్మణ రేఖ దాటరాదు.
ఇది మోడి మార్కు లక్ష్మణ రేఖ!
I felt like till winning the election they(P.M) need ideology of Hindutva.Once he(PM) got the apex position he become secular at least pretends and try to control the propogation of the original ideology, where they came from and how he got PM. Now the question is to stand still that position is he(PM) can be successful to limit the ideology?