పలుచని, పర్యావరణ క్షీణతలో ఇమిడిపోలేని, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచుల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వమే నియమించిన అనేక కమిటీలు తేల్చి చెప్పినప్పటికీ, వాటి చెడు ప్రభావాలు ఏమిటన్నదానికి పెద్ద మొత్తంలో సాక్ష్యాలు పోగుబడి ఉన్నప్పటికీ దేశంలో “ప్లాస్టిక్ సంచుల ఉత్పత్తి, వినియోగాలను నిషేదించే ఉద్దేశం ఏమీ లేదు” అని ఇటీవల ప్రభుత్వం దృఢంగా ప్రకటించింది. కానీ అటువంటి నిషేధం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్నది. దురదృష్టవశాత్తూ ఛార్జీలు వసూలు చేయడం, పన్నులు పెంచడం లాంటి పరిగణించదగిన ప్రత్యామ్నాయాలు విస్మరణకు గురవుతున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యూరోపియన్ యూనియన్ నిర్ణయానికి సరిగ్గా విరుద్ధంగా ఉంది. ఒక వ్యక్తి వినియోగించగల తేలికపాటి ప్లాస్టిక్ సంచుల సంఖ్యను తగ్గించాలని గత నెలలో ఈ.యు సభ్య దేశాలు ప్రశంసనార్హమైన నిర్ణయం తీసుకున్నాయి. 2019 నాటికి ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి వినియోగించగల సంఖ్యను 90 కి కుదించాలనీ, 2025 నాటికి 40 కి తగ్గించాలనీ, లేదా 2018 నాటికి అన్ని సంచుల వినియోగంపై ఛార్జీలు వసూలు చేయాలని (ఈ.యు) సభ్య దేశాలు నిర్ణయించాయి. ప్లాస్టిక్ సంచుల తయారీదారులు శక్తివంతమైన సమూహంగా ఉన్న దేశంలో చూసినా, జులై 2015 లోపు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా రద్దు చేయాలని కాలిఫోర్నియా రాష్ట్రం నిర్ణయించింది. (అమెరికాలో) అనేక నగరాలు ఇటువంటి నిషేధాన్ని అమలు చేస్తున్నప్పటికీ ఈ చర్య తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం కాలిఫోర్నియా.
పలుచని ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిషేధించిన దేశాలలోనూ, ఛార్జీలు వసూలు చేస్తున్న దేశాలలోనూ అతి కొద్ది కాలంలోనే వాటి వినియోగం నిలువునా పడిపోయింది. ఉదాహరణకి ఐర్లాండ్ లో ఒకసారి అటువంటి పదార్ధం వినియోగంపై పన్నులు వేశాక 2002లో ప్లాస్టిక్ సంచుల వినియోగం 95 శాతం పడిపోయింది. ఒకసారి వాడి పారేసే సంచుల వినియోగాన్ని తగ్గించేందుకు తప్పనిసరి ఛార్జీలు వసూలు చేయడం శక్తివంతమైన సాధనమని అనుమానాలకు అతీతంగా రుజువయింది. ఈ అవకాశాన్ని ఇండియా పరిశీలించకపోవడం కారణం రహితం. స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద చూసినా చెత్తా చేదారాన్ని తగ్గించడమే ప్రధమ లక్ష్యం కాదా మరి!
కొద్ది నిమిషాల సౌకర్యం కోసం ప్రజలు మతి లేకుండా ప్లాస్టిక్ సంచుల వినియోగం వైపుకు మళ్లుతున్నారు. భూమి పైనా, సముద్రంలోనూ వందల యేళ్ళ పాటు అవి క్షయించకుండా మిగిలిపోతాయన్న వాస్తవం వారి ఎరుకలో లేదని తెలుస్తూనే ఉంది. గోతులను నింపే చోట్ల తేలడమో లేదా సాధ్యమైన అన్ని చోట్లా చెత్తా చెదారం రూపంలో విస్తరించడమే కాకుండా చాలా తరచుగా అవి డ్రైనేజి వ్యవస్ధలకు అడ్డంగా లుంగలు చుట్టుకుపోయి కనిపిస్తాయి. చివరికి భూగర్భ జనాలవనరులు రీ చార్జ్ కాకుండా అడ్డుపడుతున్నాయి కూడాను. అతి పెద్ద దుష్ప్రభావం ఏమిటంటే ప్లాస్టిక్ సంచులు మింగడం వల్ల ప్రతి యెడూ పశువులు, సముద్ర జీవులు పెద్ద సంఖ్యలో చనిపోవడం.
(ప్లాస్టిక్ సంచుల) ఉత్పత్తి ప్రక్రియ అత్యధిక శక్తి వినియోగంతో కూడుకుని ఉన్నది. ఈ కారణాల చేతనే “కఠిన చర్యలు తీసుకోకపోతే, తదుపరి తరం అణు బాంబు కంటే తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది” అని 2012లో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పునర్వినియోగం మరియు మారు వినియోగం విలువలలో భాగంగా ఉన్న దేశంలో వాడిపారేసే ప్లాస్టిక్ సంచుల భారీ వినియోగం రెండో స్వభావంగా ఉద్భవించడం వింతైనది మరియు ఆశ్చర్యకరమైనది. జీవారణంలో క్షయించిపోగల వ్యర్ధాలను సమర్ధవంతంగా నిర్వహించగల వ్యవస్ధలు కూడా లేని కాలంలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ సంచుల వ్యర్ధాల నిర్వహణ గురించి ఆలోచించడం కూడా అమాయకత్వం కాగలదు.
జీవారణంలో క్షయించిపోగల వ్యర్ధాలను సమర్ధవంతంగా నిర్వహించగల వ్యవస్ధలు కూడా లేని కాలంలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ సంచుల వ్యర్ధాల నిర్వహణ గురించి ఆలోచించడం కూడా అమాయకత్వం కాగలదు.
నేను స్కూల్ లో చదివే రోజులలో ప్లాస్టిక్ వ్యర్ధాలను(పాలిథీన్ సంచులు) రి-సైక్లింగ్ ఎలా చేయాలనే అంశంపై మా సైన్స్ మాష్టెర్ ఒక ప్రోజెక్ట్ ను రూపొందించారు-ప్లాస్టిక్ వ్యర్ధాలతో(తారువలే మరగబెట్టి-ఎందుకంటే ప్లాస్టిక్ ను కాల్చడం వలనే అది కొంతమేరకు నాశనం కాగలదుగనుక) రోడ్ లు వేయవచ్చు! ఇవి సాంప్రదాయ(తారు తదితర కర్బన పధార్దాలతో చేస్తారు) రోద్ ల కన్నా అధి దృఢంగా,ఎక్కువకాలం మన్నిక కలగలవినగా ఉంటాయని తెలిపారు. ఉదా.ఆస్ట్రేలియాలో అటువంటి రోడ్ లు వేశారని తెలిపారు.
మన దేశపరిస్థితులకు వస్తే ఇక్కడ పాలిథీన్ సంచుల తయారీదారులు వాటినిషేదాన్ని లోపాయికారకంగా అమలుకాకుండా చూస్తున్నారని ప్రధాన ఆరోపణ!ప్రభుత్వాలు కూడా ప్రత్యక్షంగా సహకరించుటవలన పాలిథీన్ సంచుల వాడకం ఇక్కడ యథేచ్చగా జరుగుతుంది.
పాలిథిన్ సంచులతో…..మనదేశంలో కూడా రోడ్లు వేస్తున్నారు.
http://southasia.oneworld.net/news/indian-state-uses-plastic-waste-for-road-construction#.VJQEmsA8
మనదేశంలో కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలతో రోడ్ లను వేశారన్నమాట! కానీ,దానికి అధిక వ్యయం అవుతుండడంతో ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదనుకొంటా!ఏమైనప్పటికీ పొలిథీన్ సంచులవాడకం నిషేదించడం పాలనాపరమైన అంశానికి సంభంధిచినదవడం వలన అటువైపునుండి నరుక్కురావడమే కొంతనయం!
విలువైన సమాచారం ఇచ్చినందుకు చందుతులసిగారికి థాంక్స్!
Reblogged this on jnanasaraswatidevi's Blog.