బిజినెస్ వార్తల్లో మనం తరచుగా వినే/చదివే మాట ‘లిక్విడిటీ.’ వివిధ ఆస్తులకు ఎంత లిక్విడిటీ ఉందన్న విషయంపై ఆధారపడి వాటికి కొనుగోలుదారులు లభిస్తారు.
లిక్విడ్ అంటే ద్రవం. ద్రవం ఒక చోట నిలబడేది కాదు. దాన్ని ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర రూపంలో నిలబడి ఉంటుంది. నియంత్రించే పాత్ర ఏమీ లేకపోతే అది తేలికగా ఎటువంటి మానవ ప్రయత్నం లేకుండానే ప్రవహిస్తుంది.
ఈ కారణం చేతనే ఒక ఆస్తిని డబ్బుగా మార్చగల సామర్ధ్యాన్ని లిక్విడిటీ అన్నారు. వాయువు కూడా తేలికగానే ప్రవహిస్తుంది. కానీ దానిని నియంత్రించడం మనిషి వల్ల కాదు. తేలికగా ప్రవహించగల, కానీ నియంత్రించగల పదార్ధం ద్రవమే కనుక ఆస్తి ప్రవాహాన్ని లిక్విడ్ తో పోల్చారు.
తేలికగా డబ్బుగా మారడం ఒక్కటే సరిపోదు. అలా మారే క్రమంలో ఆస్తి తన అసలు ధరను కోల్పోకుండా ఉంటేనే లిక్విడిటీ బాగా ఉన్నట్లు. డబ్బుగా మార్చుకోగల ప్రతి ఆస్తికీ లిక్విడిటీ ఉంటుంది. లిక్విడిటీ ఎక్కువగా ఉన్న ఆస్తి త్వరగా అమ్ముడు అవుతుంది. లేదా కొనుగోలుదారులు త్వరగా లభిస్తారు.
లిక్విడేషన్ అని మరో మాట వింటుంటాం. ఒక ఆస్తి సొంతదారు తన ఆస్తిని అమ్మేసి సొమ్ము చేసుకుంటే అతను తన ఆస్తిని ‘లిక్విడేట్’ చేశాడు అని చెబుతారు. ఒక కంపెనీ తన వాటాల్లో (షేర్లలో) కొన్నింటిని మార్కెట్ లో అమ్ముకుని పెట్టుబడి సంపాదిస్తారు. ఈ ప్రక్రియను కూడా ‘లిక్విడేషన్’ అంటారు. అయితే ఇది పాక్షిక లిక్విడేషన్ అవుతుంది.
లిక్విడిటీకి సంబంధించిన ఇతర అంశాలను ఆర్టికల్ లో చూడగలరు.
ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడడానికి ఈ కింది లింకు లోకి వెళ్ళండి.
లిక్విడిటీ ఎక్కువ – లాభాలు తక్కువ!
ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ గా చూడాలనుకుంటే కింది బొమ్మపైన క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.