(కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రులే కాదు, మోడి కొలువులోని సీనియర్ మంత్రులు సైతం హిందూత్వ భావజాలాన్ని రెచ్చగొట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. భగవద్గీత పుస్తకాన్ని ‘జాతీయ గ్రంధం’ గా ప్రకటించాలని సుష్మ వ్యక్తం చేసిన కోరిక ఏదో యధాలాపంగా చేసినది కాదు. నిర్దిష్ట లక్ష్యం తోనే ఆమె ఆ మాటలు చెప్పారు. ఈ అంశంపై ది హిందు, డిసెంబర్ 10, 2014 తేదీన వెలువరించిన సంపాదకీయం. -విశేఖర్)
కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మత సంబంధిత వివాదాలపై నేరుగా గానీ, అసందర్భంగా గానీ వర్ధిల్లుతున్నట్లు కనిపిస్తున్నారు. భగవద్గీత ను ‘జాతీయ గ్రంధం’ గా ప్రతిపాదించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తన ప్రతిపాదన ద్వారా భారత దేశ జాతీయ గ్రంధంగా ఏ పుస్తకం, అసలు అలాంటి పుస్తకం ఏదైనా ఉండాలనుకుంటే, ఉండాలన్న అంశం పైన చర్చను ప్రారంభిస్తున్నట్లుగా లేరు. దానికి బదులుగా ఒక హిందూ మత గ్రంధం పైన మతపరంగా విడిపోయిన రాజకీయ చర్చకు అవసరమైన వేదికను సిద్ధం చేసేందుకు మాత్రమే ఆమె ప్రయత్నిస్తున్నారు. ఒక సెక్యులర్ ప్రజాస్వామ్య దేశంగా, కేవలం ఒక మతం మాత్రమే ఆరాధించే పుస్తకాన్ని జాతీయ గ్రంధంగా బహుశా అంగీకరించక పోవచ్చు.
ఇండియా విదేశాంగ మంత్రిగా తాను ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేటప్పుడు భగవద్గీత తనకు ఎంతగానో తోడ్పడిందని ఆమె చెప్పినప్పుడు స్వరాజ్ గారితో ఎవరూ విభేదించకపోవచ్చు. కానీ చర్చలోకి వచ్చిన అంశం భగవద్ గీత లో ఏమి ఉందన్నది కాదు, అందలి శ్లోకాల కళాత్మక సౌందర్యామూ కాదు లేదా అందలి మున్నుడి సూత్రాల ప్రాసంగికత కూడా కాదు. భారత దేశం యొక్క లౌకిక స్వభావాన్నే శ్రీమతి స్వరాజ్ గారు ప్రశ్నిస్తున్నారు; ఒక మతావలంబకులకు పవిత్ర గ్రంధం అయిన పుస్తకాన్ని, అన్ని మతాలకు చెందిన భారతీయులందరూ అంగీకరించవలసిన జాతీయ పుస్తకంగా రుద్దవచ్చా అన్న ప్రశ్నను ఆమె చర్చలోకి తెచ్చారు. బి.జె.పి ఉపాధ్యక్షుడు దినేష్ శర్మ వాదించినట్లుగా గీత మత గ్రంధం కాదని, మొత్తం మానవత కోసం ఉద్దేశించినదని వాదించడం కపటం తప్ప మరొకటి కాదు. ఏ మేరకు సెక్యులర్ ప్రభావం కలిగి ఉన్నదన్నదానిపై సంబంధం లేకుండానే మహాభారతంలో ఒక భాగం అయిన గీత కృష్ణ దేవుడితో సంబంధం కలిగిన ఒక హిందూ పాఠ్యం కనుక జాతీయ గ్రంధంగా అర్హత పొందజాలదు.
భారత దేశ రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న దశలోనే జాతీయ విలువలలో భాగంగా దేవుళ్ళను, దేవతలను ముందుకు తేకూడదని స్పష్టం చేయబడింది. నిజానికి రాజ్యాంగ పీఠికను ‘దేవుడి పేరుతో’ అని మొదలు పెట్టాలన్న సూచన వచ్చినప్పుడు, రాజ్యాంగ సభలోని అనేకమంది సభ్యులు దానికి తీవ్ర వ్యతిరేకత తెలిపారు. వారిలో అనేకమంది తమకు తాము ఆస్తికులుగా చెప్పుకునేవారు కూడా ఉన్నారు. పీఠికలో దేవుడి ప్రస్తావన తీసుకురాకూడదని వాదించిన ఒక సభ్యుడు చెప్పినట్లుగా “ప్రతి ఒక్కరికీ స్వేచ్చాయుత ఆలోచన, భావ ప్రకటన, నమ్మిక, నమ్మకం మరియు ఆరాధనలను హామీ ఇచ్చే పీఠికకు అటువంటి చర్యాత్మక గమనం సరిపడనిది.”
రాజ్యాంగంలో హామీ ఇవ్వబడిన ‘వివేకం కలిగి ఉండే స్వేచ్ఛ’ లో ఏ మతాన్నైనా అవలంబించే స్వేచ్ఛ, ఏ మతాన్ని నమ్మని స్వేచ్ఛలు కూడా కలిసి ఉన్నాయి. కాగా ఒక మతానికి చెందిన పవిత్ర గ్రంధాన్ని భారత దేశ జాతీయ గ్రంధంగా ముందుకు తేవడం అంటే రాజ్యాంగం యొక్క లౌకిక పునాదికి తీవ్ర నష్టం కలిగించడమే కాగలదు. అభివృద్ధి, (ఆర్ధిక) వృద్ధి లను హామీ ఇచ్చిన నరేంద్ర మోడి ప్రభుత్వం తన హామీలను నెరవేర్చలేదేమని డిమాండ్ చేయడం తొందరపాటు కావచ్చు గాని కొత్త ప్రభుత్వం యొక్క శక్తి యుక్తులలోని కొంత భాగం పాత, విభజనాత్మక అంశాలపైకి మళ్లుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ అనవసరం. కొందరు జూనియర్ మంత్రులు మాత్రమే కాకుండా ఒక సీనియర్ నేత కూడా ఆ విధంగా మతపరమైన విభజనలు తెచ్చే సూచన చేయడం విచారకరం. ఏదో ఒక గ్రంధాన్ని జాతీయ గ్రంధంగా పైకెత్తి తీరాల్సిందే అన్న అవసరమే నిజంగా వస్తే గనుక అది దేశం యొక్క రాజ్యాంగమే అవుతుంది గానీ, మరింకే గ్రంధమూ కాజాలదు.
భారతరాజ్యాంగమే ఈ దేశం యొక్క అత్త్యుత్తమ గ్రంధం!-దీని మీద చర్చ జరిగితే ఉత్తమం!
మన వాళ్లు పదే పదే పాక్, పాక్ వైపు చూపుతున్నది ఇందుకే నన్నమాట! వాల్లది మత రాజ్యాంగం గనుక మనకూ రాజ్యంగంలో మతాన్ని చొప్పించాలని కోరుకుంటున్నారా.