(డిసెంబర్ 6, 2014 నాటి ది హిందు సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్)
ఐదు అణ్వస్త్ర దేశాలు మరియు జర్మనీ (P5+1), ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న చర్చల ఎగుడు దిగుడు చరిత్ర గురించి బాగా తెలిసినవారు సదరు చర్చల తాజా రౌండ్, జూన్ 2015 వరకు మరో కొనసాగింపుకు నోచుకోవడాన్ని ఆశాభావంతో పరికించడం పట్ల చేయగలిగేది ఏమీ లేదు. ఇరాన్ తన మౌలిక అణు నిర్మాణాలను అంతర్జాతీయ తనిఖీలకు అనుమతించడానికీ, ఆంక్షల నుండి గణనీయ మొత్తంలో, ప్రధానంగా చమురు దిగుమతుల ఆదాయం రూపంలో, ఉపశమనం లభించడానికీ దారి తీసిన నవంబరు 2013 నాటి తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటి నుండి ఈ కొత్త గడువు పొడిగింపు రెండవది.
బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లు మధ్యవర్తిత్వం ఫలితంగా యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు ఇరాన్ సుముఖత వ్యక్తం చేయడంతో ఈ అణు ప్రతిష్టంభనలో కదలిక మొదలయింది. కానీ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్.పి.టి) కింద పౌర అణు విద్యుత్ సామర్ధ్యం పెంపొందించుకునేందుకు ఇరాన్ కు సంక్రమించిన హక్కును బుష్ ప్రభుత్వం అడ్డంగా తిరస్కరించడంతో ఇరాన్ లో ఊహించినట్లుగానే జాతీయ తిరుగుబాటు భావనలు వ్యక్తమయ్యాయి. ఐరాస భద్రతా సంస్ధ వరుస పెట్టి చేసిన తీర్మానాల వల్ల వాషింగ్టన్ అవగాహనకు ఆమోదనీయత సమకూరింది. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయాల ప్రభావం లేనట్లయితే వివాదం ఎన్నడో పరిష్కారం అయ్యేదని అమెరికా విదేశీ కార్యదర్శి జాన్ కెర్రీ, బ్రిటిష్ విదేశీ కార్యదర్శి జాక్ స్ట్రా లు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం.
ఎన్.పి.టి లో ఇరాన్, ఒక సభ్య దేశంగా కలిగి ఉన్న న్యాయబద్ధమైన ప్రయోజనాలను గుర్తించేందుకు ఒబామా ప్రభుత్వం సుముఖంగా ఉండడంతో ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు విశ్వసనీయత పెరిగింది. అంతమాత్రాన ఇరు పక్షాల మధ్య మౌలిక అనంగీకారాలు లేవని కాదు. అంతిమ ఒప్పందంలో ఆర్ధిక ఆంక్షలను తక్షణ, శాశ్వత ప్రాతిపదికన ఉపసంహరించే అవకాశం కల్పించాలన్న ఇరాన్ డిమాండ్ ఇలాంటి అనంగీకారాలలో ఒకటి. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు ఇందుకు ఒప్పుకోవడం లేదు. ఒక యురేనియం ఆధారిత అణు బాంబు తయారు చేయడానికి ఇరాన్ కు కనీసం సంవత్సర కాలం పట్టే విధంగా సెంట్రీ ఫ్యూజ్ ల సంఖ్యను తగ్గించాలని అవి కోరుతున్నాయి. అంతిమ ఒప్పందం ఆలస్యం అవుతున్నందున ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని రిపబ్లికన్లు మెజారిటీ కలిగిన ప్రతినిధుల సభ (కాంగ్రెస్) లో ఒత్తిడి పెరుగుతుండడం మరొక కారణం.
అయితే, ఆర్ధిక ఆంక్షలను తొలగించడం పైననే తన రాజకీయ ప్రతిష్టను ఇరానియన్ నాయకులు ఫణంగా పెట్టి ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజల్లోని పశ్చిమ అనుకూల సెక్షన్లలో సైతం తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరోవైపు బ్రిటన్ తో సహా వాషింగ్టన్ మిత్రులు ఇరాన్ లో నెలకొన్న పరిస్ధితిని ఆసరా చేసుకుని సాపేక్షికంగా స్ధిరమైన ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఉపఖండంలోని దేశాలకూ, అణ్వస్త్ర రహిత రాజ్యాలకూ ఇరాన్ విషయంలో నెలకొన్న స్తంభన పరిస్ధితులు ప్రపంచంలో నెలకొన్న అసమాన అణు సంబంధాలకు సాక్షీభూతంగా నిలిచాయి. జర్మనీ మినహా ఇరాన్ విరోధ దేశాలన్నీ అణ్వస్త్ర దేశాలు కావడమే ఒక్స్ దౌర్భాగ్యం కాగా, వివక్షాపూరిత ఎన్.పి.టి అందుకు మరో సజీవ సాక్ష్యం. నిరాయుధీకరణకు ఇక్కడే ప్రధాన అడ్డంకి నెలకొని ఉంది.
మీరు ఇలా అనువాదాలు ఇచ్చినప్పుదు వాటి సోర్స్ లింకు కూడా ఇవ్వండి , అప్పుడు ఈ రెండిటినీ కంపేర్ చేసుకుంటూ చదవడంవల్ల ఇంగ్లిష్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది.
ఇంకా మీ సైటులో గూగుల్ వినియోగదారులకి కామెంట్ పెట్టే అవకాశం లేదు ఎందుకని…. ??? నాగశ్రీనివాస
ది హిందు పత్రిక అందరికి తెలిసిందే కదా, నాగ శ్రీనివాస గారు.
గూగుల్ యూజర్స్ కి అవకాశం ఎందుకు లేదో నాకు అంతుబట్టలేదు. అందరికి అలాగే ఉందా అనుకుంటూ మీ బ్లాగ్ చూస్తే అక్కడ గూగుల్ లోగో కనిపించింది. నా బ్లాగ్ కే అలా లేదని అర్ధం అయింది. ఎలా యాక్టివేట్ చేయాలో కనుక్కుంటాను. Thanks for the information.
హిందూ పత్రిక గురించి అందరికీ తెలుసు గానీ.. ఎదైనా పాత అనువాదం చదివినప్పుడు వెంటనే దాని మూలం చదవాలనుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాను అంతే…
ఇంకా గూగుల్ ఎకౌంట్ తో పాటు అజ్ఞాత వ్యాఖ్యలు కూడా అనుమతించండి, మాకు ఆఫీసుల్లో గూగుల్ లాగిన్ అవ్వడానికి అనుమతి ఉండదు.