జనలిస్టుల జీవితాలు ఇప్పుడు ఏ పరిస్ధితుల్లో ఉన్నాయో తెలియజేసే ఈ నవీన్ గారి ‘కధనం’ చదవండి….
ఏ కొద్దిమందివోతప్ప జర్నలిస్టుల జీవితాలు బాగోలేవు…రాజమండ్రిలో ఆంధ్రప్రభ రిపోర్టర్ జానకి నిన్న చనిపోయాడు. నలభై ఏళ్ళ చిన్న వయసులో మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి అపస్మారకంలోకి వెళ్ళిపోయి వారం తరువాత భార్యని కూతురుని అనాధలుగా వదిలేసి వెళ్ళిపోయాడు. జీతం రాని దిగులు, అడ్వర్టయిజుమెంట్లు సంపాదించలేని దిగులు, పెన్నేసుకుని/నోరేసుకు పడిపోలేని సౌమ్యస్వభావం తప్ప నల్లా జానకీ శ్రీరామ్ కి అనారోగ్యకారకాలైన ఏఅలవాట్లూ లేవు.
మరణం అనివార్యమే అయినా ప్రశాంతంగా చనిపోయే అవకాశాలు లేని జీవితాలు జర్నలిస్టులవి…నెలనెలా జీతాలు సజావుగా ఇచ్చే ఈనాడు, సాక్షి పేపర్లలో పనివత్తిడి మోయలేనంతగా పెరిగిపోయింది. పది వార్తలను చూసి ప్రచురణకు కాపీ సిద్ధం చేయవలసిన సమయంలో ముప్పైనలభై వార్తలు మీదపడేస్తున్నారు. చిన్న తప్పు వస్తే ఉద్యోగం సఫా అనే కత్తికింద పనిచేయ వలసి వస్తోంది.
వేజ్ బోర్డు సిఫార్సులను ఎగవేయడానికి ఈనాడు హైదరాబాద్ కార్యాలయాన్ని ఫిలింసిటికి మార్చేసింది. సిటీనుంచి రానూపోనూ రోజూ సగటున 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఐదారుగంటలు బస్సుల్లోనే మగ్గిపోయే నరకాన్ని రామోజీరావు తనవద్ద సంవత్సరాల తరబడి పనిచేసిన ఉద్యోగులకు బోనస్ గా ఇచ్చారు..ఐదారేళ్ళ సర్వీసు వుంది. ఇల్లుకోసం, పిల్ల పెళ్ళికోసం చేసిన అప్పుతీరలేదు. ఇది మానేసి ఇంకో పని చేయలేను. రోజూ రామోజీ రక్తనాళాలు తెంపేస్తున్నాడు అని ఇద్దరు మిత్రులు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు
సాక్షిపరిస్ధితీ ఇంతే పోగబెట్టి పంపించేస్తున్నారు. మరియాదగా వెళ్ళిపోతే ఏడాది సర్వీసుకి 15 రోజుల జీతం వస్తుంది. లేదంటే మేమే పంపేసి అదే మొత్తం…
అసలు టపాను చూడండి 203 more words
i made a comment early hours????????? where is it?????????
You did not write that comment here. It was written under GDP article (eenadu). You can see it there.