ఇండియా-చైనా-బంగ్లా-బర్మా కారిడార్ రూపకల్పన


BCIM corridor

ఇండియా, చైనా, బంగ్లాదేశ్, మియాన్మార్ దేశాలను కలుపుతూ ఆర్ధిక కారిడార్ రూపకల్పనకు పధక రచన జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన సార్క్ శిఖరాగ్ర సమావేశాల్లో ఈ అంశంపై కూడా చర్చ జరిగిందని త్రిపురలో విడిది చేసిన బంగ్లాదేశ్ అధికారుల ద్వారా తెలిసింది. బంగ్లాదేశ్ సహకారంతో త్రిపురలో నిర్మించిన 726 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు సోమవారం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి బంగ్లాదేశ్ మంత్రి, అధికారులు అతిధులుగా హాజరుకానున్నారు.

సోమవారం (డిసెంబర్ 1) నాటి ప్రారంభోత్సవానికి హాజరు అయేందుకు బంగ్లాదేశ్ ఉప విద్యుత్ మంత్రి నస్రుల్ హమీద్, బంగ్లాదేశ్ ప్రధానికి శక్తి వనరుల సలహాదారు అయిన తాఫిక్-ఏ-ఎలాహీ చౌదరి త్రిపుర చేరుకున్నారు. త్రిపుర రాజధాని అగర్తలాలో వారిరువురు విలేఖరులతో మాట్లాడుతూ ఎకనమిక్ కారిడార్ గురించి తెలిపారు.

“ఉప ప్రాంతీయ ఆర్ధిక సహకారం ద్వారా గణనీయ లాభాలు పొందడానికి ఇండియా-చైనా-బంగ్లాదేశ్-మియాన్మార్ ఎకనమిక్ కారిడార్ ఏర్పాటుకు పధకం సిద్ధం చేశాము. ఖాట్మండులో జరిగిన సార్క్ శిఖరాగ్ర సభలో కూడా దీనిపై చర్చించాము” అని తాఫిక్ చౌదరి విలేఖరులకు తెలిపారు. నరేంద్ర మోడి, షేక్ హసీనాల నాయకత్వంలో ఇండియా, బంగ్లాదేశ్ దేశాలు కనెక్టివిటీ, శక్తి, వాణిజ్యం, వ్యాపార రంగాలలో మరింత దగ్గరి సహకారం సాధిస్తామని చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.

త్రిపుర రాష్ట్రంలో పలాటానా విద్యుత్ కర్మాగారాన్ని భారత ప్రభుత్వం నిర్మించింది. ఈ కర్మాగారం మొదటి దశ 363 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించినది. మొదటి దశ నిర్మాణం పూర్తయి డిసెంబర్ 2013 నుండి ఉత్పత్తి ప్రారంభించింది కూడా. రెండో దశలో మరో 363 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ రెండో దశ పూర్తయింది. సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడి దీనిని ప్రారంభించి దేశానికి/జాతికి అంకితం చేస్తారు.

తాఫిక్ చౌదరి చెబుతున్న కారిడార్ నిజానికి చైనా ప్రతిపాదించిన సిల్క్ రోడ్ లో ఒక భాగం. దీనిని నైరుతి (సౌత్-వెస్ట్రన్) సిల్క్ రోడ్ గా కొందరు పిలుస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాదులు చైనాను సైనికంగా చుట్టుముట్టి ఒత్తిడి పెంచుతూ చైనాకు చమురు సరఫరా అయ్యే సముద్ర మార్గాలను నియంత్రిస్తుండడంతో చైనా ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను ప్రతిపాదించి అభివృద్ధి చేస్తోంది. కారిడార్ ప్రకటన అమెరికాకు కోపం తెప్పిస్తుందన్న ఉద్దేశ్యంతో దాని గురించి భారత పాలకులు పెద్దగా మాట్లాడడం లేదు.

పలాటానా కర్మాగారం నిర్మాణం కోసం అవసరమైన వివిధ విడిభాగాల సరఫరాకు బంగ్లాదేశ్ సహకరించింది. పశ్చిమ బెంగాల్ నుండి త్రిపుర భూభాగాన్ని బంగ్లాదేశ్ వేరు చేస్తుంది. అచ్చంగా ఇండియా భూభాగం ద్వారానే వెళ్లాలంటే చుట్టూ తిరిగి రావాలి. నేరుగా వెళ్లాలంటే బంగ్లాదేశ్ దాటి వెళ్ళాలి. తమ భూభాగం గుండా పశ్చిమ బెంగాల్ నుండి విడిభాగాలను సజావుగా సరఫరా కావడానికి బంగ్లాదేశ్ సహకరించింది. ఎలాంటి సమస్యలు లేకుండా చూసింది.

బంగ్లాదేశ్ సహకారానికి ప్రతిగా పలాటానా విద్యుత్ కర్మాగారం నుండి 100 మెగావాట్ల విద్యుత్ ను బంగ్లాదేశ్ కు సరఫరా చేసేందుకు ఇండియా అంగీకరించింది. ఇండియా-బంగ్లాదేశ్ ల సహకారానికి పలాటానా విద్యుత్ కర్మాగారం ఒక మైలురాయిగా ఉంటుందని చెబుతూ ఇరు దేశాల అధికారులు, నేతలు పరస్పరం ఒకరినొకరు పొగుడుకుంటున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ జాతులు పోరాటాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. పోరాటాలు చేస్తున్న మిలిటెంట్ సంస్ధలు తమ స్ధావరాలను బంగ్లాదేశ్ లో నెలకొల్పడం అనాదిగా జరుగుతోంది. ఇటీవల కాలంలో వీరిపై బంగ్లాదేశ్ విరుచుకుపడింది. దాడులు చేసి వారి స్ధావరాలను ధ్వంసం చేసింది. కొందరిని అరెస్టు చేసి భారత్ కు అప్పగించింది కూడా.

కనుక ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఇండియా-బంగ్లాదేశ్ ల సహకారం మేలు చేయకపోగా వారి జాతి ఆకాంక్షల అణచివేతకు దోహదపడుతోంది. అదే సమయంలో ఇరు దేశాల పాలకవర్గాల ప్రయోజనాలకు మేలు జరుగుతోంది. ధనికవర్గాలే ఇరు దేశాల్లో పాలకవర్గాలు కనుక ఇరు దేశాల సహకారం ధనికులకు మేలు చేస్తుండగా ప్రజలను అణచివేస్తోంది.

“సహకారం టూ-వే ట్రాఫిక్ లాంటిది. ఇండియా, బంగ్లాదేశ్ లు పరస్పరం సహకరించుకుంటే, సహకారాన్ని క్రమంగా  విస్తరించుకుంటూ పోతే ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత గట్టిపడతాయి” అని ప్రకటించిన తాఫిక్ చౌదరి అదే ప్రవాహంలో “ఈశాన్య భారతీయ మిలిటెంట్ సంస్ధలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇండియాకు నష్టకరమైన చర్యలకు పాల్పడేందుకు మా భూభాగాన్ని అనుమతించబోము” అని పరుష హామీలు ఇచ్చేశారు.

ఆధిపత్య శక్తుల ప్రభుత్వాల మధ్య సహకారం ఆధిపత్య వర్గాలకే మేలు చేస్తుంది. ప్రజలకు మాత్రం అందుకు విరుద్ధంగా పని చేస్తుంది.

One thought on “ఇండియా-చైనా-బంగ్లా-బర్మా కారిడార్ రూపకల్పన

  1. i observe that in most of your articles if there is any discussion on development, it considers for the development wealthy people, and against poor people. i think coming up to that stage and retaining the position is also not an easy task. i give one example. government of India provides buffaloes to weaker sections at cheaper cost, provides feeding at free cost, and the work to do is just sell the milk that he collects from buffalo’s. most of the people who are habituated for liquor sell the buffalo’s, its feed and consume for liquor( my brother works in animal husbandry department). it is whos mistake now. industrialists life is also not bed of roses. they should alert every moment and observe the impact of global changes on his business.

    my intention is simple. unless they deserve no one occupy the desired position. (might be few exceptions).30th november 2014 sunday magazine article is inspiring. they discussed about “Leguntapadu” and its development. if every one possess such inspiration is only solution for present frustration on poor.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s