క్రికెట్: బౌన్సర్ బంతి దెబ్బకు కోమాలోకి… -ఫోటోలు


ఆస్ట్రేలియాలో జరుగుతున్న లీగ్ క్రికెట్ మ్యాచ్ లో ఓ క్రికెట్ ఆటగాడు ప్రాణాపాయ పరిస్ధితికి చేరుకున్నాడు. అప్పటికే అర్ధ సెంచరీ చేసిన ఫిల్ హ్యూస్ ను అవుట్ చేయడానికి బౌలర్ బాడీ లైన్ బౌలింగ్ ని ఎంచుకోవడంతో అది కాస్తా బ్యాట్స్ మేన్ కి ప్రాణాంతకంగా మారింది. ఫాస్ట్ బౌలర్స్ కి పేరు తెచ్చిపెట్టే మెరుపు వేగం బ్యాటింగ్ కు ప్రమాదం కావడం ఒక విషయం అయితే, ఆస్ట్రేలియా గ్రేట్ డాన్ బ్రాడ్ మన్ ఆటకు విరుగుడుగా ఇంగ్లీష్ ఆటగాళ్లు కనిపెట్టిన బాడీ లైన్ చివరికి ఆస్ట్రేలియా లీగ్ మేచ్ లకు చేరడం ఒక విషాధం.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ లీగ్ జట్ల మధ్య ‘షెఫీల్డ్ షీల్డ్’ కోసం పోటీ మ్యాచ్ జరుగుతోంది. అర్ధ సెంచరీ దాటిన ఫిల్ హ్యూస్ ను లక్ష్యంగా చేసుకుని న్యూ సౌత్ వేల్స్ బౌలర్ షాన్ అబ్బాట్ బౌన్సర్ బంతి విసిరాడు. బంతిని ఎదుర్కొనే క్రమంలో అది మీదకు రావడంతో ఫిల్ వెనక్కి తిరిగాడు. బంతి నేరుగా తల వెనుక భాగాన్ని బలంగా తాకడంతో ఆ దెబ్బకు బ్యాట్స్ మేన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఫిల్ హ్యూస్ బంతి తాకగానే మొదట మోకాళ్లపై చేతులు ఉంచుకుని ముందుకు వంగాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడని భావించిన హ్యూస్ ఇతర ఆటగాళ్లు, ప్రేక్షకులు చూస్తుండగానే అలాగే ముందుకు పడిపోయాడు. ముఖాన్ని నేలకు తాకిస్తూ బోర్లా పడిన హ్యూస్ వద్దకు ఇతర ఆటగాళ్లు పరుగున వచ్చి తట్టిన్నప్పటికీ అతనిలో కదలిక లేదు. దానితో ఆందోళన చెందిన ఆటగాళ్లు డాక్టర్ రావాలని హడావుడిగా డ్రెస్సింగ్ రూమ్ వైపు కేకలు వేశారు.

స్టేడియంలో సిద్ధంగా ఉన్న డాక్టర్ ఆటగాడికి ప్రధమ చికిత్స అందించాడు. ఈ లోపు సమాచారం అందుకున్న సెయింట్ విన్సెంట్ ఆసుపత్రి వాళ్ళు హుటాహుటిన హెలికాప్టర్ అంబులెన్స్ ను స్టేడియంకు పంపించారు. స్టేడియం గ్రౌండ్ పైనే కిందికి దిగిన హెలికాప్టర్ మీదికి గాయపడిన హ్యూస్ ని చేర్చి ఆసుపత్రికి తరలించారు.

హ్యూస్ పరిస్ధితి ప్రస్తుతం అత్యంత క్లిష్టంగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. స్కానింగ్ తీసి మెదడు ఏ మేరకు దెబ్బ తిన్నదీ డాక్టర్లు అంచనా వేసినట్లు తెలిస్తోంది. బంతి బలంగా తాకడంతో లోపల మెదడు వాచిందని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. డాక్టర్లు ఉద్దేశ్యపూర్వకంగా ఫిల్ హ్యూస్ ని కోమాలోకి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు దాటితే గాని పరిస్ధితి చెప్పలేమని వారు చెప్పారు.

ఇప్పటికే సర్జరీ చేశామని సర్జరీ ఫలితం ఏమిటన్నదీ తెలియడానికి 48 గంటల సమయం పడుతుందని డాక్టర్లు ఇచ్చిన సమాచారం. హెలికాప్టర్ వచ్చే లోపు ఆటగాడికి 40 నిమిషాల సేపు బౌండరీ లైన్ వద్దనే ఉంచి ప్రధమ చికిత్స అందించారు. నోటిఫై నోరు పెట్టి ఊపిరి ఊదుతూ అతన్ని స్పృహలోకి తేవడానికి ఊపిరి సరిగ్గా పీల్చుకునేలా చేయడానికి ప్రధమ చికిత్సా సిబ్బంది శ్రమించారు.

బంతి తగిలినప్పుడు ఆటగాడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ దెబ్బ బలంగా తగలడం గమనార్హం దీన్ని బట్టి రికార్డు వేగంతో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్ల విషయంలో హెల్మెట్ వల్ల ఉపయోగం లేదని అర్ధం అవుతోంది. బంతి ఆటగాడికి తగలడం అప్పటికి (5 ఓవర్లలో) రెండవసారి అని డెయిలీ మెయిల్ పత్రిక పేర్కొంది. సౌత్ ఆస్ట్రేలియా స్కోరు 136/2 వద్ద ఉండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను ముఖ్యంగా డాన్ బ్రాడ్ మన్ ను కట్టడి చేయలేక 30ల్లో ఇంగ్లండ్ బౌలర్లు బాడీ లైన్ బౌలింగ్ ని కనిపెట్టినట్లు చెబుతారు. వికెట్లను లక్ష్యం చేసుకోకుండా బ్యాట్స్ మేన్ శరీరాన్ని లక్ష్యం చేసుకుని బౌలింగ్ చేయడమే బాడీ లైన్ బౌలింగ్. లెగ్ వికెట్ ని లక్ష్యం చేసుకుంటూ బౌలింగ్ చేయడం, ఆ క్రమంలో బ్యాట్స్ మెన్ వెనుక మరింత మంది ఫీల్డర్లను మోహరించి బ్యాట్స్ మేన్ కు ప్రమాదకర సంకేతాలు ఇవ్వడం ఒక ఎత్తుగడగా అమలు చేశారు.

దీన్ని నిరోధించేందుకు సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టినప్పటికీ బౌన్సర్లను (షార్ట్ పిచ్ బంతులు) వేసే అలవాటు మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. బౌన్సర్లను నిరోధించే నిబంధనలు ప్రవేశపెట్టేందుకు ఇప్పటికీ చర్య తీసుకోలేకున్నారు. క్రికెట్ ఆట విపరీతంగా వాణిజ్యీకరణ చెందిన క్రమంలో ఎలాగైనా గెలవాలన్న పంతం పెరుగుతూ పోతోంది. ఫిల్ హ్యూస్ ఉదంతంతోనైనా క్రికెట్ పాలకులు కళ్ళు తెరుస్తారా?

Photos: Daily Mail

 

2 thoughts on “క్రికెట్: బౌన్సర్ బంతి దెబ్బకు కోమాలోకి… -ఫోటోలు

 1. సర్,ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు మానుకోలేము కదా!అలానే ఇదంతా ఆటల్లో భాగం!
  మనలో చాలామందికి తెలిసిన విషయం 70,80 లలో ముఖ్యంగా విండీస్ ఫాస్ట్ బౌలెర్స్ అంటేనే ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా భయపడే రోజులు ఎందరో బ్యాట్స్ మెన్ తమ కెరియర్లను అర్ధాంతరంగా వదిలేసిన రోజులు!
  ఇప్పటిలా అప్పుడు ఓవర్ కు 2 బౌన్సెర్స్ లను వేయాలనే నిభందనలు కూడా లేవు,బ్యాత్స్ మెన్ లకు ఇప్పటిలా హెల్మెట్స్ కూడా లేవు!
  మరీ ముఖ్యంగా ఆట ఇప్పటిలా వాణిజ్యకరణ కూడా అప్పడు లేదు! అప్పుడు ఉన్నంత ఫాస్ట్ పిట్చెస్ కూడా ఇప్పుడు లేవు!!
  క్రికెట్ ఆట బ్యట్స్ మెన్ ప్రధాన ఆట.బౌలెర్స్ కు బౌన్సెర్స్ వేసే వెసుల బాటు లేక పోతే ఎలా?
  ఏదేమైనప్పటికీ ,జరిగిన ఘటన విచారించదగ్గది!ఫిల్ త్వరలో కోలుకోవాలని ఆశిద్దాం! అలానే అబాట్ కు(ఇతని మానసిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఓసారి ఆలోచించండి-ప్రధాన విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ జాతీయ జట్టులో సహచరులు) అందరి మద్దతు అవసరం!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s