గౌరవం పేరుతో జరిగే నేరం -ది హిందు ఎడిట్


Honor killing

(ది హిందు ఎడిటోరియల్ -22/11/2014- అనువాదం. -విశేఖర్)

____________

 

గౌరవాన్ని మోహరించడం అన్నది మహిళలపై అమలయ్యే సామాజిక నియంత్రణకు ఒక తీవ్ర రూపం. అది శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచే ప్రక్రియ. కుటుంబాలు, సామాజిక సమూహాలు, ఒకరి ‘గౌరవహీన’ చర్యలపై పుకార్లమారి పొరుగువారి గూఢచర్యం – ఎవరేమి ధరిస్తున్నారు, ఎవరేమి మాట్లాడుతున్నారు, ఎవరేమి ఎగవేస్తున్నారు, ఎవరేమి అవలంబిస్తున్నారు- అన్నింటినీ ఆ తీక్షణ చూపుల ద్వారా పటం గీసేస్తారు. ఏదో ఒక హింసాత్మక రూపంతో కూడిన పితృస్వామిక ఆదేశ స్వరం ద్వారా ఈ అతిక్రమణలన్నింటిని నెరవేర్చుకుంటారు. కులాంతర మరియు మతాంతర సంబంధాలు లాంటి మరింత తీవ్రమైన అతిక్రమణలకైతే మరణ శిక్షలతో జవాబిస్తారు.

ఈ వారం, యాదవ కులానికి చెందిన ఢిల్లీ కళాశాల విద్యార్ధిని భవ్యను పంజాబి యువకుడు అభిషేక్ తో వెళ్ళిపోయినందుకు ఆమె కుటుంబం గొంతు బిగించి చంపేసింది. ఇలాంటి నేరాలపై సుప్రీం కోర్టు తీవ్రంగా విరుచుకుపడింది. కృష్ణ మాష్టర్ (2010) కేసులో, “కుటుంబ గౌరవం కాపాడడమనే దుర్బల కారణంతో మొత్తం కుటుంబాన్ని తుడిచిపెట్టేయడం, ఈ కోర్టులో నిర్ధారించబడిన అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసు సూత్రం కిందికి వస్తుంద”ని ధర్మాసనం అభిప్రాయపడింది. గౌరవనీయ న్యాయమూర్తులు దానిని దృఢమైన స్వరంతో ఖండించవచ్చు గాక! అయినప్పటికి వారి స్వరం మీ తండ్రి గౌరవం కాపాడండన్న సూక్తి చెల్లుబాటు అయ్యే  ఇళ్ల లోపలి నాలుగు గోడల మధ్య బలహీనమై వాడిపోతుంది.

‘మహిళలపై సాగే అన్నిరకాల వివక్షల నిర్మూలనా సదస్సు’తో సహా అనేక అంతర్జాతీయ చట్టాలు పరువు హత్యలపై నిర్దిష్టంగా దృష్టి పెట్టాయి. అటువంటి వివాహాలను సామాజిక దండనలకు గురి చేయడాన్ని నిషేదిస్తూ బిల్లు ముసాయిదా రూపొందించడం ద్వారా భారతీయ లా కమిషన్ స్పందించింది. (అలాంటి కేసుల్లో) అమాయకత్వ పూర్వాభిప్రాయానికి (దోషిగా రుజువయ్యే వరకూ అమాయకులన్న అభిప్రాయానికి) విరుద్ధంగా, అమాయకులని రుజువయ్యే వరకూ దోషిగా పరిగణించాలని ప్రతిపాదించింది. అయితే సమస్య మూలం ఎక్కడ ఉన్నదంటే, సమర్ధనీయం కానీ సాంప్రదాయక ఆచరణకూ, రాజ్య చట్టానికి మధ్య ఉన్న వైరుధ్యం లోనే. 2005లో ఒక అధ్యయనాత్మక సదస్సులో మాట్లాడుతూ హర్యానాలోని ఒక ఖాఫ్ ముఖ్యుడైన సూరజ్ సింగ్,  కుల పంచాయితీలకు వివాహాలపై న్యాయ నిర్ణయం చేసేందుకు దైవమే హక్కులు కల్పించిందని వ్యాఖ్యానించాడు. “ప్రేమ వివాహాలను మేము అనుమతించబోము… కోర్టు వివాహాలను కూడా మేము అంగీకరించబోము” అని ఆయన తెగేసి చెప్పాడు.

సవాలు ఎక్కడ ఉత్పన్నం అవుతుందంటే, పరువు హత్యలు పరస్పరం పోటీ పడే వివిధ ఆధిపత్య హయాంల సంగమం వద్ద నిలిచి ఉంటున్నాయి – సాంప్రదాయక ఆచరణలు, నేర చట్టాలు మరియు అంతర్జాతీయ చట్టాలు. ఉదాహరణకి లతా సింగ్ (2006) కేసులో, వ్యక్తుల ఎంపిక ప్రకారం వివాహం చేసుకునే హక్కు ఉంటుందని ఉద్ఘాటించింది. కానీ ఎంపిక అన్నది తక్కువ భాగం వ్యక్తిగతమూ మరియు ఎక్కువ భాగం తల్లిదండ్రులకు సొంతమూ, కొండొకచో కులాధీనం సైతమూ అయిన సాంప్రదాయక ఆచరణలలో “వ్యక్తిగతం”, “ఎంపిక” లు పూర్తిగా భిన్నమైన రూపాలను ధరిస్తాయి. కులం సమస్యను మరింత సంక్లిష్టం కావిస్తుంది. కులం మరియు వేరు తత్వ భావనను అంతం చేస్తుందన్న వాదన ఆధారంగా కులాంతర వివాహాలను డా.అంబేద్కర్ ఆమోదించారు. విశాల స్వభావం కలిగిన సమాజం ఈ తరహా పరువు హత్యలను గట్టిగా ఖండిస్తుంది. అయినప్పటికీ అవి దేశవ్యాపితంగా తాండవమాడుతూనే ఉన్నాయి. వీధుల్లో జనం నిరసించవచ్చు గాక! కుటుంబం నాలుగు గోడల మధ్య ‘పరువు అనబడే శాపం’ వెంటాడుతూనే ఉండగా సహన సంస్కృతి భయానక ఆచరణలు పరువు మాటున గుప్పిట జారిపోయేందుకు అనుమతిస్తోంది. వివిధ రంగాలలోని -రాజకీయ, మత, సామాజిక- నాయకులతో పాటు పౌర సమాజ నేతలు పూర్వ భావనలను కొనసాగింపజేసే భావజాలాన్ని మార్చేందుకు కృషి చేయవలసి ఉంది.

3 thoughts on “గౌరవం పేరుతో జరిగే నేరం -ది హిందు ఎడిట్

  1. పరువు హత్యలు ముఖ్యం గా కులాంతర,మతాంతర,ఆర్ధికాంతర వివహాలలో జరుగుతుండడం విచారించదగ్గవిషయం.
    అసలీహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించుకొంటే దానికి సమాధానం చెప్పవలసినది సమాజమే(అధికభాగం).
    సమాజమే నీతినియమాలను ఏర్పాటుచేసుకొంటుంది! ఆ సమాజమే దానిని తప్పుతుంది! లేని,అనవసర విలువలను కల్పించుకొని,దానికై పాకులాడి నెత్తినపెట్టుకొవడం ఎందుకు?ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు అవమానంగా భావించడం ఎందుకు?
    దానినుండి బయటపడే మార్గాలను సమాజం ఎప్పుడు ఆమోదిస్తుంది?అన్నిటికీ కాలమే సమాదానమిస్తుందని తప్పించుకొనే మార్గం కాకుండా,ఆచరణాత్మకమైన పరిష్కారాలు సూచించేదెవరు?ఎపుడు?

  2. //వివిధ రంగాలలోని -రాజకీయ, మత, సామాజిక- నాయకులతో పాటు పౌర సమాజ నేతలు పూర్వ భావనలను కొనసాగింపజేసే భావజాలాన్ని మార్చేందుకు కృషి చేయవలసి ఉంది.//
    ఈ బోధన ఎవరి చెవిన బడతున్నది? పునరుద్దరణ వాదం జడలు విప్పినర్తిస్తున్నపుడు పౌర సమాజం గొంతు మూగబోతుంది.అది నూతిలో గొంతుకై వెల వెలబోతుంది. పెళ్లి అనేది కనీసం సామాజిక ఒప్పందం అన్నచోటనే అవగహనలో అది చతికల పడిపోయినపుడు, జాతకాలు, మూడ నమ్మకాలు పెళ్లిల్లను శాసిస్తున్నపుడు లైంగిక హింస, గౌరవ హత్యలు ఆగుతాయా? ఉన్నపరిస్తితుల్లో పైన ఉదహరించిన పౌర సమాజం అగ్నికి ఆజ్య పోయక పోతే చాలు!

  3. i wonder why people worry much about caste. and the impact of it on all social aspects. it start writing “caste” column at the time of school admission. they need “Reservation” at the time of jobs. every one want to form a “community” based on their caste. Like Kamma Hostels” “Reddy Cremations”. “Visya Satram” at temple shrines etc.,

    I think only actor Kamal Hasan at the time of admission of Sruthi hasan Rejected to write his “caste”.

    when the people are divided into caste, region, religion, they try to protect their existence. if any body come in the way they try to smash down. if it is especially weak persons like innocent women the impact will be more.

    my son dont know what is his caste, religion, region at the time of his birth, in fact we train them and separate him from rest of the community to brought up in our own way, that is as per our community aspirations. naturally he either feel deprived or proud based on his caste.

    can any political party has dare enough to remove the word “Caste” from society. at least after 50 years you will not find such issues in society. but as per my knowledge it is impossible as our government will issue tickets based on “caste”.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s