బానిసల రాజధానిగా ఇండియా -కత్తిరింపు


భారత దేశం పెట్టుబడిదారీ వ్యవస్ధగా మారిపోతోందని కొందరు, మారిపోయిందని మరి కొందరు అనేక యేళ్లుగా వాదిస్తున్నారు. వారిలో కొన్ని విప్లవ కమ్యూనిస్టు సంస్ధలు, ఆ సంస్ధల్లోని నాయకులు కూడా ఉన్నారు. ఈ కారణం చేతనే చీలికలకు గురి గాకుండా స్ధిరంగా పని చేస్తున్నాయని భావించిన కొన్ని విప్లవ సంస్ధల్లోనూ చీలికలు తప్పలేదు.

ఇటీవల మావోయిస్టు పార్టీ నుండి సవ్యచాచి పాండా లాంటివారు బైటికి వచ్చి వేరే సంస్ధను ఏర్పాటు చేస్తూ భారత దేశంలో భూస్వామ్య వ్యవస్ధ అంతరించిన సంగతిని పార్టీ గుర్తించడం లేదని ఆరోపించిన సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.

కానీ భారత దేశంలో భూస్వామ్య వ్యవస్ధకు పట్టుగొమ్మ కులం. భారత సమాజంలో కుల సంబంధాలు ప్రబలంగా ఉన్నంత వరకూ భూస్వామ్య సంబంధాలు అంతరించాయని చెప్పడం సాహసమే అవుతుంది. దానితో పెట్టుబడిదారీ సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయన్న వాదనకు బలం తెచ్చుకోవడానికి కులం కూడా బలహీనపడిందని వాదించడం ప్రారంభించారు.

ఆధునిక అర్ధ వలస సంబంధాలకు కులం ఆధునిక రూపాలను సంతరించుకుంటోందన్న వాస్తవాన్ని తక్కువ చేసి చెప్పడానికి ఇష్టపడతారు. భారత దేశంలో భూస్వామ్య సంబంధాలకు కులంతో పాటు మరో సూచికగా ఉండేది వెట్టి చాకిరీ వ్యవస్ధ. వెట్టి చాకిరీని నిర్మూలించినట్లు భారత పాలకులు చెబుతారు. కానీ వాస్తవంలో వెట్టి చాకిరీ కూడా వివిధ రూపాలు మార్చుకుని కొనసాగుతోంది.

వెట్టి చాకిరీ పని విధానం కొనసాగుతోందని చెప్పేందుకు ఈ వార్త ఒక తార్కాణం. ఈ కత్తిరింపు ఏ పత్రిక నుండి సంగ్రహించిందో తెలియదు. మిత్రులు తిరుపాలుగారు ఫేస్ బుక్ నుండి సంగ్రహించి అందించగా, దీని ప్రాముఖ్యత రీత్యా టపా రూపంలో ఇస్తున్నాను.

Slave capital

6 thoughts on “బానిసల రాజధానిగా ఇండియా -కత్తిరింపు

 1. నేను కూడా మొదట వార్త వినగానే షాక్ తిన్నాను.
  దానికి రెండు కారణాలు.
  1- చరిత్ర పుస్తకాల ప్రకారం బానిస వ్యవస్థ భారత్ లో లేదని చదువుకున్నాను. అలాంటిది…అసలు బానిసత్వమే లేని భారత్…ఇప్పుడు అగ్రస్థానంలోకి ఎలా వచ్చింది. అంటే నేను గతంలో చదివిన పుస్తకాలు తప్పన్న మాట….

  2- ఈ ఆధునిక యుగంలోనూ మనిషి…సాటి మనిషిని బానిసగా చేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఉండడం….
  లేదా మనిషి తాను బతకటానికి….బానిసత్వానికి సిద్ధపడేంత దారిద్ర్యం ఉండడం…..

  అన్నట్లు శేఖర్ గారు…పై క్లిప్ ఆంధ్రభూమి దనుకుంటా…(ఫాంట్ ను బట్టి)

 2. ఇందియాలో ఇప్పటికీ ఎక్కువ మంది పల్లెటూర్లలోనే ఉంటున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధికి పట్టణీకరణ కావాలి. వ్యవసాయంపై ఆధారపడుతోన్న ఇంత మందిని చూసి పెట్టుబడిదారీ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందిందని అనుకోలేము. కులం విషయానికి వస్తే, ఇప్పుడు కూడా పెళ్ళి సంబంధాలకి వెళ్ళినప్పుడు కులం పేరు అడుగుతారు. ఆఫీస్‌లో సహోద్యోగులకి కులం పేరు అడగరు కానీ వ్యక్తిగతంగా సంబంధం ఏర్పరుచుకునేటప్పుడు కులం పేరు తప్పకుండా అడుగుతారు.

 3. //చరిత్ర పుస్తకాల ప్రకారం బానిస వ్యవస్థ భారత్ లో లేదని చదువుకున్నాను//

  చాలా మంది చరిత్రకారులు ఈ మాటేచెపుతారు. వర్ణ వ్యవస్థ ఉన్నా అది పశ్చిమదేశాల్లో ఉన్నంత దుర్మార్గ మైనది కాదని, అంటారు. ” ప్రాచీన భరత సమాజంలో బానిసల స్థితిగతులు” అనే పుస్తకాన్ని వుప్పల లక్ష్మణ రావు గారు వాల్టెర్‌ రూబెన్‌ జర్మన్‌ లో రాసిన దాన్ని నేరుగా తెలుగు అనువాదం చేశారు. ఇప్పుడు కూడా విశాలంద్రలో దొరుకుతుంది. ఏటుకూరి బలరామమూర్తి గారి ముందుమాటలో ఇలా చెపుతారు “హరప్ప మొహంజదారో నాగరికత కాలం క్రీ.పూ.2500-3000 అ మధ్య కాలానికే బానిస, బానిస యజమాని వ్య్వస్త ఉండేదని నిర్దిష్ట మైనా ఆదారాలు లభించాయి. ఈజిప్టు, బాబిలోనియన్‌ దేశాల బానిస వ్య్వస్తకు, దీనికి పోలికలున్నాయి వర్ణ వ్య్వస్త ఆనాటికి లేదు” కౌటిల్యుని అర్ధ శాస్త్రంలో తిరిగి బానిస వ్య్వస్తను గురించి, అసంఖ్యాకమైన ఉల్లేఖనలు, వివరణలు ఉన్నాయి. ఈ రెండు సరిహద్దులమధ్య భారతీయ సమాజ పరిణామంలో బానిస వ్య్వస్త వర్ణ విభజన పక్క పక్కగా సాహాయి అంటారు.

 4. తెలంగాణ ప్రాంతలో దొరలు పాలిస్తున్న కాలంలో…ఆడబాపలు అని ఓ పద్ధతి ఉండేది.
  అంటే ఓ భూస్వామి, లేదా దొర లాంటి ధనవంతుడు తన కూతురు పెళ్లి చేసినపుడు…..కాపురానికి పెళ్లికూతురుతో పాటూ ఓ కింది కులానికి చెందిన అమ్మాయిని కొని పంపేవారు. ఆ అమ్మాయిని ఆడబాప అనేవారు. ఆమెకు పెళ్లి ఉండదు. దొరసాని తన యజమాని కనుక….దొర కూడా సహజంగానే అన్ని రకాలుగా యజమాని అయ్యేవాడు….
  ఆ కాలంలో తెలంగాణలో ఎంతో మంది ఆడబాప వ్యవస్థకు బలైపోయారని చెపుతారు….
  ఇది కూడా ఓ రకంగా బానిస వ్యవస్థే కదా. అలాగే జోగిని వ్యవస్థ కూడా మరో రకం బానిస వ్యవస్థ.

 5. నిజాం కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో భోగం (వ్యభిచారం చేసే) కులంలో కూడా అనేక శాఖలు ఉండేవి. మున్నూరు భోగం (భోగంవాళ్ళుగా మారిన మున్నూరు కాపులు), తెలగా భోగం (భోగంవాళ్ళుగా మారిన తెలగావాళ్ళు), ముస్లిం భోగం, ఎరుకల భోగం వగైరా. భోగంవాళ్ళలో ఎరుకల భోగం లాంటి ఒకటి రెండు తప్ప మిగిలిన శాఖలవాళ్ళు చాకలి, మంగలి కులస్తుల కంటే ఆర్థికంగా ముందుండేవాళ్ళు. అందువల్ల భోగంవాళ్ళకి కుల వ్యవస్థపై వ్యతిరేకత ఉండేది కాదు. ఆంధ్రాలో పూర్వ జమీందార్ల రాజధానులైన పెద్దాపురం, వేల్పూరు లాంటి చోట్ల భోగం కులస్తులు ఇప్పటికీ కనిపిస్తారు. అప్పట్లో ఆంధ్రాలోని జమీందార్లు భోగం కులానికి చెందిన స్త్రీలనే ఉంపుడుగత్తెలుగా ఉంచుకునేవాళ్ళు. ఉత్తర భారత దేశంలో భోగంవాళ్ళని నాచ్ (నాట్యం చేసేవాళ్ళు) అనీ, మహా రాష్ట్రలో వీళ్ళని కొళాటి లేదా కళావంత్ అనీ, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలిచేవాళ్ళు. మన కుల వ్యవస్థ వ్యభిచారులకి కూడా ప్రత్యేక కులం సృష్టించిన చరిత్ర ఉన్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s