ప్రణమీయ హితైషికి… -కవిత


(ఈ కవిత 2000 సం.లో రాసినది. నా పుట్టిన రోజు సందర్భంగా అప్పటి మా సీనియర్ డివిజనల్ మేనేజర్ గోపీనాధ్ గారు అభినందనలు తెలియజేస్తూ ఒక గ్రీటింగ్ పంపారు. ఆయన గ్రీటింగ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కవిత రాసి పంపాను.

ఆయన గొప్ప వక్త. ముఖ్యంగా ద్రవ్య కంపెనీల వ్యాపారాభివృద్ధి కోసం ఫీల్డ్ స్టాఫ్ ను ఉత్తేజపరిచే ఉపన్యాసాలు ఇవ్వడంలో దిట్ట. ఆ తర్వాత వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని పూర్తికాలం ఉత్తేజ ప్రసంగాలు ఇచ్చే కన్సల్టెంట్ గా సొంత పని ప్రారంభించారు. ఆయన ఉపన్యాసాల్లో ఓ సారి నా కవిత ప్రస్తావనకు వచ్చిందని ఇతర మిత్రుల ద్వారా తెలిసింది. -విశేఖర్)

Birth day

*********

నల్ల మబ్బులు నింగి నిండా

ఇనుప తెరలా పరుచుకుని

రోజుల తరబడి

మనిషినీ, మనసునీ

విసిగిస్తున్నపుడు….

అడ్డంకుల్ని చీల్చుకుంటూ

వెచ్చగా తాకిన

ఓ ఒంటరి కిరణం

‘నేనున్నానని’ పలకరించింది

ఒంటరిగా వస్తే మాత్రం ఏం?

అది నా అస్తిత్వాన్ని దృఢపరిచింది

వేయి ఏనుగుల ఘీంకార ఘోషకు

సమానమై….

పచ్చగా స్ఫూర్తించే బీజాణువై…

మనసు లోతులను

మెత్తగా, వెచ్చగా స్పృజించింది

అది నా ప్రణమీయ హితైషి!

7 thoughts on “ప్రణమీయ హితైషికి… -కవిత

 1. //వెచ్చగా తాకిన
  ఓ ఒంటరి కిరణం
  ‘నేనున్నానని’ పలకరించింది//
  అవును మరి ఆత్మీయంగా పలకరించిన ఆ వెచ్చని కిరణం ఎంత బరోసా నిచ్చింది.
  బాగుందండి కవితా,

 2. Hi Gopinadh Rao garu, I had to leave B.E in 3rd year due to health reasons. So I can’t say my qualification is B.E.

  Philosophy is my passion. That passion lead me to study History and Economics even during B.E. I tend to go deep, whenever I read something interesting. I’ve been reading (anything that comes to me) since my childhood. So that helped me. Interest in knowing things has been the ‘key.’

 3. @ ‘నేనున్నానని’ పలకరించింది

  ఒంటరిగా వస్తే మాత్రం ఏం?

  అది నా అస్తిత్వాన్ని దృఢపరిచింది….

  అవును ఎన్వీఎస్ గారూ…..మనకెన్ని ఉన్నాయనుకున్నా…..ఓ ఒంటరి కిరణం తోడు మనకెంతో బలాన్నిస్తుంది.
  మన అస్తిత్వాన్ని దృఢ పరుస్తుంది. మన భవిష్యత్ కు మార్గం చూపిస్తుంది…

  అంతర్జాతీయ విషయాలతో పాటూ…అంతర్గత విషయానికి సంబంధించిన….జ్ఞానమూ అందిస్తున్నారు. కృతజ్ఞతలు.

 4. వి.శేఖర్ గారు.
  మీ ప్రణమీయ హితైషి కవిత చదివాక….నాకు గోరేటి వెంకన్న రాసిన….
  లచ్చుమమ్మా పాట….గుర్తొచ్చింది.
  మీరు గతంలో వినే ఉంటారు. మీకు గుర్తు చేయాలనిపించింది.
  ఓ సారి వినండి….

 5. చందుతులసి గారు, ఈ పాట గతంలో కొంచెమే విన్నాను. ఈ వీడియోలో స్పష్టత ఉంది.

  కానీ ఈ పాటను గుర్తు తేవడం వరకు ఒప్పుకోవచ్చేమో గానీ పాటంత గొప్పగా మాత్రం కవిత లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s