ఈ రోజు ఈనాడు పత్రికలో వివిధ జి.డి.పిల గురించి, కరెన్సీల మధ్య తేడాల గురించి చర్చించాను. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ లెక్కన ఇండియా జి.డి.పి మూడో స్ధానంలో ఉంటుందని కొద్ది రోజుల క్రితం ఐ.ఎం.ఎఫ్ ప్రకటించింది. ఈ అంచనాను మన పత్రికలు సగర్వంగా రాసుకుని గర్వించాయి. దీన్ని చదివిన కొందరు మేధావులు మనకు తెలియకుండానే మనం అగ్రరాజ్యం స్ధానానికి చేరిపోతున్నామన్న భ్రమలో పడిపోయారు.
వాస్తవానికి అసలు జి.డి.పియే దేశ ఆర్ధిక స్ధితిగతులను సరిగ్గా ప్రతిబింబించదు. పి.పి.పి జి.డి.పి అయితే అసలే ప్రతిబింబించదు. మనం రెగ్యులర్ గా వినే జి.డి.పి అసలు పేరు నామినల్ జి.డి.పి. ఈ జి.డి.పి మొత్తం ఉత్పత్తిని లెక్కిస్తుందే గాని అది ఎవరెవరి చేతుల్లో ఉన్నది చెప్పదు. అనగా ఉత్పత్తి పంపిణీ ఎంత అసమానంగా జరుగుతున్నది తెలియజేయదు. ఈ జి.డి.పి ని జనాభాతో విభజించి తలసరి జి.డి.పి ని అంచనా వేయడం కూడా వాస్తవిక పరిస్ధితిని కప్పి పెడుతుంది.
జి.డి.పి లెక్కలు పెట్టుబడిదారీ వ్యవస్ధల నిర్వహణ, అవసరం కోసం తయారు చేసుకున్న లెక్క. కనుక ఇవి వారికే ఉపయోగపడతాయి. ఆర్ధిక వ్యవస్ధ గురించి స్ధూలంగా ఒక అవగాహనకు రావడం తప్ప ఇందులో ప్రజల అవసరాలను, వనరుల అందుబాటును, వనరులు-సంపదల పంపిణీని తెలియజేసే అంశాలు ఉండవు. ప్రజల దృష్టి కోణంలో జి.డి.పి లెక్కలు ఉపయోగపడేవి కావు. కానీ ఆర్ధిక శాస్త్రాలు ఈ లెక్కల చుట్టూనే తిరుగుతాయి గనుక మనం వాటినే నేర్చుకోక తప్పదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆర్ధిక శాస్త్రాన్ని అభివృద్ధి చేసే కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది. నిజానికి ఆ కర్తవ్య నిర్వహణ అయితే జరిగింది గానీ, దానిని ప్రజల చెంతకు తెచ్చే సామాజిక వ్యవస్ధలు మనకు లేవు.
వివిధ దేశాల కరెన్సీల మధ్య తేడాలు ఎందుకు ఉన్నాయో తెలియజేసే సమాచారం పెట్టుబడిదారీ ఆర్ధిక శాస్త్రంలో లభించదు. సరుకు విలువను సప్లై-డిమాండ్ ల చుట్టూ తిప్పే శాస్త్రానికి ఉన్న పరిమితులే దానికి కారణం. సరుకు విలువ ఆ సరుకు తయారీకి పట్టే శ్రమలో ఉంటుందని పెట్టుబడిదారీ ఆర్ధిక శాస్త్రం గుర్తించదు. కనుక కరెన్సీల మధ్య తేడాకు అది ఇంకేవో పొసగని కారణాలు చెబుతుంది. ఈ అంశాన్ని కూడా ఈసారి స్వల్పంగా చర్చించాను.
ఆర్టికల్ ను ఈనాడు వెబ్ సైట్ లో చూసేందుకు కింది లంకెలోకి వెళ్లగలరు.
పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ గా ఆర్టికల్ ను చూడాలనుకుంటే కింది బొమ్మపైన క్లిక్ చేయగలరు. రైట్ క్లిక్ చేసి పి.డి.పి డాక్యుమెంట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
1947లో రూపాయి విలువ దాలర్ విలువతో సమానంగా ఉండేది. అప్పట్లో కూడా ఇందియా వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడిన దేశమే. అప్పట్లో ఇందియాలో 17% మాత్రమే పట్టణీకరణ ఉండేది. అమెరికా గత వందేళ్ళుగా సామ్రాజ్యవాద దేశమే. 1947లో కూడా అమెరికాలో motor cars ఎక్కువగా ఉంటే ఇందియాలో ఎడ్ల బండ్లు ఎక్కువగా ఉండేవి. అయినప్పటికీ 1947లో దాలర్ విలువ రూపాయి విలువతో సమానంగా ఉండేది. అప్పట్లో రూపాయి బిల్లల్ని వెండితో ముద్రించేవాళ్ళు. అనాలు, పైసల్ని రాగి, అల్యునినంలతో ముద్రించేవాళ్ళు. కరెన్సీ విలువ తరుగుదల, ద్రవ్యోల్బనాల కారణంగా వెండి నాణేలని ఆపేసారు. మా చిన్నప్పుడు (1985-1990 రోజుల్లో) 5 పైసల బిల్లలు ఉండేవి. ఒక రూపాయి అంటే 100 పైసలు. ద్రవ్యోల్బనం కారణంగా ఇప్పుడు పైసలు కూడా రద్దై ఒక రూపాయి కంటే తక్కువ దినామినేషన్ దొరకడం లేదు.
Motor car economyకీ, bullock cart economyకీ ఒకే కరెన్సీ విలువ ఉండడం సాధ్యమే. ఎద్దులూ, గుఱ్ఱాలూ, గాడిదలని పొలాల్లో మేపుతారు లేదా వాటికి చిట్టూ, తవుడూ, ఉలవలూ కలిపిన కుడితి పెడతారు. పెత్రోల్ దిగుమతి చేసుకోవడానికి ఫారెక్స్ మార్కెత్‌లో విదేశీ కరెన్సీ కొనాల్సి వస్తుంది కానీ స్థానికంగా దొరికే చిట్టూ, తవుడూ, ఉలవలూ కొనడానికి విదేశీ కరెన్సీ అవసరం లేదు. ఒక లారీని నడపడం కంటే నాలుగైదు గుఱ్ఱాలని పెంచడం ఎక్కువ ఖర్చు కూడిన పనే కావచ్చు కానీ గుఱ్ఱాలని పెంచడం ఫారెక్స్ భారం లేని పని. రెండు దేశాల కరెన్సీ విలువ సమానమైనా ఫారెక్స్ వ్యాపారి కమిషన్ తీసుకునే కరెన్సీ మారుస్తాడు.
దేశీయంగా ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఫారెక్స్ మార్కెత్‌లో మన కరెన్సీ కొనేవాళ్ళు కూడా తక్కువగానే ఉంటారు. 1947లో మన దేశంలో కరెన్సీ ముద్రణ తక్కువగానే ఉండేది. అవసరానికి మించి కరెన్సీ ముద్రించి, దాన్ని ఫారెక్స్ మార్కెత్‌లో అమ్ముకోవడంపై ఎక్కువ ఆధారపడే పరిస్థితి అప్పట్లో లేదేమో! ఇప్పుడు కరెన్సీ ప్రవాహం ఎక్కువ కనుక ఫారెక్స్ మార్కెత్‌లో రూపాయలు కొనేవాళ్ళు పెరిగితేనే రూపాయి విలువ పెరుగుతుంది.
By the way, watch this video:
From Cumar Chennam on Facebook:
రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది..? అసలు రూపాయి విలువ డాలర్ తో పోల్చితే ఎందుకు దిగజారుతుందో తెలిపే కొన్ని విషయాలు…
మన దేశంలో డాలర్ కి డిమాండ్ ఏర్పడితే రూపాయి విలువ తగ్గుతుంటుంది, కాబట్టి ఏ విషయాలు డాలర్ కు డిమాండ్ క్రియేట్ చేస్తున్నాయో తెలుసుకుందాం…
1) 1991 లో మన విదేశీ అప్పు 8,900 కోట్ల డాలర్లు, అందులో ప్రభుత్వ వాటా 58%. ఇప్పుడు మన విదేశీ అప్పు 39,000 కోట్ల డాలర్లు, ఇందులో ప్రభుత్వ వాటా 21%, మిగిలిన 79% అప్పు అతి పెద్ద కార్పోరేట్ కంపెనీలు చేసినవి. గడిచిన 6 సంవత్సరాలలో్ ఈ కంపెనీలు విదేశీ బ్యాంకుల దగ్గర చేసిన అప్పు 6 లక్షల 31 వేల కోట్లు. ఇలా తీసుకున్న అప్పులు వడ్డీలు డాలర్ల రూపమ్లో చెల్లించవలసినందున డాలర్ కు డిమాండ్ – రూపాయికి పతనం.
2) విదేశాల నుండి మనకు అవసరంలేని, ఇక్కడ దొరికే వస్తువులను కూడా డాలర్లను చెల్లించి దిగుమతి చేసుకోవటం వలన డాలర్ల కు డిమాండ్ – రూపాయి పతనం..ఆపిల్స్, లిక్కరు, బొమ్మలు, కాస్మొటిక్స్, తాళం కప్పలు, సిల్క్, పెన్నులు, కాలింగ్ బెల్లులు ఇవన్నీ కూడ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం.
3) పెద్ద పెద్ద వ్యాపారస్థులు తము వ్యాపారంలో వచ్చిన లక్షల కోట్ల లాభాలన్ని ఒకేసారి తిరిగి వ్యాపారంలో పెట్టరు ( డిమాండ్ ని బట్టి వస్తువులు ఉత్పత్త్తి చేస్తారు ), అలా పోగుబడిన డబ్బు బంగారం, భూములు, డాలర్ల రూపం లోకి మార్చుకుంటారు…డాలర్లు కొంతమంది దగ్గరే పోగుబడటం వలన డిమాండ్ పెరుగుతుంది – రూపాయి విలువ తగ్గుతుంది.
4) మన షేర్ మార్కెట్ లోకి కండిషంస్ లేకుండా డాలర్ల రూపంలో వచ్చే డబ్బు నిలకడలేనిది, మన షేర్ మార్కెట్ లో వచ్చే లాభం కన్నా ఇంకొక దేశం లో ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్ను వస్తే వెంటనే ఈ డాలర్లు అక్కడకు వెళతాయి. ఎక్కువ మొత్తం లో డాలర్స్ ఒకేసారి వెళ్ళినా డిమాండ్ పెరుగుతుంది – రూపాయి విలువ పడిపోతుంది.
5) ఈ దేశంలో దొరికిన గ్యాస్ నిక్షేపా్లకు, ఈ దేశ ప్రజల అవసరం కోసం, ఈ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ దేశ కంపెనీ అయిన రిలయంసుకు కూడా డాలరర్లు చెల్లించి గ్యాసు కొనుక్కోవటం వలన డాలర్ల డిమాండ్ పెరుగుతుంది – రూపాయి విలువ తగ్గుతుంది.
6) ఒకోసారి ప్రభుత్వం కూడా ఎగుమతులను ప్రోత్సహించటానికి రూపాయి విలువ తగ్గిస్తుంటుంది. ఇది డాలర్ డిమాండ్ కు సంభందం లేనిది.
మన మిత్రులు కొంతమంది ఫేసుబుక్ లో విదేశీ వస్తువులు కొనకుండా దేశీయ వస్తువులు మాత్రమే కొంటే రూపాయి విలువ బలపడుతుంది అని ప్రచారం కూడా చేస్తున్నారు, మంచిదే అయితే ఇలా జరగాలంటే దేశీయ వస్తువుల ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి పెట్టి, దేశీయ గిరాకి పెంచి దానికి అనుగుణంగా ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి.