“అంతరానితనం అమానుషం, చట్ట రీత్యా నేరం” అని భారత ప్రభుత్వం గత 67 యేళ్లుగా ప్రచారం చేస్తోంది. అంతరానితనం నిర్మూలించడానికి అని చెబుతూ చట్టాలు చేసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా భారత దేశంలో అంతరానితనం సజీవంగా కొనసాగుతోందని జాతీయ, అంతర్జాతీయ సంస్ధల సర్వేలో వెల్లడి అయింది. జాతీయ అనువర్తిత ఆర్ధిక పరిశోధనా సంస్ధ (National Council for Applied Economic Research -NCAER) వారు నిర్వహించిన భారత మానవాభివృద్ధి సర్వే (Indian Human Development Survey -IHDS) లో ఈ సంగతి వెల్లడి అయింది.
కులాంతర వివాహాల ద్వారా దేశంలో కుల వివక్షను నిర్మూలించవచ్చని రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్.అంబేడ్కర్ ఆశించారు. అయితే కులాంతర వివాహాలు ఇప్పటికీ అవాంఛనీయంగా పరిగణించబడుతుండడంతో జనాభాలో కేవలం 5 శాతం మాత్రమే కులాంతర వివాహాలకు సిద్ధపడ్డారని ఇదే సర్వేలో వెల్లడి అయింది. యూనివర్సిటీ ఆఫ్ మేరీ లాండ్ కూడా ఈ సర్వే నిర్వాహకుల్లో ఒకటి కావడం గమనార్హం.
సర్వే వివరాల ప్రకారం గ్రామాలలో 30 శాతం మంది పట్టణాలలో 20 శాంత మంది కుటుంబాలు తాము అంతరానితనం పాటిస్తున్నామని చెప్పాయి. ఈ లెక్క ఒకవైపు నుండి మాత్రమే పరిమితం. అనగా అంతరానితనం పాటించేవారు చెప్పిన వివరాలపై ఆధారపడిన లెక్క. అంతరానితనం అనుభవించేవారిని అడిగితే వారు ఏయే చోట్ల, ఏయే సందర్భాల్లో, ఏయే మారు రూపాల్లో వివక్ష ఎదుర్కొంటున్నది చెప్పేవారు. ఆ విధంగా అంతరానితనం పాటించే కుటుంబాలు ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
IHDS సర్వే అతి పెద్ద సర్వేగా తెలుస్తున్నది. దేశవ్యాపితంగా ఇటువంటి వివరాలు సేకరించిన సర్వేలలో ఇదే అతి పెద్దది, ప్రధమం అని కూడా తెలుస్తోంది. ఆదాయ వర్గాలు, కులాల వారీగా దేశవ్యాపితంగా 42,000 మందిని ఇంటర్వ్యూ చేసి ఆ వివరాలను సర్వే క్రోడీకరించింది. సర్వే వివరాలు పూర్తిగా ఇంకా వెల్లడి కావలసి ఉందని, అయితే కొన్ని భాగాలను సర్వే సంస్ధలు తమతో పంచుకున్నాయని ది హిందు తెలిపింది.
కులాంతర వివాహాలు, అంతరానితనం గురించిన వివరాలను సేకరించిన NCAER సంబంధిత ప్రశ్నలను నేరుగానూ, పరోక్షంగానూ అడగడం ద్వారా వాస్తవ సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించింది. మీరు అంటరానితనం పాటిస్తారా? అని అడగడంతో పాటుగా కింది కులం వారు తమ వంటగదిలోకి రావడానికి లేదా తమ పాత్రలను ఉపయోగించడానికి అనుమతి ఇస్తారా అని సర్వే చేసినవారు అడిగారు. తద్వారా అంతరానితనం తీవ్రతను సర్వే అంచనా వేసింది.
గ్రామాలలో మూడు వంతుల మంది తాము అంతరానితనం పాటిస్తున్నట్లు చెప్పారని సర్వే తెలిపింది. పట్టణాలలో వారి సంఖ్య ఐదో వంతుగా నమోదయింది. కులాల వారీగా చూస్తే అంతరానితనాన్ని అత్యధిక సంఖ్యలో పాటిస్తున్నది బ్రాహ్మణులే. గ్రామాలలోని బ్రాహ్మణులలో 62 శాతం మంది ఇప్పటికీ అంతరానితనం పాటిస్తున్నారు. పట్టణాల్లో నివసించే బ్రాహ్మణులలో 39 శాతం మంది అంతరానితనం పాటిస్తున్నారు. బ్రాహ్మణుల తర్వాత ఇతర వెనుక బడిన కులాల వారు అత్యధికంగా అంతరానితనం పాటిస్తుండగా ఆ తర్వాత స్ధానం బ్రాహ్మణేతర అగ్రకులాల వారిది. దీనిని బట్టి చేతి వృత్తుల వారిలో (OBC) కంటే, వ్యవసాయ కులాల్లో అంతరానితనం తక్కువగా ఉన్నదని భావించవచ్చు.
కులం, అంతరానితనం లకు సంబంధించిన ఈ సర్వే అత్యంత సంక్లిష్టమైన వ్యవహారమని సర్వే సంస్ధలు అభిప్రాయ పడ్డాయి. 15-49 సంవత్సరాల మధ్య వయసుగల వివాహిత మహిళలను వారిది కులాంతర వివాహమా అని అడగగా 5.4 శాతం మంది మాత్రమే ‘అవును’ అని సమాధానం ఇచ్చారని సర్వే నివేదిక తెలిపింది. ఈ అంశంలో గ్రామాలకు, పట్టణాలకు పెద్ద తేడా లేదని, గ్రామాల కంటే పట్టణాలలో స్వల్పంగా మాత్రమే ఎక్కువ కులాంతర వివాహాలు జరిగాయని తెలిపింది. 2004-05 లో జరిపిన IHDS లో వచ్చిన ఫలితాలకూ ఇప్పటి సర్వే ఫలితాలకు పెద్దగా తేడా లేదని కూడా సంస్ధలు తెలిపాయి. గత 10 సంవత్సరాలలో కుల భావనలలో తేడా ఏమీ రాలేదని దీని ద్వారా స్పష్టం అవుతోంది.
రాష్ట్రాల వారీగా చూస్తే కులాంతర వివాహాలు మధ్య ప్రదేశ్ లో (1 శాతం) అత్యంత తక్కువగా నమోదయ్యాయి. వెనుకబడిన రాష్ట్రాలుగా పరిగణించే బిమారు రాష్ట్రాలలో మధ్య ప్రదేశ్ ఒకటి కావడం గమనార్హం. నిజానికి బిమారు వర్గీకరణ చాలా పాతకాలం నాటిది. దాదాపు పాతిక, ముప్ఫై యేళ్ళ నాటి సామాజిక వెనుకబాటు పరిస్ధితి మధ్య ప్రదేశ్ లో ఇప్పటికీ కొనసాగుతోందని తాజా IHDS సర్వే ద్వారా తెలుస్తున్నది. కాగా గుజరాత్ లో అత్యధిక కులాంతర వివాహాలు (11 శాతం) నమోదయ్యాయి. విచిత్రంగా బిమారు రాష్ట్రాల్లో మరొక రాష్ట్రం బీహార్ లోనూ కులాంతర వివాహాలు 11 శాతం నమోదయ్యాయని సర్వేలో తేలింది. వెనుకబాటుతనానికి-కులాంతర వివాహానికి మధ్య ఉన్న లంకె ఎక్కడ తప్పిందన్న సవాలును బీహార్ విసిరినట్లయింది. (బహుశా ఈ తప్పిన లంకెను ఆర్ధిక వర్గంలో వెతుక్కోవచ్చు!)
“భారతీయ సర్వేలు అడిగే ప్రశ్నల్లో కులానికి సంబంధించిన ప్రశ్నలు అత్యంత సంక్లిష్టమైనవి. ఈ రోజు ‘నేను బనియా ను’ అని చెప్పిన వ్యక్తి రేపు ‘నేను మోధ్ బానిక్ ను’ అని చెప్పవచ్చు; పైగా రెండూ కరెక్టే కావచ్చు కూడా” అని NCAER కి చెందిన సీనియర్ ఫెలో సోనాల్దే దేశాయ్ చెప్పారని ది హిందు తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ మేరీ లాండ్ లో సోషియాలజీ ప్రొఫెసర్ అయిన దేశాయ్ IHDS కు నేతృత్వం వహించారు. (ఈ బ్లాగర్ కి తెలిసిన ఓ మహిళ తన తల్లిగారికి చెందిన వెనుకబడిన కులం కంటే తన తండ్రికి చెందిన వ్యవసాయ అగ్రకులాన్ని తన కులంగా చెప్పుకుంటారు. అయితే ఇది వ్యవహారంలో. చదువు విషయానికి వచ్చేసరికి తాను బి.సిని అని చెప్పుకుంటారు. తద్వారా బి.సి రిజర్వేషన్ ను ఆమె పొందుతారు. ఈ మహిళ విషయంలో రెండు సమాధానాలూ నిజమే కదా!)
భారత దేశంలో కులాలు బలహీనపడ్డాయని, అంతరానితనం ఏదో మేరకు నశించిందని కొందరు విప్లవ పార్టీల నేతలు కూడా చెప్పడం కద్దు. కళ్ల ఎదుట కనిపించే కుల తత్వానికి వ్యవస్ధాగత కారణాలు వెతకవలసి ఉండగా అంతరించినట్లుగా కనపడే కుల తత్వానికి కారణాలు వెతకడం పైనే ఎక్కువ దృష్టి పెట్టడం అంటే సమాజంలోని వాస్తవ స్ధితిగతులను బట్టి ఒక నిర్ణయానికి రావడం కంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయానికి అనుగుణంగా సమాజం గురించి వ్యాఖ్యానం చేయడమే అవుతుంది. ఇటువంటి దృష్టి కోణం సమాజాన్ని మార్చడం అటుంచి కనీసం జనాన్ని కదిలించడంలోనూ విఫలం అవుతుంది.
వెనుకబాటుతనానికి-కులాంతర వివాహానికి మధ్య ఉన్న లంకె ఎక్కడ తప్పిందన్న సవాలును బీహార్ విసిరినట్లయింది-సర్, వీలైతే దీనిని వివరిస్తారా?
ఆర్థికంగా వెనుకబడిన సమాజంలో నమ్మకాలు కూడా వెనుకబడి ఉంటాయి. నేను నాకు పరిచయమైనవాళ్ళకి వాళ్ళది ఏ ఊరో అడుగుతాను, వాళ్ళ వృత్తి ఏమిటో కూడా అడుగుతాను. కానీ కులం పేరు, ఇంటి పేరు అడగను. పల్లెటూరివాళ్ళు అయితే అలా అడుగుతారు.
I wonder why people every time after Brahmins? my direct question to you. will you call a brahmin for performing rituals if he is a boozer?? or found as a non vegetarian???? is it ok if he perform poojas and other rituals by wearing jeans and T shirts having cigar in one hand.?????
for imbibing the culture Sanathana Dharama (not Hindhuism) among the common public in fact the brahmins were kept a side to learn the vedas, rituals, and other poojas. (believing or not believing depends on each and every individual) for such activities they have to learn sometimes through out their life time.
I personally experienced many a times piece of mind when i listened to Brahmasri Changanti Koteswara rao gari speeches. to get that knowledge perhaps he might have detained himself (became untouchable to society) in his study room for years together.
in fact today brahmins were treated by society as untouchable in government sector, jobs, EAMCET, ICET, and other competitive exams, promotions, though they prove themselves.
most of the brahmins families are in very poor stage. girls are not ready to marry the persons who learned rituals. most of the brahmins are leaving their KULAVRUTTHI.
every body encourages inter caste marriages on the stage. but i personally experiencing the difference of culture, brought up, language, traditions, and problems with it as my wife belongs to Maharastra and i belong to Telugu. though the caste is same. imagine the problems if it is inter caste? its a life and not a play which ends in hours where everybody claps if you perform on stage.
iam not against the inter caste marriages but certainly there will be difference between the brought up as there will be difference in eating habits, drinking habits way of performing the festivals. culture and traditions. which creates difference of opinions between couples, which ultimately leads to divorce. its may not apply to everybody who go for inter caste marriage. but iam talking about the possibilities.
i dont think so the still people following untouchability in towns or villages. might be some orthodox families remained here and there may follow but most of the brahmins changed their mind set and treating other are equal, but may not going for inter caste marriage and i will not also encourage as it has its own problems.
might other upper caste people have this caste feelings but brahmins are not alone culprits. in fact they are scapegoats.
తప్పక చదవండి…
అక్బరుద్దీన్ ఒవైసీకి నేను మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. శరీరంలో స్థిరపడి దానిని నయం చెయ్యాలని కూడా గ్రహించని, చెయ్యనక్కరలేదని భావించిన అలసత్వానికి గుర్తుగా వికటించి బయటపడిన కేన్సర్ అక్బరుద్దీన్ ఒవైసీ. ఇప్పుడు బయటపడినా చికిత్సకి లొంగని చావుకి గుర్తు ఈ ‘కేన్సర్’. అయితే అంత దయనీయమైన దశలో ఉన్నదా హిందూదేశం? హిందూమతం?
మన మతానికి విస్తృతి ఎక్కువ. ఔదార్యం ఎక్కువ. జాలి ఎక్కువ. సంయమనం ఎక్కువ. అన్నిటికీ మించి అలసత్వం ఎక్కువ. బట్టల్లేని సీతమ్మనీ, నగ్నంగా నిలిపిన భరతమాతనీ చూసికూడా తన తల్లికి బట్టలు తొడిగిన ఎమ్.ఎఫ్.హుస్సేన్‌గారి కళాస్వేచ్ఛని నెత్తికెత్తుకునే కళాతృష్ణ మనది. ‘మతం’ గురించి ఎవరు మాట్లాడినా, దేవుడిని వెనకేసుకొచ్చినా ‘హిందుత్వ’మని కత్తులు దూసే సెక్యులర్ కవచాలు తొడుక్కున్న ఆత్మవంచన చేసుకునే అవకాశవాద పార్టీలున్న దేశం మనది. మనం నలుగురు ముస్లిం పెద్దల్ని రాష్ట్రపతుల్ని చేసుకున్నాం. ఇద్దరు ముస్లింలను ఉపరాష్ట్రపతుల్ని చేసుకుని గౌరవించుకున్నాం. మరే ముస్లిం దేశంలోనూ ఏ హిందువూ ఏ విధమయిన పదవిలోనూ నిలిచిన దాఖలాలు లేవు. నెదర్లాండులో తమ దేవుడిని వెక్కిరించే కార్టూన్లు వేస్తే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఆస్తులూ, ఇళ్లూ తగలెట్టారు. తమ దేవుడిని దూషించిన ముస్లిం రచయితనే చంపాలని మరో దేశపు మతగురువు శాసిస్తే -యిప్పటికీ సాల్మన్ రష్దీ రహస్యపు బతుకు బతుకుతున్నాడు. మనం చిత్రగుప్తుడిని, యముడినీ (రెండు ‘యముడికి మొగుడు’ సినీమాల్ని చూసి సంతోషించాం) శ్రీకృష్ణుడినీ, నారదుడినీ ఆటపట్టిస్తే ప్రేక్షకులు వందరోజులు చూసి ధన్యులవుతారు. బ్రాహ్మణ్యాన్ని గర్హించి -వాళ్ల చేత పేడ తినిపిస్తే -బ్రాహ్మణతరులు కిల కిల నవ్వుకుంటారు. ముస్లింలలో అలాంటి పరాచికాలు ఎప్పుడయినా ఎవరయినా చేసిన దాఖలాలు ఉన్నాయా? చేసి బతికి బట్టకట్టగలరా?
ఈ దేశంలో ముస్లిం సోదరులంతా ఒకటి. ఎక్కడ ఉన్నా ఒకటిగా ఓటు వేస్తారు. అయిదేళ్ల ఆడపిల్లకి బురఖా వేస్తారు. అరవైయ్యేళ్ల ముసలాయనా టోపీ పెడతారు. తమని కాదంటే పదేళ్ల పిల్లనీ కాల్చి చంపుతారు. మతం పట్ల గౌరవం, మరొక పక్క భయం – వారిని సంఘటిత పరుస్తుంది.
మనదేశంలో మనం మహారాష్ట్రులం, తమిళులం, బెంగాళీలం, వెనుకబడిన వారం, ముందుబడినవారం, కులాలవారం, రెడ్లం, కమ్మవారం, కాపులం, బ్రాహ్మణులం, శ్రీవైష్ణవులం, శైవులం, మాలలం, మాదిగలం -మనం సామూహిక ప్రతిపత్తిని ఏనాడూ ప్రకటించుకోము. ఎవరూ ఎవరిమాటా వినరు. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరయినా ఎప్పుడయినా ముస్లింలకు ప్రాతిపదిక మతం. మనకి? వ్యక్తిగత ప్రయోజనం, స్వలాభం, డబ్బు, పదవి, ఎదుటివాడి పతనం -మరేదో, మరేదో.
హిందూదేశంలో ముస్లింల ‘హజ్’ యాత్రకి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రపంచంలోని 52 ముస్లిం దేశాలలో ఏ దేశంలోనూ ఈ ఉపకారం లేదు. శుభం. మరి భారతదేశంలో కాశీ, గయ, కేదార్, బదరీ, వైష్ణోదేవి యాత్రలకు మన ప్రభుత్వం ఆర్థిక సహాయం చెయ్యదేం? అడిగే నాధుడేడీ? వాళ్ల స్వార్దాలకే వ్యవధి చాలకపోయె. మన చిన్న పొట్టకు శ్రీరామరక్ష. మన కులానికి మేలు కలిగితే చాలు. మొన్న విశాఖపట్నంలో ఓ స్వామీజీని బహిరంగంగా కొట్టారు. కారణమేదయినా ఈ పనిని ఏదీ? ఒక ‘ఇమామ్’కి దమ్ముంటే చేయమనండి. మనది భారతదేశం. పరాయి పెద్దని అవమానించమనడం ఉద్దేశం కాదు. మన మర్యాదకి నీడలేదని చెప్పడం ఉద్దేశం.
అక్బరుద్దీన్ చేసిన ప్రసంగం ఏ హిందువయినా చేసి బతికి బట్టకట్టగలడా? ముస్లింలు మాట దేవుడెరుగు. ఔదార్యం కట్టలు తెంచుకునే మన సెక్యులర్ వీరులు ‘హిందుత్వం’ పేరిట గొంతుచించుకోరా? అక్బరుద్దీన్ అరాచకాన్ని ఉత్తరప్రదేశ్‌లో మరో ముస్లిం నాయకుడు సమర్థించారు! హిందూ దేశంలో ముస్లింల కిచ్చిన ప్రత్యేక స్థానం మరే ముస్లిం దేశంలోనయినా హిందువుల కిచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ దేశంలో 15 శాతం మైనారిటీ వర్గాన్ని 85 శాతం మెజారిటీ వర్గం నెత్తిన పెట్టుకుంటోంది.
కరుణానిధికి రామాయణం కట్టుకథ. ఆయన మన ముఖ్యమంత్రి. దేవుడిని నమ్మని, నమ్మకం లేదని బల్లగుద్దే ఏ ముస్లిమయినా ఏ ముస్లిం దేశంలో నయినా నాయకుడు కాగలడా?
ఈ విచిత్రాన్ని ఎవరయినా గమనించారా? గాజాలో అరబ్బులు క్షేమంగా లేరు. పాకిస్తాన్‌లో వందలమంది ముస్లింలను వారే చంపుకుంటున్నారు. లిబియాలో, మొరాకోలో, ఆఫ్గనిస్థాన్‌లో, సిరియాలో, లెబనాన్‌లో, ఈజిప్టులో, ఇరాక్‌లో, యెమెన్‌లో ముస్లింలు హింసకు బలి అవుతున్నారు. ఆస్ట్రేలియాలో, ఇంగ్లండులో, ఫ్రాన్స్‌లో, ఇటలీలో, జర్మనీలో, స్వీడన్‌లో, అమెరికాలో, నార్వేలో వారు క్షేమంగా, హాయిగా ఉన్నారు. అయినా ఆ దేశాల్లో ముస్లింలు పై దేశాల్లో ముస్లింలుగా ఉండాలనుకుంటున్నారు.
మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో ముస్లింలు మైనారిటీలుగా రాయితీలు పొందుతున్నారు. శుభం, మరి ఈ దేశంలోనే జమ్ము కాశ్మీర్‌లో, మిజోరంలో, నాగాలాండ్‌లో, అరుణాచల్‌ప్రదేశ్‌లో, మేఘాలయలో మైనారిటీలయిన హిందువులకు ఆ రాయితీలు యివ్వడం లేదేం?
ముస్లిం మత కార్యకలాపాలను, వారి వ్యవహారాలను చూసే వక్ఫ్ బోర్డులున్నాయి. వాటి ఆదాయాన్ని ఈ దేశంలో ఎవరయినా ముట్టుకోగలరా? పదిమంది దర్శించే ప్రతి హిందూ దేవాలయ పరిపాలనా, ఆదాయం -రాజకీయ నాయకుల, వారి ప్రతినిధుల చేతుల్లోకి పోయిందేం?
ఎవరయినా మనల్ని తిట్టినప్పుడు -మనం హిందువులం. ఎవరూ తిట్టనప్పుడు -మనల్ని మనమే తిట్టుకునే స్వదేశీయులం. అదీ మన ప్రతాపం.
‘మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్!’ అన్నాడు గిరీశం. అక్బరుద్దీన్ వంటి పెద్దలు ”వీళ్లంతా ఉత్త వెధవాయిలోయ్!” అని నవ్వుకుని ఉంటారు. అందుకే రొమ్ము విరుచుకుని -ప్రేక్షకులు మురిసిపోయేలాగ -హిందూ దేశంలో హిందువుల్ని తిట్టి -తీరిగ్గా లండన్ వెళ్లి కూర్చున్నారు. ఇక్కడ మన వీరంగం చూసి -అక్కడ పేపర్లలో చదువుకుని నవ్వుకుంటూ ఉండి ఉంటారు.
కులాల పేరిట, వర్గాల పేరిట -కిష్టిగాడు, రాములు వెధవ, సీతి, లచ్చి స్థాయికి మతాన్ని యీడ్చిన గౌరవనీయులైన హిందువులు -మొదట ఇల్లు చక్కబెట్టుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. తమలో ఏ లోపాలున్నా ‘మతం’- భేషరతుగా -నయానికో, భయానికో -తమకి గుర్తింపునీ, బలాన్నీ, సామూహిక ప్రతిపత్తినీ యివ్వగల శక్తి అని ముస్లింలు నమ్ముతున్నారు. మనం ఏనాడయినా -ఎవరో మనని దుయ్యబట్టిన యిలాంటి అరుదయిన సందర్భాల్లో ప్రథమ కోపాన్ని చూపడం తప్ప -యిలాంటి సంఘటిత శక్తిని ప్రదర్శించామా?
అక్బరుద్దీన్ తప్పు చేశాడా? ఇప్పుడు క్రైస్తవ మతాన్ని సహాయం తెచ్చుకుంటాను. మీ మతాన్ని, మీ విలువల్ని, మీ విశ్వాసాల్ని, మీ ఆచారాల్ని గౌరవించే మొనగాడెవరయినా ఉంటే మొదటి రాయి వెయ్యండి.
నా ఉద్దేశంలో అక్బరుద్దీన్ ప్రసంగం మేలుకొలుపు. పేడ తినే బ్రాహ్మణ్యం, యముడిని వెక్కిరించే సినిమాలూ, స్వజనాన్ని గౌరవించుకోలేని స్వార్థం, వేలంటీన్ వేలం వెర్రికి విర్రవీగే సామూహిక పైత్యం, దేవుడు, దేవాలయాలు ‘హిందుత్వం’ అని రాజకీయ ప్రయోజనాలకు గొంతు చించుకునే అవకాశవాద పార్టీలూ మతానికి విలువని పెంచవు. అక్బరుద్దీన్ వంటి వారి నోటికి బలి అవుతాయి. అంతకంటే భయంకరమైన విషయం ప్రేక్షకుల ప్రశంస అనే హెచ్చరిక.
BY GOLLAPUDI MAARUTHI RAO GARU (FILM ACTOR, COLUMNIST)
గోపీనాధ్ గారూ మీరు మౌలికంగా బ్రాహ్మణులు సమాజంలో అత్యున్నతులు అన్న నమ్మకాన్ని సమర్ధిస్తున్నారు. ఈ ఒక్క అంశం చాలదా, దేశంలో కులాలు ఇంకా కాలకూట విషం ఎందుకు చిమ్ముతున్నాయో తెలియడానికి!
కులాల మధ్య తేడాను కూడా సంస్కృతుల మధ్య తేడాగా చెబుతున్న మిమ్మల్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఓ పక్క సామూహిక ఉమ్మడితనం కలిగి ఉండలేకపోతున్నామని బాధపడుతున్నారు, మరో పక్క ఒకే ఊరిలో నివసించే భిన్న కులాలది భిన్న సంస్కృతులు అని తీర్మానించేస్తున్నారు. ఒకే అంశాన్ని పొగుడుతున్నారు, తెగుడుతున్నారు. ఈ తేడా ఏమిటో మొదట తేల్చుకోవాలి మీరు.
మీ వ్యాఖ్యానంలో ఈ భిన్న ధోరణి చూశాక ఆర్టికల్ లోని అంశాలు బ్రాహ్మణుల వెంట పడుతున్నట్లు అనిపించడంలో ఆశ్చర్యం అనిపించడం లేదు. భారత సమాజంలోని కొన్ని వాస్తవాలను సర్వే వెల్లడి చేసింది. ఆ వాస్తవాలు (ఆ కొందరు) బ్రాహ్మణులను తూలనాడుతున్నట్లు మీకు అనిపిస్తే ఆ తప్పు సర్వేది అవుతుందా లేక (కొందరు) బ్రాహ్మణులది అవుతుందా? ఆలోచించండి!
Check this: http://telugu.greatandhra.com/politics/political-news/15-years-mana-kulame-vundali-57180.html
గోపీనాధ్ రావు గారు:
అసలు మనం సెక్యులర్ అన్న అభిప్రాయానికి ఎలా వచ్చారో అర్ధం కావడంలేదు నాకు. మీరు కనీసం ఒక ప్రభుత్వకార్యాలయాన్ని ఎప్పుడైనా పనిమీద visit చేసినా, లేదా ఒక ఎర్రబస్సు ఎక్కినా అక్కడుండే దేవుళ్ళపటాలు మన సెక్యులరిజాన్ని వెక్కిరిస్తుంటాయి. శాటిలైట్లను పంపేముందు నమూనాను తిరుపతిలో చూపించి (వెంకన్న approval పొదాక) మాత్రమే వాటిని పంపించగల సెక్యులర్ స్థాయిలో ఉన్నాము. దేశాధ్యక్షుడు ఒక మతపెద్ద పాదాలపై పడే అద్భుత దృశ్యాన్ని ఒక్క సెక్యులర్ దేశంలోనే చూడగలం. ఒక వైజ్ఞానిక సంస్థ ప్రారంబోత్సవంలో, దేశాధినేత మతగ్రంధాల్లోని కట్టుకధలను వల్లెవేసి, మనం ఇతరులకన్నా పుడింగులమని బీరాలుపోతే, మనలో ఎంతమంది సెక్యులరిజ ప్రేమికులు దాన్ని ఖండించారు? హిందూమతాన్ని ఉధ్ధరించగలడన్న ఆశతో మనదేశాధినేతనికి ఒక దేవుని అవతారం స్థాయిలో image సృస్టిస్తున్నప్పుడు మీలాంటి నిక్కమైన హిందువులు ఎక్కడ దాక్కుంటారు సార్? ఇస్లాం ఒక మతం. హైందవం ఒక జీవ విధానం. ఆ నిర్వచనన్ని అంగీకరించి, హైందవం విస్తృతిని గూర్చి గొప్పలు చెప్పుకోవడంలో చూపించిన ఉత్సుకత దానిలోని లోపాలు గుర్తెరగడంలో ఎందుకు చూపలేక పోతున్నారు మీరు? అస్పృశ్యత ఒక అగ్రకులపు అభిజాత్యపు idealogy (కాలక్రమేణా ఆ దురాచారం నిమ్నకులాలకూ పాకింది) ఆ అగ్రకులాన్ని ‘భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మ’ అంటూ ఎందుకు పవిత్రీకరించి, వారిమీద ఏ ఒక్క విమర్శజరిగినా, దాన్ని మొత్తం భారతీయతమీద జరిగిన దాడిగా వారు చేస్తున్న ప్రచారంలో మీరెందుకు భాగస్వాములౌతున్నారో తెలుసుకోవచ్చా?
ఓవైసీని మించిన విషాన్ని చిమ్మేవారు, science, rationalism, common senseల కన్నా హైందవమే ఉన్నతమని నమ్మబలికే ప్రబుధ్ధులూ బ్లాగులోకంలోనే ఉన్నారు. వారిని నాకు తెలిసిన నిక్కమైన హిందువు ఎవ్వరూ ఖండించలేదు. ఎందుకంటారు? బ్లాగుల్లో పరిస్థితి ఎలా ఉందంటే నిజాన్నికూడా హిందువుల మనోభావాలు గాయపడని రీతిలో water down చేసి చెప్పాల్సిన రీతిలో ఉంది. మహమ్మద్ పైని కార్టూనులను సమర్ధించగలిగినమీరు అభ్యుదయ రచయితలు హిందూదేవతలపై చేసిన విమర్శలను హిందువులు ఎందుకు సహించలేకపోయారో చెప్పగలరా? అంతెందుకు ఇదే బ్లాగరు గతంలో మొత్తుకున్నట్లు అతనిని అత్యంత జుగుప్సాకరంగా దూషించారే, అది ఏమతం నేర్పిన సంస్కారమో, అది ఏవిధంగా నెదర్లాడు కార్టునులకు ప్రతీకార్త్మకంగా అల్లర్లు నెరపినవారి సంస్కారానికి భిన్నమైనదో చెప్పగలరా? తస్లీమా నస్రీన్ గారిని ఆదరించడంలోని సహృదయత, అరుంధతీ రాయ్‌నో, అభ్యుదయ రచయితలనో గౌరవించడంలో చూపించడంలో ఎందుకు విఫలమౌతుంటారో మీరు వివరించగలరా?
మీరుదహరించిన హజ్ యాత్రల సబ్సిడీలు (ఆ సబ్సిడీ బిచ్చం అఖ్ఖర్లేదని ముస్లిముల్లోని ఆలోచించగలిగినవారు గతంలో ఒకసారి చెప్పారు. అయినా మన ప్రభుత్వాలు ఆపనిని మానుకోవు) , ముస్లిములపై అధికప్రేమలూ ముస్లిముల్ని మతమౌఢ్యంలో ముంచి ఉంచి, ఆపైన వారిని అన్ని సమస్యలకూ కారణంగా చూపించే ఒక shrewd ప్రయత్నం అంటాననుకోండి, దానికి మీరేం సమాధానం చెప్పగలరు?
మన సెక్యులర్ దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలసొమ్ముతో ఒక జ్యోతిష్యుణ్ణి మేపుతుంది. ఎందుకలా అని ఎప్పుడైనా ఆలోచించారా గోపీగారు? ప్రజలసొమ్ముతో వాస్తు (అనబడే హిందువులకు మాత్రమే పరిమితమైన ఒక మూఢాచారం) పేరున ప్రభుత్వం లక్షలు ఖర్చుచేస్తుంది. ఎందుకని ఎప్పుడైనా ప్రశ్నించారా? సినిమాల్లో బ్రాహ్మణూల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మాత్రమే అది ఒక రాష్ట్రస్థాయి వివాదమయి, అది హైందవ సాంప్రదాయలపై దాడిగా వ్యక్తీకరించబడుతుంది. ఎందుకలా అని ఎప్పుడైనా ప్రశ్నించారా రావుగారూ? బ్రాహ్మణ విలువలూ, సాంప్రదాయాలూ, ఆచారాలే “(తెలుగు) సంస్కృతి”గా ప్రచారం చేయబడ్డపుడు ఎందరు ప్రశ్నించారండీ?
(Some spelling/typing mistakes are corrected by me in this comment -Visekhar)
హిమగిరి గారు, ఆర్టికల్ లోనే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది.
కులం వెనుకబాటుతనానికి సూచిక. కులాంతర వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో/రాష్ట్రంలో సమాజం సాపేక్షికంగా పురోగమించిందని భావించవచ్చు. ఇది ఒక అవగాహన.
బిమారు గ్రూపు అంటే బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్ లు. ఇవి దేశంలో బాగా వెనకబడ్డ రాష్ట్రాలుగా ప్రతీతి.
మధ్య ప్రదేశ్ ఈ గ్రూపులో ఉంది కనుక అక్కడ కులాంతర వివాహాలు తక్కువగా ఉండడం పై అవగాహనలో ఇమిడిపోతుంది. కానీ ఇదే గ్రూపులో ఉన్న బీహార్ లో కులాంతర వివాహాలు అత్యధికం (11 శాతం) నమోదయ్యాయి. బీహార్ వెనకబడింది కనుక అక్కడ కూడా కులాంతర వివాహాలు తక్కువగా ఉండాలి. కానీ ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా బీహార్ పై అవగాహనకు సవాలు విసిరిందని చెప్పాను.
ఈ దేశంలో సొంత ఆస్తి విధానం ఒక స్టేటస్ గా చలామని అయినంత వరకు కులం కూడా ఒక స్టేటస్ సింబల్. ఎవరెంత లిబరల్ గా మాట్లాడినా, కుల ఉన్నతిని వదులుకుంటారనేది నీటి మీద రాతలే. కులం వల్ల ఆర్ధిక లాభం లేకపోయినా, కులాన్ని వదులు కోవడమంటే తన వ్యక్తిత్వాల్ని వదులు కోవడంగా భావిస్తారు. ఎవరిక్కడ స్వంత ఆస్తిని వదులుకుంటారు. సమాజ వర్గీకరణలో పైస్తాయిని వదులుకుంటారు. సాంఘిక వర్గీకరణలో కుల పరంగా స్థాయి భేదాలున్నంతవరకు కుల గౌవరవం అంతరించదు. ఆస్తిలేని వాడికి కులమే ఒక అంతస్తునిస్తుంది దాన్ని చూస్తూ చూస్తు వదులు కొవడంటే తన్ను తాను పణంగా పెట్టడమే? అంతటి త్యాగదనులున్న దేశమా ఇదీ?
మనిషి ఉధయ లేచినది మొదలు ప్రతి క్షణం తన ఉన్నతిని చాటుకుంటూంటాడు. ఒక వ్యక్తి వ్యక్తిగా గా చలమని అయ్యేసమాజకాదు మనది. మొదటకులంతో, ఆకులవల్ల ఏర్పడిని వంశగౌరవంతో, ఆ రంగు వల్ల వచ్చిన పేరు ప్రతిష్టలతో, ఈ పేరు ప్రతిష్టల ఏర్పడిన అబద్దపు మేధో ముధ్ర, దాని చలామని వల్ల ఆర్ధిక వెసులు బాటుతనం, వీటినంటివల్ల వచ్చిన సామాజిక అంతస్తు. దీని వాస్తవ రూపం అందరికి తెలుసు. పై స్థాయిలో ఉన్న ఒక ఉన్నతోధ్యోగి,, అర్ హత ఉన్నా లేక పోయినా తన కులం గాల్లనే ఉధ్యోగంలో చేర్చుకుంటాడు.వాడు వాడి కులం గాల్లనే తన కింది స్తాయి ఉధ్యోగులను చేర్చుకుంటాడు. అన్ని అబద్దాలతో వారు చలా మని అవుతూ కింది కులాల వారికి మేదోస్తాయి ఉండదని ఒక అబద్దపు ప్రచారం. మరీ ముఖ్యంగా ఆర్ర్ధి సంస్కరణలు, వెదేశి పెట్టు బడులకు దేశ ఆర్ధ్క గేత్లను బార్లా తెరిచిన తరువాతా కుల రక్కసీ దాని కోరలు చాస్తూ వస్తుంది. దీనికంతకు కారణం తరతరాలుగా దేశాన్ని కుల మౌడ్యంలో ముంచిన భ్రాహ్మణ భావ జాలం. కులం మhhూ వటవృక్షమై ఈ దేశంలో వేళ్లుకొవడానికి కారణం ఎవరు వద్దన్న కాదన్నా భ్రహ్మనిజమే. మరి వారి వెంట పడకుండా ఎవరి వెంట పడత్తరు?