వివాహాల్లో లైంగిక హింస సర్వ సాధారణం -సర్వే


వైవాహిక జీవితంలో జరుగుతున్న అత్యాచారాలను గుర్తించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కోర్టులే కాదు, పార్లమెంటు సభ్యులు కూడా వైవాహిక జీవితంలో అమలయ్యే బలవంతపు లైంగిక జీవనాన్ని గుర్తించడానికి నిరాకరిస్తారు. వివాహంలో లైంగిక హింసను గుర్తించడం అంటే భారత దేశ సంస్కృతీ సాంప్రదాయాలను అగౌరవపరచడమే అని భావించే మహిళా ఎం.పిలు కూడా మన చట్ట సభల్లో కూర్చొని ఉన్నారు. అలాంటి వారు చివరికి మహిళా కమిషన్ లో సైతం ఆసీనులై ఉండడం ఓ విపత్కర పరిణామం. భారత దేశంలో వైవాహిక జీవితంలో సర్వ సాధారణం నిరాకరించడానికి వీలు లేనంత తీవ్ర స్ధాయిలో ఉన్నదని అంతర్జాతీయ, జాతీయ సంస్ధల సర్వే ద్వారా స్పష్టం అయింది.

ఇండియాలో ఇలాంటి కుటుంబ స్ధాయి సర్వే జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. అయితే ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితమై జరగడం ఒక మైనస్. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ వుమెన్ (ICRW), యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) సంస్ధలు నిర్వహించిన ఓ సర్వేలో భారత దేశంలో వివాహ సంబంధంలో ఉన్న స్త్రీలు ఎదుర్కొంటున్న దారుణ పరిస్ధితిని వెల్లడి చేసింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) విభాగం తాను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్వేలను వాయిదా వేస్తూ పోవడం వల్ల ఇండియాలో వైవాహిక జీవితంలో సంబంధాల లక్షణాలను వివిధ కోణాలలో ఎప్పటికప్పుడు వెలికి తీసే అవకాశం లేకుండా పోయింది.

ప్రస్తుత సర్వే 8 రాష్ట్రాలలో మాత్రమే జరిగింది. అవి: పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్ధాన్, గుజరాత్, మహా రాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా. మొత్తం 9,205 మంది పురుషులను, 3,158 మంది స్త్రీలను పరిశోధకులు ఇంటర్వ్యూ చేశారు. వీరందరూ 18-49 సం.ల వయసు మధ్య వారే. కులం, మతం, ఆదాయ వర్గం లాంటి వైరుధ్యాలకు అతీతంగా ఈ సర్వే జరిగింది. అనగా ఈ సర్వేలో కుల పరమైన, మతపరమైన, వర్గపరమైన తేడాలను చూడలేము.

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ సర్వే చివరిసారి జరిపిన సర్వే ప్రకారం తమపై లైంగిక హింస జరుగుతోందని నివేదించిన మహిళలలో అత్యధికులు వివాహితులే. తమపై అత్యాచారం జరిగిందని NFHS సర్వేయర్లకు చెప్పిన మహిళల్లో కేవలం 2.3 శాతం మంది మాత్రమే భర్త కాకుండా ఇతరులు బలవంతంగా లైంగిక అత్యాచారం చేశారని చెప్పారని సర్వేను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. NFHS సర్వే వివరాలను కింది గ్రాఫ్ లో చూడవచ్చు.

 Sexual violence in India -NFHS

ICRWA-UNFPA వాళ్ళు జరిపిన అధ్యయనంలో అడిగిన ప్రశ్నలు కింది విధంగా ఉన్నాయి.

1. మీ భార్య/జీవిత భాగస్వామి ని, ఆమెకు ఇష్టం లేకపోయినా, లైంగిక క్రియలో పాల్గోమని బలవంతం చేశారా?

2. ఆమెకు ఇష్టం లేదని మీకు తెలిసినా సరే మీ భార్యను గానీ స్నేహితురాలిని గానీ మీ భార్య/జీవితభాగస్వామి/స్నేహితురాలు (girl friend) కాబట్టి లైంగిక క్రియలో పాల్గొనాల్సిందే అని నమ్ముతూ బలవంతంగా పాల్గొన్నారా?

3. ఆమెకు ఇష్టం లేకపోయినా మీ భార్య/జీవిత భాగస్వామిని పోర్నోగ్రఫీ చూడమని బలవంతం చేశారా?

4. ఆమెకు ఇష్టం లేకపోయినా ఏదో ఒక లైంగిక క్రియను చేయమని బలవంతపెట్టారా?

కింది గ్రాఫ్ లలో మొదటిది ఇంటర్వ్యూ చేసిన జంటల వైవాహిక స్ధితిని తెలియజేసేది. రెండవది సర్వేలో వివాహ సంబంధాల్లో కొనసాగుతున్న లైంగిక హింస పై వెల్లడి అయిన ఫలితాలు.

 

ఫలితాలు:

ఈ 8 రాష్ట్రాల్లో దాదాపు 1/3 వంతు మంది పురుషులు తాము ఏదో ఒక సమయంలో లైంగిక క్రియ కోసం తమ భార్య/భాగస్వామి పై ఒత్తిడి చేశామని తెలియజేయగా, స్త్రీలు మాత్రం తాము అలాంటి ఒత్తిడికి గురయ్యామని 17 శాతం మాత్రమే చెప్పగలిగారు. అయితే NFHS సర్వేలో మాత్రం 6.6 శాతం మహిళలు మాత్రమే తాము ఏదో ఒకసారి బలవంతంగా లైంగిక క్రియలో పాల్గొనేలా బలవంతానికి గురయ్యామని చెప్పగలిగారు. గ్రాఫ్ లో లెక్కలు 8 రాష్ట్రాలవి కాగా NFHS సర్వే మొత్తం ఇండియా వ్యాపితంగా జరిగిన సర్వే. NFHS సర్వే అత్యంత శాస్త్రీయమైనదిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా గమనించాల్సిన విషయం.

తాము లైంగికంగా బలవంతానికి గురయ్యామని చెప్పడానికి కూడా స్త్రీలు ముందుకు రాని పరిస్ధితిని ఇది తెలియజేస్తోంది.

మొత్తం మీద చూసినట్లయితే భారత దేశంలో వైవాహిక జీవితంలో బలవంతపు సమాగమం, లైంగిక హింస సర్వ సాధారణం అన్నది నిర్వివాదాంశంగా తేలుతోంది.

10 thoughts on “వివాహాల్లో లైంగిక హింస సర్వ సాధారణం -సర్వే

  1. మహిళా కమిషన్ సభ్యుల్ని పాలకవర్గంవాళ్ళు నియమిస్తారు. పాలలవర్గంవాళ్ళు తాన అంటే ఈ కమిషన్‌వాళ్ళు తందాన అనక ఏమి చేస్తారు?

  2. మనదేశంలో గొర్రెలని మాంసంకోసం పెంచినట్లుగా, ఆడపిల్లలని ‘అందు’కోసం పెంచేవారు. వాళ్ళని పణంగా పెట్టి (అంటే less than ఇరవైల్లోని చెల్లెళ్ళనీ/అక్కలనీ నలభైల్లో ఉన్నవాళ్ళకిచ్చి పెండ్లిజరిపించి) తద్వారా కలిగిన ఆర్ధిక వెసులుబాటుతో ఉన్నత చదువులు చదివిన వారిని నేను పదులసంఖ్యలో చూశాను.

    ఉన్నత చదువులు చదివి (అంటే post graduation), తమకాళ్ళమీద తాము నిలబడగలిగే సామర్ధ్యము కలిగీ, తప్పనిసరై (విడాకులను non-trivialగా పరిగణించే స్థాయికి మన సమాజం ఇంకా ఎదగలేదు) మొగుడితో sex చేసే మగువలగాధలు నాకు వ్యక్తిగతంగా తెలుసు.

    మొదటివారిమీద నాకు జాలి ఉన్నది. రెండవ వారిమీద నాకు అసహ్యం తప్ప మరొకటిలేదు for they are the typical ______s. They don’t even deserve pity and so shall we not show any pity towards them for they care more about societal acceptance than them being sexually exploited.

  3. “వివాహాల్లో లైంగిక హింస”ని తప్పించుకొనే అవకాశాలగురించిన అవగాహన ఉన్నా, కొందరు సంఘమర్యాదకోసం, పాతివ్రత్య ego satisfactionకోసం అలాగే పడి ఉండటం ‘భారత్’లో సాధ్యమే. అలాంటి పతివ్రతల గురించి జాలిపడాల్సిన అవసరం ఎవరికీ ఉండఖ్ఖర్లేదు అన్నది నా అభిప్రాయం. కాబట్టి ఈసర్వేలోని ఆర్ధిక స్వావలంబన లేని మహిళలకు మాత్రమే నా సానుభూతిని extend చేయదలచుకున్నాను.

    And your decision to thwart anonymous comments have caused a little bit of a discomfort 🙂 and I didn’t quite like that.

  4. ఎప్పటిలా మీబ్లాగులో నా కలంపేరుతో వ్యాఖ్యానించలేకపోయాను. కాబట్టి దానికి మీరే (అనగా మీకు కలిగిన కష్టమేదో)కారణమని భావించాను.

    ఇదీ ఒకందుకు మచిదేలెండి! ఇహమీదట నెను log in అయ్యే వ్యాఖ్యానిస్తాను.

    Apologies for pointing at you 😦

  5. Actually! pardon my English.

    I meant ‘trivial’ not ‘non-trivial’.

    it’s “has caused a little bit of a discomfort” but not “have caused a little bit of a discomfort”.

    I must have been really excited to have committed those ‘horribilities’ 🙂

  6. భర్తలకనుకూలంగా నడుచుకోవటం తమ విధి అని అదే తమ జీవిత పరమార్ధమని ( పతి వ్రత ధర్మం ) అనే మాట మరుగున పడిందిలేండి, ఉగ్గు పాలతో బోధించే సమాజంలో భర్తలనుండి బలవంతపు లైంగిగికత అనేది ఉంటుందా? అలా ఉందని ఎవరైనా భావించినా అది బైటికి చెప్పుకో తగిందా?
    ఆ మధ్య ఒక వార్త, శ్రీకాకుల, జిల్లాలో ఒక అరవ అయిదేళ్ల ముసలాయన తన భార్య తన కోరికను అంగీకరించలేదని కత్తితో పొడిచి చంపేసాడు. ” ఆడదాని అంగీకారం కోసం ఎదురూ చూస్తూ కూర్చుంటే వాడు మగాడే కాదు పొమ్మనేది” మనసమాజం. అసలిది వార్త అని రాస్తేనే నవ్వి వూరుకుంటారు మెజారిటి ప్రజలు. ఇదేదో విచిత్రంగా వుందే! మరి పెళ్లి చేసుకోడమెందుకట అంటారు. మరీ చదువుకున్న వాళ్లు కూడా!

  7. విడాకులు అంటే గుర్తొస్తోంది. కొన్నేళ్ళ క్రితం నాకు ఒక matrimonial websiteలో ఒక విడాకులు తీసుకున్న అమ్మాయి పరిచయమైంది. ఆమెకి ప్రపోజల్ పంపాను. ఆమె నుంచి నాకు సమాధానం రాలేదు కానీ మా బంధువులు “ఆమె ఎందుకు, వేరే అమ్మాయిని చూసుకోవచ్చు కదా” అని అభ్యంతరం చెప్పారు. వీళ్ళు విడాకులని trivialగా చూస్తారు కానీ విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి మాత్రం అంగీకరించరు. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకున్నది నేను, దానికి వీళ్ళ అభ్యంతరం ఎందుకు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s