గేట్ల వద్ద వద్ద అసలు శత్రువు -ది హిందు ఎడిట్ (ఫోటోలు)


India's Border Security Force (BSF) soldiers patrol in front of the golden jubilee gate at the Wagah border, on the outskirts of the northern Indian city of Amritsar, November 3, 2014. India and Pakistan have suspended a daily military ritual on their main land border crossing after a suicide attack that killed dozens of people, the first time the colorful parade has been called off since the two countries went to war in 1971. India's home ministry said BSF agreed to a Pakistani request to suspend the flag-lowering ceremony to allow mourning. At least 45 people were killed and more than 100 wounded on Sunday by the explosion that ripped through a carpark about 500 meters (yards) from Pakistan's border gate just as hundreds of people left the popular daily performance. REUTERS/Munish Sharma (INDIA - Tags: POLITICS CIVIL UNREST MILITARY TPX IMAGES OF THE DAY) - RTR4CLI5

India’s Border Security Force (BSF) soldiers patrol in front of the golden jubilee gate at the Wagah border, on the outskirts of the northern Indian city of Amritsar, November 3, 2014. India and Pakistan have suspended a daily military ritual on their main land border crossing after a suicide attack that killed dozens of people, the first time the colorful parade has been called off since the two countries went to war in 1971. -REUTERS

(ఆదివారం నాడు ఇండియా-పాక్ మధ్య ఉన్న వాఘా సరిహద్దు వద్ద అవతలివైపు భారీ పేలుడు సంభవించింది. అమాయక పౌరులు అనేకమంది ఈ ఆత్మాహుతి బాంబు పేలుడులో మరణించారు. ఈ అంశంపై మంగళవారం, నవంబర్ 4 2014, ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)

*****************

పాకిస్తాన్ లో వాఘా సరిహద్దు వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి దుఃఖభాజనం. శోచనీయం ఏమిటంటే ఇది (సరిహద్దు) ద్వారాల వద్ద అసలు శత్రువు ఇండియా కాదని తెలియజేసే వక్రోక్తి కూడా. పాకిస్తాన్ లో అంతర్గతంగా మోహరించిన వివిధ శక్తులు దేశాన్ని బదాబదలు చేయడంలో చురుకుగా పని చేస్తున్నాయి. ఆదివారం దాడిలో 60 మంది చనిపోయారు. హింసాకాండకు బాధ్యులంగా చెప్పుకుంటూ కనీసం మూడు సంస్ధలు -సెప్టెంబర్ 2013లో పెషావర్ చర్చి బాంబింగ్ కు బాధ్యురాలైన జుందుల్లా, తెహ్రీక్-ఏ-తాలిబాన్ (టి.టి.పి) కి చెందిన రెండు ప్రత్యర్ధి గ్రూపులు- పోటీ పడి ప్రకటనలు జారీ చేశాయి. టి.టి.పి లోనే భాగం అయిన జుందుల్లా, ఉత్తర వజీరిస్తాన్ లో పాకిస్ధాన్ సైన్యం సాగిస్తున్న ‘జర్బ్-ఏ-అజ్బ్’ ఆపరేషన్ కు ప్రతీకారంగా బాంబు దాడి జరిపామని ప్రకటించింది.

మొహర్రం నెలలో షియాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రతి యేడూ ఆత్మాహుతి మరియు ఇతర ఉగ్రవాద దాడులు పెచ్చరిల్లడం పరిపాటి కావడంతో గత కొద్ది రోజులుగా దేశం అత్యున్నత స్ధాయి అప్రమత్తత పాటిస్తోంది. అయితే పాకిస్తాన్ గూఢచార వర్గాలు తాజా దాడులు సెక్టేరియన్-యేతర దాడులు కూడా అయి ఉండే అవకాశాన్ని ప్రస్తుతానికి కొట్టిపారవేయడం లేదన్నది స్పష్టం అవుతోంది. ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుకు కాపలా కాసే పారామిలటరీ రేంజర్లకు ప్రాముఖ్యత కలిగిన స్ధావరం కావడంతో ఇటీవలి కాలంలో ఇది పాకిస్తాన్ భద్రతా అప్రమత్తత జాబితాలో దాడులకు తేలికగా ఆందుబాటులో ఉన్న ప్రదేశంగా స్ధానం పొందింది. విశాల ప్రాంతం అయిన బోర్డర్ చెక్ పోస్టు గేటు దాటి ప్రవేశించకుండా గార్డులు అడ్డుకోవడంతో ఆత్మాహుతి దాడి బాంబర్ అనేకమంది పౌరుల మధ్య తనను తాను పేల్చుకున్నాడు. పౌరులలో అనేకమంది సరిహద్దు ద్వారాల వద్ద జెండా అవనటం చేసే కార్యక్రమాన్ని తిలకించి తిరిగి వెళ్తున్న సందర్శకులే. ముగ్గురు రేంజర్లు కూడా దాడిలో చనిపోయారు.

దుర్ఘటనకు సంబంధించి పాకిస్తానీ పోలీసులు వెంటనే 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరిశోధనలు ముందుకు కొనసాగుతాయనడంలో సందేహం లేదు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే ఇస్లామిస్టు ఉగ్రవాదం మరియు మిలిటెన్సీలకు సంబంధించి సమగ్రమైన విధానం గానీ స్పష్టమైన వివరణ గానీ ఏదీ లేకపోవడం. ఈ సంవత్సరాంతానికి ఆఫ్ఘనిస్తాన్ ను అమెరికా ఖాళీ చేసే నాటికి ఈ ప్రాంతంలో వెనక్కి ఎగదన్నే అంతర్గత కుమ్ములాటలు తన చేయిదాటి పోకుండా ఉండే స్ధాయిలో టి.టి.పిని నియంత్రించడమే లక్ష్యంగా ప్రస్తుతం వాయవ్య ప్రాంతంలో మిలటరీ ఆపరేషన్ సాగుతున్నట్లు కనిపిస్తోంది. తద్వారా ఈ ప్రాంతంలో విశాల వ్యూహాత్మక లక్ష్యాలను మరింత స్వేచ్ఛగా నేరవేర్చుకోవాలన్నది పాక్ పాలకుల ఆకాంక్ష. అనేక మిలిటెంట్ సంస్ధలు, ముఖ్యంగా ఇండియా వ్యతిరేక ఎజెండా కలిగిన సంస్ధలు, ఇక్కడ ఇంకా వర్ధిల్లుతూనే ఉన్నాయి.

పేలుడు శబ్దం ఇండియా వైపు కూడా వినపడినంత దగ్గరగా బాంబు దాడి ప్రదేశం ఉన్నది. బాంబు దాడిలో భారతీయులు ఎవరూ గాయపడలేదు. సోమవారం ఇరు పక్షాలు పెద్దగా ఆర్భాటం లేకుండా జెండా అవనతం కార్యక్రమాన్ని నిర్వహించాయి. పాకిస్తాన్ వైపు నుండి సందర్శకులను కూడా అనుమతించారు. కానీ పరిమితంగానే ఇరు పక్షాల మధ్య నడిచే భూ ఉపరితల వ్యాపారం తాత్కాలికంగా ఆగిపోయింది. ఢిల్లీ నుండి లాహోర్ కు నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసుకు కూడా అంతరాయం కలగలేదు. సరిహద్దుకు కొద్ది మీటర్ల దూరంలో జరిగిన దాడి, స్ధిరమైన పాకిస్తాన్ భారతీయ ప్రయోజనాలకు అవసరమన్న వాస్తవాన్ని గుర్తుకు తెచ్చింది. పాకిస్తాన్ నుండి వస్తున్న ఉగ్రవాదంపై భారత దేశానికి ఉన్న ఆందోళనను పాక్ కు తెలియజేయాలంటే ఢిల్లీ-ఇస్లామాబాద్ లు చర్చలు జరుపుకోవడం తప్ప మరో మార్గం లేదని కూడా ఈ సంఘటన జ్ఞప్తికి తెస్తోంది.

2 thoughts on “గేట్ల వద్ద వద్ద అసలు శత్రువు -ది హిందు ఎడిట్ (ఫోటోలు)

  1. “పాకిస్తాన్ నుండి వస్తున్న ఉగ్రవాదంపై భారత దేశానికి ఉన్న ఆందోళనను పాక్ కు తెలియజేయాలంటే ఢిల్లీ-ఇస్లామాబాద్ లు చర్చలు జరుపుకోవడం తప్ప మరో మార్గం లేదని కూడా ఈ సంఘటన జ్ఞప్తికి తెస్తోంది.”….ఆ జ్ఞానం పాకీస్తాన్ పెద్దలకూడా ఉంటే ఎంతబాగుండేది

  2. ఆ జ్ఞానం వచ్చి….భారత్ పాక్ చర్చలు జరిపినా….అమెరికా లేదా ఇతర పశ్చిమ దేశాలు ఊరుకుంటాయా. నిజంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరగకనే ..సమస్య అలా ఉందంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు.
    – భారత్ -పాక్ ల మధ్య శతృత్వం కొనసాగితేనే ఆయుధాల వ్యాపారం కొనసాగుతుంది….లేదంటే ఆయుధ వ్యాపారులకు అతిపెద్ద మార్కెట్ లు పోతాయి. ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు కొనేది పాక్, భారత్ లే….
    కాబట్టి ఆయుధ వ్యాపారుల పీచమణచకుండా భారత్, పాక్ శతృత్వం పరిష్కారం కాదు. ఒక్క భారత్ పాక్ సమస్యలే కాదు… ప్రపంచంలో అనేక ఉగ్రవాద సమస్యలకు….కారణం ఆయుధ వ్యాపారులు సహాయ సహకారాలు ఉంటాయి…
    అలాగే ఆ ఆయుధ వ్యాపారుల్లో అధికులు అమెరికన్లు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s