(ఖాతాదారుల) వెల్లడికి మించి వెళ్లాలి… -ది హిందు ఎడిట్


Black Money

పన్నుల విషయాల్లో గోప్యత అనేది ప్రాధమిక (అధికార) కార్యకలాపాల్లో అనుసరించవలసిన ప్రక్రియలలో తప్పనిసరి భాగమే కాకుండా పన్నుల ఎగవేతను నివారించేందుకు కావలసిన అంతర్జాతీయ సహకారంలో అత్యవసర దినుసు కూడా. అయితే, ఇతర దేశాలు పంచుకున్న వివరాలపై తగిన విధంగా చేయవలసిన పరిశోధనను ఎగవేసేందుకు అది సాకు కారాదు. కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్ లో 627 మంది పేర్లతో కూడిన జాబితాను అందించక తప్పని పరిస్ధితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేలా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంలో మనకు అందుతున్న సందేశం ఇదే. పన్నుల ఎగవేత సమస్యలపై అంతర్జాతీయ సహకారానికి ప్రధాన ఆధారాంశం గోప్యతా సూత్రమే. ఈ సూత్రానికి అనుగుణంగానే కోర్టు, (జాబితాలో పేర్లను) వెల్లడి చేయకుండా తాను ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కు, తదుపరి పరిశోధన నిమిత్తం, అందజేసింది.

జరిగిందాన్ని బట్టి చూస్తే, ఇది వృధా ప్రక్రియగా కనిపించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఈ జాబితాను గత జూన్ నెలలోనే సిట్ కు సమర్పించింది. అయితే అప్పటి నుండి కేసులో తగిన పురోగతి లేకుండా పోయింది. పరిశోధనను తాను పర్యవేక్షించనిదే విచారణ మరింత ఆలస్యం కావచ్చని కోర్టు నమ్ముతున్నందున కోర్టు చర్య సక్రమంగానే కనిపిస్తుంది. ఇదే విషయంలో కోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం కోరకపోయినట్లయితే, జాబితా తమకు ఇవ్వాలని కోర్టు అడిగి ఉండేది కాదని ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచార సంరంభంలో విదేశీ బ్యాంకు ఖాతాల్లో మూల్గుతున్న భారీ మొత్తంలోని నల్ల డబ్బును వెనక్కి తెప్పిస్తామని హామీ ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ ఉత్సాహం చూపిన నేపధ్యంలో, సిట్ త్వరితగతిన, గొప్ప సామర్ధ్యంతో దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులు సహకరిస్తారన్న న్యాయమైన ఆశ నెలకొని ఉంది. అయితే ప్రభుత్వ పాలనకు దాని పరిమితులు దానికి లేకపోలేదు. గోప్యత పాటించవలసిన ఆవశ్యకతను మెరుగైన రీతిలో అవగాహన చేసుకున్నందున సమస్యను మరింత ఆశాజనకమైన రీతిలో పరిష్కరించే దృష్టి అవసరం అయింది. అంతర్జాతీయ బాధ్యతల గురించి నొక్కి చెప్పడంలోనూ, తద్వారా వివిధ దేశాల నుండి భవిష్యత్తులో అందవలసిన సహకారాన్ని ప్రమాదంలోకి నెత్తకుండా ఉండడం లోనూ ప్రస్తుత ప్రభుత్వం సరిగ్గానే వ్యవహరిస్తోంది. యు.పి.ఏ ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అవలంబించింది.

అమెరికాతో అంతర్-ప్రభుత్వ ఒప్పందానికి రావడంతో పాటు, 46 ఇతర దేశాలతో బహుళపక్ష ఒప్పందం చేసుకోవాలని ఇండియా భావిస్తోంది. పన్ను ఎగవేతను నివారించేందుకు సరిహద్దుల మీదుగా యంత్రాంగాలను నిర్మించేందుకు చేసే ప్రయత్నాలను బలహీనపరచే ఏ పనిని చేయకూడదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే కొద్ది మంది పేర్లను తక్షణమే వెల్లడి చేయడం కంటే విదేశీ ఖాతాల్లో లెక్కకు అందని సొమ్ముని దాచిన వ్యక్తులందరిని గుర్తించి, విచారించడం మరింత ముఖ్యమైనది. అదీ కాక నల్ల డబ్బు అంతా విదేశాల్లో మాత్రమే లేదన్న సంగతి మరువరాదు. అందులో పెద్ద మొత్తం దేశం లోపలనే ఉన్నది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఉన్నత విద్య, మైనింగ్ లాంటి రంగాల్లో పేరుకుని ఉంది. ప్రజా ఆర్ధిక మరియు విధానాల జాతీయ సంస్ధ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక అంచనా ప్రకారం భారత దేశంలో నల్లడబ్బు దానిని జి.డి.పిలో 75 శాతం వరకూ ఉండవచ్చు. ఈ చట్ట విరుద్ధ దివ్య నిర్మాణాన్ని కూల్చివేయాలంటే తీవ్ర విధాన చర్యలు, చురుకైన పర్యవేక్షణ అవసరం.

 

5 thoughts on “(ఖాతాదారుల) వెల్లడికి మించి వెళ్లాలి… -ది హిందు ఎడిట్

  1. కేంద్ర ప్రభుత్వం మొన్న స్విస్ బ్యాంక్ అకౌంత్‌లు అంటూ ముగ్గురి పేర్లు బయట పెట్టింది. నిజానికి ఆ అకౌంత్‌లు స్విస్ బ్యాంక్‌లవి కావు, ఫ్రాన్స్‌లోని HSBCవి. భాజపా ప్రభుత్వం జనాన్ని వెంగళప్పలని చేస్తోంది.

  2. in the editorial they mentioned, one real estate, second higher education, third mining, i do not know about other two but crores of black money is in education. based on the parents weakness schools and colleges charges huge amount as fee and other types of expenditure which are not at all require for their education. more over i hope so these institutions will be registered under society registration act and the tax will be only 20% on their revenue. government will generally give this flexibility as they serve to society. but are they really serving is a million dollar question.

  3. స్విస్ బ్యాంక్‌లలోని డబ్బు చచ్చినా తిరిగిరాదనుకునే భాజపా తాము స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు రాబడతామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసింది. ఇది చదివితే నల్ల డబ్బుకీ, భాజపాకీ ఉన్న సంబంధం ఏమిటో అర్థమవుతుంది: https://m.facebook.com/photo.php?fbid=823090674391699id=100000723215614set=a.479912378709532.110761.100000723215614refid=52__tn__=C

  4. నల్లధనం విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన 628 మంది జెనీవా హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ ఖాతాదారుల జాబితాలోని దాదాపు 289 ఎంట్రీలలో ఎలాంటి సొమ్మూ లేదని, అలాగే జాబితాలో 122 పేర్లు రెండుసార్లు రిపీట్ అయినట్లు సిట్ గుర్తించింది

    ఈ అకౌంట్ హోల్డర్ లను జాగో జాగో అని కావలసినన్ని సార్లు దండోరా వేసారు మరి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s