“బి.జె.పి వాళ్ళ అచ్ఛే దిన్, బొట్టు బొట్టుగా మన వరకూ కారుతాయా, లేదా?”
**********
మోడి/బి.జె.పి ప్రభుత్వం హానీ మూన్ రోజులు గడిచిపోయాయి. వారే పెట్టుకున్న వంద రోజుల గడువు కూడా పూర్తయింది. కానీ వారు అట్టహాసంగా ప్రకటించిన అభివృద్ధి, ఉద్యోగాలు మాత్రం ఇంతవరకూ లేశామాత్రమైనా పత్తా లేవు.
పల్లెల్లో కూలీ/రైతు ఇల్లాలికి ‘ట్రికిల్ డౌన్ సిద్ధాంతం‘ తెలుసని కాదు. కానీ బొట్లు బొట్లుగా రాలి పడడం అంటే ఏమిటో వారికి తెలుసు. గొప్పోళ్లకు లభిస్తున్న ‘మంచి రోజులు’ మన దాకా కాస్తయినా వస్తాయా లేదా అని ఆ ఇల్లాలి విరుపును పెట్టుబడిదారీ వ్యవస్ధ లెజిటిమసీ కోసం వల్లించబడిన ట్రికిల్ డౌన్ సిద్ధాంతంపై ఎగతాళిగా కార్టూనిస్టు ఇలా విరిచారు.
మొన్ననే దేశ రక్షణ కోసం అని చెబుతూ విదేశీ ఆయుధ కంపెనీలకు మోడి ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయల బహుమతి ప్రకటించింది. కంపెనీలకు మేలు చేస్తూ కార్మిక చట్టాలను సంస్కరించారు. త్వరలో కంపెనీల యజమానులకు తమ కోసం కొత్తగా బ్యాంకులు పెట్టుకునే అవకాశం కల్పించబోతున్నారు.
‘జన్ ధన్ యోజన’ అంటూ ప్రజల మధ్య జరిగే సౌకర్యవంతమైన చిన్నా, చితకా లావాదేవీలను కూడా బడా ద్రవ్య సంస్ధల పాలు చేసే బృహత్పధకాన్ని రచించారు. డీజెల్ ధరల కట్లు తెంచి బహుళజాతి చమురు కంపెనీలను సంతృప్తిపరిచారు. ప్రణాళికా సంఘం ఊపిరి తీసేసి అస్మదీయులకు ఇష్టానుసారం దోచిపెట్టే మార్గం సుగమం చేసుకున్నారు. విదేశీ ఖాతాదారుల ఏకాంత హక్కు కోసం సుప్రీం కోర్టుతో తలపడుతున్నారు.
ఇంతా చేసి చివరికి కూలి పనివాళ్ళకి సంవత్సరానికి కనీసం 100 రోజులు (నిజానికి అంత సీన్ లేదు) హామీ ఇచ్చిన జాతీయ ఉపాధి హామీ పధకాన్ని పంచ పాండవులు-మంచం కోళ్ళు సామెత చేసేశారు.
ఆ ఇల్లాలు వాపోతున్నట్లు బొట్లు బొట్లుగా రాలడం అటుంచి పేదల నుండి ఉన్న గోశె పీకేస్తున్న దుర్దినాలు దాపురించాయి.
ఇవా అచ్ఛే దిన్?!
అవ్వని మీ లేక్కలు. చిన్నపటి నుంచి పేదవాడి గురించి వింటూనే ఉన్నాము. వాడిని ఆదుకోవటానికి ముందో వెనకో ప్రభుత్వాలు రంగంలోకి దిగుతాయి. భారమంటు పడేదేమైన ఉంటే అది మధ్య తరగతి వాడికి. చస్తూ బతుకుతూంటాడు. మధ్యతరగతి వాడికి మోడి ప్రభుత్వం వచ్చిన తరువాత ధరల భారం తగ్గింది. అది పెద్ద రిలిఫ్. ప్రణాలిక సంఘం ఎందుకు? మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ఇంకొందరు బ్యురోక్రాట్లు లక్షలు టాయ్ లేట్ మీద తగలేశారు. మాంటేక్ సింగ్ అహ్లువాలియా సాధించినది ఎమైనా ఉందా?
మోడీ ఎన్నికలలో గెలుస్తున్నాడు. త్వరలో కాష్మీర్ కూడా గెలిచి బిజెపి ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఆశ్చర్య పోనక్కరలేదు. కాంగ్రెస్ పని అయిపోయింది. ఎన్నికల అనంతరం ఇప్పటివరకు ఆపార్టిలో ఏ మార్పులు లేవు. కొత్త అధ్యక్షుడొస్తే పార్టి చీలికలు పేలికలౌతుంది, ప్రస్తుత అధ్యక్షురాలు కొనసాగితే పార్టి కాలగర్భం లో కలసిపోనుంది. స్వాతంత్రానంతరం నెహ్రు హయాములో కాంగ్రెస్ పార్టి వలే దేశ వ్యాప్తంగా BJP పార్టి అవతరించనుంది. రానున్న రోజులలో దేశానికి బిజెపినే గతి.
The real face of BJP: http://m.thehindu.com/news/national/bringing-back-black-money-in-100-days-we-arent-so-immature-says-venkaiah/article6640174.ece/