ఏయే శక్తులు చేతులు కలిపెనో…
ఏయే సామ్రాజ్యాలు ఆశీర్వదించేనో…
ఏయే వర్గాలు వైరుధ్యముల బాపెనో…
ఏయే రాజకీయ వైరులు వెన్నుజూపెనో…
ఏయే కంపెనీలు నిధులను పరిచెనో…
ఏయే (హిందూ) దేవతలు ఓటు వర్షముల కురిపించెనో…
ఏయే ముజఫర్ నగర్ లు ఆత్మహనన ఓట్లు గుమ్మరించెనో…
ఏయే కుల సమీకరణలు తిరుగబడెనో…
ఏయే పేలుళ్లు రక్త తిలకం దిద్దెనో…
ఏయే మిత్రులు శత్రు నాటకంబాడెనో…
ఏయే శత్రులు సలాము చేసెనో…
నేర చట్టముల పదును విరిగెను!
న్యాయ స్ధానములు అటేపు జూచెను!
నిందితులు కాలరు ఎగురవేసెను!
సామంతులు చక్రవర్తులాయెను!
మోడి-అమిత్ ల జైత్రయాత్ర సాగెను!
సాగెను, సాగెను, సాగుతూనే ఉండెను!
(అ)శత్రు, మిత్ర సేనలు గుడ్లప్పగించగ!!!