ఇసిస్ టెర్రరిస్టులకు అమెరికా ఆయుధాలు


US weapons to ISIS

పొద్దున లేస్తే పత్రికల్లోనూ, టి.వి ఛానెళ్లలోనూ ఇసిస్ పై అమెరికా సాగిస్తున్న యుద్ధం సంగతులే దర్శనం ఇస్తాయి. ఉత్తర సిరియాలో టర్కీ సరిహద్దులో ఇసిస్ పై పోరాడుతున్న కుర్దు బలగాలకు కావలసిన ఆయుధాలను విమానాల ద్వారా గాల్లోనుండి జారవిడుస్తున్నామని అమెరికా చెబుతోంది. గత ఆదివారం నుండి ఈ జారవేత కార్యక్రమం నిర్వహిస్తున్నామని అమెరికా మిలట్రీ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఆయుధాలు వాస్తవంగా ఇసిస్ చేతుల్లోకి వెళ్ళాయని ప్రెస్ టి.వి విడుదల చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది.

ఇసిస్/ఇసిల్/ఐ.ఎస్ పేరుతో ఇరాక్, సిరియాలలో ఓ కరుడు గట్టిన తీవ్రవాద సంస్ధ వెలిసిందని, అది ఆల్-ఖైదా కంటే అత్యంత ప్రమాదకరమైందని, ఆ సంస్ధ కార్యకర్తలు అత్యంత క్రూరమైన రాక్షస తీవ్రవాదులని పశ్చిమ పత్రికలు, ప్రభుత్వాలు గత కొద్ది నెలలుగా ప్రపంచానికి చెబుతున్నాయి. వాస్తవంలో ఈ సంస్ధ అమెరికా, ఐరోపాల సామ్రాజ్యవాద ప్రయోజనాలను నెరవేర్చేందుకు తయారు చేసుకున్న ఉగ్రవాద సంస్ధ మాత్రమేనని, సిరియాలో కీలు బొమ్మ ప్రభుత్వం నిలపడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయిన నేపధ్యంలో ఇసిస్ ద్వారా సిరియా ప్రభుత్వంపై ప్రాక్సీ యుద్ధాన్ని అమెరికా సాగిస్తోందని భౌగోళిక రాజకీయ విశ్లేషకులు పలువురు ఇప్పటికే రుజువు చేశారు.

తాజాగా ఈ విశ్లేషణను రుజువు చేస్తూ అమెరికా జారవిడిచిన ఆయుధాలు ఇసిస్ తీవ్రవాదుల చేతుల్లో ప్రత్యక్షం అయ్యాయి. ఇసిస్ కు సానుభూతిగా వెలువడే ఓ ఛానెల్/పత్రిక విలేఖరి ఈ వీడియోను వెలుగులోకి తెచ్చారని తెలుస్తోంది. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సైతం ఈ వీడియోను తమ వెబ్ సైట్ లో పబ్లిష్ చేసింది. అయితే పోస్ట్ ప్రచురించిన కారణం వేరు. అమెరికా ఆయుధాలు పొరబాటున ఇసిస్ స్వాధీనంలోకి వెళ్ళాయని చెప్పడానికి పోస్ట్ ఈ వార్త ప్రచురించింది.

సిరియా, టర్కీ సరిహద్దులో సిరియాలోని కోబానా పట్టణం కోసం కుర్దు, ఇసిస్ బలగాల మధ్య నెల రోజులుగా తీవ్ర యుద్ధం సాగుతోంది. ఈ పట్టణం కుర్దు బలగాల ఆధీనంలో కొనసాగుతోంది. కుర్డులు స్ధానికంగా నాలుగు దేశాల్లో విస్తరించి ఉన్నారు. సిరియా, ఇరాన్, ఇరాక్, టర్కీ దేశాల్లో విస్తరించి ఉన్న కుర్దులు స్వతంత్ర దేశం కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. సిరియాలో కిరాయి తిరుగుబాటును పశ్చిమ దేశాలు ప్రవేశపెట్టడంతో సిరియా అధ్యక్షుడు తమ దేశంలోని కుర్దులతో ఒప్పందానికి వచ్చి వారికి స్వయం పాలన అప్పగించాడు. టర్కీలో కుర్దుల పోరాటాన్ని అక్కడి ప్రభుత్వం కఠినంగా అణచివేస్తూ ఇరాకీ కుర్దు పోరాటానికి మాత్రం మద్దతు ఇస్తుంది.

సిరియా ప్రభుత్వాన్ని కూల్చడానికి టర్కీ కూడా తీవ్రంగా కృషి చేస్తోంది. టర్కీ నాటో సభ్య దేశం. స్ధానికంగా అమెరికా సామ్రాజ్యవాద ఎత్తులలో టర్కీ పూర్తి భాగస్వామ్యం వహిస్తుంది. ఇసిస్ తీవ్రవాదులతో అమెరికా పోరాడేది నిజమే అయితే టర్కీ కూడా ఇసిస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దులకు మద్దతు ఇవ్వాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా సిరియా కుర్దులకు మద్దతుగా రాకుండా టర్కీలోని కుర్దులను టర్కీ ప్రభుత్వం నిరోధిస్తోంది. టర్కీ నుండి కుర్దు బలగాలు గనుక సిరియా కుర్దులకు మద్దతుగా వస్తే కోబాని పట్టణం కోసం జరుగుతున్న పోరులో ఇసిస్ ను మట్టి కరిపించడం చిటికెలో పని. అయినప్పటికీ టర్కీ కుర్దులు సరిహద్దు దాటి సిరియాలో ప్రవేశించకుండా టర్కీ నిరోధిస్తోంది. దానితో అసలు టర్కీ ఉద్దేశ్యం ఇసిస్ గెలుపా అన్న అనుమానం కలుగుతోంది.

ప్రెస్ టి.వి ప్రచురించిన వీడియోలో పారాచూట్ ద్వారా ఆయుధాలు కిందికి దిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హ్యాండ్ గ్రెనేడ్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు (ఆర్.పి.జి), వైద్య సరఫరాలు పారాచ్యూట్ ద్వారా కిందికి దిగిన పెట్టెల్లో ఉన్నాయని ప్రెస్ టి.వి, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు తెలిపాయి. ఇసిస్ పై పోరాడుతున్న కుర్దు బలగాల కోసం తాము ఆయుధాలు సరఫరా చేస్తున్నామని సోమవారం నాడు అమెరికా ప్రకటించిన రీత్యా ఈ ఆయుధాలు అమెరికా సరఫరా చేసినవే అని నిర్ధారణ అయింది.

వీడియోను కింది లింక్ లో చూడవచ్చు.

New video shows US airdropped weapons in hands of ISIL terrorists

అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు తాము జారవిడిచిన ఆయుధాల్లో ఒక భాగం పొరబాటున తీవ్రవాదుల చేతుల్లోకి వెల్లిందని వాటిని తాము వెంటనే దాడి చేసి నాశనం చేశామని ప్రకటించారు. నాశనం చేసిన ఆయుధాలు వీడియో ద్వారా తెలుస్తున్నట్లుగా ఇసిస్ చేతుల్లోకి ఎలా వెళ్లాయో సెంట్రల్ కమాండ్ అధికారులు చెప్పడం మరిచినట్లున్నారు. బహుశా దారి తప్పిన ఆయుధాల లోడు ఒకటే అని తాము భావించామని, ఒకటి కంటే ఎక్కువే దారి తప్పాయేమో పరిశీలిస్తామని సెంట్రల్ కమాండ్ అధికారులు ప్రకటించవచ్చు.

One thought on “ఇసిస్ టెర్రరిస్టులకు అమెరికా ఆయుధాలు

  1. sir
    when ever you are writing about something, please mention maps even, so that we can understand with more clarity and its easy work, else we have to check up every time with google maps, if i have time we look into google maps and try to understand clearly else just iam reading as a news. . its just a piece of advise. follow if possible. dont feel that its a lethargic person’s advise. its just problem of availability of time

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s