విఫల స్వప్నం విషమై హిట్లర్ ప్రాణాన్ని మింగిన వేళ… -ఫోటోలు


‘Thousand-Year Reich!” ఇది జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఇష్టంగా ప్రవచించిన కల. Reich అంటే జర్మనీ భాషలో సామ్రాజ్యం అని అర్ధం. జర్మనీ సామ్రాజ్యం వెయ్యేళ్లు అవిచ్ఛిన్నంగా సాగాలని హిట్లర్ కలలు కన్నాడు. కానీ సోవియట్ రష్యాతో చేసుకున్న నిర్యుద్ధ సంధిని తుంగలో తొక్కుతూ ఎర్ర నేలను కబళించడానికి దండయాత్ర చేసి తన కలలను తానే కల్లలుగా మార్చుకున్నాడు. సోవియట్ ఎర్ర సేనలు తూర్పు వైపు నుండి కదం తొక్కుతూ బర్లిన్ నగరాన్ని పాదాక్రాంతం చేసుకుంటున్న క్షణాల్లో వైరి సేనల చేత చిక్కడం ఇష్టం లేని అడాల్ఫ్ హిట్లర్ విషం మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పశ్చిమ మిత్ర రాజ్యాలు రైన్ నది దాటి పశ్చిమ జర్మనీని ఆక్రమించుకోగా, సోవియట్ ఎర్ర సైన్యం తూర్పు వైపు నుండి పోలండ్, చేకొస్లోవేకియా, హంగేరిల, ఆస్ట్రియాలను విముక్తం చేస్తూ తూర్పు జర్మనీని ఆధీనంలోకి తెచ్చుకుంది. విజయం సాధించిన మిత్ర రాజ్యాలు, లొంగిపోయిన జర్మనీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జర్మనీని నాలుగు భాగాలుగా విభజించి మిత్ర రాజ్యాలు పంచుకున్నాయి. ఆ విధంగా తూర్పు జర్మనీ సోవియట్ ఆధీనంలోకి రాగా పశ్చిమ జర్మనీని మూడు ముక్కలు చేసి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు తలా ఒక ముక్క పంచుకున్నాయి.

విచిత్రం ఏమిటంటే రాజధాని బెర్లిన్ పూర్తిగా తూర్పు జర్మనీలోనే ఉన్నప్పటికీ నగరాన్ని కూడా నాలుగు భాగాలుగా విభజించి పంచుకోవడం. పశ్చిమ రాజ్యాల ఒత్తిడి మేరకు పారిశ్రామిక సంపదలతో విలసిల్లిన బెర్లిన్ ను ఇలా నాలుగు భాగాలు చేశారు. ఫలితంగా బెర్లిన్ లో పావు భాగం సోవియట్ ఆధీనంలో కొనసాగగా ముప్పాతిక భాగం పశ్చిమ రాజ్యాల ఆధీనంలో కొనసాగింది.

జర్మనీ ఫాసిస్టు ప్రభావం నుండి తప్పించే పేరుతో సోవియట్ రష్యాలోని సామ్రాజ్యవాద ప్రతీఘాతక ప్రభుత్వం బెర్లిన్ గోడను నిర్మించి బెర్లిన్ ప్రజలను నిలువునా చీల్చింది. ఆ విధంగా బెర్లిన్ గోడ తూర్పు, పశ్చిమ విభజనకు, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద మరియు సోషల్ సామ్రాజ్యవాద (సోషలిజం పేరుతో సామ్రాజ్యవాద ఆధిపత్యం చెలాయించినందున సోవియట్ రష్యా పెత్తనాన్ని సోషల్ సామ్రాజ్యవాదంగా చెప్పేవారు) విభజనకు సంకేతంగా నిలిచింది. బెర్లిన్ గోడ కూల్చినప్పుడు సోషలిజంపై పెట్టుబడిదారీ విజయంగా తప్పుడు రంగును పూసి ప్రపంచం ముందు ప్రదర్శించారు.

ఈ కింది ఫోటోలు రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల నాటివి. జర్మనీ దాదాపు అన్నీ యుద్ధరంగాల్లోనూ వరుస ఓటములు చవి చూస్తూ లొంగుబాటుకు దగ్గరవుతున్న రోజులు. ది అట్లాంటిక్ పత్రిక ఈ ఫోటోలను మూడేళ్ళ క్రితం ప్రచురించింది.

3 thoughts on “విఫల స్వప్నం విషమై హిట్లర్ ప్రాణాన్ని మింగిన వేళ… -ఫోటోలు

  1. సర్,రష్యాలో 1917-53 సుమారు 35 సం,, లెనిన్,స్టాలిన్ ల పరిపాలన కాలంలో ఆ దేశప్రజలు అంతకముందు రష్యా పాలితుల కంటే పశ్చిమ దేశ ప్రజలు కంటే మెరుగైన జీవన విధానాన్ని గానీ,అత్యుత్తమ ప్రజాసంభంధాలు గాని గడిపారని వివరంగా చెప్పగలరా? ఆ కాలంలో ప్రజలకు రాజ్యంతో కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకొన్నారు?

  2. Berliner Mauer కూలడానికి కారణం ఒక clerical mistakeట. First of all the guy was reading a draft copy (die Entwurfskopie), and when he was asked, from when would the people be allowed to visit the GDR, he responded “from right now!”. That spelled the doom of an empire (empire – if you lemme say) and drove the first nail into the coffin of USSR.

    I had been friends with a few Poles and Germans (to the extent I could even speak their tongues) and found none who liked the Communist rule by the way.

  3. No. You can not grant such a sweeping observation. A few poles and Germans can not speak for all of their country men. That is just obsurd.

    East European countries have developed good living standards as long as they implemented true socialist economies. With Khrushchev’s take over, the downfall of people’s govts ensued. If we can not see the difference between socialist construction and social-imperialist domination it could be a pathetic mistake and it would not be the right observation.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s