బి.జె.పి నేతలు చేసింది లవ్ జిహాద్ కాదా?


Love Jihad

 

-ప్రవీణ్

భాజపా నాయకులు తమ వ్యక్తిగత జీవితాలలో వెనుకబాటు నమ్మకాలని నమ్మరు. ఆ పార్తీ సీనియర్ నాయకులలోనే నలుగురు మతాంతర వివాహాలు చేసుకున్నారు. వాళ్ళు జనం మీదకి మాత్రం వెనుకబాటు నమ్మకాలని రుద్దుతారు.

లవ్ జిహాద్ అనేది నిజంగా జరిగితే షానవాజ్ హుస్సేన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీలు చేసినది కూడా లవ్ జిహాద్ కాదా? వాళ్ళకి భాజపాలో ఉన్నత స్థానం ఎందుకు ఇచ్చినట్టు?

ఈ కింది వివాహ సంఘటనలు కూడ “లవ్ జిహాదే” నా?

  1. అశోక్ సింఘాల్ కుమార్తెని బిజేపి మైనారిటీ నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పెళ్ళి చేసుకున్నారు.
  2. మురళీ మనోహర్ జోషి కుమార్తెని షానవాజ్ హుస్సేన్ పెళ్లి చేసుకున్నారు.
  3. మోడి సోదరుడి కుమార్తె వివాహం కూడ ఒక ముస్లింతోనే జరిగింది.
  4. అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ రెండవ వివాహం ఒక ముస్లింతో జరిగింది.
  5. సుబ్రమణ్య స్వామి కుమార్తె సుహాసిని స్వామి వివాహం సల్మాన్ హెయ్డర్ అనే ఒక ముస్లింతో జరిగింది.
  6. ప్రవీణ్ తొగాడియా సోదరి ఒక ధనిక ముస్లింని పెళ్ళాడారు.
  7. బాల్ థాకరే మనవరాలు నేహా థాకరే కూడ డాక్టర్ మహ్మద్ నబీ అనే ముస్లింని పెళ్ళాడారు.

ఇవి వాళ్ళ వ్యక్తిగత విషయాలని భాజపా అభిమానులు సమాధానం చెప్పగలరు. తాము వ్యక్తిగతంగా నమ్మని భావజాలాన్ని జనం నమ్మాలనుకోవడం అభ్యంతరకరమే. విదేశీ పెట్టుబడులు తప్ప ఏదీ అవసరం లేదనుకోవడానికి మతం పేరు చెప్పుకోవడం ఎందుకు? సామ్రాజ్యవాదుల మోచేతి నీళ్ళు తాగే నాస్తికుడు దేశానికి ప్రధానమంత్రైనా అతను విదేశీ పెట్టుబడులని ఆహ్వానించడం తప్ప ఏమీ చెయ్యడు.

 

4 thoughts on “బి.జె.పి నేతలు చేసింది లవ్ జిహాద్ కాదా?

  1. there is difference between love jihad and inter religion marriage. BJP leaders never opposed inter religion marriages. They are against love jihad which is as operation in the name of love to convert hindhu women as terrorists or to serve terrorists.

  2. venkat గారు : చెదురుమదురు సంఘటనలని ఎవరో పనిగట్టుకొని conduct/organise చేస్తున్నారని భ్రమపడటాన్ని ఆంగ్లంలో fallacy of agenticty అంటారు.

    నిజంగా ఒక తీవ్రవాదనాయకుడిలోకి మీరు పరకాయ ప్రవేశంచెయ్యండి. ఒక బాంబు పేల్చడానికి పదిలక్షల ఖర్చవుతుందనుకుంటే, వందకోట్ల మంది ఉన్న దేశంలో పెళ్ళిళ్ళ కారణంగా, కావలసినంతమందిని convert చెయ్యడానికి కొన్ని కోట్లుఖర్చవడమేగాక, బోలెడంత సమయం వృధా అవుతుంది. And your conversion rate would still be not able to cope up with the birthrate in India. తీవ్రవాదులు long term goalsతో గాక, ఉనికి నిరూపణకోసం దుర్మార్గాలుచేస్తారు. The so called love jihad is not economically feasible and that did surface because of the UP elections.

  3. డబ్బున్నవాడు తన కూతురిని ఇంకో డబ్బున్నవానికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు కానీ తన కులంవానికో, తన మతంవానికో ఇచ్చి పెళ్ళి చెయ్యాలనుకోడు. భాజపా నాయకులైనా అందుకు భిన్నంగా ఆలోచించరు. వీళ్ళకి తమ వ్యక్తిగత జీవితాలలోనే మతం గురించి అంతగా పట్టింపు లేనప్పుడు ప్రత్యేకంగా ఒక హిందూత్వ పార్తీ నడపడం ఎందుకు?

  4. హర్యాణాలో ఒక జంట సగోత్రీక వివాహం చేసుకుందని కుల పెద్దలు ఖాప్ పంచాయితీలో వాళ్ళని నిలబెట్టారు. వాళ్ళిదరూ ఒకే గోత్రంవాళ్ళు కనుక వాళ్ళు వరుసకి అన్నాచెల్లెళ్ళు అవుతారని చెప్పి భార్యకి భర్తకి రాఖీ కట్టమని ఆదేశించారు. ఆ భార్యాభర్తలు పోలీస్ స్తేషన్‌కి వెళ్ళి కుల పెద్దల నుంచి తమకి రక్షణ కల్పించాలని కోరారు. భాజపా నాయకులు తాము మతాంతర వివాహాలు చేసుకుంటారు కానీ జనం మీదకి మాత్రం కులం, మతం, గోత్రం లాంటి వెనుకబాటు నమ్మకాల్ని వదులుతారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s