(మోడి ఇటీవల ప్రకటించిన కార్మిక వ్యతిరేక కార్మిక సంస్కరణలకు ది హిందు మద్దతుగా వస్తూ ఈ సంపాదకీయం వెలువరించింది. నిస్పక్షపాత ముద్రను కాపాడుకోవడానికి ఈ సంపాదకీయంలో పత్రిక చాలా ప్రయాసపడింది. అనునయ మాటలతో, నచ్చజెప్పే ధోరణితో పాఠకుల చేత చేదు మాత్రను మింగించడానికి కృషి చేసింది. తనిఖీల లోపం వల్ల కార్మికులకు నష్టం కలుగుతుందని నామమాత్రంగా చెబుతూ అంతిమంగా భారత దేశ శ్రామిక ప్రజల హక్కులకు భంగం కలిగించే కార్మిక సంస్కరణలను నిండు మనసుతో పత్రిక ఆహ్వానించడం కడు శోచనీయం. -విశేఖర్)
కార్మిక సంస్కరణలకై ‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ శ్రమయేవ జయతే’ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎంతో యిష్టంగా ప్రకటించిన చర్యలు, స్వాతంత్ర్య దినోత్సవం నాడు ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో బహుళజాతి కార్పొరేషన్ లకు ఆహ్వానం పలుకుతూ ఆయన ప్రకటించిన రోడ్ మ్యాప్ తరహాలోనే ఉన్నాయి. ఆయన ప్రకటించిన చర్యల్లో అత్యంత గణనీయమైనది ఏమిటంటే ప్రస్తుతం అమలులో ఉన్న భారమైన తనిఖీ ప్రక్రియలను సులభతరం చేయడం. ఆయా సంస్ధలను వాటికి అనువైనట్లు గా తమకు తామే యోగ్యతాపత్రం ఇచ్చుకుంటూ పత్రాలు సమర్పించడానికి అనుమతించడం కూడా ఇందులో భాగంగా ఉంది. (త్వరలో) అమలులోకి రానున్న యాదృచ్ఛిక తనిఖీ ప్రక్రియ, 1800 మంది లేబర్ ఇనస్పెక్టర్ లకు పని కల్పించే పాలనాపరమైన రెడ్ టేప్ ను ఒక్క వేటుతో ముగింపు పలకనుంది.
నిజానికి, నిగూఢమైన తనిఖీ ప్రక్రియల ఆటంకాల తొలగింపు పాతుకుపోయిన అవినీతిని నిర్మూలించి సమగ్ర స్ధాయిలో సామర్ధ్యం మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది. కానీ పారిశ్రామిక భద్రతా సంస్కృతి కడు దౌర్భాగ్యపూరితంగా లోపించిన దేశంలో ఇది విధానాలను తెగింపుతో తిరగదోడడం కూడా. తనిఖీల వ్యవస్ధ ప్రభావశీలంగా ఉండేట్లుగా చూడడమే కాకుండా వేలాది మంది మానవ జీవితాల రక్షణ ఎటువంటి పరిస్ధితుల్లోనూ భంగపడకుండా చూడవలసి ఉంది. అమెరికాలో 2007లో మినియాపొలిస్ వంతెన పతనం, బంగ్లాదేశ్ దుస్తుల ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు, భోపాల్ లో డిసెంబర్ 1984 నాటి గ్యాస్ లీకేజి… ఇవన్నీ ఎంతో కొంత మొత్తంలో తనిఖీల లోపం వల్ల సంభవించినవే.
వివిధ కార్మిక మరియు భద్రతా చట్టాలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ తనిఖీ చేసే ఏక-గవాక్ష వ్యవస్ధను ఏర్పాటుకు వేలాది సంస్ధల వివరాలను డిజిటలైజ్ చేయడం ప్రశంసనీయమైన చొరవగా చెప్పవచ్చు. ముఖ్యంగా, కష్టించి చేసుకున్న రు. 27,000 కోట్ల పొదుపు సొమ్మును స్తంభన నుండి విడిపించే స్నేహపూర్వక భవిష్య నిధి సౌకర్యం, వివిధ యాజమాన్యాల మధ్య పి.ఎఫ్ ఖాతాలను తేలికగా మార్చుకోగల వసతి కల్పన చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంస్కరణ. యూనియన్ బడ్జెట్ లో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ను రు. 300 నుండి రు. 1000 లకు పెంచుతూ ప్రకటించిన చర్యకు ఈ సౌకర్యాలు అనుగుణంగా ఉన్నాయి. గత లోక్ సభ ఎన్నికలకు ముందు పెన్షన్ ను రు. 3,000 కు పెంచుతామని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేయడం వేరే సంగతి కావచ్చు.
స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే, ఈ కార్మిక సంస్కరణ చర్యల రాజకీయ సున్నితత్వ స్వభావం -బి.జె.పి అనుబంధ ట్రేడ్ యూనియన్ కార్యవర్గాలలో కూడా- చివరికి మోడీ విషయంలోనూ తనను తాను వెల్లడించుకోకుండా ఏమీ లేదు. కొద్ది నెలల క్రితమే యాజమాన్యాలకు సౌకర్యవంతంగా ఉండడానికి వీలుగా కాంట్రాక్టు కార్మిక చట్టానికి రాజస్ధాన్ ప్రభుత్వం తెచ్చిన సవరణాలను భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఫలితంగా మోడి ప్రకటించిన కొత్త సవరణలలు కార్మికులకు సైతం తక్కువ లబ్ది చేకూర్చేవి ఏమీ కాదంటూ చాలా జాగ్రత్తగా నచ్చజెప్పే మెత్తని మాటల మధ్యలో భద్రంగా పెట్టి మరీ ఆవిష్కరించారు. గతంలో అనుమతులు పొందడానికి సుదీర్ఘకాలం పాటు ఎదురు చూడవలసి రావడం వల్ల ఉత్పాదకతకు నష్టం వాటిల్లినట్లయితే, దానివల్ల కార్మిక ప్రజానీకపు ప్రయోజనాలపైన కూడా ప్రతికూల ప్రభావం పడినమాట వాస్తవం. భారత దేశంలో ఉనికిలో ఉన్న వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాంల నాణ్యతా ప్రదర్శన కోసం టెక్నాలజీ అంబాసిడర్ లను ముందుకు తేవాలన్న మోడీ పధకం కూడా బాగానే రూపొందించబడింది. అటువంటి సంస్ధలు మరిన్ని అవసరం అని చెప్పడంలో తప్పు ఎంచడానికి ఏమీ లేదు.
కార్మిక వ్యతిరేక సంస్కరణలకు ‘హిందూ’ పత్రిక అనుకూల మొగ్గు విచారకరం. సమతూకం కోసం చేసిన ప్రయత్నం చివరకు సంపాదకీయాన్ని నాన్చుడు ధోరణికి దిగజార్చింది.
దిక్కు మార్చుకొని,కాలంతో పాటు కొట్టుక పోతుంది.
Please watch this screenshot. https://m.facebook.com/a/notifications.php?redir=%2Fstory.php%3Fstory_fbid%3D599770673478417%26id%3D100003364686744%26comment_id%3D599847913470693%26offset%3D0%26total_comments%3D14&seennotification=9109147&gfid=AQDNjEZedwu93pqq&refid=48
BJP is ready to sacrifice anything for foreign investments.