ప్రశ్న: కూలింది సోషలిస్టు రష్యాయేనా? -2


Red flag over German Parliament -May 2, 1945

Red flag over German Parliament -May 2, 1945

మొదటి భాగం తరువాయి…………

 

ఆ విధంగా సోవియట్ రష్యా ప్రజల సహాయంతో స్టాలిన్, మొట్టమొదటి సోషలిస్టు రాజ్యానికి ఎదురైన అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొన్నాడు. కానీ సోషలిస్టు రాజ్యం వయసు అప్పటికి ఇంకా బాల్య దశలోనే ఉంది తప్ప పరిపక్వ దశకు చేరుకోలేదు. సోషలిస్టు నిర్మాణం నిరంతర సవాళ్లను ఎదుర్కొంటూ చేయవలసిన ప్రయాణం. ఒక కుటుంబాన్ని సక్రమంగా నిర్మించుకోవాలంటేనే కిందిమీదులు అవుతుంటాం. అలాంటిది అనేక జాతులతోనూ, ప్రజా సమూహాలతోనూ, ప్రాంతాలతోనూ కూడి ఉండే బహుళజాతుల వ్యవస్ధను పాత సమాజం మిగిల్చిన అనేకానేక కళంకాలను, ఆటంకాలను అధిగమిస్తూ నూతన వ్యవస్ధను నిర్మించుకోవాలంటే ఇంకెంత కష్టమో ఎవరికి వారే ఊహించుకోవాల్సిన విషయం.

ఈ క్రమంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంలో ఎదురవుతున్న ఆటంకాలను వివరిస్తూ స్టాలిన్ పలు రచనలు చేశారు. దేశంలో ఆర్ధిక వర్గాలు నశించాయన్న తన అవగాహన తప్పని వెల్లడించాడు. దేశంలో ఆర్ధిక వర్గాలు ఇంకా కొనసాగుతున్నాయని, కానీ అవి మునుపటి వ్యవస్ధలో వలే స్పష్టంగా కనిపించకుండా ఎర్ర జెండా ముసుగు వేసుకుని, ప్రగతిశీల భావాలు వల్లిస్తూ చివరికి సోవియట్ కమ్యూనిస్టు పార్టీలో కూడా చొరబడ్డాయని ఆయన గ్రహించి తన తప్పును సవరించుకున్నాడు. ఆర్ధిక వర్గాలు కొనసాగుతున్నందున వర్గపోరాట కర్తవ్యం మిగిలే ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే సోషలిస్టు వ్యవస్ధలో వర్గ శత్రువు స్నేహపూరిత  ముసుగు వేసుకున్నందున నూతన వర్గపోరాటం మరింత కష్టంగా ఉంటుందని విశదీకరించాడు.

స్టాలిన్ మొట్టమొదటి సోషలిస్టు రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో అవిరామంగా కృషి చేశాడు. ఆ క్రమంలో కొన్ని తప్పులకు పాల్పడ్డాడు. తప్పులు ఏమన్నా ఉంటే అవి ఆయన తెలిసి చేసినవి కావు. సోషలిస్టు రాజ్యాన్ని కాపాడడంలో, పటిష్టంగా నిర్మించడంలోనూ ఆయన ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేది కింది కమిటీలు, కింది కార్యకర్తలు. ఆయన ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ ఆయన ఆదేశాలను సరిగ్గా అన్వయించడంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు కొన్ని అతి చర్యలకు పాల్పడ్డారు. ఇవి అనివార్యంగా స్టాలిన్ కి అంటగట్టబడ్డాయి. నిరంతరం మెలకువగా ఉండడానికి ప్రయత్నాలు చేసినా వ్యవస్ధ నిర్మాణ క్రమం అనేది ఎప్పుడూ పుస్తకాల్లో ఉన్నట్లుగా జరగదు. పుస్తకానికీ, ఆచరణకీ నిత్యం ఒక ఎడమ/అంతరం/వైరుధ్యం కొనసాగుతూ ఉంటుంది. ఈ ఎడమను ఎంత త్వరగా పూడ్చగలిగితే అంత ఉపయోగం. దానికి మళ్ళీ పార్టీ పైనా, ప్రజలపైనా ఆధారపడవలసిందే.

Joseph Stalin

కానీ ఈ లోపుగా స్టాలిన్ కు ముదిమి వయసు మీదపడింది. ఆయన బ్రతికి ఉండగానే కమ్యూనిస్టు పార్టీలో చేరిన పెట్టుబడిదారీ శక్తులు అదను కోసం కాచుకుని కూర్చున్న పరిస్ధితిలో మార్చి 5, 1953 తేదీన స్టాలిన్ మరణించారు. అప్పటికే ఆయన వయస్సు 75 సం.లు. ఆయన మరణంతోనే సోవియట్ కమ్యూనిస్టు పార్టీలో అధికారం కోసం కుమ్ములాట మొదలైంది. జార్జి మలెంకోవ్ అనే ఆయన పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టినా, రెండేళ్లలోనే ఆయనను కూల్చి నికిటా కృశ్చెవ్ అధికారం చేపట్టాడు. మలెంకోవ్ కాలంలోనే పెట్టుబడిదారీ శక్తులు దాదాపు అన్ని అధికార స్ధానాలను కైవసం చేసుకున్నారు. సోషలిస్టు నిర్మాణాన్ని ఎంత వేగంగా వెనక్కి తిప్పాలన్న అంశంపైనే అప్పటి నుండి తగాదాలు, కుట్రలు, కూల్చివేతలు కొనసాగాయి. ఇవి గోర్బచెవ్-యెళ్ట్సిన్ ల వరకూ కొనసాగాయి.

అత్యంత తిరోగామి చర్యలను తీసుకున్న ఘనత మొదట కృశ్చెవ్ కు దక్కుతుంది. ఆయన ఏలుబడిలో కమ్యూనిస్టు/సోషలిస్టు సిద్ధాంతాలకే చెదలు పెట్టించే కార్యక్రమం శరవేగంగా మొదలయింది. ఆయన తన మొట్టమొదటి దాడి స్టాలిన్ నుండే ప్రారంభించాడు. స్టాలిన్ బ్రతికి ఉన్నంతవరకూ కుక్కిన పేనులా పడిఉన్న కృశ్చెవ్ అధికారంలోకి వచ్చాక స్టాలిన్ పైన అమెరికా-ఐరోపాలు కూడా ఊహించని విధంగా దాడి చేశాడు. అనరాని మాటలు అన్నాడు. స్టాలిన్ హయాంలోని అసంతృప్త వర్గాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారంతా కృశ్చెవ్ నీడన జమ కూడారు. సోషలిస్టు నిర్మాణంలో కింది కమిటీలు, కార్యకర్తల తప్పులకు బాధితులుగా మిగిలిన వారు కూడా వెనకా ముందూ చూడకుండా కృశ్చెవ్ నీడన చేరారు. వారంతా తమకు తెలిసి కొందరూ, తెలియకుండా అనేకులూ అత్యద్భుతమైన సోషలిస్టు రాజ్యాన్ని లోపలి నుండి తొలిచి వేయడం మొదలు పెట్టారు.

సిద్ధాంత రంగంలో కూడా కృశ్చెవ్ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేశాడు. వర్గసంకర సిద్ధాంతాలకు పునాది వేశాడు. ఆర్ధిక వర్గాలు నిజానికి ఉప్పు-నిప్పు గా ఉంటాయి. పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటూనే పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉంటారు. అలాంటి విరుద్ధ వర్గాల మధ్య శాంతి సాధ్యమని కృశ్చెవ్ ప్రబోధించాడు. శాంతియుత పోటీ, శాంతియుత పరివర్తన, శాంతియుత సహజీవనం అంటూ మూడు శాంతి సూత్రాలు ప్రతిపాదించి మార్క్సిజం సారాన్ని నిరాకరించాడు. ఆయన వెంట పలు కమ్యూనిస్టు  రాజ్యాలు వెళ్ళగా మావో నేతృత్వంలోని చైనా ఎదురోడ్డి సైద్ధాంతీక పోరాటం సాగించింది. కృశ్చెవ్ సూత్రాలు ఎంత నాసికరమో, మానవాళికి ఎంత వినాశకరమో అప్పట్లో రష్యా-చైనా ల మధ్య పెద్ద చర్చ సాగింది. ఆ చర్చను ‘గ్రేట్ డిబేట్’ అని పిలుస్తారు. సిద్ధాంతరంగంలో మావో చేతిలో చావు దెబ్బ తిన్నప్పటికీ కృశ్చెవ్ తన దేశంలో తన సూత్రాలను అమలు చేస్తూ దేశాన్ని పెట్టుబడిదారీ వ్యవస్ధవైపుకి తీసుకెళ్ళాడు.

కృశ్చెవ్ కి సంబంధించి మరో ముఖ్యమైన అంశం ఆయన సాగించిన ప్రపంచాధిపత్య పోటీ. అమెరికాతో ఆయన ప్రపంచాధిపత్యం కోసం పోటీ పడడం ప్రారంభించాడు. నిజానికి పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్ధ, సామాన్య ప్రజల సోషలిస్టు వ్యవస్ధలు పరస్పర విరుద్ధ శక్తులు. పెట్టుబడిదారీ వ్యవస్ధ దోపిడీ వ్యవస్ధకు కొమ్ము కాస్తే సోషలిస్టు వ్యవస్ధ శ్రామిక ప్రజల పక్షాన నిలుస్తుంది. కాబట్టి ఈ రెండూ ఒకదానినొకటి ఘర్షణ పడక తప్పదు. కానీ ఆ ఘర్షణ ప్రపంచాధిపత్యం రూపంలో ఉండదు. ఒక సోషలిస్టు రాజ్యం మహా అయితే మరో పెట్టుబడిదారీ దేశంలోనో, మరో మూడో ప్రపంచ దేశంలోనో సోషలిస్టు విప్లవాలు విజయవంతం కావడానికి సహాయ, సహకారాలు ఆందించగలదు. అంతర్జాతీయ వేదికలపై పీడిత ప్రజల, జాతుల, దేశాల తరపున వాణి వినిపించగలదు. అంతే తప్ప తానే మూడో ప్రపంచ దేశాలను ఇతర రాజ్యాలను తన ప్రభావంలోకి తెచ్చుకోవడానికీ, తన ఉపగ్రహ రాజ్యాలుగా మార్చుకోవడానికి సోషలిస్టు రాజ్యం ప్రయత్నించదు. అది సోషలిస్టు రాజ్యం లక్షణం, లక్ష్యం కానే కాదు.

కానీ కృశ్చెవ్ అమెరికాతో పోటీ పడుతూ రష్యా ప్రభావ ప్రాంతాలను విస్తరించడంలో దూకుడుగా వ్యవహరించాడు. ఈ ఒక్క లక్షణం చాలు ఆయన సోషలిస్టు నిర్మాణంలో లేడనీ, మరో పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశంగా రష్యాను మార్చాడనీ చెప్పడానికి. సామ్రాజ్యవాద పోటీలోకి దిగి ప్రపంచ దేశాలను మార్కెట్ దేశాలుగా పరిగణిస్తూ సామ్రాజ్య విస్తరణకు ప్రయత్నించాలంటే పెద్ద ఎత్తున ఆయుధ శక్తి అవసరం అవుతుంది. భారీ సైనిక శక్తిని పోషించాల్సి ఉంటుంది. బడ్జెట్ లో భారీ మొత్తాన్ని మిలట్రీ వ్యయానికి కేటాయించాల్సి వస్తుంది. కృశ్చెవ్ అదే చేశాడు. చివరికి పరిస్ధితి ఎలా మారిందంటే కృశ్చెవ్ కాలంలోనూ, ఆ తర్వాతా కూడా అమెరికా కంటే రష్యాయే ఎక్కువ దూకుడుగా సామ్రాజ్యవాద పెత్తందారీ దేశంగా అవతరించింది. ఆఫ్ఘనిస్ధాన్ లాంటి దేశాలను దురాక్రమించింది. ప్రపంచంలో అనేకచోట్ల వేలు పెట్టింది. అమెరికా ఒకటి చేస్తే తాను రెండు చేసేందుకు ప్రయత్నించింది. అనేక పేద దేశాలు, అక్కడి ప్రజలు అమెరికా-రష్యా ల పోటీ మధ్య నలిగిపోయారంటే అతిశయోక్తి కాదు.

అయితే గోర్భచెవ్ పదవి చేపట్టే నాటికి రష్యా ఆర్ధిక వ్యవస్ధ సామ్రాజ్యవాద పోటీని మోయలేకపోయింది. ఆఫ్ఘన్ దురాక్రమణ ఆర్ధిక వ్యవస్ధకు పెను భారం అయింది. ప్రపంచవ్యాపితంగా విస్తరించిన మిలట్రీ స్ధావరాలు భారం అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధ ఆర్ధిక వ్యవస్ధను రష్యా మోయలేకపోయింది. దానితో ఆర్ధిక వ్యవస్ధను చక్కబెట్టుకోవడానికి సైనిక స్ధావరాలను ఒక్కటోక్కటిగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. తన ఉపగ్రహ రాజ్యాల సమస్యలను ఆదుకోలేని పరిస్ధితిలో పడిపోయింది. చివరికి ఆఫ్ఘన్ నుండి కూడా సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో యుద్ధ ఆర్ధిక వ్యవస్ధ వల్ల ప్రజలకు సౌకర్యాలు అందడం తగ్గిపోతూ వచ్చింది. పాత సోవియట్ సోషలిస్టు తరం అంతరించి సోషలిజం అంటే ఏమిటో తెలియని తరం సోవియట్ డెమొగ్రఫీని ఆక్రమించింది.

The duo that lead Soviet disintegration -Gorbachev and Yeltsin

The duo that lead Soviet disintegration -Gorbachev and Yeltsin

దేశ పరిస్ధితిని ప్రజలకు చెప్పాల్సిన అవసరం తరుముకు రావడంతో గోర్బచెవ్ 1990లో పెరిస్త్రోయికా, గ్లాస్తనోస్త్ అనే ద్విసూత్రాలను ప్రతిపాదించి అమలు చేశాడు. ఇవి అసలు సూత్రాలు అని చెప్పదగ్గవి కూడా కాదు. ఆర్ధిక వ్యవస్ధ పతనం అంచుకు చేరి అగ్రరాజ్య ప్రతిష్టను కూడా భారమైపోయిన దశలో సోషలిస్టు ముసుగుని తొలగించుకోవలసిన అత్యవసరం గోర్బచెవ్ ప్రభుత్వానికి వచ్చింది. ‘అయ్యా మనము/మేము సోషలిస్టు దేశం కాదు. అగ్ర రాజ్యం కూడా కాదు’ అని చెప్పుకోవడమే గోర్భచెవ్ వల్లించిన ద్విసూత్రావళి.

ఇక్కడే గోర్భచెవ్, యెల్టిసిన్ ల మధ్య ఒక వైరుధ్యం వచ్చింది. ముందు చెప్పినట్లుగా ‘ఎంత త్వరగా ముసుగు తొలగిద్దాం’ అన్న అంశంలో వచ్చినదే ఈ వైరుధ్యం. ముసుగుని నిలువునా, అడ్డంగా చీరేసి బదాబదలు చేసేద్దాం అని యెల్టిసిన్ ఒత్తిడి చేశాడు. ‘అలా చేస్తే కాస్త ప్రతిష్ట కూడా లేకుండా పలచబడతాం. గౌరవం ఉండదు. తలెత్తుకోలేం. మెల్లమెల్లగా ముసుగు తొలగిద్దాం” అని గోర్బచేవ్ ప్రతిపాదించాడు. అమెరికా, తదితర పశ్చిమ రాజ్యాలు అప్పటికే యెల్టిసిన్ వెనుక నిలిచాయి. ఆయనకు అనుకూలంగా తమ సొంత ఎన్.జి.ఓ సంస్ధల చేత ప్రజలను కూడగట్టి భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ నిరసనకారుల్లో పశ్చిమ రాజ్యాలు కూడగట్టింది కొద్దిమందినే. కానీ మలెంకోవ్, కృశ్చెవ్ ల కాలం నుండి అమలు చేస్తున్న యుద్ధ ఆర్ధిక విధానాలతో క్రుంగిపోయిన జనం కూడా వారితో జతకలిశారు. ప్రజల న్యాయమైన అసంతృప్తి యెల్టిసిన్ కు, ఆయన వెనుక ఉన్న పశ్చిమ దేశాలకు కలిసి వచ్చింది.

యెల్టిసిన్ అచ్చంగా అమెరికా మనిషి. సోవియట్ రష్యా ప్రజల పాలిట పెద్ద విలన్. రష్యా ప్రజల వేళ్ళతోనే రష్యా ప్రజల కళ్లను పొడిపించిన దేశద్రోహి. కానీ ఈ సంగతి జనానికి తెలియదు కదా. అమాయకంగా ఆయన వెంట వెళ్లారు. ఆర్ధిక సమస్యలతో సోవియట్ రష్యా జాతుల బందిఖానాగా మారి ఉండడంతో ఎప్పుడెప్పుడు విడిపోదామా అని వివిధ జాతులు కాచుకుని ఉన్నాయి. 1990 నాటి పరిణామాలతో వివిధ జాతులు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. ఆ విధంగా సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయింది.

విచ్ఛిన్నం అయింది సోవియట్ రష్యా అన్నది నిజమే. కూలిపోయింది సోవియట్ రష్యా అన్నదీ నిజమే. కానీ 1990 నాటికి సోవియట్ రష్యా, ‘సోషలిస్టు సోవియట్ రష్యా’ గా మిగిలి లేదు. అది పెట్టుబడిదారీ సోవియట్ రష్యాగా అప్పటికే మారిపోయి ఉంది. కాబట్టి 1990లో కూలిపోయిందీ, విచ్ఛిన్నం అయిందీ ‘పెట్టుబడిదారీ సోవియట్ రష్యా’యే తప్ప ‘సోషలిస్టు సోవియట్ రష్యా’ కాదు.

పెట్టుబడిదారీ వ్యవస్ధలో జాతులు అణచివేయబడతాయి. శ్రామిక ప్రజలు పీడించబడతారు. మాఫియాలు రాజ్యం చేస్తాయి. ఇదంతా ప్రజల్లో అసంతృప్తి ప్రోది చేస్తుంది. ఆ అసంతృప్తి 1990లో బద్దలై పెట్టుబడిదారీ సోవియట్ రష్యా కూలిపోవడానికి దారి తీసింది.

కనుక సోవియట్ రష్యా విచ్ఛిన్నం కావడానికి, కూలిపోవడానికి, అగ్రరాజ్య ఆధిపత్యం కోల్పోవడానికీ కారణం ఆ దేశంలో అంతర్గతంగా ఆర్ధిక వైరుధ్యాలు తలెత్తడము, సామ్రాజ్యవాద యుద్ధ ఆర్ధిక వ్యవస్ధను మోయలేక చతికిలబడడమూ. దేశంలో వనరులు ఉన్నంతనే సరిపోదు. ఆ వనరులను ఉత్పత్తిగా, ప్రజల ఆర్ధిక శక్తిగా మార్చగలిగితేనే అది ఆ దేశ శక్తిగా మార్పు చెందుతుంది. పెట్టుబడిదారీ సోవియట్ రష్యాలో ఆర్ధిక ఉత్పత్తి పంపిణీలో అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ఉత్పత్తిలో అధికభాగం యుద్ధ ఆర్ధిక వ్యవస్ధ కోసం మళ్లించగా ప్రజలకు, శ్రామికులకు పంపిణీ చేయడానికి పెద్దగా మిగల్లేదు. కమ్యూనిస్టు పార్టీని, ప్రభుత్వ కంపెనీలను అంటిపెట్టుకుని వృద్ధి చెందిన నూతన పెట్టుబడిదారీ వర్గం ప్రజల అసంతృప్తిని అణచివేసేందుకు మాఫియాలను పెంచి పోషించారు. యెల్టిసిన్ ఏలుబడిలో ఈ మాఫియాలు మొత్తం దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ఇప్పటికీ మాఫియాల ఆధిపత్యం రష్యాలో కొనసాగుతోంది. కాకపోతే ఇప్పటి మాఫియా, ధనికవర్గాలకు జాతీయతా భావనలు ఉంటే యెల్టిసిన్ కాలంలో అమెరికా, పశ్చిమ రాజ్యాలకు దాసోహం అన్నాయి.

ఈ కారణం వల్లనే పుతిన్ అంటే అమెరికా, పశ్చిమ రాజ్యాలకు తగని విద్వేషం. యెల్టిసిన్ లాగా కాకుండా రష్యాను సొంత కాళ్లపై నిలబెట్టేందుకు పుతిన్ ప్రయత్నించడం పశ్చిమ రాజ్యాలకు ఇష్టం లేదు. ఆ మాటకొస్తే ఏ దేశమూ తన సొంత కాళ్లపై నిలబడడం వారికి ఇష్టం ఉండదు. ఈ రోజు సొంత కాళ్లపై నిలబడ్డవాడు రేపు ఉత్పత్తి పెంచుకున్నాక మార్కెట్ కోసం తిరిగి తమకే పోటీ వస్తారని వారికి తెలుసు. కనుకనే పుతిన్ పైన విపరీతమైన వ్యతిరేక ప్రచారాన్ని పశ్చిమ పత్రికలు సాగిస్తాయి. పుతిన్ సోషలిస్టు కావడం అటుంచి కనీసం ఎర్రజెండా పొడకూడా గిట్టని వ్యక్తి. కానీ జాతీయ భావాలు ఉన్న వ్యక్తి. తమ సంపద తమ దేశంలోనే ఉండాలని కోరుకునే వ్యక్తి. తమ సంపదలను పశ్చిమ రాజ్యాల దోపిడీకి ఇచ్చగించని వ్యక్తి. అందువలన ఎంతటి దుష్ప్రచారానికైనా ఆయన తగును.

పుతిన్ ఏలుబడిలో రష్యా మళ్ళీ శక్తులు కూడదీసుకుంటోంది. తన ప్రయోజనాల వరకూ అమెరికాకు ఎదురు నిలుస్తోంది. డాలర్ ఆధిపత్యాన్ని కూలదోసేందుకు తద్వారా అమెరికా తనకు సృష్టిస్తున్న సమస్యలను తొలగించుకునేందుకు కృషి చేస్తోంది. చైనాతో కలిసి యువాన్, రూబుల్ కరెన్సీల శక్తి పెంచేందుకు కృషి చేస్తోంది. అయితే తనకు ఆధిపత్యం అవసరం లేదని పుతిన్ చెబుతున్నాడు. ఆయనకి అవసరం లేకపోయినా పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం అది కాదు. ఉత్పత్తి పెంచుకుంటూ పోవడం, తద్వారా లాభాలు పెంచుకోవడం, ఉత్పత్తి అమ్మకానికి మార్కెట్ల వేటలో పడడం, ఆ క్రమంలో అవతలి పెట్టుబడిదారీ శక్తితో పోటీ పడడం… ఇది పెట్టుబడిదారీ వ్యవస్ధ సహజ లక్షణం. ఎవరు వద్దన్నా అది జరిగిపోతుంది. ఆ క్రమంలో పోటీ, ఘర్షణలు అనివార్యం. నలిగిపోయేది మాత్రం ప్రజలు.

…………………………అయిపోయింది.

25 thoughts on “ప్రశ్న: కూలింది సోషలిస్టు రష్యాయేనా? -2

  1. కూలిపోయింది పెట్టుబడి దారి రష్యానే కానీ…సోషలిస్టు రష్యా కాదు…రష్యా పాలకుల పతనాన్ని కమ్యూనిస్టు సిద్దాంతాల లోపంగా చెప్పే వారికి….., రష్యా పతనం వెనక సందేహం ఉన్నవారికి మీ వ్యాసం చాలా విలువైన సమాధానం. చాలా ఓపికగా, వివరంగా విశ్లేషించారు శేఖర్ గారు.

  2. sir,most of the contemporary political thinkers called that socialism principles are partially utopian in nature and there is widespread thinking that no country can able to sustain with socialism in long run.Is in this present world by application of pure socialistic principles can a country sustain by satisfying peoples aspirations??..Is revolutionary socialism propounded by marx are not against humanitarian ethics?..In present global world there is no perfect socialist country,more are less the so called socialist countries are following oscar lange socialism principles which almost ideologically equal to capitalism.As machivallie said people are self interested,deceit and greedy,is the people will accept the socialistic principles….??

  3. @pavan గారు: ఆదర్శాలు మనుషుల ‘సహజ ప్రవృత్తి’కి ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. కాబట్టే అవి ఆదర్శాలౌతాయేమో.

    మీకు తోచినమతం ఒకదాన్ని తీసుకొని దాని బోధనలు ఉటోపియనో కాదో ఆలోచించండి. ఏదైనా మతాన్ని, ఆ మతంలో చెప్పిన సూత్రాల ఆధారంగా పాటిస్తున్నారేమో చెప్పండి. అలా ఎవ్వరూ తు.చ. తప్పకుండా ఏ ఒక్క మతాన్నీ పాటించనప్పుడు మతాలన్నీ ఎప్పుడో విఫలమయ్యాయనీ ఎందుకు మనం భాష్యం చెప్పం?. మతం చెప్పిన బోధనలకు మనం ఇచ్చే concession కమ్యూనిజం చెప్పే సూత్రాలకు మాత్రం మనం ఎందుకు ఇవ్వం? ఎందుకు ఒకదాన్నిమాత్రమే ఉటోపియన్ అంటాం? ఎందుకు కమ్యూనిజంపైనే ‘అది ప్రాక్టికల్ కాదు’ అని దాడిచేస్తాం?

    ఏ నీతులైనాకదా ఒకలాంటివేకదా! ఆచరణలో లోపాలుంటాయి. అలా ఉన్నప్పుడు వాటిని గుర్తెరిగి మర్గాన్ని సరిచూకోవాలేతప్ప. అహ వాటినసలు పాటించడమే కష్టము అని అనుకోవచ్చా?

  4. Hi Pavan, There is nothing like pure socialism or impure socialism. There is only one socialism and every other mixed isms lead invariably to the opposite ism i.e capitalism.

    For it’s survival, capitalism, in the face of it’s own failures, develops several forms of alternative theories that express themselves as alternatives to capitalism, which are actually not.

    The truth is capitalism tries to gather it’s opposition under the flag of it’s own created alternatives, so that people may not be rallied behind the true alternative to capitalism i.e. socialism. In this way capitalism is able to control it’s opposition also. This line of work happens in every field like social, economical, political and philosophical.

    Market Socilism, the one proposed by Oscal Lange is one of such foolish alternatives. As you observed, Market itself is the foremost tool of capitalism. So, how can there be Market Socialism? So what you observed as “almost ideologically equal to capitalism” is right. Actually it is not ‘almost equal to’ but, it is equal to capitalism. It is nothing but capitalism.

    No. Machiavellinism is not true. Actually, the political thought had developed in leaps and bounds after Machiavelli. He is not at all relevant to the present societies. His theories are already thrown into a dust bin.

    Human greed, deceit etc.. are not the qualities of any particular individual or are a certain group of people. Those are the qualities of the society in which an individual or a group of people live in at a given time and place. People can not generally have qualities beyond the societies that they live in.

    So, as the Capitalist society is full of greed and deceipt, people possess them. As such they believe it is natural. But, some people, over a time, come to know the human history and human behaviour over ages and they can find in which direction the society is moving. Marx, Engels, Lenin, Stalin, Mao, Ho Chi Min… and so many people in that order are such people.

    Utopian socialism is history. It is a pre-Marxian ideology. The philosophy had progressed beyond that. Only thing is we have to see it.

  5. @ viseshaaghna garu and visekhar garu,
    sir,I completely agree with ur logic that,why cant we give concessions to communism? … The universal laws underlying in all religions are more or less same, preachings of morality and equality. Man is the culprit who changed those things according to his own advantage, whether it is religion or communism,and every ideology will have a inborn flaw and in this universe there will be a counter ideology to contradict that .Then what is the need to inclination towards to certain ideology? Why the blend of different ideologies cannot exist?why the peaceful coexistence and cooperation between different classes of the society cannot exist?every man will have natural attributes and he will act according to his ideas and pleasures.In general, watching a television may bring pleasure and satisfaction to common man and it may be different for philosopher whose thinking is different. How far it is reasonable to follow a specific ideology and rubbing on the people against there will to follow that.

  6. It’s just me talking to myself.

    అహింసాయుతంగా బ్రతకవలెను, అబధ్ధమాడరాదు, తాగితందనాలాడరాదు, లంచగొండితనము చెడ్డ అలవాటు, ఇతరులను బాధించరాదు, కులతత్వము కూడనిది

    పైవేవీ మానవ ప్రవృత్తికి సరిపడడంలేదని ఏ ఒక్కరోజు పేపరు (కనీసం జిల్లా ఎడిషను) చదివినా అర్ధమయిపోతుంది. అలాగని “ఆ బోడి నీతులు… ఎవడు పాటించిచచ్చాడు?… అస్సలు ప్రాక్టికల్ కాదు… ఏదో పుస్తకాల్లో రాసుకోడానికేతప్ప ఎందుకు పనికొస్తాయి?… ఎందుకు పాటించాలి?” అని ఆలోచించడం సరైనపనా? అసలలా ఆలోచించడం మొదలుపెడితే ముందుగా పవిత్ర గ్రంధాలన్నింటినీ విసిరెయ్యాల్సుంటుంది. వాటినిమాత్రం పూజిస్తూ, పారాయణంచేస్తూ కమ్యూనిజం చెప్పే ఆదర్శాలనుమాత్రం utoian idealsగా కొట్టెయ్యడం సరైనపనా?

  7. విశేషజ్ఞ గారు, అహింసావాదానికి వర్గంతో సంబంధం లేదు కనుక అహింసావాద పాఠాలు వ్రాయడానికి పాలకవర్గానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ పాలకవర్గం ఎప్పుడూ తాను చెప్పిన నీతుల ప్రకారమే నడుస్తుందనుకోలేము. అందుకే మావోయిస్త్‌లు దొరికితే వాళ్ళని కోర్త్‌లో హాజరుపరచకుండా extrajudicial killingsకి పాల్పడతారు.

  8. Pavan garu :

    I never came across a theistic religion honestly preaching equality. Religions are more like mix and match rule books where the rules often contradict themselves. That’s why one religious book something the other from the same religion upholds. One could even see the holy-men responding in different ways to similar situations at different times (the cause for such difference in the reaction could be found in cast/race/lineage of the persons involved). Hinduism is infested with cast differences. Even the texts that were intended for teaching morals like equality dictate how the people of one cast should serve the people of the other casts. Christianity and Islam are the religions that are based on the concept of ‘Chosen People’ and all. The very core of their faiths is about establishing the political hegemony of the ‘Chosen Ones’. They simply cannot tolerate the people of other faiths (at least so as per their scriptures). Their history and their current day intolerant trends prove that. I don’t think Communism is any different. Even that tries to demolish the other faiths (esp. capitalism) and the people who cherish those isms in their hearts. But it does so in search of a true equality. That’s one good reason why we don’t see women being subjugated in Communist/Socialist societies.

    If you observe carefully, all of these are the conflicting isms. An honest truce between them would be like the truce between the proverbial god and the proverbial satan. Communism preaches equality to the very strictest terms (one could even call it ‘making the people toe the line’). While other isms try to explain and understand the differences thereby actively foster the same. Communism talks about the radical reformation of the situations with the use of force. The others isms concentrate on maintaining the status quo with the use of morals and sometimes force. Hence they cannot co-exist in entirety. If mix and match is the option I am looking at I would pick most of my morals from Communism and a few from the current society (I said current society but not religion), to make a moral soup to serve the people.

    I am not comfortable with a few (but very fundamental) points of communism but I surely prefer Communism to religion.

  9. @viseshaaghna garu
    Sir, I completely agree with your views on religion and I do fall in same line with your thinking, communism is much more better than religion,religious fundamentalism is nothing but extreme communalism, whether it may of Islamic or Hinduism or Christianity are the monsters for the harmony and peaceful existence of the society.As samule huntingtons called global war on terror as clash of civilizations but in my opinion it is a war between capitalism and Islamic communalism both are threats to existing societies but later is a more serious threat.
    Although communism is better than religion,but it is not the panacea for every thing as you said there some flaws in fundamentals, according to your opinion.

    @vishekar garu
    Sir,According to my opinion even Mao and Stalin are not true socialists but they simply wear the mask of socialism as there outfit but with imperialism in there thought and actions.As you told in the above article that it is in the time kurcschev, soviet started imperialistic actions by formation of buffer states, but tracing back there origins we can found them during Stalin era in different forms like Berlin blockade, Nuclear tests in 1949, Annexation of baltic states in 1938..etc. Mao was the person who annexed the Tibet in 1949 with imperialistic views, these policies initiated by mao, even now china is following that in the south china sea and completely oppressing ughiyurs in xinjiang and ethnic Tibetians in Tibet region.

  10. విశేషజ్ఞ గారు,
    మార్క్సిజాన్ని మతంతో పోల్చటం ఏమిటి? ఆ పోలికే కరెక్టు కాదు. మార్క్సిజం ఒక సిద్దాంతం. ఒక తత్వశాస్త్రం అయినంత మాత్రానా దానికి ఉన్న పునాదులు వేరే మతానికి ఉన్న పునాది వేరే. మతం మార్క్సిజం తో ఏ మాత్రం పోటి పడలేదు. దానికి ఒక్క దైవ భావన తప్ప జీవితంలో ఏర్పదే మరేభావనికి అది జవాబు చెప్ప లేదు, చెప్పదు కూడా. ప్రతి దానికి దేవుడి మీద ఆదారా పడమంటుంది. మనుషులకు సహాజంగా ఉండే బౌతిక లక్ష్ణాల వల్లే లౌకీక జీవితాన్ని గడుపుతున్నారు తప్ప ప్రతి దానికి దానిమీద ఆధారపడితే మానవ జాతి ఎప్పుడో తుడిచి పెట్టూక పోయేది.
    శేఖర్ గారు,
    సోవియట్ యూనియన్ కూలి పోవడం మంటే ప్రపంచ పెట్టూబడి దారుల్లో ఎటువంటి సంకోచం లేకుండా ఉత్సాహ పరచడం కాదా? దానికి గోర్బ్చెవ్ కంటే ఎల్స్తిన్ నాయకత్వం వహించాడు. దాని సోషలిస్ట్ ముసుగు సహాజంగ చిరిగి పోలేదు. చింపబడింది అనేది వాస్తవం. మరి పెట్టుబడి దారి నాయకత్వం వహించే చైనా కమ్యునిష్టు పార్టి దాని ముసుగు తొలిగించు కోవడం లో జాప్యం ఎందుకు చేస్తున్నాట్లు? అది హాంకాంగ్ విషయం లో కూడా భావజాల ఘర్షణ పడింది. ఎందుకంటారు?

  11. sir,it is just a health discussion which enlightened me think in different ways,nothing more than that and I hope all bloggers present here are mutual learners for better knowledge sharing, so I think there is nothing like hands up and down. .
    Thanking you viseshaaghna garu

  12. @Thirupalu గారు: మీరు లేవనెత్తిన అభ్యంతరాన్ని నేను ముందుగానే ఊహించగలిగాను. కమ్యూనిజం ఒక set of moralsని బోధిస్తుంది (మతంలాగే) అన్న విషయంలోనే నా పోలిక తప్ప, కమ్యూనిజంలోకూడా దేవతలూ, దేవుళ్ళూ, క్రతువులూ ఉన్నాయనికాదు. నేను ఉపయోగించిన abstraction వేరు. పోలిక proposed-morals విషయంలోనే తప్ప ఇంకొకటికాదు. మీకు అర్ధమయ్యేలా చెప్పగలిగానని ఆశిస్తున్నాను.

  13. విశేషజ్ఞ గారు, మతం ఆచరణలో విఫలమవుతోన్నా మతాన్ని ఒక ఊహాస్వర్గ విషయంగా ఎందుకు భావించడం లేదు అనే మీ ప్రశ్నని నేను సమర్థిస్తాను. మీరు కమ్యూనిస్త్ కాకపోయినా ఈ ప్రశ్న అడగడం న్యాయమే. ఎందుకంటే ఇది సాధారణ భౌతికవాదులకి కూడా రావలసిన సందేహం.

    ఒక వ్యక్తి కమ్యూనిజమ్‌ని సమర్థిస్తాడా లేదా వ్యతిరేకిస్తాడా అనేది అతనికి ఉన్న సామాజిక చైతన్యాన్ని బట్టి ఉంటుంది. 1840కి ముందు కార్ల్ మార్క్స్ కూడా కమ్యూనిజమ్‌ని అంగీకరించలేదు. అది అతను ఆర్థికంగా ముందున్న ఒక న్యాయవాది కొడుకు కావడం వల్ల కావచ్చు, ఇంకేదైనా కారణం వల్ల కావచ్చు.

    భావజాలం అనేది మనిషికి పుట్టుకతో రాదు కదా.

    కేవలం వ్యక్తిగత హక్కులు తెలుసుకోవడానికైతే కమ్యూనిజం అవసరం అనిపించదు. నేను కమ్యూనిస్త్‌నే కానీ నేను తెలంగాణాకి సపోర్త్ ఇవ్వడానికి కారణం కమ్యూనిజం కాదు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కి రైలులో వెళ్ళాలంటే ఎంత లేదన్నా 12 గంటలు పడుతుంది. ఎక్కడో హైదరాబాద్‌ని అభివృద్ధి చేస్తే విశాఖపట్నంలో ఉండే నాకు ఏమీ రాదు. నాకు రైలు ప్రయాణాల్లో పరిచయమైన సమైక్యవాదులతో చెప్పేవాణ్ణి “హైదరాబాద్ మీద వ్యామోహ పడకుండా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం” అని.

  14. కమ్యూనిజమ్‌కి నీతి శాస్త్రం కంటే వర్గ చైతన్యంతో ఎక్కువ సంబంధం ఉంది. బయటి ప్రపంచం గురించి తెలియని దండకారణ్య ఆదివాసులు వర్గ చైతన్యం వల్ల మావోయిస్త్ పార్తీలో చేరుతున్నారు. కానీ భూమి గుండ్రంగా ఉందని తెలిసిన పట్టణ మధ్యతరగతివాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలో అవినీతి నిర్మూలన సాధ్యమని నమ్మి అన్నా హజారేకి మద్దతు ఇస్తున్నారు.

  15. ప్రవీణ్ గారు,

    Thank you. నేను ఒకే ఒక్క ధర్మాన్ని విశ్వసిస్తాను: ఒకమనిషి ఇంకొకరిని control చెయ్యడం లేదా భౌతికంగా బాధించడం తప్పు. (మీరు నేను ఏదో sexuality గురించి చర్చించిన మరియు పరస్పరం విభేదించిన విషయంలోకూడా నా అభిప్రాయాలు ఇప్పుడు నేను వ్యక్త పరచిన అభిప్రాయానికి లోబడే ఉన్నాయి.)

    ఒకవేళ అలా ఎవరైనా ఇంకొకరిని బాధిస్తే వారిని శిక్షించవలసిందే. మతాలుచేసేదంతా ఇంకొకరిని తమ morals సహాయంతో control చెయ్యడం కాబట్టి నేను మతాన్ని అసహ్యించుకుంటాను. ఒకవేళ కమ్యూనిజమైనా ఒకవ్యక్తి ఇష్టయిష్టాల విషయంలో, ఆ యిష్టాయిష్టాలు ఇతరులకు ఏ చెరుపూ చేయనప్పుడు అడ్డుపడితే, దానిని ఖండిస్తాను.

    ఇదికాక నాకు “సత్యం” (the Truth) అంటే చాలా ఇష్టం.

    “పై కొండ మీద ఒక పెద్ద విగ్రహం అంటె కిందనుంచి కూడా కనిపించేంత ఎత్తున్న వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఏర్పరచాలి. కిందనుంచి చూసి కిందనుంచే వెళ్ళిపోతే మరింత పుణ్యం అనే ప్రచారాన్ని కలిగించాలి.”

    లాంటి మాటలూ….

    ‘ధర్మస్థలం’ అనే బ్లాగులో ప్రస్తుత రామసేతు రాముడు నిర్మించినది కాదని వారివద్ద ఆధారాలున్నప్పటికీ, ప్రజలు నమ్ముతున్న తప్పుడు విషయాన్ని ఖండించే ధైర్యం వారికి లేదని చెప్పినప్పుడు మతానికి సత్యంతోగాక propagandaతో సంబంధముంటుందన్న విషయంలో నాకు ఋజువులు దొరికినట్లయ్యింది. ఇలాంటివే కమ్యూనిష్టు రాజ్యాల్లో సాగిన నిజాల దాచివేతలగురించి రంగనాయకమ్మ గారే విమర్శలుచేశారు. సత్యం అన్న పదార్ధాన్ని మతంకూడా గౌరవించదు (“నభ్రూయాత్ సత్యమప్రియం” అంటే అర్ధమేమిటి?) కానీ మతానికున్న ‘ఇమేజి’ వేరు. ఎందుకు ఆప్ ఉన్‌కీ పర్దా ఫాష్ నహీ కర్తేహో?

    ఒక భావజాలాన్ని ఒకరకమైన logicతోనూ, ఇంకో భావజాలాన్ని ఇంకో logicతోనూ విశ్లేషించినప్పుడు నేను సహజంగానే ఆ dual valuesని ప్రశ్నిస్తాను.

    మీలాంటివారు :
    1. “ఏవో రెండు పుస్తకాలు చదివినంత మాత్రాన ప్రపంచంలోని విషయాలన్నీ అర్ధమైపోతాయన్నట్లుగా కమ్మీలు ప్రవర్తిస్తారు” అని మీమీద వ్యాఖ్యలు చేసినప్పుడు, “మీరుమాత్రం మీపురాణాల్లోనే అన్నింటికీ వివరణలున్నాయని అనుకోవడంలేదూ” అని ఎందుకు ప్రతి సమాధానమివ్వరు?
    2. “@*$ ఎమిచేసినా అది ధర్మమే. ఆయన విగ్రహవాన్ ధర్మ:” అంటూ వెర్రికూతలు కూసినప్పుడు మీరుమాత్రం మార్క్సో విగ్రహవాన్ ధర్మ: అనో సామ్యవాదో: విగ్రహవాన్ ధర్మ: అనో అనడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?
    3. కమ్యూనిజం సైన్సుకాదని వారన్నప్పుడు ‘Religious science’ అన్న పదాన్ని ఆప్ నంగా కర్‌కే క్యో నహీ మార్‌తే హో?
    4. సమానత్వం, మానవత్వం అన్నవి నిజానికి సామ్యవాద విలువలు (రష్యా, చైనాల్లోని కమ్యూనిష్టు రాజ్యాలు వాటి పాటించి చచ్చినా ఛావకపోయినా). సామ్యవాదపు ప్రాబల్యం పెరిగాకే మతాలు వాటిని హైలైట్ చేసి, వాటికి వ్యతిరేకంగా ఉన్న కధలని (శంబూకవధ) మరుగున పడేయడమో, ప్రక్షిప్తాలని కొట్టిపారెయ్యడమో చేస్తున్నాయి. ఎందుకు మీలాంటివారు వాటిని మీ వాదనల్లో విస్మరిస్తారు?
    5. హిట్లర్ సాగించిన (మావో, స్టాలిన్‌లు సాగించారిని ప్రచారంలో ఉన్న) జనహననానికీ, ఖాండవనంలో అర్జునుడు సాగించిన జనహననానికీ (తప్పించుకోజూసినవారిని తిరిగి మంటల్లోకి నెట్టేసారని భారత మూలంలోనే ఉందని చదివాను) తేడా ఏమిటని ఎందుకు మీరు ఎదురు ప్రశ్నించి, వారిని తలదించుకొనేలా చెయ్యరు?
    6. Is there been any religion that is free from incest, extraneous sex and violence? Why don’t you guys bash those holier-than-thou people we encounter in the blogosphere?
    7. Why do you guys accept the attacks on your morals while the identical morals go un-bashed under the guard of religion.

  16. విశేషజ్ఞ గారు,

    స్త్రీ-పురుష సంబంధాల విషయంలో నేను కొంచెం కఠినంగా వాదించడానికి బలమైన కారణాలే ఉన్నాయి. సినిమాలో హీరోయిన్ చీర జారి ఆమె ఊరుమూలం కనిపించే సన్నివేశం వచ్చినప్పుడు హాల్‌లో తండ్రి-కొడుకులు కూడా కలిసే ఆ సన్నివేశం చూస్తారు. అలాగే భోగం వీధిలో తండ్రితో పడుకున్న భోగకాంతతోనే కొడుకు పడుకోడని guarantee లేదు. బూతు చూడడానికి లేదా అక్రమ సంబంధం పెట్టుకోవడానికి వరసలు అవసరం లేదనుకునేవాళ్ళు పెళ్ళి విషయంలో మాత్రం వరసలు ఎందుకు పాటిస్తున్నారు?

    ఒక సినిమా నటి నగ్న సౌందర్యాన్ని వరసలు లేకుండా అందరూ ఎంజాయ్ చేసే సమాజంలో కుటుంబ స్త్రీలు మాత్రం సినిమా నటుల్లాగ నిక్కర్‌లూ, మినిస్కర్త్‌లూ వేసుకునే ధైర్యం ఎందుకు చెయ్యడం లేదు? సినిమా నటి చేసేది వ్యాపారమే కావచ్చు. డబ్బులు వస్తాయనిపిస్తే చెత్త బట్టలు వేసుకుని మగవాళ్ళని రంజింప చెయ్యొచ్చు కానీ డబ్బులు రావనిపిస్తే ఒంటి నిండా చీర కట్టుకుని ఉండాలా? ఇలాంటివి చూస్తే మన సమాజంలో ఉన్నది నీతి అనిపిస్తుందా, హిపోక్రిసీ అనిపిస్తుందా?

    చెత్త బట్టలు వేసుకునేవాళ్ళు వ్యాపారం కోసం అవి వేసుకుంటారు. ఆ వ్యాపార సంస్కృతి నమ్ముకుని బతికేవాళ్ళ ప్రైవసీ గురించి మార్క్సిస్త్‌లు ఆలోచించక్కరలేదు కనుకనే నేను దీపికా పడుకొణే పై పోస్త్ విషయంలో విశేఖర్ గారిని విమర్శించాను. అంతే కానీ నేను మన మాజీ పోలీస్ బాస్ దినేష్ రెడ్డిలాగ స్త్రీలు modest బట్టలు వేసుకోకపోతే రేప్‌లు జరుగుతాయని వాదించలేదు. రేప్‌లు చేసేవాడు బురఖా వేసుకున్న స్త్రీని కూడా వదలడని నేను ఈ బ్లాగ్‌లోనే వ్రాసాను.

    మతం విషయానికి వస్తే, వ్యక్తిగత చైతన్యం లేనివానికి సామాజిక చైతన్యం కూడా ఉండదు కనుక వ్యక్తిగతంగా అభివృద్ధి నిరోధకమైన నమ్మకాలన్నిటినీ కమ్యూనిస్త్‌లు వ్యతిరేకిస్తారు. అంతే కానీ నాస్తికహేతువాద సంఘాలలాగ కేవలం జనంలోని వ్యక్తిగత నమ్మకాలని మార్చే అజెందా మార్క్సిస్త్‌లు పెట్టుకోరు. అంతమాత్రాన మతవాదులు చేసే ప్రేలాపనలకి కమ్యూనిస్త్‌లు సమాధానం చెప్పలేకపోతున్నారనుకోకూడదు.

  17. “బూతు చూడడానికి లేదా అక్రమ సంబంధం పెట్టుకోవడానికి వరసలు అవసరం లేదనుకునేవాళ్ళు పెళ్ళి విషయంలో మాత్రం వరసలు ఎందుకు పాటిస్తున్నారు?” అయ్యా! ఏమిచెప్పను? అప్సరసాసంభోగాసక్తతకొద్దీ మంచిగా మసలుకోవడం ప్రస్తుత రీతి. తండ్రీ, కొడుకూ మరియూ అదే రంభతో కూడడం somehow incest కాదు 🙂

    “చెత్త బట్టలు వేసుకునేవాళ్ళు వ్యాపారం కోసం అవి వేసుకుంటారు. ఆ వ్యాపార సంస్కృతి నమ్ముకుని బతికేవాళ్ళ ప్రైవసీ గురించి మార్క్సిస్త్‌లు ఆలోచించక్కరలేదు కనుకనే నేను దీపికా పడుకొణే పై పోస్త్ విషయంలో విశేఖర్ గారిని విమర్శించాను. అంతే కానీ నేను మన మాజీ పోలీస్ బాస్ దినేష్ రెడ్డిలాగ స్త్రీలు modest బట్టలు వేసుకోకపోతే రేప్‌లు జరుగుతాయని వాదించలేదు. రేప్‌లు చేసేవాడు బురఖా వేసుకున్న స్త్రీని కూడా వదలడని నేను ఈ బ్లాగ్‌లోనే వ్రాసాను. ”

    మీ కామెంటుతో ఏకీభవిస్తున్నాను -ఈ ఒక్క paragraph దక్క.

    ఒకరు చేసిన పని మీకు నచ్చనంత మాత్రాన, వారికి ప్రైవసీ హక్కులేదనడాన్ని నేను అంగీకరించలేను (మిరన్నదాన్ని కొంచెం వక్రీకరిద్దాం. మీరు చెప్పినట్లునడుచుకుంటేనే వారి ప్రైవసీ హక్కులకోసం మీరు పోరాడతారా?). ఒకరు తమ ఇష్టప్రకారం నడుచుకోవడాన్నీ, వారిపైన జరిగే బలవంతాన్నీ distinguish చెయ్యాలని నేనంటాను. నాకు icecream తినడం ఇష్టమనుకుంటే, నాకు నచ్చినప్పుడు నేను తింటాను. It doesn’t mean that somebody has a right to force a block of ice down my throat. And if that is what were to happen, I wouldn’t expect Marxists -like you- to watch the spectacle with nonchalance.

  18. మరోసారి చెప్పాల్సి వస్తోంది. ప్రవీణ్ వ్యక్తం చేసిన పై అభిప్రాయాలు మార్క్సిజం కాదు. కనీసం అభ్యుదయం కూడా కాదు. అదో రకం పైత్యం. ఎదుటివారు ఏం చెబుతున్నారో అర్ధం చేసుకోవడం మానేసి తా పట్టిన కుందేలుకు మూడే కాళ్లని నమ్మే రకం పైత్యం. ఈ పైత్యానికి మందు లేదు. విరుగుడు లేదు. ఇలాంటి పుచ్చు భావాలు వ్యక్తం చేస్తూ తాను గొప్ప స్త్రీవాదినని నమ్మడం ప్రవీణ్ గారికి మాత్రమే చెల్లును.

    ప్రవీణ్ గారూ, మీరు మార్క్సిస్టు-లెనినిస్టు అన్న పేరు పెట్టుకోకండి. అది మీకు నప్పదు. లేదా మార్క్సిస్టు ఆలోచన లేకపోతే పోయే, కనీసం ప్రగతిశీలకరంగా అయినా ఆలోచించడం నేర్వండి. ఈ విషయాన్ని మీకు అర్ధం అయ్యేలా చెప్పేవాళ్లు ఈ భూమండలంలో ఎవరైనా ఉంటే గనక వారికి చేతులెత్తి మొక్కడానికి నేను గట్టిగా నిర్ణయించుకున్నాను.

  19. నా వాదం అభ్యుదయం కూడా కాదా? మరి అభివృద్ధి నిరోధక నమ్మకాలలోనే మునిగి తేలేవాళ్ళ మాట ఏమిటి?

    నేను ఒక బ్లాగ్‌లో “పిన్ని వరస స్త్రీని పెళ్ళి చేసుకోవడం తప్పెలా అవుతుంది?” అనే ప్రశ్న అడిగాను,

    దానికి ఒక బ్లాగర్ చేసిన వ్యాఖ్య ఇది: “వీడు తన పిన్నిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు, సమాజం అందుకు ఒప్పుకోలేదని ఛీ పాడు సమాజం అంటూ సమాజం మీద ద్వేషం పెట్టుకుని ఈ ప్రశ్నలు వేస్తున్నాడు”.

    ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళవి అభివృద్ధి నిరోధక నమ్మకాలైతే వీళ్ళ కంటే ఎంతో మెరుగ్గా ఆలోచించే నావి అభ్యుదయం కూడా కావట!

    నేను పిన్ని వరస స్త్రీని పెళ్ళి చేసుకుంటే పెట్టుబడిదారీ వ్యవస్థలోని వ్యక్తి స్వేచ్ఛావాదం పేరు చెప్పి నేను చేసిన పనిని సమర్థించుకోగలను. “ఛీ పాడు సమాజం” అని సంకుచితంగా అనుకోవాల్సిన అవసరం నాకు లేదు.

    ఒక పెట్టుబడిదారుడు ఇంకో పెట్టుబడిదారుని మీద patent ఉల్లంఘన కేస్ పెడితే దాని గురించి కార్మిక సంఘం నాయకుడు పట్టించుకోడు. ఒక అశ్లీల నటి ఒక అశ్లీల పత్రిక మీద privacy intrusion కేస్ పెట్టినా దాని గురించి స్త్రీవాదులు పట్టించుకోనక్కరలేదు.

  20. శెఖర్ గారూ మీ రచన స్టాలిన్ మంచివాడనీ, కాకపొతే కిందిస్తాయి కార్యకర్తలు దాన్ని పాటించలేదని నేపమంతా కార్యకర్తలమీద వేశారు. కాని లెనిన్ నే లెనిన్ సంఖలిత రచనలలొ స్టాలిన్ గురించి అతడు (స్టాలిన్) డూకుడు స్వబావం గలవాడనీ పార్టీ పగ్గాలు అతనికి ఇవ్వద్దనీ చెప్పాడు. బెతల్ హొం రచనలొకుడా రైతులభుములు సమిస్టి బాగస్వమ్యానికి తేవడానికి కార్యకర్తలకు తార్గెట్లు నిర్నయించి దాన్ని పూర్తి చెయ్యనివానికి రకరకాల డండనలు విధించాడు. అలాగే రైతులు దానిలొ బాగస్వామ్యం కానివాళ్ళకు ఇంట్లొనుంచి వ్యవసాయం పనిముట్లు తీసుకునిపొవడమూ వాళ్ళను వెలివేయటమూ ఇంకా రకరకాల దారునానికి పాల్పడ్డాడు. ఆ సమయంలొ సుమారుగా 6 లక్షలమంది సనిపొయినట్టు చెప్పుతున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s