నాయకుడు: “లే, లే! మనం పోరాడాలి!”
కురువృద్ధ పార్టీ: “నన్ను కూలదోసింది ఎవరూ!? (నువ్వు కాదూ?)”
***
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఓటమి సంపూర్ణం అయిందని రాజకీయ విశ్లేషకులు, పత్రికలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సమీప భవిష్యత్తులో ఆ పార్టీ కోలుకోవడం చాలా కష్టం అని తీర్మానిస్తున్నారు. కానీ పాజిటివ్ ఓటు కంటే నెగిటివ్ ఓటే ఎక్కువ ప్రభావం కలిగించే పరిస్ధితుల మధ్య ఆ పార్టీని కొట్టిపారేయడం తొందరపాటుతనమే కాగలదు.
అయితే అందుకు ఒక షరతు ఎలాగూ ఉండనే ఉంది. ఆ పార్టీ కోలుకోవడానికి తగిన అంతర్గత పరిస్ధులే అతి ప్రధాన షరతు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు. ఏ పార్టీ అయినా సరే తన పనితనాన్ని రుజువు చేసుకోవాలంటే ఆ పార్టీ అంతర్గత నిర్మాణం, పని విధానం సక్రమంగా ఉండాలి. నాయకత్వం శక్తివంతంగా ఉండడమే కాకుండా దిగువ నాయకత్వం, కార్యకర్తలు సైతం తమ నాయకత్వానికి తగిన శక్తిని అందించగలగాలి.
కానీ కాంగ్రెస్ కు ఇప్పుడు అదే లోపించింది అని కార్టూన్ సూచిస్తోంది. కాంగ్రెస్ యువరాజుగా రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ ఇప్పటికీ తన నాయకత్వ ప్రతిభ ఏపాటిదో రుజువు చేసుకోలేకపోయారు. లేదా ఆయన ఇప్పటికే తన శక్తియుక్తులను రుజువు చేసుకుని ఉన్నట్లయితే తనకవి లేవని రుజువు చేసుకున్నట్లే.
ఇలా అనడానికి కారణం ఎన్నికల్లో ఆ పార్టీ ఎదుర్కొన్న ఘోర ఓటములు కాదు. ముందే చెప్పినట్లు పాజిటివ్ ఓటు కంటే నెగిటివ్ ఓటే ఎక్కువ ప్రభావం కలిగిస్తున్నప్పుడు వరుసగా ప్రభుత్వాలు నడిపిన పార్టీ ఓటమిని ఎదుర్కోక తప్పదు. రెండుసార్లు వరుసగా ప్రభుత్వం నడిపిన పార్టీ మూడోసారి కూడా గెలిస్తే గనక అది ఆ పార్టీ ఘనతగా కంటే, ప్రతిపక్షం చేతగానితనంగా మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. భారత దేశంలో ఉన్న పరిస్ధితులు అలాంటివి.
మరి ఇలా అనడానికి ఏమిటి కారణం? ఆ పార్టీ నాయకత్వంతో పాటు, ప్రస్తుత నాయకత్వం తప్ప మరో గత్యంతరం లేని పరిస్ధితిలో కాంగ్రెస్ ఉంది చూసారూ, అదే ఈ పరిస్ధితికి కారణం. ఎంత ఘోరం అంటే, ది హిందూ పత్రికలో ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించినట్లు, ఆ పార్టీ కనీసం ప్రయత్నం చేయడం కూడా మానేసింది.
ఎన్నికల యుద్ధంలో దిగిన తర్వాత ఓటమి తప్పదని తెలిసినా సరే, చివరి వరకూ ప్రయత్నించడం, పోరాడడం రాజకీయ పార్టీల కర్తవ్యం. లేనట్లయితే వారు చెప్పే రాజకీయ సిద్ధాంతాలను (అవి ఎంత బూటకం అయినా సరే) చెప్పడమే దండగ. అసలు అలాంటి పార్టీ ఉనికిలో ఉండడమే దండగ. కాడి కింద పడేసి ప్రత్యర్ధికి గెలుపును బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించే పార్టీ ఉనికిని జనం ఎందుకు గుర్తించాలి గనుక?
కాంగ్రెస్ ఈ పరిస్ధితిలో ఉండడానికి కారణం ఆ పార్టీ నేత రాహుల్ గాంధీయే అని కార్టూన్ ఎత్తి చూపుతోంది. ఆయనే తన పార్టీని బలహీనపరిచారని, చివరికి ఆయన కాస్త ఊపు తెచ్చుకుని ‘పోరాడదాం’ అన్నా సరే, లేవలేని విధంగా కూలబడిపోయిందని కార్టూన్ చెబుతోంది. ఎన్నికల వరకు తీసుకుంటే ఇది నిజమేనన్నది కనిపిస్తున్న విషయమే.
లోక్ సభ ఎన్నికలు తీసుకున్నా, ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికలు తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాహుల్ గాంధీ నుండి వచ్చిన ప్రోత్సాహం ఏమీ లేదు. అసలు ఆయన నిర్వహించిన ఎన్నికల ర్యాలీలే చాలా తక్కువ. ఎలాగూ ఓడిపోతాం గదా అన్న ఉదాసీనతే ఆయనలోనూ పార్టీలోనూ కనిపించిందని విశ్లేషకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలవైపు నుండి చూస్తే దీనిని కాంగ్రెస్ పార్టీ ఉదాసీనతగా కంటే పాలకవర్గాల ఐక్యతగా చూడడమే సబబు కాగలదు. కాంగ్రెస్ పార్టీ అవినీతి వల్లనైతేనేమీ, కాంగ్రెస్, బి.జె.పి ఇరు పార్టీల పాలనలోనూ అనేక కుంభకోణాలు వెలుగు చూడడం వల్లనైతేనేమీ, కాంగ్రెస్-బి.జె.పి ల మధ్య పెద్దగా తేడా లేదని ప్రజలకు అంతకంతకూ ఎక్కువగా ఎరుకలోకి రావడం వల్లనైతేనేమీ… రాజకీయ వ్యవస్ధ, పాలనా వ్యవస్ధ పటిష్టంగానే ఉన్నాయని చూపవలసిన అగత్యం పాలవర్గాలు అందరికీ కలిగింది. ఆ విధంగా ఒనగూరిన ఐక్యత వెనుక విదేశీ సామ్రాజ్యవాదుల ఒత్తిడి ఉన్నా ఆశ్చర్యం లేదు.
Asalu congress endukuu levadam? Levaalani evaru korukuntunnaaru?
ka cha ra bhaashalo cheppante aa party ni bonda pettandi
Telugu vaari maatallo …aaparty ni bhoosthapitham cheyyandi.
Andhrula manobhaavaalu……congress ni thala ettakundaa cheyyandi
Bharatha prajalu …ee party ni samoolangaa naasanam cheyyalani kankanam kattukunnaaru. So ade manchidi.