భారత దేశంలో ఇస్లామిస్టు సంస్ధలు ‘లవ్ జిహాద్’ కు కుట్ర చేస్తున్నాయని చెప్పడానికి మీరట్ అమ్మాయి కేసు పాఠ్య గ్రంధం లాంటి ఉదాహరణగా ఆర్.ఎస్.ఎస్ తదితర హిందూత్వ సంస్ధలు కోడై కూశాయి.
తనను కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లి చేసుకుని, అత్యాచారం చేశారని ఆ అమ్మాయి మొదట్లో ఆరోపించింది.
ఆ తర్వాత అసలు సంగతి వెల్లడిస్తూ రాజకీయ పార్టీలు, సంస్ధల ఒత్తిడితో, తన తండ్రి బలవంతం చేయడంతో తాను ఆ విధంగా చెప్పానని, తన తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉంది కనుక రక్షణ ఇవ్వాలని కోర్టుకు మొరపెట్టుకుంది.
తాను ముస్లిం అబ్బాయిని ప్రేమించి, తన ఇష్టంతోనే అతనితో వెళ్లానని చెప్పింది.
ఇంత జరిగినా, ‘పాఠ్య గ్రంధం’ లాంటి కేసుగా చెప్పిన కేసు వాస్తవానికి తమ ఒత్తిడి వల్లనే పుట్టిన కేసుగా రుజువైనా, ఆర్.ఎస్.ఎస్ మాత్రం ‘లవ్ జిహాద్’ భారత స్త్రీ గౌరవాన్ని గాయపరుస్తోందంటూ తప్పుడు ప్రచారానికే కట్టుబడుతోంది.
భారత స్త్రీ గౌరవాన్ని వారి వ్యక్తిత్వంలో, వారి ఇష్టపడి వ్యక్తం చేసే ప్రేమలో కాకుండా, తాము అల్లుకున్న ఊహాగానాల్లో చూడడమే ఆర్.ఎస్.ఎస్ కి ప్రయోజనం కావచ్చు గానీ అది భారత స్త్రీకి గౌరవం అవుతుందా? అవుతుందని ఆర్.ఎస్.ఎస్ నేతలు నొక్కి చెబుతున్నారు.
ఆర్.ఎస్.ఎస్ ‘సర్కార్యవహ’ సురేష్ భయ్యాజీ ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత 10, 15 సంవత్సరాలుగా హిందూ సమాజం ‘లవ్ జిహాద్’ ను ఎదుర్కొంటోందని ఆయన వాపోయారు. “మతపరమైన దృక్కోణం జోలికి పోకుండా చూస్తే, అది (లవ్ హిహాడ్) స్త్రీల గౌరవాన్ని గాయపరుస్తోందనడం లోనూ, వారికి అన్యాయం జరుగుతోందనడం లోనూ ఎటువంటి సందేహమూ లేదు” అని సురేష్ భయ్యాజీ అన్నారని పత్రికలు తెలిపాయి.
‘లవ్ జిహాద్’ అన్న ప్రచారమే మతవిద్వేషపూరిత ప్రచారం. దానిని వ్యక్తిగత ఇష్టాయిష్టాల పరంగా కాకుండా మతపరమైన దృక్కోణంలో చూస్తున్నదే ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ సంస్ధలు. అలాంటిది మత దృక్కోణం లో కాకుండా చూస్తే స్త్రీలకు గౌరవభంగం అని చెప్పడం ఏమిటో అర్ధం కాని విషయం.
పత్రిక విలేఖరులు అప్పటికీ మీరట్ అమ్మాయి ఉదాహరణను ఎత్తి చూపారు కూడా. దాన్ని ఆయన ‘మృత సమస్య’ గా చెప్పి తప్పించుకున్నారు. నిజమే అది మృత సమస్యే. ఎందుకంటే ఆ సమస్య ఆర్.ఎస్.ఎస్ ఊహాగానాలకు ఇక ఎంతమాత్రం సరిపోయే విధంగా లేదు. పైగా బి.జె.పి, ఇతర మత సంస్ధలు పుట్టించిన అబద్ధపు ప్రచారాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చే ‘ఇష్టం లేని’ వాస్తవం. కనుక అతి ‘మృత సమస్య’గా మారదమే ఆర్.ఎస్.ఎస్ కి కావాలి. ‘సజీవ సమస్య’గా కొనసాగితే ఆర్.ఎస్.ఎస్ ప్రచారం తప్పుడు ప్రచారంగా తేల్చేస్తుంది. ఈ ప్రచారంలో హిందూ మతోన్మాద సంస్ధలదే ప్రధాన హస్తం అని రుజువు చేస్తుంది.
ఎవరీ మీరట్ అమ్మాయి?
ఉత్తర ప్రదేశ్ లో మీరట్ సమీపంలోని ఒక గ్రామంలో 22 యేళ్ళ అమ్మాయి ఒకరు గత ఆగస్టులో హఠాత్తుగా వార్తలకెక్కారు. ముస్లిం యువకులు కొందరు ఆమెను కిడ్నాప్ చేశారని, సామూహిక అత్యాచారం చేశారని, కలీమ్ అనే యువకుడు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని ముస్లిం మతంలోకి మార్చారని ఆమె ఆరోపించింది. అప్పటికి సహారన్ పూర్ లో మతకొట్లాటలు రెచ్చగొట్టబడ్డాయి. దాడులు, హననాలు సాగుతుండగా వెలువడిన ఈ ఆరోపణలను హిందూత్వ సంస్ధలు నెత్తిన ఎత్తుకున్నాయి. మీరట్ అమ్మాయి కేసు ‘లవ్ జిహాద్’ కు పాఠ్య గ్రంధం లాంటి ఉదాహరణ అని టాం టాం వేశాయి. బి.జె.పి ఎం.పి యోగి ఆదిత్యనాధ్ దానిని యు.పి. ఉప ఎన్నికల్లో ప్రచారాంశంగా వాడుకున్నారు. అయినా బి.జె.పికి ఫలితం దక్కలేదు.
ఇలా ఉండగా అక్టోబర్ 13 తేదీన అమ్మాయి తమ ఇంటినుండి పారిపోయి వచ్చి పోలీసుల శరణు వేడింది. తనకు తన తల్లి దండ్రుల నుండి ప్రాణ భయం ఉందని ఫిర్యాదు చేసింది. తమావాళ్లు తనని చంపడానికి చూస్తున్నారని పేర్కొంది. తాను గతంలో ఆరోపించినట్లుగా తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పింది. అత్యాచారం మాట అబద్ధం అని తెలిపింది. తాను కలీం ను ప్రేమించానని, తన ఇష్టాపూర్వకంగానే అతన్ని ఇష్టపడ్డానని, తాను అతన్నే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. తనకు రక్షణ ఇవ్వాలని కోర్టును కోరింది. ఆమె కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే హోమ్ లో ఉంచాలని కోర్టు ఆదేశించింది.
“నేను నా తల్లిదండ్రులతో ఉంటున్నాను. కాని నేను ఆ ఇంటి నుండి పారిపోయి వచ్చాను. ఎందుకంటే నాకు అక్కడ ప్రాణహాని ఉంది. మరో మతానికి చెందిన అబ్బాయితో నేను ఇష్టపూర్వకంగానే వెళ్ళాను” అని అమ్మాయి చెప్పిందని పత్రికలు తెలిపాయి.
“అమ్మాయి ఇంటినుండి పారిపోయి ఒక మహిళా పోలీసు స్టేషన్ ను ఆశ్రయించింది. అనంతరం ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచ్చాము. తాను నారీ నికేతన్ లో ఉంటానని అమ్మాయి మేజిస్ట్రేట్ కు విన్నవించుకుంది. దానితో మేజిస్ట్రేట్ ఆమెను మీరట్ నారీ నికేతన్ కు పంపారు” అని మీరట్ రూరల్ ఎస్.పి ఎం.ఎం.బేగ్ పత్రికలకు తెలిపారు.
మరో మూడు రోజుల తర్వాత మీరట్ అమ్మాయి కధ మరో మలుపు తిరిగింది. అక్టోబర్ 16 తేదీన అమ్మాయి తండ్రి నరేంద్ర త్యాగి మరిన్ని నిజాలతో ముందుకు వచ్చాడు. దీనంతటికీ రాజకీయ పార్టీలే కారణం అని ఆయన అసలు గుట్టు విప్పారు. అమ్మాయికి సొంత నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చిందని, తాను ఎవరిని ఇష్టపడితే వారిని పెళ్లి చేసుకునే హక్కు ఆమెకు ఉన్నదని చెప్పేశారు. అమ్మాయితో తనకు ఇక సంబంధం లేదని చెప్పారు. తన కూతురు వ్యక్తిగత జీవితంతో రాజకీయ పార్టీలు ఆటలాడుకున్నాయని స్పష్టం చేశారు. బి.జె.పి ఎన్నికల నినాదం ‘లవ్ జిహాద్’ ప్రచారానికి వాడుకునేందుకు తన కూతురి జీవితాన్ని ఉపయోగించారని ఆయన చివరికి గ్రహించారు.
“ఆమె ఇప్పుడు ఎదిగిన పిల్ల. ఆమెను బలవంత పెట్టడానికి మేమేవరం? అది ‘లవ్ జిహాద్’ అయినా సరే, కలీం ని ఆమె ఇష్టపడితే శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు. అతనితో సంతోషంగా ఉంటే అదే కానీయండి. అమ్మాయి ఇంటికి వస్తుందా లేదా అన్నది ఇక నాకు అనవసరం. ఆమెతో నాకు సంబంధం లేదు. ఆమె వ్యక్తిగత జీవితంలోకి రాజకీయ పార్టీలు చొరబడి అనవసరంగా హంగామా చేశాయి. మేము ఆమె తల్లిదండ్రులం. ఆమె వ్యక్తిగత జీవితాన్ని రచ్చకెక్కించడం మాకు ఇష్టం లేదు. రాజకీయ పార్టీలే మా దగ్గరికి వచ్చి అనవసర వివాదం సృష్టించాయి. దీని నుండి స్వప్రయోజనం పొందాలని చూశాయి” అని అమ్మాయి తండ్రి పత్రికలకు చెప్పారు. అయితే అమ్మాయి తమపై మోపిన హత్యాప్రయత్నం కేసు వెనక్కి తీసుకోవాలని ఆయన కోరాడు. ఆమె మంచిని కోరినందుకు తమకు శిక్ష వేయొద్దని కోరాడు. అమ్మాయి కేసు వల్లనే ఆమె తల్లిదండ్రులు అసలు నిజాలను వెల్లడించారని దీని ద్వారా అర్ధం అవుతోంది.
లవ్ జిహాద్ ఉన్నది ఊహల్లోనే
లవ్ జిహాద్ ఎంత వాస్తవమో ఒక్క మీరట్ అమ్మాయి ఉదంతమే చెబుతోంది. భారత సమాజంపై సామ్రాజ్యవాద ఆర్ధిక పెత్తనం రుద్దుతున్న ఆర్ధిక దోపిడి అనివార్యంగా సామాజిక ధోరణులలో ఉపరితల మార్పులను తెస్తోంది. ఈ మార్పులలో భాగంగా యువతీ యువకులు పాత సామాజిక బంధనాలను తృణీకరిస్తూ కొత్త సంబంధాలను ఆహ్వానిస్తున్నారు. వారిలో కొందరు కుల, మత భావనలను సైతం తెంచుకుంటున్నారు. పాత సమాజంపై పని చేసే ఆధునిక సమాజ విలువల వల్ల అప్పుడప్పుడూ కలిగే సానుకూల ప్రభావంగా వీటిని చూడవచ్చు.
కానీ ఆర్.ఎస్.ఎస్ లాంటి శక్తులకు పాత సమాజాల వెనుకబాటు భావాలే నిరంతరాయంగా కొనసాగడం కావాలి. ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహించే అగ్రకుల భూస్వామ్య పెత్తందారీ వర్గాలకు రక్షణ ఇచ్చేదీ ఆ పాత కుళ్ళు విలువలే. ఆ విలువలు లేకపోతే వారి భావజాలానికి ఆదరణ ఉండదు. ఆదరణ ఉండకపోతే వారి రాజకీయ, ఆర్ధిక లక్ష్యాలకు, ఆశలకు నీళ్ళు వదులుకోవలసి ఉంటుంది. సమాజం వెనుకబడే ఉండాలి. కానీ వారికి మాత్రం సామ్రాజ్యవాద పెట్టుబడులైన ఎఫ్.డి.ఐలు మాత్రం కావాలి. సామ్రాజ్యవాద పెట్టుబడికి వారు దాసానదాసులు. బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర వారికి అందుకే లేదు. బ్రిటిష్ కు జో హుకుం కొట్టి దేశాన్ని వారికి అప్పగించినప్పుడు దేశంలో ఆధిపత్యంలో ఉన్నది వారు ప్రాతినిధ్యం వహించే అగ్రకుల ప్రతిభా సంపన్నులే. ఇప్పుడు అదే తరహాలో ఎఫ్.డి.ఐలకు ఎర్ర తివాచీ పరుస్తున్నారు.
దేశ ప్రజలకు గానీ, వారిలో భాగమైన స్త్రీలకు గానీ అత్యంత గౌరవ హీనం ‘ఊహల్లో మాత్రమే ఉండే’ లవ్ జిహాద్ లు కాదు. దేశ సంపదలను సమస్తం విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పే ఎఫ్.డి.ఐలను ఆహ్వానించడమే అసలైన గౌరవహీనం. కాంగ్రెస్ పాలనలో స్వదేశీ జాగరణ పేరుతో విదేశీ సరుకులు వాడరాదని ప్రచారం చేసిన హిందూత్వ శక్తులు తమ పాలనకు వచ్చేసరికి ఆ ఊసే ఎత్తడం లేదు. బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ ల అసలు రూపం ఇదే. వారి ప్రయోజనాల కోసం ప్రజలు పాత సమాజాల కుళ్లులో దొర్లుతూ ఉండాలి. తాము మాత్రం సామ్రాజ్యవాద పెట్టుబడులు విదిలించే సంపదలలో ఓలలాడాలి.
భాజపా నాయకులు తమ వ్యక్తిగత జీవితాలలో వెనుకబాటు నమ్మకాలని నమ్మరు. ఆ పార్తీ సీనియర్ నాయకులలోనే నలుగురు మతాంతర వివాహాలు చేసుకున్నారు. వాళ్ళ గురించి నేను ఇంతకముందే ఒకటిరెండు వ్యాఖ్యల్లో వ్రాసాను. వాళ్ళు జనం మీదకి మాత్రం వెనుకబాటు నమ్మకాలని రుద్దుతారు.
లవ్ జిహాద్ అనేది నిజంగా జరిగితే షానవాజ్ హుస్సేన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీలు చేసినది కూడా లవ్ జిహాద్ కాదా? వాళ్ళకి భాజపాలో ఉన్నత స్థానం ఎందుకు ఇచ్చినట్టు?
BJP gelupu gurinchi kuda raayandi.
Ee lov jihad gurinchi evaru antha interest chupinchadam ledu.
Inka chaalaa vishayaalu unnaayi.
Arunachala pradesh lo road China enduku objection pedutundo okasari rayandi.
appudappudu china, pakistan gurinchi kuda rayandi.
” వర్ణ సంకరం జరరగకుండా స్త్రీలపై విధించిన నిర్బందాలు దాన్ని ఆపలేకపోయాయి, జరగాల్సిన వర్ణసంకరం ఎప్పుడో జరిపోయింది ఈనాటి ఆధునికుడికి పూర్వికుల ఆప్రికా రక్తం అన్నీ జాతుల్లో ఉన్నదే, ప్రతి మనిషి హొమోషేపియన్ కు వారసులే” అంటారు కొడవంటి కుటుంబరావు గారు. భారత జాతి ఒక స్వచ్చంద జాతీ అయినట్లు అందులో ఏసంకరము జరగకూడదని విద్వేషాన్ని పెంచి పోషించటం ఒక రాజకీయ అవసరంగా సామ్రాజ్య వాధానికి దాసోహం అనే వర్గాలకు కావాలి. దానికి అనుకూలంగా చరిత్రతెలియని తరం ఒకటి దాపురించడం, లేదా తెలియకుండాచేయడం దానికి అందివచ్చిన పలాలై నాయి. అదీ స్త్రీల ఆత్మాభిమానానికి తామే రక్షకులమని చెప్పుకోవడం మరీ విడ్డూరం.
సర్, భారత సమాజంపై సామ్రాజ్యవాద ఆర్ధిక పెత్తనం రుద్దుతున్న ఆర్ధిక దోపిడి అనివార్యంగా సామాజిక ధోరణులలో ఉపరితల మార్పులను తెస్తోంది-మరి అంతర్గత మార్పులు ఎలా సంభవిస్తాయి? అసలవి ఎలా ఉంటాయి?
వీలైతే వివరించగలరు?
షానవాజ్ హుస్సేన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీలతో సహస్ నలుగురు భాజపా సీనియర్ నాయకులు మతాంతర వివాహాలు చేసుకున్నారు. ఇవి వాళ్ళ వ్యక్తిగత విషయాలని భాజపా అభిమానులు సమాధానం చెప్పగలరు. తాము వ్యక్తిగతంగా నమ్మని భావజాలాన్ని జనం నమ్మాలనుకోవడం అభ్యంతరకరమే. విదేశీ పెట్టుబడులు తప్ప ఏదీ అవసరం లేదనుకోవడానికి మతం పేరు చెప్పుకోవడం ఎందుకు? సామ్రాజ్యవాదుల మోచేతి నీళ్ళు తాగే దేశానికి నాస్తికుడు ప్రధానమంత్రైనా అతను విదేశీ పెట్టుబడులని ఆహ్వానించడం తప్ప ఏమీ చెయ్యడు.
ఇవ్వన్ని సంఘటనలు కూడ “లవ్ జిహాదేనా”…?1- అశోక్ సింఘాల్ కుమార్తెని బిజేపి మైనారీటీ నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పెళ్ళి చేసుకున్నడు2-మురళీ మనోహర్ జోషి కుమార్తె ని శాహనాజ్ హుస్సేన్ పెళ్లి చేసుకున్నడు3-మోడి సోదరుడి కుమార్తె వివాహం కూడ ఒక ముస్లీంతోనే జరిగింది4-అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ రెండవ వివాహం కూడ ఒక ముస్లీంతోనే జరిగింది5-సుబ్రమణ్య స్వామి కుమార్తె సుహాసాని స్వామి వివాహం సల్మాన్ హెయ్డర్ అనే ఒక ముస్లింతోనే జరిగింది6-ప్రవీణ్ తొగాడియా సోదరి కూడ ఒక ధనిక ముస్లీం ని పెళ్ళాడింది7-బాల్ థాకరే మనవరాలు నేహా థాకరే కూడ డాక్టర్ మహ్మద్ నబీఅనే ముస్లీంని పెళ్ళాడింది