మంచిరోజుల్లో మరో రోజు: కట్లు తెంచుకున్న డీజెల్


 

Disel deregulation

ప్రధాని మోడి హామీ ఒసంగిన మంచి రోజుల్లో మరో శుభ దినం రానే వచ్చెను. డీజెల్ ధరల్ని మార్కెటింగ్ కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తూ డీ-రెగ్యులేషన్ కు మోడి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ను పడదిడుతూ కూడా, అదే కాంగ్రెస్ ఏలికలు నియమించిన రంగరాజన్ కమిటీ ఫార్ములాయే ఆదర్శంగా దేశీయ గ్యాస్ రేట్లను ఎం.ఎం.బి.టి.యు ఒక్కింటికి 4.2 డాలర్ల నుండి 5.61 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం ఎం.ఎం.బి.టి.యు (మిలియన్ మెట్రిక్ బ్రిటిష్ ధర్మల్ యూనిట్) ఒక్కింటికి 8.4 డాలర్లకు గ్యాస్ రేటు పెంచవలసి ఉంది. అంతకాకపోయినా కనీసం 6 నుండి 7 డాలర్ల వరకు మోడి ప్రభుత్వం గ్యాస్ రేట్లు నిర్ణయిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. వారి అంచనా కంటే తక్కువ రేటునే ప్రైవేటు కంపెనీలకు చెల్లించేందుకు కేంద్రం నిర్ణయించింది కనుక ఇది ప్రజానుకూల నిర్ణయం అని కొందరు చెప్పబోతున్నారు. కానీ అందులో వాస్తవం లేదు. మోడి కేబినెట్ నిర్ణయాన్ని కాస్త దగ్గరగా పరిశీలిస్తే జనాన్ని మాయచేసే ప్రయత్నం జరిగిందని అర్ధం అవుతుంది.

రంగరాజన్ కమిటీ నిర్ణయం పూర్తిగా భారత ప్రజలకు వ్యతిరేక నిర్ణయం. ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ రంగరాజన్ చమురు, గ్యాస్ మార్కెట్ పోకడలు తెలిసిన గొప్ప నిపుణుడెమీ కాదు. ఆయనతో పాటు నిర్ణయంలో భాగం పంచుకున్న ఇతర కమిటీ సభ్యులలో అత్యధికులు కూడా ఆయనను మించినవారే. వారు రూపొందించిన ఫార్ములా కేవలం ప్రైవేటు బహుళజాతి గ్యాస్ కంపెనీలకు జనం సొమ్ము దోచిపెట్టడానికి ఉద్దేశించినది మాత్రమే.

సాధారణంగా ఒక సరుకు ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఆ సరుకు ధరను నిర్ణయిస్తుంది. భారత దేశంలో గ్యాస్ ఉత్పత్తికి కేంద్రం అనేక రాయితీలు ఇస్తుంది. దానితో ఉత్పత్తి ఖర్చు బాగా తగ్గిపోతుంది. ఒక అంచనా ప్రకారం ఇండియాలో ఒక ఎం.ఎం.బి.టి.యు గ్యాస్ ఉత్పత్తికి 2 డాలర్ల కంటే తక్కువే ఖర్చవుతుంది. ఇది అంతర్జాతీయ ధరల కంటే చాలా చాలా తక్కువ. కానీ రిలయన్స్ కంపెనీతో పాటు ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలలో కూడా విదేశీ బహుళజాతి కంపెనీలు భారీ వాటా కలిగి ఉన్నాయి. వాటికి దేశీయ ఉత్పత్తి ధర లాభ సాటి కాదు. అందుకే అవి ధరలు పెంచాలని భారత ప్రభుత్వంపై అనేక యేళ్లుగా ఒత్తిడి చేస్తున్నాయి. విదేశీ కంపెనీల ఒత్తిడికి తల ఒగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం రంగరాజన్ నేతృత్వంలో కమిటీ వేసి వారి చేత సిఫారసు చేయించుకుని అంతర్జాతీయ ధరలతో సమానంగా ఇక్కడి ధరలు చేర్చేందుకు పూనుకుంది. కమిటీ సిఫారసు అమలు చేసేలోపు వివిధ పరిణామాలు జరుగుతుండగానే ప్రభుత్వం మారిపోయింది.

ఇప్పుడు మోడి కేబినెట్ గ్యాస్ చెల్లింపు ధర 5.61 డాలర్ గా నిర్ణయించింది. ఇది పైకి చెప్పిన మూల ధర మాత్రమే. డీప్ వాటర్ నుండి గ్యాస్ వెలికి తీసే కంపెనీలు ఈ మూలధర పైన అదనంగా ప్రీమియం ధర వసూలు చేసే స్వేచ్ఛను మోడి కేబినెట్ కల్పించింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ అంతా డీప్ వాటర్ నుండి వెలికి తీస్తున్నదే. కనుక రిలయన్స్, ఓ.ఎన్.జి.సి, కెయిర్న్ (రాజస్ధాన్ బావి తప్ప) కంపెనీలు కేబినెట్ సిఫారసు చేసిన 5.61 డాలర్ రేటుకు అదనంగా ప్రీమియం ధర డిమాండ్ చేస్తాయి. ఈ ప్రీమియంతో కలుపుకుని రంగరాజన్ సిఫారసు చేసిన ధరకు సమానంగా కంపెనీలు వసూలు చేస్తాయా అన్నది కొద్ది వారాలు ఆగితే తెలుస్తుంది.

రంగరాజన్ కమిటీ సిఫారసును కేబినెట్ కాస్త సవరించడం వల్ల ధర తగ్గిందని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. ధర తగ్గడం కేవలం ఊహాత్మకమే. ఇప్పుడు కంపెనీలు వసూలు చేస్తున్న లేదా ప్రభుత్వం చెల్లిస్తున్న ధర 4.62 డాలర్లు. కనుక ధర వాస్తవంగా 0.99 డాలర్లు పెరిగింది. కమిటీ సిఫారసుతో పోల్చితే ‘ధర పెంపుదల’ తక్కువగా ఉన్నది తప్ప ధర మొదలుకైతే పెరిగిందన్న విషయాన్ని ఈ పత్రికలు దాపెడుతున్నాయి. జపాన్ నుండి, ఇండియా నుండి(?!) దిగుమతి చేసుకునేందుకు అయ్యే ఖర్చును రంగరాజన్ ధర నుండి తొలగించినందున ధర పెంపుదల తగ్గిందన్నది ప్రభుత్వ వివరణ.

ఇవన్నీ ఊహాత్మక ఖర్చులే తప్ప వాస్తవ ఖర్చులు కాదు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గ్యాస్ ను సింగపూర్ మార్కెట్ రేటుకు దిగుమతి చేసుకుంటున్నామని ఊహిస్తూ ఆ రేటుపైన ఊహాత్మక భీమా ఖర్చులు, రవాణా ఖర్చులు, ఇతర కస్టమ్ సుంకాలు కలిపి ఒక రేటును రంగరాజన్ కమిటీ నిర్ణయించింది. ఈ రేటు కంటే తక్కువకు జనం నుండి వసూలు చేస్తే దానిని నష్టంగా ప్రభుత్వాలు గుండెలు బాదుకుంటూ ప్రచారం చేస్తున్నాయి. పత్రికలు, ఛానెళ్లు సైతం సదరు ఊహాత్మక నష్టాలను నిజమైన నష్టాలుగా ప్రచారం చేసి పెడుతున్నాయి.

ఇలా ఉత్పత్తి ఖర్చులు లేకుండానే ఊహాత్మకంగా ధరలు పెంచడాన్ని రంగరాజన్ కమిటీ, యు.పి.ఏ, ఎన్.డి.ఏ ప్రభుత్వాలు నిస్సిగ్గుగా సమర్ధించుకుంతున్నాయి. వారు చెబుతున్నా కారణం దేశీయంగా ధరలు తక్కువగా ఉండేసరికి విదేశీ పెట్టుబడులు ఈ రంగంలోకి రావడం లేదట. విదేశీ కంపెనీల కోసమే కృత్రిమంగా ధరలు పెంచి జనాన్ని బాదుతున్నామని ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తెస్తున్న ప్రధాన స్రవంతి పత్రిక లేదా ఛానెల్ ఒక్కటంటే ఒక్కటీ లేదు. దాదాపు పత్రికలన్నీ కార్పొరేట్ కంపెనీలు నడుపుతున్నవే కావడంతో ఈ పరిస్ధితి నెలకొంది. ఒకటీ ఆరా ఇతర పత్రికలు, ఛానెళ్లు ఉన్నా అవి కూడా కార్పొరేట్ చందాలకు, యాడ్ లకు అమ్ముడుబోతున్నాయి. జనం నుండి నిజాలు దాచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి.

మోడి ప్రభుత్వ కేబినెట్ ఇప్పుడు ప్రకటించిన 5.61 డాలర్/ఎం.ఎం.బి.టి.యు అంతిమ ధర కాదు. దీనిని కంపెనీలు వసూలు చేసే ప్రీమియం అదనం. ఈ సంగతి ప్రస్తుతం గమనించాల్సిన ముఖ్య విషయం.

ఇక డీరెగ్యులేషన్ విషయానికి వస్తే ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు రుద్దిన వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమం, నూతన ఆర్ధిక విధానాలలో భాగమే డీజెల్ డీ-రెగ్యులేషన్. ఇది కాంగ్రెస్ విధానాలకు కొనసాగింపు. నీచే దిన్ గా బి.జె.ఈ/మోడి తిట్టిపోసిన కాంగ్రెస్ పాలనకు కొనసాగింపు. ఈ నిర్ణయం కాంగ్రెస్ చేస్తే నీచే దిన్, బి.je.పి/మోడి చేస్తే అచ్ఛే దిన్ అవుతుందా? సత్య హరిశ్చంద్రుడు గర్జించినట్లు “కాదు… కాజాలదు…!”

డీ రెగ్యులేషన్ అంటే డీజెల్ ధరలపై ప్రభుత్వం విధించే నియంత్రణను ఎత్తివేయడం. నియంత్రణ అంటే వాస్తవానికి అది నియంత్రణ కాదు. దిగుమతి ధరల పైన కేంద్రమూ, రాష్ట్రాలూ వసూలు చేసే రెట్టింపు సుంకాలలో కొంత భాగాన్ని తగ్గించి, ఆ భాగాన్ని దేశీయ రిఫైనరీ కంపెనీలకు ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లుగా, ప్రజలకు ఇచ్చే సబ్సిడీగానూ చెప్పడమే ప్రభుత్వం విధించే నియంత్రణ. ఇప్పుడు ఈ సబ్సిడీ భాగాన్ని కూడా ప్రజల నుండి వసూలు చేయడమే మోడి తీసుకున్న డీ రెగ్యులేషన్ నిర్ణయం. ఇక నుండి డీజెల్ రేట్లను కూడా అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడులు స్వేచ్ఛగా నిర్ణయిస్తాయి. ప్రభుత్వం కలుగజేసుకోదు. ఆ విధంగా ప్రభుత్వ విధుల్లో ఒక దానిని మోడి తగ్గించుకున్నారు. మోడి ఎన్నికల్లో చెప్పిన ‘కనిష్ట (చిన్న) ప్రభుత్వం, గరిష్ట పాలన’ నినాదానికి అర్ధం ఇదే.

డీజెల్ డీ రెగ్యులేషన్ వల్ల దాని రేటు లీటర్ కి రు. 3.37 తగ్గిందని ప్రభుత్వమూ, పత్రికలూ అదే పనిగా జబ్బలు చరుస్తూ, బాకాలు ఊదుతున్నాయి. వాస్తవం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం ఈ బ్లాగ్ లో చెప్పినట్లు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయి. అమెరికాలో షేల్ చమురు, గ్యాస్ ఉత్పత్తి పెరగడం, షెల్ చమురు ధర సాధారణ చమురు ధర కంటే తక్కువగా ఉండడము, చమురు ఉత్పత్తిని తగ్గించి ధరలు పెరిగేలా చూడాలన్న ఇతర ఒపెక్ దేశాల కోరికను సౌదీ అరేబియా పెడచెవిన పెట్టడం… ఈ కారణాల వల్ల కొద్ది వారాలుగా చమురు ధరలు పడిపోతున్నాయి. ఇప్పుడు తగ్గిన ధర మూడు వారాల క్రితమే తగ్గాలి. కానీ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల అనంతరం డీజెల్ డీరెగ్యులేషన్ చేయాలని మోడి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు’ అన్నట్లుగా జనానికి అచ్చే దిన్ సంగతేమో గానీ మోడికి మాత్రం సూపర్ అచ్ఛే దిన్ లు కలిసొస్తున్నాయి. ప్రజా వ్యతిరేక నిర్ణయమైన డీజెల్ డీ రెగ్యులేషన్ నిర్ణయం తీసుకోబోతున్న కాలంలోనే అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా జరిగి డీజెల్ ధరలు తగ్గించాయి. డీజెల్ డీ రెగ్యులేషన్, డీజెల్ ధర తగ్గుదల… ఇవి రెండూ వేరు వేరు పరిణామాలు. రెండూ ఒకేసారి జరగడంతో మొదటిదానివల్ల రెండోది జరిగినట్లు ప్రభుత్వం చెప్పుకోగలుగుతోంది. భవిష్యత్తులో క్రూడాయిల్ ధరలు ఎలాగూ పెరుగుతాయి. అప్పుడు డీజెల్, పెట్రోల్ ధరలు సామాన్యుడికి మహాభారమ్ కానున్నాయి. 

 

6 thoughts on “మంచిరోజుల్లో మరో రోజు: కట్లు తెంచుకున్న డీజెల్

  1. Well said sir,
    But I have one doubt if international companies could not invest and if our desi companies cant develop the best refining technology then pollution levels increses…. Our desi companies cant able to refine petroleum to further levels means beyond bharath stage five…. As of now desi companies are very old and inefficeint May this is the sin of politics but how to tackle the problem

  2. భరత్ గారూ, అదేమీ లేదు. మన రిఫైనరీలు ప్రపంచ స్ధాయి టెక్నాలజీని వాడుతున్నాయి. అవేమీ వెనకబడి లేవు. నిజంగా కాలుష్యం తగ్గించాలంటే సౌర విద్యుత్తు, పవన విద్యుత్తులను ప్రోత్సహించవచ్చు. సౌర విద్యుత్ తో జర్మనీ అద్బుతాలు సాధిస్తోంది. విదేశాల్లోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలలో అనేకమంది భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. వారికి సరైన ప్రోత్సాహం ఇస్తే ఇక్కడే ఉండి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడానికి వారికి అభ్యంతరం ఉండదు. కాకపోతే మన పాలకులు ఆ వైపు కృషి చేయడానికి పశ్చిమ దేశాలే ఒప్పుకోవు. R&D పై ఖర్చు చేయకుండా ఇండియా లాంటి దేశాలను అవి నిరోధిస్తాయి. తద్వారా తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటాయి. అది అంతిమంగా వ్యాపార ఆధిపత్యానికి గ్యారంటీ చేస్తుంది.

    అసలు సమస్య మన పాలకుల జాతీయత! దేశ (ప్రజల) ప్రయోజనాలకు వారు కట్టుబడి లేకపోవడమే సమస్య.

  3. sir, iam faculty in management that too in finance. it took three to four times reading to understand the concept, how a normal person who do not have knowledge can understand all these concepts except bearing this. is it not a cheating

  4. Dear Sir
    You are very true till now I didnt understand why our govt supporting nuclear energy and spending crores of public wealth on Americacan nuclear reactors instead of solar and wind energy. Our country’s southern tip has high potential for wind energy. They are simply not ready to tap it. Let us hope the scientists may come back to India.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s