కుర్చీలేని మహారాణి -కార్టూన్


 

Chairless queen

భారత దేశంలో మహా రాజులకు, మహా రాణులకు, యువరాజు, యువరాణిలకు కొదవలేదు. ఒకప్పడు రాజ్యాలు యేలి ప్రజలను పీడించుకు తిని సంపదలు కూడబెట్టిన రాజ్యాధీశులే నేడు ఆధునిక రాచరికం వెలగబెట్టడం కళ్ల ముందు కనపడుతున్న నగ్న సత్యం. ఆనాడు వారసత్వంగా రాచరిక ఆధిపత్యం సంక్రమించినట్లే నేడూ వారసత్వంగా రాజకీయ ఆధిపత్యం సంక్రమిస్తోంది. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను పడదిట్టిపోసే పార్టీలు కూడా తమ తమ వారసత్వాలను కాపాడుకుంటూ ప్రజల నెత్తిన గుడిబండల్ని మోపుతున్నారు.

ఒకనాటి రాచరికాలు కొనసాగుతుండగానే వారితో పాటు ప్రజల అభిమానంతో రాజ్యాధిపత్యం చెలాయించే అవకాశాన్ని కల్పించడమే ఆధునిక ప్రజాస్వామ్య లక్షణం. నేటి ప్రజాస్వామ్య సారం ఇదే. పీడకులను ఎంచుకునే స్వేచ్ఛ ఆధునిక ప్రజాస్వామ్య రాచరికం దయతో పీడితులకు ఇస్తుంది. అంతోసిదానికి ‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం’ అంటూ బిరుదు కూడా తగిలించుకున్నారు.

నేటి ప్రజాస్వామ్య సారం ఇది కాకపోతే అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు రుజువై కోర్టు శిక్ష వేసినప్పటికీ జయలలిత విడుదల కోసం వ్యవస్ధలన్నీ కూడబలుక్కోవడాన్ని ఎలా చూడాలి? జయలలిత, ఆమె సహచర నిందితులు ప్రయత్న పూర్వకంగా కోర్టు విచారణను 18 సం.ల పాటు సాగదీశారని  ట్రయల్స్ కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకూ ఏక గొంతుతో చెప్పాయంటే ఆ అవకాశం వారికి ఎలా వచ్చింది? జయలలితకు, ఆమె సహచర నిందితులకు 2 నెలలపాటు బెయిలు ఇవ్వడానికి సుప్రీం కోర్టు విధించిన షరతుల్లో ఒకటి: తదుపరి అప్పీలు విచారణను మరింత సాగదీసే ఎత్తులు వేయకూడదని.

దోషిగా దిగువ కోర్టు నిర్ధారించిన తర్వాత పై కోర్టుకు అప్పీలు చేసుకుంటే బెయిలు ఆటోమేటిక్ గా ఇవ్వాలని పేరుపొందిన ఉద్దండపిండ న్యాయవాదులు సుప్రీం కోర్టులో వాదిస్తే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య బెంచి తలూపి బెయిల్ ఇచ్చేసింది. సరే అనుకుందాం. కానీ ఇదే హక్కు సాధారణ దొషులు కాదు – నిందితులకే ఎందుకు ఇవ్వరు? కనీసం విచారణ కూడా లేకుండా భారత దేశ జైళ్ళలో వేలాది ఆదివాసీ ఖైదీలు మగ్గిపోతున్నా ఈ కోర్టులకు వారి హక్కులు వారికి ఇవ్వాలన్న సద్బుద్ధి ఎందుకు కలగదు? వారు జయలిత వలె పలుకుబడి కలిగిన, కొనుక్కొచ్చుకున్న జనసమూహాలు మెచ్చిన రాజులు, రాణులు కాకపోవడం వల్లనే కదా?!

ఆమె పదవిలో ఉండగా అధికారాన్ని వినియోగించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టిందని కోర్టులు నిర్ధారించవచ్చు గాక! ఏదో పొరబాటున చేసిన చట్టం వల్ల ఆమె ఎమ్మెల్యే పదవిని, తద్వారా మహారాణి (ముఖ్యమంత్రి) పదవిని కోల్పోవచ్చు గాక! ఆమె మాత్రం రాణి గారే, కాకపోతే కుర్చీ లేని రాణి, తన తరపున కీలుబొమ్మను కుర్చీలో కూర్చోబెట్టగల సర్వాధికార మహారాణి గారే! ఈ కార్టూన్, బహుశా, సూచిస్తున్నది ఈ అంశాన్నే!

 

3 thoughts on “కుర్చీలేని మహారాణి -కార్టూన్

  1. “పీడకులను ఎంచుకునే స్వేచ్ఛ ఆధునిక ప్రజాస్వామ్య రాచరికం దయతో పీడితులకు ఇస్తుంది.”
    హెంతమాటనేశారు! పాలకులు-పాలితులు అన్న దానిని పీడకులూ-పీడితులుగా మార్చేస్తారా? హన్నా..!

    I don’t understand why the HELL could/should a convicted be bailed. బెయిల్ అన్న ఆంగ్లపదాన్ని (మునిగిపోతున్నవాణ్ణి) చేదవేసి రక్షించడం/బయటపడెయ్యడం అనుకుంటే (after all that is what ‘bail-out packages’ mean right?), దోషులకు ‘చేదవేయడం’లోని అంతరార్ధమేమిటో న్యాయదేవతకే తెలియాలి.

  2. కుర్చీ లేక పోవడమేమిటి? మాయింట్లో బోలెడన్ని కుర్చీలున్నాయి. బంగారు కుర్చీ కావాలన్నా ఉంది. వెండి కుర్చీ కావాలన్నా ఉంది, వజ్రాలా కుర్చీ కావాలాన్న ఉంది. మరి లేని దేమిటి? రాజ్యాంగం తెలిసిన అమాయకులంతా అధికారం లేదంటారు. అది వాళ్ల మనసుల్లో లేదేమో అని భ్రమ పడుతున్నారు. వాస్తవంగా అధికారం చెలాయిస్తున్నపుడు కాగితాల్లో మీ లాంటి వారి మనసుల్లో అధికారం లేక పోతేనేమిటండీ! ప్రజలిచ్చిన అధికారం ఎవరు లాక్కో గలరు? తమిళం లో ఒక పాట ఉంది ” నా అసైందాల్‌ అసయుం అఖిళమెల్లా ” అన్నట్టు ( నేను కదిలితే నే విశ్వం కదులుతుంది. లేకపోతే నిలిచి పోతుందని భావం తో ఈశ్వరడు అంటారు) అలాంటి వారికి అక్షరాలాలో లేని అధి కారం ఉంటే నేమి లేకపోతేనేమి వాస్తవంలో జరుగుతున్నదే కావాలి. బౌతికంగా ఉన్నదే బ్రతుకు కాని. బావ వాధులకు తెలిసినంత బౌతిక వాధం బౌతిక వాదులకు తెలియదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s