కొద్ది రోజుల క్రితం ఢిల్లీ జూలో చోటు చేసుకున్న దుర్ఘటన గుర్తుంది కదా! తెల్ల పులిని దగ్గరి నుండి ఫోటోలు తీయబోయి పొరబాటున లోపలికి పడిపోవడంతో ఓ విద్యార్ధిని పులి చంపేసింది. ఆ హృదయవిదారక దుర్ఘటనను ఎవరో తమ సెల్ ఫోన్ లు చిత్రీకరించారు.
వీడియోను బట్టి చూస్తే పత్రికలు చెప్పినట్లు పులికి బలైన విద్యార్ధి కాదు దానిపై రాళ్ళు వేసింది. పులి ఆవాసం బైట ఉన్నవారు రాళ్ళు వేశారు. తాము పులి నుండి అతన్ని రక్షిస్తున్నామని భావిస్తూ వాళ్ళు పులి మీదికి రాళ్ళు విసిరారు. అలా రాళ్ళు విసరడం వల్లనే పులి అతన్ని నోట కరుచుకుని పక్కకు తీసుకెళ్లిందని కొందరి అభిప్రాయం.
ఈ అంశంపై గతంలో ప్రచురించిన వార్తను కింది లింక్ లో చూడవచ్చు.
పంజా దెబ్బతో యువకుడిని చంపిన తెల్లపులి
కానీ ఆ సంగతి ఎలా తెలుస్తుంది? ఊహించని పరిణామంతో అందరూ అతన్ని ఎలాగోలా రక్షించాలని తాపత్రయపడ్డారు. ఆ క్రమంలో వాళ్ళు తప్పే చేశారో, ఒప్పే చేశారో చెప్పడం కష్టం కావచ్చు. కానీ ఆ విద్యార్ధి తెలియక, అనుకోకుండా చేసిన పని వల్ల ఘోరమైన ఫలితాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్నది వాస్తవం.
Cats are very territorial (don’t we kill a snake -or another man for that matter if he enters our ‘ilakha’- even if it is harmless?). It is the student’s fault (even unknowingly) to violate the cat’s territorial rights and so did he pay for that. He took his risk for that photo and that didn’t workout well. period.
పొరపాటునో గ్రహ పాటునో విధ్యార్ది దుస్సా హాసానికి పాల్పడి నా, దీని వలన ఒక మానవనుభవాన్నిచ్చింది. ఈనుభవానికి మెరుగులు దిద్ది ఇంకో విధ్యార్దో, మరో టీనేజ్ పిల్లలో ఇలాంటి సంఘటనకు గురి కాకుండా చేస్తే ఆవిధ్యార్ది ధన్యుడవుతాడు. ఈ విధంగా అతని కి నివాళులర్పించడం మన మానవ ధర్మం. కాదంటారా?
Please read this story: http://www.india.com/whatever/was-the-white-tiger-saving-the-man-it-killed-in-delhi-zoo-162884/