(సెషన్స్ కోర్టు విధించిన శిక్షపై హై కోర్టుకు అప్పీలు చేసుకున్నందున హై కోర్టు విచారణ ముగిసేవరకు శిక్షను సస్పెండ్ చేయాలని, బెయిల్ ఇవ్వాలని చేసుకున్న జయలలిత విన్నపాన్ని కర్ణాటక హై కోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై ది హిందు పత్రిక ఈ రోజు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ ఇవ్వడానికి కర్ణాటక హై కోర్టు నిరాకరించడం వెనుక దొడ్డ సందేశం ఏదన్నా ఉంటే అది ప్రజా సేవకుల అవినీతిని న్యాయ వ్యవస్ధ ఎప్పటి కంటే ఎక్కువ తీవ్రంగా పరిగణిస్తుందని తెలియజెప్పడమే. సాధారణ పరిస్ధితుల్లోనైతే న్యాయం నుండి తప్పించుకోగలరని భావించడానికి వీలులేని వ్యక్తి 4 సంవత్సరాల జైలు శిక్షకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకున్నట్లయితే దానిని యధావిధి ప్రక్రియలో భాగంగా స్వీకరిస్తూ ఆమోదించడమే కాకుండా పెద్దగా ఆర్భాటం లేకుండా శిక్షను సస్పెండ్ చేసి ఉండేవారు. అయితే అవినీతిని ‘వ్యవస్ధాగత ఆర్ధిక నేరాలకు” దారి తీసే మానవ హక్కుల ఉల్లంఘనగానూ, “రాజ్యపాలన యొక్క స్వస్ధతనే బలహీనపరిచే తీవ్ర రోగం”గానూ అభివర్ణిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయాలు ప్రకటించిన నేపధ్యంలో, అవినీతి కేసులను హై కోర్టు మొత్తంగా భిన్నమైన పునాది మీదికి తరలించడానికే ఎంచుకుంది. నేరస్ధులుగా నిర్ధారించబడిన ప్రజా సేవకులు అప్పీలేట్ కోర్టు అందుకు విరుద్ధంగా నిర్ణయించేవరకూ అవినీతిపరునిగానే పరిగణించాలన్న రూలింగ్ ను హై కోర్టు ప్రస్తావించింది. జైలు శిక్ష సస్పెన్షన్ అన్నది యధావిధిగా జరిగిపోయే ప్రక్రియ కాదనీ, తగిన కారణాలు ఉంటేనే ప్రసాదించగల ఉపశమనం మాత్రమే అని కూడా హై కోర్టు చెప్పింది.
నేరం రుజువైయిన తర్వాత బెయిలు ఇవ్వడం అన్నది ట్రయల్స్ కు ముందరి దశలో ఇచ్చే బెయిలుతో సమానం కాదనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ట్రయల్స్ ముందరి దశలో (నేరం రుజువయ్యే వరకూ) నిందితుడు అమాయకుడు అన్న పూర్వ భావన ఉంటుంది. దానితోపాటు అప్పీలును సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడాన్ని మధ్యంతర ఉపశమనానికి ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించవచ్చు. జయలలిత మరియు ఇతరులకు షరతులతో కూడిన బెయిలు ఇవ్వొచ్చన్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవగాహనను జస్టిస్ ఎ.వి.చంద్రశేఖర తోసిపుచ్చుతూ (దోషులకు) ఉపశమనం కల్పించడానికి తగిన కారణాలు లేవన్నది ఈ నేపధ్యంలోనే. నిజానికి ఇది జయలలితకు పెద్ద ఎదురు దెబ్బ. తక్షణ ఉపశమనం కోసం ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది.
అవినీతి సంబంధిత న్యాయ మీమాంస విషయంలో, జడ్జి ఇచ్చిన ఆదేశం సుప్రీం కోర్టు వరుసగా ఇచ్చిన తీర్పుల స్ఫూర్తికి అనుగుణంగానే ఉన్నది. ఇటీవలి కాలంలో దోషిత్వం నిర్ధారించబడిన చట్ట సభల సభ్యులు తక్షణ అనర్హత వేటు నుండి అనుభవిస్తూ వచ్చిన రక్షణను అతున్నత కోర్టు తొలగించింది. ప్రజాసేవకులను ప్రాసిక్యూట్ చేయడానికి (ప్రభుత్వం) ఇవ్వవలసిన అనుమతులకు కాలపరిమితి విధించింది. చట్ట సభల సభ్యులు ఇమిడి ఉన్న కోర్టు విచారణలను (ట్రయల్స్) త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. నిర్దిష్ట ర్యాంకుకు ఎగువ స్ధాయి బ్యూరోక్రాట్ ల పాత్ర ఉన్న కేసుల పరిశోధనకై అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వానికి విచక్షణాధికారాలు కల్పిస్తున్న వసతిని రద్దు చేసింది.
జయలలిత విడుదలకు అనుకూలంగా తమిళనాడులో ఉన్న రాజకీయ సందడికి, పెడబొబ్బలకు తాను అతీతమని హై కోర్టు కూడా తనను తాను రుజువు చేసుకుంది. జయలలిత కోసం విధేయత, సానుభూతిలు బహిరంగంగా ప్రకటించుకోవడానికి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం కార్యకర్తలకు, మద్దతుదారులకు తమ కారణాలేవో తమకు ఉండవచ్చు. కానీ సాధారణ ప్రజానీకానికి అసౌకర్యం కలిగించే హింసాత్మక ఘటనలు, నిరసనలు ఆమె న్యాయ పోరాటానికి ఎ మాత్రం సహాయం చేయకపోగా దీర్ఘకాలికంగా ఆమెకు రాజకీయ నష్టం కలుగజేయవచ్చు. శాంతి వహించాలని అత్యవసర విన్నపం చేసుకున్న ముఖ్యమంత్రి పనీర్ సెల్వం ప్రజాస్వామిక నిరసనల పరిమితులు ఉల్లంఘించబడకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాల్సి ఉంది.
జయలలిత విషయంలో వెలువడిన నిర్ణయాన్ని సమర్ధిస్తూనే, ఆవిషయంలో జరిగిన సుదీర్ఘ తాత్సారాన్ని గమనించిన నాదో ప్రశ్న… ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం ఒక మైనారిటీ ప్రభుత్వమైనా, ‘సంకీర్ణ ధర్మా’నికి తలొగ్గవలసిన పరిస్థితిలో ఉన్నా జయలలితకు శిక్షపడేదా?
ఈప్రశ్నకు తెలిసీ సమాధానం చెప్పకపోయారో, మీ బ్లాగు వేయి వ్రక్కలవుతుంది జాగ్రత్త 🙂
అందులో అనుమానం ఏముంది చెప్పండి! శుభ్రంగా, దర్జాగా అభిమానుల ఆనంద సందోహాల మధ్య బైటికి నడిచివచ్చేవారు.