(ఇండియా-పాకిస్ధాన్ ల మధ్య సరిహద్దుల ఆవలి నుండి కాల్పులు జరగడం మళ్ళీ నిత్యకృత్యంగా మారిపోయింది. పాక్ కాల్పుల్లో సోమవారం 5గురు భారతీయ పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఇండియా కాల్పుల్లో తమ పౌరులూ మరణించారని, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా భారత సైనికులు కాల్పులు జరుపుతున్నాయని పాకిస్ధాన్ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ది హిందు పత్రిక ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)
ఆధీన రేఖ మరియు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి చెదురు ముదురు (కాల్పుల విరమణ) ఉల్లంఘనలుగా మొదలైన సంఘటనలు, ఇప్పుడు, 2003 నుండి అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం ముందరి నాటి పాత రోజుల స్ధాయికి దిగజారే ప్రమాదకర పరిస్ధితికి విస్తరించడం పట్ల ఇండియా, పాకిస్ధాన్ ప్రభుత్వాల ఉన్నత స్ధాయిలోనే ఆందోళన చెందవలసిన అగత్యం ఏర్పడింది. 2003 నాటి ఒప్పందం కుదిరేవరకూ ఇరు పక్షాలూ ప్రతి రోజూ ఫిరంగి కాల్పులతో మునిగి తేలుతూ ఉండేవి. ఫలితంగా ఇరు వైపులా సైనికులతో పాటు పౌరులు సైతం మరణించేవారు. ఘర్షణలు కొనసాగిన కాలంలో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోకి మిలిటెంట్లు చొరబాటు ఉచ్ఛదశకు చేరుకున్న పరిస్ధితి! ఈ నెలలో మొదటి ఏడు రోజుల్లోనే ఫిరంగి కాల్పులు జరిగిన ఘటనలు 11 వరకు చోటు చేసుకోగా అందులో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దానితో 11 సంవత్సరాల నాటి కాల్పుల విరమణ ఒప్పందం అపహాస్యానికి గురవుతోంది. నిజానికి ఆధీన రేఖ వద్ద నెలకొని ఉన్న పరిస్ధితి కాల్పుల విరమణ ఒప్పంద సూత్రాలకు అనుగుణంగానే ఉన్నదా అని నిలదీసినా తప్పు లేదు.
కాల్పులు కేవలం ఆధీన రేఖ వరకే పరిమితం కాలేదు; అవి అంతర్జాతీయ సరిహద్దును కూడా ప్రభావితం చేస్తోంది. అంతర్జాతీయ సరిహద్దును పాకిస్ధాన్ పూర్తిగా అంగీకరించలేదు. దానిని ‘వర్కింగ్ బౌండరీ’ గానే ఇప్పటికీ పిలుస్తోంది. సరిహద్దుకు ఆవల నుండి జరిగిన సోమవారం నాటి కాల్పులలో 5గురు పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆర్నియా అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆర్నియా ప్రాంతంలో జమ్ములోని జనావాస ప్రాంతం. భారత్ వైపు నుండి ఎలాంటి హెచ్చరికలు లేకుండా జరిగిన కాల్పుల్లో తమ పౌరులు మరణించారని పాకిస్ధాన్ కూడా చెబుతోంది. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలను పరిశీలించడానికి ఇరు దేశాలు కొన్ని రక్షణ ప్రక్రియలను ఏర్పరచుకున్నాయి: ఫీల్డ్ కమాండర్ల మధ్య సమావేశాలు నిర్వహించే ఏర్పాటు, ఇరు దేశాలలోని ‘డైరెక్టర్ ఆఫ్ మిలట్రీ ఆపరేషన్స్’ ల మధ్య హాట్ లైన్ నెలకొల్పడం… తదితర చర్యలు ఆ కోవలోనివే. ఆధీన రేఖ వద్ద ఉద్రిక్తతలను చల్లార్చడంలో ఈ ప్రక్రియలేవీ విజయవంతం కాలేదని ఇటీవలి నెలల్లో జరిగిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
అవసరమైన చర్యలు ఏమీ తీసుకోకుండా, చర్చలకు సిద్ధంగా ఉన్నామని రొటీన్ గా ప్రకటించడం, ఒక్కోసారి ఆ ప్రకటనల నుండి కూడా వెనక్కి తగ్గడం కంటే ఇరు పక్షాలు చర్చల ప్రక్రియను మళ్ళీ తాజాగా, అత్యవసరంగా మొదలు పెట్టడం ఉత్తమం. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న మిశ్రమ స్ధాయి చర్చల ఫార్మాట్ లో ఇరు పక్షాలకు చెందిన రక్షణ శాఖ కార్యదర్శులు ప్రతి సంవత్సరం సమావేశమై ఇతర అంశాలతో పాటు కాల్పుల విరమణ ఒప్పందం స్ధితిగతులను కూడా అంచనా వేసుకునేవారు. అలాంటి సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేయడం సమయస్ఫూర్తి కాగలదు. దానివల్ల ఉద్రిక్తతలు ఉపశమించడమే కాకుండా కాల్పుల విరమణ ఒప్పందం మొత్తంగా కూలిపోయే ప్రమాదం నుండి కాపాడినవారవుతారు. ఇక ఎలాంటి జాప్యం లేకుండా న్యూ ఢిల్లీ చర్చలకు పిలుపు ఇవ్వాలి.
ఇండియాకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి వీలులేని రాజకీయ కష్టాలలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇరుక్కుని ఉన్నారన్నది నిజమే. కానీ పాకిస్తాన్ కొత్త రక్షణ కార్యదర్శి, తన పూర్వ అధికారికి మల్లేనే సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ఆయన ఆర్మీ అధిపతికి సన్నిహితుడన్న పేరు కూడా ఉంది. పాకిస్ధాన్ ఆక్రమణలో ఉన్న భూభాగం నుండి జరిగే మిలిటెంట్ల చొరబాటును కప్పిపుచ్చేందుకే ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్న ఇండియా ఆందోళనలను కేవలం చర్చల బల్ల వద్ద మాత్రమే లేవేత్తడం వీలవుతుంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ తో మాట్లాడడం ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కాపాడే విషయం గానీ, లేదా ఇరు దేశాల మధ్య ఉన్న అనేక ఇతర అంశాలు గానీ ఇరు దేశాల మధ్యనే పరిమితమై ఉండడం సాధ్యపడుతుంది.
హిందూ రక్షకుడు, అఖండ భారత్ భవిష్యత్ సాధకుడు మోడీ వచ్చాక కూడా పాక్ రెచ్చిపోవడం ఏంటో.. భారతీయుల పార్టీ శత్రువులకు భయపడుతోందా అనిపిస్తోంది.
sri garu dont put communal tag to the above incidents as the sufferers on both sides of the border are Muslims and sufferings are to be seen more in a humanitarian perspective and they are the people who are squeezed between the politics and greedy ambitions of leaders, on both sides… patriotism is necessary for every Indian citizen but Hindu patriotism is not appreciable..