ఇన్ ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్… -ఈనాడు


ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ యొక్క ఆర్ధిక మౌలికాంశాల్లో (ఎకనమిక్ ఫండమెంటల్స్) ద్రవ్యోల్బణం ఒకటి. ద్రవ్యోల్బణం గురించి ఆర్ధికవేత్తలు అనేక సిద్ధాంతాలు చెబుతారు. ఆ సిద్ధాంతాలన్నీ మనిషి సృష్టించిన కృత్రిమ మారక సాధనం అయిన డబ్బు చుట్టూనే తిరుగుతాయి.

ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా డబ్బును నియంత్రించే ధనికవర్గాల జోలికి ఆర్ధికవేత్తలు వెళ్లరు. ఫలితంగా ఆ సిద్ధాంతాలన్నీ వాస్తవ పరిస్ధితులకు దరిదాపుల్లోకి వెళ్లడంలో విఫలం అవుతాయి. దాంతో మళ్ళీ మళ్ళీ సరికొత్త సిద్ధాంతాలతో ఆర్ధికవేత్తలు ముందుకు రావడానికి పరిస్ధితులు ఎప్పుడూ ఏర్పడి ఉంటాయి.

ఇన్ ఫ్లేషన్, డిఫ్లేషన్, డిజిన్ ఫ్లేషన్, రిఫ్లేషన్… ఈ నాలుగింటిలో ఇన్ ఫ్లేషన్ అన్నదే మౌలికమైనది. మిగిలిన మూడూ ఇన్ ఫ్లెషన్ కు అనుబంధమైనవి. ఇన్ ఫ్లేషన్ పై అవగాహన పెంచుకునే క్రమంలో మిగిలిన మూడింటికి రూపకల్పన జరిగింది. కనుక ఈ నాలుగు పదాలను ఆర్ధిక వ్యవస్ధలో డబ్బు చెలామణి పాత్రను వివరించే పదజాలాల సమితి (సెట్)గా పరిగణించవచ్చు.

డబ్బు ఆర్ధిక వ్యవస్ధకు మౌలికం కాదు. అది కేవలం మారకం సాధనం మాత్రమే. మౌలికమైనవి సరుకులు. బార్టర్ పద్ధతిని మరింత సులభతరంగా మార్చుకునే క్రమంలో డబ్బు పుట్టింది. డబ్బు దానికదే విలువ కలిగి ఉండదు. అది తాను ప్రాతినిధ్యం వహించే సరుకులోని విలువను మాత్రమే తెలియజేస్తుంది. సరుకులో మళ్ళీ మౌలికమైనది అందులో పదార్ధం కాదు. ఆ సరుకును తయారు చేయడానికి కొంత శ్రమ అవసరం ఆ శ్రమకు కట్టిన విలువే ఆ సరుకు విలువ. కనుక అంతిమంగా శ్రమ విలువకు డబ్బు ప్రాతినిధ్యం వహిస్తుంది.

‘డబ్బుదేముంది, కుక్కను కొడితే రాలతాయి” అని కొంతమంది ధనికవర్గ ప్రముఖులు తేలిక వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కుక్కను కొడితే అది ‘కుయ్యో, మొర్రో’ అని ఏడుస్తుంది. లేదా ధైర్యం గల్ల కుక్కయితే పిక్కలు పట్టి పీకి పెడుతుంది. అంతే తప్ప డబ్బులు మాత్రం రాలవు. ఇంకో చివర “డబ్బు చెట్లకు కాయవు” అని రాజకీయ ప్రముఖులు, మంత్రులు జనాన్ని అపహాస్యం చేస్తూ చెబుతుంటారు. కానీ డబ్బు దేనికి కాస్తుందో వారు చెప్పరు. డబ్బు రాలేది, కాచేది కేవలం శ్రమకు మాత్రమే. ప్రపంచంలో ఇక దేనికీ డబ్బు కాయదు.

కనుక కుక్కను కొట్టేవారూ, చెట్లకు కాయదని నీతులు వల్లించేవారూ ఎవరిని అవమానిస్తున్నట్లు? శ్రమని అవమానిస్తున్నట్లు. స్వేదం చిందించి, రెక్కలు ముక్కలు చేసుకుని శ్రామికులు సరుకుల్ని, సంపదల్ని సృష్టిస్తుంటే వాటికి ప్రతీధిగా పుట్టిన డబ్బు కుక్కల్ని కొడితే రాలుతుందని చెప్పడం ఎంత అవమానకరం? జీవితంలో ఏనాడూ శ్రమ చేయనివారూ, లేదా నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినవాళ్లు మాత్రమే ఇలా ఒళ్ళు బలుపు వ్యాఖ్యలు చేస్తారు.

ఇక ఆర్టికల్ విషయానికి వస్తే ఈనాడు వెబ్ సైట్ లో ఆర్టికల్ చూడాలనుకుంటే గనుక కింది లింక్ ని క్లిక్ చేయండి. ఈ లింకు వారం రోజులు మాత్రమే పని చేస్తుందని మరువద్దు.

ద్రవ్యోల్బణం ఏం సూచిస్తుంది?

ఆర్టికల్ ని పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో కూడా చదవొచ్చు. పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ అయితే మనకు కావలసిన సైజుకు పెంచి చదువుకోవచ్చు. పి.డి.ఎఫ్ లో చదవాలనుకుంటే కింది బొమ్మ పైన క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.

Eenadu - 06.10.2014

 

16 thoughts on “ఇన్ ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్… -ఈనాడు

 1. ఆర్థిక శాస్త్రంలో కరెన్సీ విలువ ఒక్కటే నాకు అర్థం కాని విషయం. చమురు దిగుమతి కోసం మన దేశం కావాలనే కరెన్సీ విలువ తగ్గిస్తోంది. ఒక కువైత్ దినార్ 213 రూపాయలతో సమానం. ఒక కువైత్ దినార్ కొనాలంటే 213 రూపాయలు విలువైన దినామినేషన్‌లని మనం ముద్రించుకోవాలి. అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు నేపాల్‌వాడు కావాలని 426 నేపాలీ రూపాయలు ముద్రించి ఒక కువైత్ దినార్‌ని కోరితే ఏమవుతుంది? కువైత్‌వాడు తన దినార్‌లని నేపాల్‌వాడికి అమ్మడానికే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తాడా?

  కరెన్సీ విలువ తరుగుదల వల్ల విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు అన్‌లోదింగ్ అవ్వడం నేను విశాఖపట్నం హార్బర్‌లో ప్రత్యక్షంగా చూసాను. ఎరువుల ధరలు పెరిగి ఎరువులు కొనలేక రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో నాకు సులభంగానే అర్థమైంది.

 2. సర్, మీ విష్లెషణ ప్రస్తుత అర్దిక పరిస్తుతలకి సరిగ్గా సరిపొయెలా చాలా అర్థవంతంగా ఉంది..
  నాకు చాలా రొజుల్నుంచి కొన్ని doubts ఉన్నయ్ … దయచేసి clarify చేయగలరు.
  >ప్రపంచంలో మన currency విలువ వివిద దేశాల currency విలువలలో(తో) ఈ తేడా ఎందుకు ఉంది?
  >INDIAకి చాలా అప్పులు ఉన్నాయ్ కదా మరి అలాంటపుడు కావల్సినంత currency ని ముద్రించుకొని అప్పులను తీర్చెయొచ్చు కదా ….
  >ద్రవ్యొల్భణం మరియు ఆర్దిక మాంద్యానికి మద్య గల సంబాందాన్ని వివరించగలరా?

 3. సర్,ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా డబ్బును నియంత్రించే ధనికవర్గాల జోలికి ఆర్ధికవేత్తలు వెళ్లరు-ఎందుకో,వివరించగలరా?ఎప్పటినుండో అడగాలను కొంటున్నాను-సరుకుల ధరలు తగ్గినప్పుడు ప్రజలు సరుకులను కొనరు,ఇంకా తగ్గుతాయోమోనని ఎదురు చూస్తారు?-సర్ ఇది ఎప్పటి అంచనా?(ఏ కాలం నాటిది?)ఇప్పటి పరిస్తుతులలో కూడా దీనిని సార్వత్రీకరణ చేయడం సరైనదేనా? నా ఉద్దేశ్యం ఏమిటంటే కొన్ని వస్తువులు డిమాండ్ బట్టి వాటి చేలానమి జరుగుతుంది గానీ,ధరలు వాటి కొనుగోళ్ళను పెద్దగా ప్రభవితం చేయవు కదా! ఉదా-గాస్,పెట్రోల్ మొ,,.

 4. సతీష్ గారు, కరెన్సీ కట్టల ముద్రణ పెరిగినంతమాత్రాన వనరులు పెరగవు. వనరులు పెరగకుండానే కరెన్సీ కట్టల సర్క్యులేషన్ పెంచితే కరెన్సీ విలువ తగ్గి ధరలు పెరుగుతాయి.

  అప్పుల వల్ల ఎప్పుడూ మోసమే జరుగుతుంది. అప్పు ఇచ్చేవాడు వడ్డీకి ఇస్తాడు కానీ ఫ్రీగా కాదు. ప్రపంచ బ్యాంక్ ఆంధ్రాకి లక్ష కోట్లు అప్పు ఇచ్చి వడ్డీతో సహా తిరిగి లక్షా ముప్పై కోట్లు కట్టమంది అనుకుందాం. ప్రభుత్వానికి ఆ లక్షా ముప్పై కోట్లు రాకపోతే జనం మీద పన్నులు పెంచో, విద్యుత్ చార్జిలు లేదా బస్సు చార్జిలు పెంచో వసూలు చేస్తుంది. మన రాష్ట్రంలో పన్నులు కట్టలేక జీడి పరిశ్రమలు, విద్యుత్ చార్జిలు కట్టలేక జనుప మిల్లులు మూతపడడానికి కారణం ఇదే.

 5. Marxist Leninist గారు,

  Market లో currency సర్క్యులేషన్ పెంచడం వల్ల డబ్బు పెరిగి దానికి సరిపడా ఉత్పత్తి లేక (తగినన్ని వనరులు లేకపొవడం వల్ల ) వస్తువుల దరలు పెరుగుతాయి . its ok……
  కాని,
  ప్రపంచ బ్యాంక్ ఆంధ్రాకి లక్ష కోట్లు అప్పు ఇచ్చి వడ్డీతో సహా తిరిగి లక్షా ముప్పై కోట్లు కట్టమంది అన్నారు కదా..
  ఆ లక్షా ముప్పై కోట్లు ముద్రించి అప్పు తీరిస్తె మనకు కలిగే నష్టం ఎంటి?

  మన దగ్గర పుష్కలమైన natural sources & manpower ఉన్నాయ్ కద ,, మనమే currency print చేసి (FDIల కోసం ఎదురుచూడకుండ ) Infrastructure develop చేసుకొని economic growth సాదించొచ్చు కద.

  silly questions అనిపించొచ్చు, but i am trying to get answer since a long time but people made me so confused… 🙂

 6. ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకునే బదులు మనమే అతిరిక్తంగా కరెన్సీ కట్టలు ఎందుకు ముద్రించకూడదు? 1947లో రూపాయి విలువ దాలర్‌తో సమానంగా ఉండేది. జవహార్ లాల్ నెహ్రూ కావాలని రూపాయి విలువని తగ్గించి ఒక దాలర్‌ని ఐదు రూపాయలు చేసాడు. జవహార్ లాల్ నెహ్రూ ప్రపంచ బ్యాంక్ నుంచి కోటి దాలర్‌లు అప్పు తెచ్చి, వాటిని రూపాయిలలోకి మార్చి ఐదు కోట్లు చేసేవాడు. కరెన్సీ విలువ తగ్గింపు వల్ల నష్టమే, ఎందుకంటే దాని వల్ల మనం విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కరెన్సీ విలువ తరుగుదల వల్ల విదేశాల నుంచి దిగుమతి అయ్యే అన్ని సరకుల ధరలూ పెరుగుతాయి. స్వదేశీ ఉత్పత్తిని పెంచుకుని దిగుమతులు తగ్గించుకున్నా మన కరెన్సీ విలువ పెరుగుతుంది కానీ మన పాలకులు ఆ పని చెయ్యరు.

 7. Hi Satish

  మీరు మిస్ అయినట్లున్నారు. ఆర్టికల్ లోనే మీ ప్రశ్నకు సమాధానం ఉంది. నేనిలా రాశాను:

  “డబ్బు ఆర్ధిక వ్యవస్ధకు మౌలికం కాదు. అది కేవలం మారకం సాధనం మాత్రమే. మౌలికమైనవి సరుకులు. బార్టర్ పద్ధతిని మరింత సులభతరంగా మార్చుకునే క్రమంలో డబ్బు పుట్టింది. డబ్బు దానికదే విలువ కలిగి ఉండదు. అది తాను ప్రాతినిధ్యం వహించే సరుకులోని విలువను మాత్రమే తెలియజేస్తుంది.”

  పైన ప్రవీణ్ గారు చెప్పింది కూడా కరెక్ట్ కాదు. వనరులు దానంతట అవే విలువను కలిగి ఉండవు. వాటిపైన శ్రమ జరిగి ఒక ఉత్పత్తి తయారైతే ఆ ఉత్పత్తికి విలువ ఉంటుంది తప్ప వనరుకి కాదు. వనరుకి, ఉత్పత్తి (సరుకు) కీ ఉన్న తేడా ‘శ్రమ’. శ్రమ వల్ల వనరులో కొంత భాగం సరుకుగా మారుతుంది. సరుకుగా మారడానికి పట్టే శ్రమే ఆ సరుకు ఖరీదు/ధర/వెల.

  కొంత డబ్బు ప్రింట్ చెయ్యాలంటే దానికి సమాన విలువ గల ఉత్పత్తి దేశంలో జరిగి ఉండాలి. దేశంలో ఎంత ఉత్పత్తి జరుగుతున్నదో అంచనా వేస్తూ ఆర్.బి.ఐ కరెన్సీ ముద్రిస్తుంది. వివిధ ఉత్పత్తులను ఒకరి నుండి మరొకరికి మారకం జరగడానికి సాధనంగా ఆ డబ్బును విడుదల చేస్తుంది.

  కాబట్టి కొత్త సరుకులు మరియు సేవల ఉత్పత్తి ఏమీ లేకుండా డబ్బును ప్రింట్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? డబ్బు పరిమాణం పెరుగుతుంది గానీ సరుకులు సేవలు పెరగవు. అంటే సరుకుల విలువ కంటే ఎక్కువ డబ్బు చెలామణిలోకి వస్తుంది. ఇదే కదా ద్రవ్యోల్బణం! సరుకుల విలువకు మించిన డబ్బు ముద్రిస్తే ద్రవ్యం ఉల్బణం చెందుతుందే గానీ అదనపు ఉత్పత్తి ఏమీ జరగదు.

  ఎఫ్.డి.ఐ లు అంటే డాలర్ల కట్టలు కాదు. ఇతర దేశాల్లో జరిగిన ఉత్పత్తి విలువను ఇక్కడికి సరఫరా చెయ్యడం. ఉదాహరణకి యాపిల్ కంపెనీ వాడి దగ్గర డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఫోన్లు, టాబ్లెట్లు తదితర సరుకులు తయారు చేసి అమ్మితే వస్తుంది. టాబ్లెట్ కొనే వ్యక్తికి డబ్బు ఎక్కడిది? ఒక పని చేసో, ఉద్యోగం చేసో తన శ్రమను అమ్ముకుని (తద్వారా ఒక ఉత్పత్తి తయారు చేసి) ఆ డబ్బుతో యాపిల్ టాబ్లెట్ కొంటాడు. ఇక్కడ మారినట్లు కనిపించేది డబ్బే కానీ అసలుకు మారింది యాపిల్ టాబ్లెట్ లోని శ్రమా, కొనుగోలుదారుడు చేసిన ఉత్పత్తిలోని శ్రమా. వివిధ సరుకుల రూపంలో ఉండే ఈ శ్రమల్ని భౌతికంగా మార్చుకోవడానికి వీలుగా డబ్బు వాడుకలోకి వచ్చింది. కనుక డబ్బులో విలువ లేదు. ఆ డబ్బు దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ సరుకుకు విలువ ఉంటుంది. ఆ సరుకులో శ్రమే సరుకుకు విలువ తెస్తుంది.

  ఇంకో ఉదాహరణ చూద్దాం. నీరు ప్రకృతి వనరు. ఒక చెరువులో నీరు ఉంది. అది మంచి నీరు. అది తాగాలంటే చెరువుకి వెళ్ళి తాగాలి. నీరు నడిచిరాదు కాబట్టి. అందరూ చెరువుకు వెళ్ళడం కుదరదు. ఎవరి పనులు వారికి ఉంటాయి. ఒకరిద్దరు ఒక బండి కట్టుకుని పీపా తీసుకెళ్లి నీరు నింపి ఊర్లోకి తెచ్చి బిందె నీరు ఇంత అని అమ్మితే జనం దాన్ని కొనుక్కుని తాగుతారు. ఎందుకు కొనుక్కున్నారు? నీటిని తమ బదులు ఆ వ్యక్తి వెళ్ళి కొంత శ్రమను వెచ్చించి మోసి తెచ్చాడు కనుక డబ్బు ఇచ్చి నీరు కొనుక్కుంటారు. బిందెకు ఎంత ధర పెట్టినా కొనరు. ఆయన చెప్పే ధర న్యాయం అనిపిస్తేనే కొంటారు. మరీ ఎక్కువ ధర అనిపిస్తే తామే చెరువుకు వెళ్ళి నీరు తాగడమే కాకుండా తాము కూడా ఒక పీపా తెచ్చి అదే ఎక్కువ ధరకు అమ్మే ప్రయత్నం చేస్తాడు. అంటే మొదటి అమ్మకందారుకి పోటీ వస్తాడు. ఇలా మరింతమంది పోటీదారులు తయారైతే ఒక్కో అమ్మకందారుకు కొనుగోలుదారులు తగ్గిపోతారు. దాంతో ధర తగ్గించి కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా నీటి ధర (నీరు తేవడానికి వెచ్చించిన శ్రమ ధర) వాస్తవ స్ధాయికి చేతుతుంది. అమ్మేవాడికి ఈ సంగతి ముందే తెలుసు కనుక సాధ్యమైనంత వరకు న్యాయమైన ధర వసూలు చేస్తాడు.

  సరుకుకు (వనరుకు) విలువ ఎలా వస్తుందో చెప్పేందుకు ఈ ఉదాహరణ.

 8. ప్రవీణ్ గారూ, మీరు ‘మార్క్సిస్టు-లెనినిస్టు’ అన్న పేరును తొలగించాలని మరోసారి విన్నవిస్తున్నాను. మీరా పేరును కొనసాగిస్తే గనుక మీ భావాలు మార్క్సిజం-లెనినిజం కిందికి రావని ఈ బ్లాగ్ లో బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంటుంది. దయచేసి ఆ పేరు తొలగించండి.

 9. విశేఖర్ గారు, నేను వనరుల లభ్యత గురించి మాట్లాడాను కానీ వాటివిలువ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్పలేదు. శ్రమ లేకుండా ఏదీ జరగదు అని మార్క్సిస్త్ చారిత్రక భౌతికవాదం చదివినవానిగా నాకు తెలుసు. కానీ పెట్టుబడిదారీ సమాజంలో వాస్తవంగా అందే విలువ కేవలం శ్రమని బట్టి ఉండదు. అందుకే విమాన పైలత్, రైల్వే లోకో ద్రైవర్ సమానంగా కష్టపడినా వాళ్ళిద్దరి జీతాలు ఒకలా ఉండవు.

  కరెన్సీ కట్టల ముద్రణ పెంచడం ఎందుకు సాధ్యం కాదో చెప్పాను, అంతే. డబ్బుకి దానంతట అదే విలువ రాదు అనేది నిజం. అలా వచ్చే పరిస్థితి ఉంటే ఎవరైనా సొంతంగా కరెన్సీ కట్టలు ముద్రించుకోవచ్చు.

 10. విశేఖర్ గారు, చెయ్యని తప్పుకి నేను మారాల్సిన అవసరం లేదు. తెలంగాణా వచ్చిన తరువాత కూడా తెలంగాణాపై విషం చిమ్మే ఓ పెద్ద మనిషి ఇప్పటికీ బ్లాగుల్లో తాను మార్క్సిస్త్‌ననే చెప్పుకుంటున్నాడు. నా మెదడులో అతని కంటే ఎక్కువ విషముందా?

 11. విషం గురించి కాదు. ఆ మాటకొస్తే మీ మెదడులో విషం ఉందని నేను నమ్మడం లేదు. ఎవరన్నా చెప్పినా దాన్ని అంగీకరించను.

  సమస్యల్లా మీరు వ్యక్తం చేస్తున్న భావాల వల్లనే వస్తోంది. ముఖ్యంగా స్త్రీల వస్త్రధారణ, వారి అలవాట్లు, సాస్కృతిక ధోరణులు… ఇలాంటి అంశాల్లో మీరు చెబుతున్నవి మార్క్సిజం అటుంచి కనీసం అభ్యుదయం కూడా కాదు. ఈ భావాలు కలిగి ఉండే హక్కు మీకుంది. కానీ వాటిని మార్క్సిస్టు-లెనినిస్టు అన్న పేరుతో వ్యక్తం చేయడమే అభ్యంతరకరం.

  మాంసం తినేవాళ్లు ఎముకలు మెడలో వేసుకుని తిరగక్కర్లేదు కదా. మార్క్సిస్టు-లెనినిస్టులు అయినవాళ్ళు ‘మేం ఫలానా అహో’ అని చెప్పుకోనక్కర్లేదు. వారు చేయవలసింది అన్యాయం జరుగుతున్న చోట పీడితుల పక్షాన నిలబడడం. పురుషాధిక్య వ్యవస్ధలో స్త్రీలు పీడితులు. వారి పక్షాన నిలవడం మాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వారికి గుణ గణాలను అంటగడుతూ, మీరు నమ్ముతున్నానని చెబుతున్న భావాలకు విరుద్ధంగా వాదనలు చేస్తున్నారు. వాదనలు చేయండి గానీ అందుకు మరో పేరు ఉపయోగించండి.

 12. నేను మార్క్సిస్త్‌ని కాదని మీరు బహిరంగ ప్రకటన చేస్తానన్నారు కదా, అందుకు ఈ కారణాలు చెప్పండి.

  1) రైతులకి బ్యాంక్ ఋణాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం.

  నా సమాధానం: నేను కింగ్‌ఫిషర్‌కి ఋణాలు ఇవ్వడాన్ని కూడా వ్యతిరేకించాను. కేవలం పెట్టుబడి పెట్టడం వల్ల లేని దిమాంద్ కొత్తగా పుట్టదు.

  2) రైలు చార్జిల పెంపుని సమర్థించడం.

  నా సమాధానం: 5 రూపాయల తికెత్‌ల కోసం ఎవడూ కోట్లు ఖర్చుబెట్టి రైలు మార్గం వెయ్యడు. నన్ను ఎంత తిట్టినా ఈ నిజం అబద్దమైపోదు.

  3) అవయవ ప్రదర్శనలు ఇచ్చే సినిమా నటులపై కఠిన వ్యాఖ్యలు చెయ్యడం

  నా సమాధానం: ఆ సినిమా నటులు చేసేది కూడా వ్యాపారమే. వాళ్ళని చెత్తగా చూపించే నిర్మాత & దర్శకులది మాత్రమే వ్యాపారం అనుకోవాలా?

  ఇంకా చాలా కారణాలు చెప్పొచ్చు. నాకేమీ భయం లేదు.

 13. మీకింకా ఎన్నిసార్లు చెబితే అర్ధం అవుతుందో నాకు అర్ధం కాకుండా ఉంది. మరోసారి చెబుతాను.

  మీరు మార్క్సిస్టులో కాదో నాకు తెలియదు. కాకపోవడం వల్ల నాకు నష్టం లేదు. అవడం వల్ల లాభమూ లేదు.

  కానీ మీరు వ్యక్తం చేస్తున్న భావాలు మార్క్సిజం కిందికి రావు. పైగా మార్క్సిజానికి విరుద్ధమైనవి. మార్క్సిజానికి విరుద్ధ భావనలు వ్యక్తం చేస్తూ మార్క్సిస్టును అని చెప్పడం సరైనదేనా, మీరే చెప్పండి.

  మీరు పైన చెప్పిన ఉదాహరణలు కూడా మీతో గతంలో వివరంగా చర్చించాను. అవి మీకు అర్ధం కాలేదో లేక మరొకటో నాకు తెలియదు. అర్ధం కాకపోయినా ఫర్వాలేదు. అర్ధం కావాలన్న రూల్ లేదు కాబట్టి.

  కానీ మార్క్సిస్టును అని చెప్పుకునేటప్పుడు కొన్ని కనీస భావాత్మక నియమాలు పాటించాలి. అవేమిటో వివిధ సందర్భాల్లో మీకు చెప్పాను. మీరు వినడం లేదు. ఫలితంగా మీకు చెడ్డపేరు వస్తోంది సరే, మార్క్సిజం గురించి తెలియనివారికి మీరు వ్యక్తం చేసే అవకతవక భావాలే మార్క్సిజం అన్న తప్పుడు సందేశం వెళ్తోంది. ఇది మీకు ఎన్ని సార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా మీరు స్వీకరించడం లేదు. అందుకే మార్క్సిజానికీ, మీ భావాలకూ సంబంధం లేదని బహిరంగ ప్రకటన చేస్తానని చెప్పడం. మళ్ళీ చెబుతున్నా. నేను చెప్పింది ‘మీరు మార్క్సిస్టు కాదు అని ప్రకటన చేస్తాను’ అని కాదు. ‘మీ భావాలు మార్క్సిజం కిందికి రావు’ అని ప్రకటన చేస్తాను అని మాత్రమే.

  దయచేసి రాసింది రాసినట్లు అర్ధం చేసుకోగలరు. మళ్ళీ కొత్త అర్ధాలు తీస్తే సమాధానం ఇవ్వలేను.

 14. స్త్రీలపై నా భావాలు అభ్యంతరకరంగా మీకు ఎందుకు అనిపించాయి? నేను నా కథలలో స్త్రీ తన సొంత మరిదితో లేచిపోతున్నట్టు వ్రాసినప్పుడు చాలా మంది బ్లాగర్లు అభ్యంతరం చెప్పారు కానీ మీరు అభ్యంతరం చెప్పలేదు. నాకు అది బాగానే గుర్తుంది. నిక్కర్లు వేసుకోవడం వల్ల స్త్రీ స్వేచ్ఛ రాదు అని నేను వ్రాసినప్పుడు మాత్రం అది అభ్యుదయానికి దూరం అనిపించిందా?

  నా కథలపై ఎన్ని విమర్శలు వచ్చినా నేను సిగ్గుపడలేదు కానీ నా శ్రేయోభిలాషి ఒకరు (ఆవిడ పేరు నేను చెప్పలేను) “నువ్వు ఆ కథలని దిలీత్ చేస్తేనే నీ కోసం పెళ్ళి సంబంధం చూస్తాను” అన్న తరువాత నేను ఆ కథల్ని దిలీత్ చేసాను. వ్యక్తిగత జీవితం కోసం నేను కొన్ని వదులుకున్నాను కానీ మార్క్సిజంకి మాత్రం నేను ఎన్నడూ దూరం అవ్వలేదు.

  లేచిపోవడం అనేది కేవలం వ్యక్తిగత విషయం. లేచిపోవడానికి స్త్రీవాదం తెలియాలని రూల్ లేదు కూడా. నేను లేచిపోవడాల కథలు వ్రాసిన రోజుల్లో కూడా నా భావాలు అభ్యుదయానికి దూరంగా ఉన్నాయని మీరు అనుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం మీకు అలా అనిపిస్తోంది!

 15. జానకి విముక్తి నవలలో జానకి అడుగుతుంది “డబ్బంటే కరెన్సీ కట్టలే కదా, అందరికీ కావలసినన్ని కరెన్సీ కట్టలు ముద్రించి ఇవ్వొచ్చు కదా” అని. అప్పుడు జానకికి ఇలా సమాధానం చెపుతారు “నీకు కావలసినన్ని కరెన్సీ కట్టలు ముద్రించి ఇస్తే నువ్వు శ్రమ చేస్తావా? అలా కరెన్సీ కట్టలు ముద్రించి ఇస్తే నువ్వే కాదు, ఎవరూ శ్రమ చెయ్యరు” అని. సమాజాన్ని నిరంతర చలనంలో ఉంచగలిగేది శ్రమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s