చీపురు వెనక సందేశం -ది హిందూ ఎడిట్


వీళ్ళు ఊడ్చేదేమిటి?

వీళ్ళు ఊడ్చేదేమిటి?

(ఆం ఆద్మీ చేతిలోని చీపురు కాస్తా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడి చేతిలోకి వచ్చేసింది. స్వయంగా చీపురు చేతబట్టి ఒక సెంట్రల్ ఢిల్లీలో ఒక పోలీసు స్టేషన్ ఆవరణను శుభ్రం చేయడం ద్వారా ప్రధాని దేశం దృష్టిని గొప్పగా ఆకర్షించారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక రోజు ఆర్భాటంతో ముగియడం భారత దేశానికి అనుభవమే. చంద్రబాబు నాయుడు గారి ‘ప్రజల వద్దకు పాలన’ అధికారులను జనం వద్దకు తేవడం తప్ప సాధించిందేమీ లేదు. వై.ఎస్.ఆర్ ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు దళారీల సంపదల్ని మాత్రమే పెంచాయి. ఇప్పుడు రోడ్లు ఊడ్చి దేశాన్ని శుభ్రం చేస్తానంటున్న ప్రధాని కార్యక్రమం వాస్తవానికి స్ధానిక సంస్ధల చేతుల్లో ఉన్నదే. సదరు సంస్ధలకు నిధులు ఇవ్వకుండా, గ్రామ స్వరాజ్యాన్ని చాప చుట్టి చంకన బెట్టుకుని, గాంధీ జయంతి నాడు చీపురు పడితే ఏమి ఉపయోగమో ఈ ఎడిటోరియల్ కాస్త చర్చించింది. -విశేఖర్)

‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ లేదా ‘క్లీన్ ఇండియా మిషన్’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి నాడు ప్రారంభించడం ద్వారా తన ప్రభుత్వం మహాత్మా గాంధీకి, పరిశుభ్రత రెండింటికీ ఇచ్చిన ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోడి ప్రముఖంగా చాటాలని భావించారు. పాఠశాలల్లో మరిన్ని టాయిలెట్ల అవసరం ఉందనీ, భారత దేశ గ్రామాలు పట్టణాలు మురికి లేకుండా ఉండాలని ప్రధాని మోడి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనే చెప్పడం ద్వారా ఈ సందేశాన్ని స్పష్టంగా ముందుకు తెచ్చారు. కానీ అక్టోబర్ 2 తేదీన అత్యున్నత స్ధాయిలో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి తనదైన అర్ధాన్ని కలిగి ఉంది. గాంధీ ఆశ్రమాలలో టాయిలేట్ లను శుభ్రపరిచే క్రతువును తన ప్రచారోద్యమంతో సంబంధం కలపాలన్నది మోడి కోరిక. తద్వారా అవమానకరమైన పనిగా కనిపించే ఈ కూలీ పని నిజానికి జాతి నిర్మాణంలో గొప్ప కార్యక్రమం అని ఆయన చెప్పదలిచారు.

మిషన్ ప్రారంభం చుట్టూ ఆవరించిన కోలాహలం చప్పుడు సమస్త భారతీయులను పరిశుభ్రతా కార్యక్రమం వైపు ఆకర్షించడానికి ఉద్దేశించబడింది: ప్రతి ఒక్కరూ వారంలో రెండు గంటల సమయాన్ని తన పరిసరాల శుభ్రతకు వెచ్చించాల్సి ఉంటుంది. పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడంలో స్వచ్చ్ భారత్ అభియాన్ కార్యక్రమం విజయవంతం అయిందనడంలో సందేహం లేదు. ప్రధాన మంత్రి తన సమయంలో కొద్ది భాగాన్ని చీపురు చేతబట్టి సెంట్రల్ ఢిల్లీలో ఊడ్చిన దృశ్యాలు కొన్ని ప్రాంతాల్లో కొంత కాలం పాటు కొంత ప్రభావాన్ని పడవేయవచ్చు. కానీ శుభ్రతా కార్యక్రమంలో జనం పెద్ద ఎత్తున పాల్గొనాలనీ, తద్వారా భారత దేశం నిరంతరం శుభ్రంగా ఉండగలదని మోడి నిజంగా ఆశిస్తున్నట్లయితే ప్రభుత్వ విధానం సంకేతాత్మక చర్యల కంటే ఎంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

భారత దేశ గ్రామాలు, పట్టణాలు మురికి లేకుండా ఉండాలంటే కావలసింది ప్రతి ఒక్క పౌరుడు ప్రతి వారంలో రెండు గంటల పాటు  శుభ్రం చేసే కార్యక్రమంలో మునిగిపోవడం కాదు. వ్యక్తిగత సంలగ్నత విషయంలో గాంధీయన్ భావజాలం అద్దిన ప్రభావాన్ని అది పడవేసినప్పటికీ నిపుణ జనుల ఉత్పాదక పనిగంటలను మహా వృధా చేసినట్లే కాగలదు. పరిశుభ్రత విషయమై సాధారణ అవగాహన పెంచేందుకు రాజకీయ నాయకులను, పారిశ్రామికవేత్తలను, సెలబ్రిటీలను రోడ్లు ఊడ్చే కార్యక్రమంలోకి దించడం ఒక సంగతి కాగా పనిలో ఉన్న ప్రతి ఒక్క వయోజనుడు వారంలో రెండు గంటల పాటు శుభ్రం చేసే పనిలో దిగుతారని ఆశించడం మరో సంగతి. నిజమే, పౌరుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వానికైనా, ఏ పౌర సంస్ధకైనా బహిరంగ స్ధలాలు శుభ్రంగా ఉండేలా చేయడం సాధ్యం కాదు. కానీ ఇదీ, పని స్ధలంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిజంగా శుభ్రపరిచే కార్యక్రమంలోకి దిగాలని కొరడమూ రెండూ ఒకటి కాదు.

ఊడ్వడం (శుభ్రపరచడం) అనే చర్యకు అంటుకుని ఉన్న కళంకతను తొలగించడానికి మొదట ప్రయత్నాలు చేపట్టాలి, పౌరులు పెద్ద సంఖ్యలో సామూహిక శుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలి. అది కేవలం ఒక్కసారి చేసేదయినా లేక సంవత్సరానికి ఒకసారి చేసేదయినా సరే, సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వమే అన్నీ చేయలేకపోవచ్చు, కానీ మౌలిక పౌర నిర్మాణాలను శక్తివంతం కావించడానికి, స్వచ్ఛంద సేవ ప్రత్యామ్నాయం కాజాలదు.  పరిశుభ్రత, పారిశుధ్యం సాధ్యం కావాలన్నా, వ్యర్ధాల నిర్వహణ మెరుగుపరచాలన్నా భారత దేశ పౌర (స్ధానిక) సంస్ధలు ‘క్లీన్ ఇండియా’ ప్రచారంలో కేంద్ర స్ధానంలో ఉండాలి. స్వచ్ఛ్ భారత్ అభియాన్ స్ధిరంగా కొనసాగే కార్యక్రమం కావాలి. దాని విజయం ప్రతి పౌరుడూ వీధులు ఊడ్వడానికి కేటాయించే పని గంటలపై మాత్రం ఆధారపడి ఉండకూడదు. చీపురు చేతబట్టకుండానే పరిశుభ్రత అన్న ఆదర్శాన్ని సాధించడానికి ఎంతో చేయవచ్చు.

3 thoughts on “చీపురు వెనక సందేశం -ది హిందూ ఎడిట్

  1. చీపురు చేతబట్టకుండానే పరిశుభ్రత అన్న ఆదర్శాన్ని సాధించడానికి ఎంతో చేయవచ్చును. ఆపని మన నాయకులు గత ఆరున్నరదశాబ్ధులుగా చేస్తూనే ఉన్నారు – గొప్పగొప్ప ఉపన్యాసాలద్వారా. ఇక్కడ చీపురుపట్టటం అనేది కార్యాచరణ అనేది పురమాయించటం కాకుండా స్వయంగా పాల్గొనటం ద్వారా పెద్దచిన్నా అందరూ కలిసికట్టుగా చేయవలసినది అని చెప్పటం ప్రథాని ఉద్దేశం అని అనుకుంటే బాగుంటుంది. కేవలం’గాంధీ జయంతి నాడు చీపురు పడితే’ సరిపోదన్నది నూఱుశాతం నిజం. ఒకరు చెప్పితే మ్రొక్కుబడిగా చేసేవి ఇలాగే నడుస్తాయి. అందుకే స్వయంగా పెద్దవారు ముందుండి నడపటం అవసరం. నయకుడు అంటే పెత్తందారుగా కాక ప్రథానసేవకుడుగా ఉండాలన్నది క్రియలో చూపటం మంచిదే కదా. కేవలం ‘సంకేతాత్మక చర్యల కంటే ఎంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది’ అన్నదానితో ఏకీభవిస్తాను. ‘పౌరులు పెద్ద సంఖ్యలో సామూహిక శుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలి’ – ఇది నిజమే. గ్రామీణ పౌరులు కలిసివస్తారని నమ్మవచ్చును. చదువుకున్నామని చెప్పుకునే నాగరీకుల సంగతే అనుమానం. వీళ్ళు వాక్సూరులే కాని క్రియలో ఎవరితోనూ కలిసివచ్చే వారు కాదు. వీళ్ళకి నిత్యం వినోదం కావాలి, విలాసజీవితం కావాలి, ఇతరులసేవలు కావాలి. అంతే కాని స్వయంగా ఒళ్ళువంచి పూచికపుల్ల ఇక్కడ తీసి అక్కడ పెట్టరు. గొప్పనామోషీ వీరికి. దేశంలో శుభ్రతాలోపంలో గ్రామీణంలో అవగాహనాలోపం కారణం – దానిని నివారించటానికి ఈ‌ మోదీగారి ప్రయత్నం లాంటివి పనికి వస్తాయి. మరి నగరభారతంలో వాతావరణకాలుష్యానికి నాగరికుల ఒళ్ళుపొగరు కారణం – దానికి ఈ సేవాకార్యక్రమాలు గాక శిక్షాకార్యక్రమాలు తప్ప దారి కనిపించటం‌ లేదు. అస్సలు బాధ్యతల గురించి పట్టని ఈ‌ నాగరికులకు హక్కులగురించి మాత్రం గొప్పగొప్ప అవగాహనలు దండిగా ఉంటాయి. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్ స్ధిరంగా కొనసాగే కార్యక్రమం కావాలి’ అన్న మీ‌ ఆకాక్షే నాది కూడా. లా-పాయింట్లు తప్ప అసలు పాయింట్ పట్టని మన పట్టణవాసుల్ని ఎలా కార్యోన్ముఖుల్ని చేయగలమా అన్నదే పెద్దసమస్య.

  2. Dear sir
    i passed urinals many a times near side a road, more over iam an educated person, professor by profession, above all iam NSS program officer. but, read my first sentence once again. because nature didnt wait for any one else. i search for public toilets before i do piss. when i didnt find i attend nature call. so, as the article said, government first do the needful things. at least “sulabh” is doing something better. later on he has give pose to photos.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s