విద్యుత్ కోతలతో అల్లాడుతున్న తెలంగాణ


POWER-CUTS

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీకారం వల్లనోఏమో తెలియదు గానీ తెలంగాణ జిల్లాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి. డిమాండ్ కు సరఫరాకు మధ్య భారీ అంతరం తలెత్తడంతో వేసవి చాలా దూరం ఉన్నా అప్పుడే వేసివి తరహా కోతలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అధికారిక కోతలు పట్టణాల్లో రోజుకు 4 గంటలు అని ప్రకటించి అనధికారికంగా మరిన్ని గంటలు కోత విధిస్తున్నారు. పల్లెల గురించి చెప్పుకోకపోతేనే మేలు.

తెలంగాణలో విద్యుత్ కోతలకు ప్రధాన బాధితులు అక్కడి రైతాంగం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నెల రోజుల్లోనే విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన అక్కడి రైతులపై అమానుషంగా లాఠీ ఛార్జీ చేయించడం ద్వారా కె.సి.ఆర్ ప్రభుత్వం తన స్వభావం ఏమిటో స్పష్టంగా చాటుకుంది. నక్సలైట్ల ఎజెండాయే తన ఎజెండా అని ఉద్యమ కాలంలో ప్రతి సభలోనూ చెప్పిన కె.సి.ఆర్ అధికారంలోకి వచ్చాక వరవర రావు, కళ్యాణ రావులు తలపెట్టిన చిన్న సభకు అనుమతి ఇవ్వకపోగా వారిద్దరితో పాటు పలువురిని అరెస్టు చేసి కేసులు బనాయించాడు.

ఒక సర్కిల్ పూర్తయిందన్నమాట! ధర్మాగ్రహం ప్రకటిస్తున్న రైతులపై లాఠీలు ఝుళిపించగలిగిన కే.సి.ఆర్, సరిగ్గా అదే దృష్టి కోణంతో వరవర రావు తదితరుల సభకు అనుమతి ఇవ్వలేదని జనం అర్ధం చేసుకోవాల్సిన విషయం.

రైతులతో పాటు దాదాపు ప్రతి రంగంలోని జనం విద్యుత్ కోతల వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. నగర జనం అతి తక్కువగా 4 గంటల కోతలు అనుభవిస్తుంటే పల్లె జనం అత్యధికంగా 18 గంటల కోతలు ఎదుర్కొంటున్నారు. నైరుతి ఋతుపవనాలు ప్రభావం కోల్పోయి అలా వెనక్కి వెళ్తుండగానే ఇలా కోతలు మొదలు కావడం బట్టి మునుముందు తెలంగాణ ప్రజల విద్యుత్ పరిస్ధితి ఊహించడానికి కూడా భయం వేస్తుండవచ్చు. ‘ఆంధ్ర వాళ్ళు ఇవ్వకపోతే ఇక విద్యుత్ లేదా? మేము జాతీయ గ్రిడ్ నుండి విద్యుత్ కొంటాం, రైతులు ఇబ్బంది పడనివ్వం, 9 గంటలు విద్యుత్ కరెక్ట్ గా ఇస్తాం” అని కె.సి.ఆర్ ఎన్నికల్లోనూ, ఉద్యమంలోనూ ఢంకా భజాయించి మరీ హామీ ఇచ్చారు. వాస్తవంలో అదేమీ లేకపోగా ప్రశ్నించిన రైతుపై లాఠీ ఝుళిపించారు.

వేసవి రాకకు ఇంకా 5 నెలల సమయం ఉంది. కానీ తెలంగాణలో విద్యుత్ కోతలపరంగా అప్పుడే వేసవి మొదలైంది. విద్యుత్ అధికారులు రాష్ట్రం మొత్తం మీద 500MW నుండి 550MW వరకు కొరత ఉందని చెబుతున్నారు. అయితే వాస్తవ కొరత 1500 MW పై మాటే అని అనధికారికంగా అంగీకరిస్తున్నారు.

బోరు బావుల కింద సేద్యం చేస్తున్న రైతులు విద్యుత్ కోతల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారికి రోజుకు 4 నుండి 5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. ఆ విద్యుత్ కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. పోనీ పారిశ్రామిక రంగం ఏమన్నా చల్లగా ఉందంటే ఆ పరిస్ధితి కూడా లేదని తెలుస్తోంది. వారానికి రెండు రోజులు పవర్ హాలిడే పాటించమని ప్రభుత్వం పరిశ్రమలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. సలహా కాదు, నిజంగానే పవర్ హాలిడే అమలు చేస్తున్నారని పారిశ్రామికవేత్తలు కొందరు చెబుతున్నారు. వారంలో ఒక రోజు పూర్తిగా సరఫరా ఇవ్వడం లేదనీ మిగిలిన 6 రోజుల్లో రోజుకి 8 గంటలు మాత్రమే నికరంగా విద్యుత్ సరఫరా అవుతోందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.

ఉదాహరణకి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రకటిత కోత 4 గంటలు కాగా అప్రకటిత కోతలు మరో 2 గంటలు అమలు చేస్తున్నారు. జిల్లాలోని ఇతర పట్టణాల్లో 8 గంటల కోతలు అమలు చేస్తుండగా పల్లెల్లో 12 గంటలకు పైనే కోత పడుతోంది. జిల్లాలో 100 MW విద్యుత్ కొరత ఉన్నదని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రభాకర్ చెప్పారని ది హిందు తెలిపింది. 450 MW మేరకు డిమాండ్ ఉండగా 348 MW మాత్రమే సరఫరా చేయగలుగుతున్నామని ఆయన తెలిపారు.

వరంగల్ జిల్లాలో భారీ విద్యుత్ డిమాండ్ ఉంటుంది. 2,100 MW విద్యుత్ డిమాండ్ ఉండగా 1,500 MW మాత్రమే సరఫరా అవుతోంది. అనగా ఏకంగా 600 MW విద్యుత్ కొరత! వినియోగదారులను గ్రూపులుగా విభజించి వంతులవారిగా విద్యుత్ ఇస్తున్నామని జిల్లా విద్యుత్ పంపిణీ అధికారులు చెబుతున్నారు.

కరీం నగర్ లో విద్యుత్ సరఫరా వేళల్లో తీవ్ర అస్తవ్యస్త పరిస్ధితులు నెలకొనడంతో పంటలు ఎండి వాలిపోతున్నాయి. పొడి వాతావరణం అదనపు సమస్యగా మారింది. 4 నుండి 5 గంటలు మాత్రమే సరఫరా అవుతుండడంతో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్ధితి ఇంకా ఘోరం. డిమాండ్, సప్లై మధ్య అంతరం తీవ్రంగా ఉండడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా కోతలు అమలు చేస్తున్నారు.

జిల్లా వ్యాపితంగా పారిశ్రామిక ప్రాంతం విస్తరించిన మెదక్ జిల్లాలో ప్రధాన విద్యుత్ డిమాండు పరిశ్రమల నుండే వస్తుంది. దానితో వారానికి రెండు రోజుల పాటు పవర్ హాలిడే అమలు చేస్తున్నారు. అలా చేస్తే తప్ప విద్యుత్ సరిపోనీ పరిస్ధితి. పలు పారిశ్రామిక యూనిట్లు డీజెల్ జనరేటర్ల సహాయంతో సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం రోజుకి 6.2 మిలియన్ యూనిట్లు అవసరం కాగా 4.9 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుతోంది. నల్లగొండ జిల్లాలో 22.5 మి.యూ విద్యుత్ డిమాండ్ కు గాను 18 మి.యూ మాత్రమే సరఫరా అవుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో నీటి రాబడి తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలోనూ ఇదే పరిస్ధితి ఉందని వివిధ పత్రికల ద్వారా తెలుస్తోంది.

తెలంగాణలో విద్యుత్ కొరత ఊహించనిదేమీ కాదు. కానీ పాలకుల అసమర్ధత, అశ్రద్ధ, చిత్తశుద్ధి లేమి ప్రజలకు మరింత భారంగా పరిణమించాయి. తెలంగాణ వస్తే ఇక సమస్యలే ఉండవని ప్రచారం చేసుకున్న కె.సి.ఆర్ ప్రజలకు సమాధానం చెప్పడం మాని అణచివేత పద్ధతులకు తెగించడం శోచనీయం. ప్రజల సమస్యలు పరిష్కరించే చిత్త శుద్ధి ఉంటే ప్రజలకు నచ్చజెప్పడం, క్రమ శిక్షణ పాటించేలా చూడడం పెద్ద సమస్య కాదు. కానీ పాలకులకు లేనిదే చిత్త శుద్ధి. మాయమాటలు చెప్పి, ప్రతి చిన్నా, పెద్దా సమస్యకు ఆంధ్ర పాలకులను చూపిన కె.సి.ఆర్, ఇప్పుడు స్వయంగా అధికారంలో ఉన్నారు. ఆయనపై ఆంధ్ర పాలకుల ప్రభావం ఏమీ లేదు (లేక ఉందా?). కాబట్టి ఆయనకు సాకులు లేవు. సాకులు లేక, చిత్తశుద్ధి కూడా లేక అణచివేతకు దిగుతున్నారు.

22 thoughts on “విద్యుత్ కోతలతో అల్లాడుతున్న తెలంగాణ

 1. మీరు కె.సి.ఆర్ అభిమాన తానులో ముక్కేనా మల్లిఖార్జున్ గారూ? దురదృష్టవశాత్తూ నేను కాదు.

  నేను ప్రస్తావించిన రైతుల సమస్యలు, అణచివేత సమస్యలపైన మీరు స్పందిస్తే బాగుంటుంది. కె.సి.ఆర్ ని నేను ఎప్పుడూ పొగడ్లేదు. పైగా ఉద్యమాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించాను. నేను ఉద్యమం వైపే గానీ కె.సి.ఆర్ వైపు కాదు. గమనిస్తారని ఆశిస్తున్నాను.

 2. Dear V.Sekahar Garu,
  I would like to ask following few Q about the above issue,

  1.How many days it has gone by since the inception of New Tg Govt ,does it possible to overcome this kind of perinneal issues in such a very short time?

  2. Which of preceeding govt’s actually responsible to this situation?Why the erstwhile United AP govt not foucsed on increasing the installed power genearating capacity by putting plants in TG ? Why that Q were not raised in your article?

  3.Even after your clearly knows that , CBN is responsible for this situation by not honouring the electricity agreement , why your morphing that information in your article in first para itself?

  4.Am unable to understand ,why you have had raised the arrest of KalyanRao and varavara Rao in this article? what is the link between these two issues? what is the link between Naxals agenda and Power Crisis?

  5.And we are least expecting from andhra persons to praise our state and our CM.

  Expecting your reply .

  Thank you Sir.

 3. తెలంగాణా లో విద్యుత్ కొరత కి ఆంధ్ర ప్రదేశ్ ఎలా కారణం అవుతుంది .
  ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విద్యుత్ కొరత ఉంది , కాకపోతే కేంద్రం చొరవ తో ఏదో ప్రాజెక్ట్ ( మర్చిపోయాను ) లో భాగంగా నిరంతర విద్యుత్ ఇచ్చే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ని చేర్చడం జరిగింది .

 4. మల్లిఖార్జున్ గారు మీకు సమాధానం ఇస్తాను. దానికి ముందు ఒక విషయం చెప్పండి. ‘నక్సలైట్ల అజెండాయే నా అజెండా’ అన్న కె.సి.ఆర్ మాటలకు అర్ధం ఏమిటి? ఈ అంశంలో స్పష్టత ఉంటే మన చర్చ కాస్త అర్ధవంతంగా ఉంటుంది.

 5. Mallikarjun sir
  When K.C.R. knows that problem of power in telangana, why he misguided telangana people. may be normal people cannot imagine the issue, but k.c.r is surrounded by many electricity engineers. he know the facts but he didnt reveal, at the time of election.

  please dont blame all the preceding leaders for all the issues. when he is enjoying the benefits of actions of those leaders like IT sector, state capital, industrial development, he should also take the blame. at least he should say the facts.

  after coming into power he is stating that state has to suffer power cut for 3 more years. till that time how the industries and farmers has to bear the situation. the impact will be not just confine to just one sector but spread to all the sectors.

 6. recently doctors performed operations with the help of cell phone lights, Imagine the situation of the patient on the bed, he is no where connected with andhra, telangana issue, power issue. just because he is patient of telangana state he faced such pathetic situation. at least K.C.R. government has to supply power without any interruption for such emergency areas

 7. పేరు చెప్పుకోలేని పిరికిపందవి. నా చేతల గురించి ఎలా అడగ్గలవ్?

  ఈ బ్లాగ్ రహస్యం కాదు. బహిరంగం. ప్రపంచంలో ఇంటర్నెట్, మొబైల్ ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరూ చూడగలరు. ఇలాంటి చోట పోస్ట్ చేస్తే ప్రభుత్వాన్ని అడిగినట్లే. మీకు అర్ధం కాకపోతే అది వేరే సంగతి.

  విచిత్రం ఏమిటంటే అటు కె.సి.ఆర్ అభిమానికేమో మార్ఫింగ్ లాగా కనిపించింది, తమరికి ‘చేతనైతే’ లాగా కనిపించింది. అసలు విషయం మాత్రం ఇద్దరూ వదిలేశారు.

  మల్లిఖార్జున్ గారు కాస్త పద్ధతి పాటించారు. అడగదలుచుకుంది మర్యాదగా అడిగారు. ఆ మేరకు తెలంగాణ సంస్కృతి అని వారు చెప్పుకున్న మర్యాదను నిలుపుకున్నారు. ఎటొచ్చీ తమరి మర్యాదే ‘బొంద’ లో తగలడింది. నువ్వు పిరికి పందవి కాకపోతే ధైర్యంగా పేరు పెట్టుకుని అడుగు. అది చేతకాకపోతే నీలో నువ్వే కుళ్లిపో. ఇలా చర్చలని ఖరాబు చెయ్యకు. మళ్ళీ కారుకూతలు రాస్తే ప్రచురించను.

 8. మల్లిఖార్జున్ గారు…విద్యుత్ కోతలతో అల్లాడిన రైతులు….రోడ్లపై ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపితే….లాఠీలతో బాధించడం…., వరవరరావు సభను భగ్నం చేయడం…ఈ ఘటనల మధ్య సంబంధం లేదంటారా…?

  – ఈ రెండింటి మధ్య లింక్ ఏమిటంటే….ప్రజా ఉద్యమాల పట్ల కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి.
  దాన్ని ఈ రెండు ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. అది కూడా “నక్సలైట్ల ఎజెండాయే మా అజెండా” అన్న కేసీఆర్ ప్రభుత్వం వరవరరావు సభ తలపడితే కనీసం అనుమతించకపోవడం న్యాయమేనా…?

  – ఇక” మీరు కూడా ఆ తాను ముక్కలేనా”…. అనడంలో మీ ఆంతర్యం నాకర్థం కాలేదు. అంటే కేసీఆర్ ను ఎవరూ విమర్శించకూడదా. అదీ ఆంధ్ర ప్రాంతం వారు విమర్శిస్తే…కచ్చితంగా ” తాను ముక్కలేనా…? ”

  -ఒక సమస్య మీద విమర్శ చేస్తే….మనం చూడాల్సింది విమర్శలో వాస్తవం ఉందా, లేదా అని. అంతే కానీ విమర్శ చేసిన వారు ఆంధ్ర వారా, లేక ఇతర ప్రాంతం వారా అనే పరిస్థితిలో తెలుగు ప్రజలు ఉండడం దురదృష్టకరం.

  -తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోత ఊహించినదే. తెలంగాణ విద్యుత్ సంక్షోభం వెనక…గత ప్రభుత్వాలు, ప్రస్తుత సీమాంధ్ర ప్రభుత్వం వైఖరి ఉందన్నది వాస్తవమే. కానీ అంతకన్నా….. పరిస్థితిని ముందే ఊహించి కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపలేని….నష్ట నివారణ చేయలేని కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందన్న సంగతి వాస్తవం కాదా…?

  – ఐతే సీమాంధ్రకు చెందిన వారు తెలంగాణ ముఖ్యమంత్రిని గౌరవించాలన్న మీ వ్యాఖ్యతో అంగీకరిస్తాను….మరి ఆ గౌరవించేవారే విమర్శించవచ్చు కూడా అని మీరు అంగీకరిస్తారా…?

  ( నా అంచనా ప్రకారం మల్లిఖార్జున్ గారు ఇంకెక్కడో వెలిబుచ్చాల్సిన ఆవేశం ఇక్కడ రాశారేమో అనిపిస్తోంది. కేసీఆర్ ను కొందరు వ్యక్తులు పని గట్టుకుని పదేపదే విమర్శించడం వాస్తవమే. కానీ వారిమీద కోపాన్ని ఈ బ్లాగులో రాయడం సమంజసం కాదు కదా…?)

 9. మీ బెదిరింపుల వ్యాఖ్యలు తొలగించాను. ఇది ప్రచురిస్తున్నాను. ఎందుకంటే నాకిది అర్ధం కాలేదు. బ్లాగ్ లో చేరడం ఏమిటి, చందా అడగడం ఏమిటి? చేరమని ఎవరు అడిగారు? చందా ఎవరు అడిగారు? అర్ధం అయేట్లు చెప్పండి.

 10. anonymous గారూ, మీ భాష నాకిప్పుడు అర్ధం అయింది. మీరు పొరబాటు పడ్డారు. ఈ మెయిల్ సబ్ స్క్రిప్షన్ అన్న పదాన్ని వర్డ్ ప్రెస్ వాళ్ళు ‘ఈ మెయిల్ చందారులుగా చేరండి’ గా అనువాదం చేశారు. దానర్ధం చందా కట్టి బ్లాగ్ లో చేరమని కాదు. ఈ బ్లాగ్ పోస్టుల సమాధారం మీ ఈ మెయిల్ కి రావాలంటే మీరు చందా డబ్బులు ఏమీ ఎవరికీ కట్టనవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఇదే కాదు. బహిరంగంగా కనపడే బ్లాగ్ లన్నీ ఉచితమే.

  మీ వ్యాఖ్యల్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నానని కూడా ఏవో రాశారు. అవేమీ జరగవు. పాఠకుల వ్యాఖ్యల్ని ఎవరూ కొనరు. వర్డ్ ప్రెస్ వాళ్ళు ఇలాంటి బ్లాగ్ లకు తమ సర్వర్లలో space ఉచితంగా ఇస్తారు. ఆ ఖర్చులు రాబట్టుకోవడానికి బ్లాగ్ లలో వివిధ కంపెనీల యాడ్స్ ప్రచురిస్తారు. ఇందులో బ్లాగర్లకి వచ్చేదేమీ ఉండదు. స్పేస్ ఉచితంగా ఇవ్వడం ద్వారా కంట్రిబ్యూటర్స్ నుండి కంటెంట్ సేకరించి, ఆ కంటెంట్ మధ్య యాడ్స్ ప్రచురించి సొమ్ము చేసుకోవడం ఐ.టి కంపెనీల వాళ్ళ వ్యాపారాల్లో ఒకటి. వారిది వ్యాపారం, మనది అవసరం. ఈ సంగతి అర్ధం కాక మీరు ఇంకేదో అనుకున్నారు.

  ఆ సంగతి వదిలిపెట్టి చర్చించాలనుకుంటే కాస్త పద్ధతిగా రాయండి. చర్చిద్దాం. నేను తెలంగాణకు చెందినవాడినని మీరు అనుకుంటున్నట్లుగా మీ వ్యాఖ్యల్లో తెలుస్తోంది. అది కూడా నిజం కాదు. నేను ఆంధ్ర ప్రదేశ్ వాసిని. నేనిక్కడే పుట్టాను. నా బతుకంతా ఇక్కడే గడిచింది, ఇక్కడే గడుస్తోంది. ఇకముందు కూడా ఇక్కడే గడుస్తుంది.

 11. విశేఖర్ గారు. బ్లాగేమిటి…చందాలేమిటి….?
  నేను ఇంతకు ముందే రాసినట్లు..ఒక వ్యాఖ్యలో నిజముందో లేదో చూడాలి గానీ…..ఆంధ్ర వాడా తెలంగాణ వాడా అని చూసే పరిస్థితి రావడం అత్యంత శోచనీయమైన దురదృష్టకరమైన ప్రమాదకరమైన దుస్థితి.

  మీలాంటి వాళ్లు కూడా…..నేను ఫలానా ప్రాంతం అని చెప్పుకోవాల్సి రావడం…..? (నాకు ఏమనాలో అర్థం కావడం లేదు.)
  -బ్లాగర్లందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే. నిన్ననే పరమపదించిన తెరేశ్ బాబు గారు చెప్పినట్లుగా
  కావడి కుండల్లా కలిసి ఉందాం.

 12. నాకూ మొదట అర్ధం కాలేదు. ఒకవేళ ఈ మెయిల్ ఇచ్చినవాళ్లని డొనేట్ చేయమని వర్డ్ ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారా అని అనుమానం వచ్చింది. ఓ మిత్రుడితో మాట్లాడాక అజ్ఞాత పొరబాటు అర్ధం అయింది.

  చందుతులసి గారూ, వ్యక్తులందరూ ఒకే స్ధాయిలో ఉండరు గదా. తరతమ స్ధాయిలు ఉంటాయి. తమ చుట్టూ ఉన్న భావజాలం ప్రభావంలో ప్రతి ఒక్కరూ ఉంటారు. వీలయినంత ఓపిగ్గా తెలియజెప్పడమే మన పని. కొంతమంది పనిగట్టుకుని వచ్చి తిట్టడం నిజమే గానీ ఈ అజ్ఞాత అలా అనిపించడం లేదు. ఆవేశంలో ఏదో రాసేశారు. అందుకని సంయమనం పాటించాను.

 13. విశేఖర్ గారు, ఆంధ్రాలోని సంక్షేమ పథకాలలో అవినీతి గురించి ఒక వ్యాసం వ్రాయండి. భర్త ఉన్న స్త్రీలు కూడా భర్త చనిపోయాడని చెప్పి వితంతు ఫించన్‌లు తీసుకుంటున్నారు. ఈ బోగస్ లబ్దిదారులని ఏరివెయ్యకుండానే చంద్రబాబు నాయుడు వితంతు ఫించన్‌లని 200 నుంచి 1000 రూపాయలకి పెంచాడు.

 14. తెలంగాణలో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు కట్టడానికి రెండుమూడేళ్ళు పడుతుందని కె.సి.ఆర్. అన్నాడు. ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఒక్క అభివృద్ధి పని కూడా చెయ్యకపోయినా కమ్మ పత్రికలు అతనికి ఫ్రీ పబ్లిసితీ ఇస్తున్నాయి.

  విరసం సభకి ఆంధ్రాలో కూడా అనుమతి ఇవ్వలేదు. దానిపై కూయని మీదియా తెలంగాణలో జరిగిన దానిపై మాత్రమే ఎందుకు కూస్తోంది?

 15. విశేఖర్ గారు, మీరు ఈనాడు, ఆంధ్ర జ్యోతులలోని వార్తలు ఇక్కడికి తేకండి. ఆంధ్ర జ్యోతి తెలుగు దేశానికి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా వ్రాయదు కానీ తెలంగాణాపై ఇప్పటికీ విషం చిమ్ముతుంది,

  TRS కార్మికవర్గ పార్తీ కాదు, వాళ్ళది మావోయిస్త్ అజెందా కాదు. చైనాలో మావో బతికి ఉన్న కాలంలో బలవంతపు వ్యవసాయ సమిష్ఠీకరణ జరిగింది. కె.సి.ఆర్. తన పార్తీకి చెందిన భూస్వాముల భూములని జాతీయం చేసి, భూస్వాముల చేత వ్యవసాయ క్షేత్రాలలో పనులు చెయ్యిస్తాడనే భ్రమలు అవసరం లేదు. సోవియత్ సమాఖ్య ఉన్న రోజుల్లో ఆంధ్రాలో కూడా ఒకటిరెండు గ్రామాల్లో వ్యవసాయ సమిష్టీకరణ చేసారు. సోవియత్ సమాఖ్య కూలిపోయిన తరువాత అది వదిలేసారు. కె.సి.ఆర్. భూసంస్కరణలైనా చేస్తాడనే భ్రమలు అవసరం లేదు. తెలంగాణలో 500 ఎకరాలు భూములు ఉన్న భూస్వాములు కూడా ఉన్నారు. వాళ్ళకి 10 ఎకరాలు ఉంచుకుని మిగితా భూమిని పేదలకి ఇచ్చెయ్యమని చెపితే వాళ్ళు TRSని వదిలి కాంగ్రెస్‌లో చేరిపోతారు. కె.సి.ఆర్. ఈ విషయం తెలియనంత అమాయకుడు కాదు.

  చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాజధాని తప్ప ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చెయ్యడు. చంద్రబాబు విధానాలపై కమ్మ పత్రికల్లో విమర్శలు కనిపించవు. తెలంగాణలో కొంత మంది రైతులు రోద్ మీదకి వచ్చి గొడవ చేస్తేనే ఈ కమ్మ పత్రికలు దాని గురించి కారు కూతలు కూస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s