న్యాయానికి సుదూర రహదారి -ది హిందు ఎడిట్


Jayalalithaa_2

(అక్రమ ఆస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారిస్తూ కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది 4 సం.ల కారాగార శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. సహ నిందితులకు 4 సం.ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఫలితంగా అవినీతి కేసులో శిక్ష పడిన మొదటి ఉన్నత స్ధాయి నేతగా జయలలిత చరిత్ర పుటలకు ఎక్కారు. అవినీతి కేసుల్లో నేతలు తప్పించుకుపోకుండా ఇటీవల చేసిన చట్టం ఫలితంగా ఎం.ఎల్.ఏ పదవి, తద్వారా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన మొదటి నేతగా కూడా ఆమె వినుతికెక్కారు. ఈ పరిణామంపై ది హిందూ ఆదివారం ప్రచురించిన సంపాదకీయం. -విశేఖర్)

బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు, అసమ (అక్రమ) ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారించడం ప్రభుత్వ ఉన్నత స్ధాయిల్లోని వ్యక్తులతో సహా పౌరులందరికీ సమానంగా చట్టాలను వర్తింపజేయాలన్న కీలక రాజ్యాంగ సూత్రానికి గణనీయ ప్రమాణీకరణ. అధికారాన్ని దుర్వినియోగం చేసి కూడా రాజకీయ వర్గ నేతలు చాలా తరచుగా తేలికగా తప్పించుకోవడంలో సఫలం అవుతున్నారు. తద్వారా తమ ఓట్ల ద్వారా వారిని అధికారంలోకి తెచ్చిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద పదవిలో ఉండగా శిక్ష పడిన ముఖ్యమంత్రుల్లో కుమారి జయలలిత మొదటివారు; ఆమెకు ముందు కొద్ది మంది రాజకీయ నాయకులు మాత్రమే అవినీతి కేసుల్లో జైలు శిక్షలను ఎదుర్కొన్నారు.

కానీ ఈ దోష నిర్ధారణ సాధారణ న్యాయ ప్రక్రియలో సంభవించినది కాదు. న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించడానికి, ఆలస్యం చేయడానికి ప్రతి దశలోనూ ప్రయత్నాలు జరిగాయి. ఈ కేసులోని ప్రాసిక్యూషన్ మరియు న్యాయాధీశులు ఒత్తిడులకు తట్టుకుని న్యాయ సూత్రాలను, ఆ సూత్రాల నిస్పక్షపాతాన్ని నిలబెట్టడం ఎంతో ప్రశంసనీయం. 2001 ఆరంభం నుండి మొదలైన కుమారి జయలలిత మొదటి ట్రయల్ ను ఆటంకపరిచి కూలదోయడానికి పలు ప్రయత్నాలు జరగడం కనుగొన్న సుప్రీం కోర్టు 2003లో కేసును బెంగుళూరుకు తరలించింది. అయినప్పటికీ, న్యాయ ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీయబడిన పేచీకోరు మార్గంగా మార్చినప్పటికీ ఈ కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగినట్లే కనిపిస్తోంది.

అయితే, అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులను న్యాయ దేవత ముందు ప్రవేశపెట్టడం కంటే అధికార దుర్వినియోగాన్ని, న్యాయ ప్రక్రియలను ప్రభావితం చేయడాన్ని నిరోధించడానికి, తగిన వ్యవస్ధాగత తనిఖీలను నెలకొల్పడం మరింత ముఖ్యమైనది. గత రెండేళ్లుగా అత్యున్నత స్ధానాల్లో అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆందోళన పెచ్చరిల్లింది. జాతీయ అవినీతి వ్యతిరేక వ్యవస్ధ లోక్ పాల్ నెలకొల్పక తప్పని పరిస్ధితి పార్లమెంటుకు ఏర్పడగా, ఈ విషయంలో న్యాయ వ్యవస్ధ చొరవ ప్రదర్శించింది. ఇంత భారీ కేసులోనూ మారధాన్ విచారణకు పట్టిన కాలం -18 సం.లు – చాలా సుదీర్ఘం. ప్రజా జీవితంలో అవినీతి నిర్మూలనకు దేశానికి ద్విముఖ వ్యూహం అవసరం: అధికార దుర్వినియోగం అరికట్టడానికి మరింత ప్రభావశీలమైన చట్టబద్ధ నిర్మాణం ఏర్పరచడం, మరియు నిందితుల నిస్పక్షపాత ట్రయల్ పొందే హక్కుకు భంగం కలగకుండా కేసుల విచారణా కాలం తగ్గించేందుకు వీలుగా పాలనా సంస్కరణలు తేవడం.

శనివారం వెలువడిన తీర్పుకు కొన్ని దురదృష్టకర పరిణామాలు ఉన్నాయి. తమిళనాడులో అనేక ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. జయలలిత అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలో ఎవరు కూర్చున్నా, వారు తగిన రాజకీయ పరిపక్వతను, రాజనీతిజ్ఞతను ప్రదర్శించాలి. తద్వారా ఎఐడిఎంకె పార్టీ కార్యకర్తల ఆగ్రహం వీధుల్లోకి ఒలకకుండా, వారి హింసాత్మక చర్యలు ప్రభుత్వ ఆస్తులపైకీ, సాధారణ ప్రజాలపైకి మళ్లకుండా శాంతి భద్రతలను సమర్ధవంతంగా నిర్వహించాలి. కర్ణాటకలో నెలకొల్పబడిన కోర్టు ఈ తీర్పు వెలువరించినందున ఎలాంటి హింసాత్మక చర్యలైనా కన్నడిగుల మీదికి విస్తరించకుండా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. కుమారి జయలలిత ముందు ఇప్పటికీ అప్పీలు చేసుకునే మార్గాలు తెరుచుకునే ఉన్నాయి. తమిళనాడు, హింస మరియు వినాశన పూర్వక వలయంలోకి జారిపోవడానికి అనుమతించరాదు.

6 thoughts on “న్యాయానికి సుదూర రహదారి -ది హిందు ఎడిట్

 1. Many Kashmiris have been befooled and misguided by the separatist leaders who have their own vested interests and personal agenda. The only correct demand Kashmiris should raise is that Pakistan and Bangladesh must be reunited with India under a strong secular modern minded government which does not tolerate religious extremism of any kind. This will automatically solve the Kashmir problem.

 2. మూల గారు. మరి ఆఫ్ఘనిస్తాన్, బర్మాలను మాత్రం వదిలేశారు. అవి కూడా ఒకప్పుడు మన అఖండ భారత దేశంలోనివే. మీ ఉద్దేశం సరిహద్దు పాక్, బంగ్లాలతో సరిహద్దు సమస్య ఉంది కాబట్టి అవి మన భారతదేశంలో కలిస్తే…అటు ఆ సమస్యకు, ఇటు కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కావచ్చు. కానీ ఒక సమస్యను పరిష్కరించుకోలేక….చరిత్రను వెనక్కు తిప్పాలనుకోవడం పలాయనవాదం లేదా….అసలు సమస్యను పక్కదోవ పట్టించడమే.
  -కాశ్మీర్ సమస్య పరిష్కారం…పాక్, బంగ్లాదేశ్ ల్ భారత్ లో కలవడం వల్ల దొరకదు. కాశ్మీర్ ప్రజలతో సరైన రీతిలో చర్చలు జరిపినప్పుడు దొరుకుతుంది. అది కాశ్మీర్ ప్రజలకు భారత్ పై నమ్మకాన్ని పెంచే దిశగా ఉండాలి.

  -ఇక కాశ్మీర్ వేర్పాటు నాయకులు అక్కడి స్థానిక ప్రజలను తమ స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం ఆందోళన చేయిస్తున్నారన్న మీ ఆరోపణ నిజం. కాకుంటే ఒక్క కాశ్మీర్ లోనే కాదు. పంజాబ్ నుంచి తమిళనాడు దాకా అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ నాయకులు చేస్తోంది అదే కదా. మిగతా రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనో….లేదా తమ కులానికో మతానికో రిజర్వేషన్ కాావాలనో డిమాండ్ చే్స్తారు. కాశ్మీర్ నాయకులు కొందరు ఇంకో అడుగు ముందుకు వేసి స్వతంత్ర ప్రతిపత్రి కోరుతున్నారు. ఎవరు ఏం కోరినా…..అసలు తమకేం కావాలో నిర్ణయించుకునే హక్కు స్థానిక ప్రజలకు ఉంటుంది.
  – బంగ్లా, పాకిస్తాన్ ( ఏ చారిత్రక కారణాలైనా కావచ్చు)… స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. మన దేశ నాయకులు నిత్యం జపించే……సార్వభౌమత్వం…..అనేది మిగిలిన దేశాలకు కూడా ఉంటుంది. దాన్ని అందరం గౌరవించాల్సిందే.
  వేర్పాటు వాదం ఎంత ప్రమాదకరమో…..మనకు చెందని ప్రాంతాలు కలుపుకోవాలన్న ఆక్రమణ వాదం అంతకు మించిన ప్రమాద కరం.
  మన దేశ సమస్య పరిష్కారం కోసం బంగ్లాను, పాకిస్తాన్ ను కలపాలన్న డిమాండ్ న్యాయమేనంటారా…?

  -చరిత్రను వెనక్కు తిప్పగలిగితే కాశ్మీర్ కే కాదు… అనేక సమస్యలకు పరిష్కారాలు సులభంగా లభిస్తాయి. కానీ చరిత్రను వెనక్కు తిప్పడం సాధ్యం కాదు కదా. ఇప్పుడు ఆలోచించాల్సింది సాధ్యమయ్యే పరిష్కారాల గురించి.

 3. చందుతులసి గారు,మీ కామెంట్స్ కు కృతజ్ఞతలు.కాశ్మిర్ సమస్యకు పరిష్కారం నేను సూచినదికాదు! @ జస్.మార్కండేయ కట్జు గారి సూచన! నేను దానిని చర్చకు పెడితేబాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలను పెట్టాను!ఈ సూచన(పాకిస్తాన్-బంగ్లాదెశ్ లను కలుపుకోవాలని-ఆ దేశ ప్రజల ఇష్టంతో మాత్రమే!) కొత్తగా ఉందని తోచింది!

 4. మూల గారు, సందర్భం లేని చోట హఠాత్తుగా కాశ్మీరు సమస్యను ముందుకు తెచ్చి తలా, తోకా లేని పరిష్కారం సూచిస్తుంటే అసలు ఇది మీరు రాసిన వ్యాఖ్యేనా అన్న అనుమానం వచ్చింది. ఎవరన్నా మీ పేరుతో రాసారా అని పరిశీలించాను. మీరు రాసిందే అని అర్ధం అయింది. కానీ విషయం ఏమిటో బోధపడలేదు.

  మీరు చర్చకోసం ఒకరి వ్యాఖ్యానాన్ని ప్రస్తావిస్తే ఆ సంగతి స్పష్టంగా చెప్పాలి కదా. చందుగారు ఆక్షేపించాకనే ‘చర్చ కోసం’ అని చెప్పడం అంత అర్ధవంతంగా లేదు. ఆయన అభిప్రాయం మీకూ ఉన్నట్లయితే అదైనా చెప్పొచ్చు. కానీ మీ గత వ్యాఖ్యల వల్ల మీకు ఇలాంటి అభిప్రాయం ఉండడం వీలు లేదన్న అవగాహనతో మీరు రాసింది కాదన్న అనుమానం రావలసి వచ్చింది. నేనే రాద్దాం అనుకుంటుండగా చందుతులసి రాశారు. ఇప్పటికన్నా విషయం పూర్తిగా చెప్పినట్లేనా?

 5. అంతే కాదు మూల గారు, కాశ్మీర్ సమస్య రావణ కాష్టం కాలుతూనే ఉండాలి. లేకపోతే మన రాజకీయ నాయకులకు ఆ కాష్టాన్ని ఆర్పడం ఎంతమాత్రం ఇష్టం లేదు. అలా ఇష్టమై నట్లైతే అది ఎప్పుడో పరిష్కారమై ఉండేది.

 6. శేఖర్ గారు, ఈ వ్యాఖ్యలు వ్రాయడానికి-కట్జు గారి అభిప్రాయం ప్రకారం కాశ్మిర్ సమస్యకు పరిష్కారంగా ఒక దేశంగా(ప్రజాస్వామ్యయుతంగా) పాకిస్థాన్ విఫలమయ్యిందట!అందుకని పాక్-భారత్ సరిహద్దులు కలవడం ద్వారా కాశ్మిర్ సమస్య పరిష్కరించాలని ఆయన అభిప్రాయం! ఈ విషయాన్ని చర్చకు పెడితే ఎలా ఉంటుందని తోచి ఈ వ్యాఖ్యలను ప్రచురించాను.చర్చ అని చెప్పకుండా స్వతహాగా ఎవరు ప్రతిస్పందిస్తారో చూద్దామని అలా ప్రత్యక్షంగా వ్రాశాను అంతే! అన్యదా భావించవద్దని మనవి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s