‘ఎకనమిక్ సైకిల్’ అన్న మాటను తరచుగా వింటుంటాం. ముఖ్యంగా ఆర్ధిక సంక్షోభాల సమయంలో ఈ పదం ఎక్కువగా చర్చలోకి వస్తుంది. ఎకనమిక్ సైకిల్ కు సంబంధించిన అనుభవాలు సంక్షోభ సమయంలోనే ఎక్కువగా ఉండడం అందుకు కారణం.
ఆర్ధిక చక్రం అనే కాదు, ఎన్నడూ వినని ఇతర ఆర్ధిక పదజాలం కూడా సంక్షోభాల సమయంలో ఎక్కువగా వినిపిస్తాయి. గత రెండు శతాబ్దాలుగా సంక్షోభాల మధ్య కాలం తగ్గుతూ వస్తోంది. అనగా ఆర్ధిక చక్రం వేగంగా తీరుగుతోంది అన్నట్లు. ఫలితంగా ఆర్ధిక పదబంధాల వాడకం పత్రికల్లో పెరిగిపోయింది. దరిమిలా ఆర్ధిక పదజాలంపై పాఠకుల ఆసక్తి కూడా సాపేక్షికంగా పెరిగింది.
ఈ వారం ఈనాడులో ఆర్ధిక చక్రం గురించి చర్చించాను. ఆర్ధిక చక్రాల వల్ల తలెత్తే మాంద్యం దశ నుండి బైటపడడానికి లోటు బడ్జెట్ ల సహాయంతో ఋణ వ్యయాలు ఇతోధికంగా పెంచాలని ప్రముఖ ఆర్ధికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ప్రతిపాదించారు. తత్ఫలితమే మనం ఈనాడు చూస్తున్న లోటు బడ్జెట్ లు.
అయితే మాంద్యం దశకు మాత్రమే ప్రతిపాదించబడిన లోటు బడ్జెట్ లను ఆచరణలో నిత్య కృత్యంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత నిజం అయింది.
నిజానికి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మెజారిటీ స్వతంత్ర ఆర్ధిక వ్యవస్ధలు కాదు. అవి ఏదో ఒక సామ్రాజ్యవాద దేశ ఆర్ధిక వ్యవస్ధకు గానీ లేదా సామ్రాజ్యవాద దేశాల ఉమ్మడి వ్యవస్ధకు గానీ అనుబంధ ఆర్ధిక వ్యవస్ధలు మాత్రమే.
అందువలన ఆర్ధిక చక్రగతి పరిణామాలు ఇక్కడ కాస్త అటు ఇటుగా కనిపిస్తాయి. మార్కెటీకరణ ఎంత తీవ్రంగా జరిగి, ఎంత ఎక్కువగా సామ్రాజ్యవాద దేశాల ఏలుబడిలోకి వెళ్తాయో, అంత తీవ్రంగా ఆర్ధిక చక్ర గతి పరిధిలోకి వెళ్తాయి.
ఈ రోజు ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే కింది లింక్ ను క్లిక్ చేయగలరు.
ఆర్ధిక చక్రగతి – లోటు బడ్జెట్ ల సంబంధం?
పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ లో ఆర్టికల్ చూడాలనుకుంటే కింది బొమ్మపైన క్లిక్ చేయగలరు. బొమ్మ పైన రైట్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
సర్,కీన్స్ ప్రకారం ప్రభుత్వం రాబడికి తగిన వ్యయం అన్న సూత్రం వదిలి రాబడిని మించి ఖర్చుచేయాలి-ఇదే సూత్రాన్ని ఒక సామాన్య కూలి కుటుంబానికి వర్తింప చేయడానికి వీలౌతున్నదా? ఒక సామాన్యకూలి కుటుంబం తన ఆర్ధిక చక్రవలయం అనండి లేదా ఆర్ధిక కష్టాలు నుండి బయట పడే మార్గాని ప్రపంచంలో ఉన్న ఏ ఆర్ధిక వేత్త అయినా సూచించ గలిగారా?
ఈ బ్లాగు ను ఫాలో అవుతున్న విధ్యార్ధులు ఈ లింకును చదవాలని, రాజ్యంగమంటే, ప్రభుత్వమంటే ఏమిటో సరిగా 9 అంటే వాస్తవంగా) అర్ధం చేసుకోవటానికి ఉపయోగపడుతుందని ఇక్కడ ఇస్తున్నాను.
http://magazine.saarangabooks.com/2014/09/24/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B0%82-%E0%B0%AE%E0%B1%81%E0%B0%B8%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A8/